top of page

విశ్వంభర.. ఏదో పెద్దగా రావాలి

  • Guest Writer
  • Jul 26, 2025
  • 3 min read

ప్రస్తుతం చిరంజీవి చేస్తున్న రెండు సినిమాలు ప్రొడక్షన్‌లో ఉన్నాయి. ఇందులో విశ్వంభర షూటింగ్‌ నేటితో పూర్తయింది. చిరు-మౌనీరాయ్‌పై తీసిన స్పెషల్‌ డ్యాన్స్‌ నెంబర్‌తో గుమ్మడికాయ్‌ కొట్టారు. అనిల్‌ రావిపూడితో చేస్తున్న సినిమా మూడు షెడ్యూళ్లు పూర్తి చేసుకుంది. అయితే ఈ రెండు సినిమాల బజ్‌ పోల్చుకుంటే అనిల్‌-చిరు కాంబో మీదే ఎక్కువ హైప్‌ ఉంది. ఇంకా టీజర్‌ కూడా రాకుండానే ఆ సినిమాకి అంత క్రేజ్‌ రావడానికి కారణం డైరెక్టర్‌ అనిల్‌ రావిపూడి ఫ్యాక్టర్‌. అపజయం లేని ఆయన చాలా పక్కాగా తీసుకుంటూ వెళ్తున్నారు.

విశ్వంభర పరిస్థితి మాత్రం వింతగా మారింది. ఈ సినిమా నుంచి వచ్చిన టీజర్‌ సినిమా బజ్‌పై చాలా ప్రభావం చూపింది. గ్రాఫిక్స్‌ అన్నీ తేలిపోయాయి. దీంతో టోటల్‌ సినిమా మీదే ఎఫెక్ట్‌ పడిరది. గ్రాఫిక్స్‌ స్కోప్‌ ఉన్న కథలో అవి పక్కాగా కుదరాల్సిందే. యావరేజ్‌గా ఉన్న జనం ఆసక్తి చూపించడం లేదు. టీజర్‌కి వచ్చిన రెస్పాన్స్‌ చూసి టీం చాలా బలంగా గ్రాఫిక్స్‌ని డిజైన్‌ చేస్తున్నామని చెప్పుకొచ్చింది.

అయితే కేవలం మాటలు సరిపోవు. విశ్వంభరపై మళ్లీ బజ్‌ రావాలంటే.. ఏదో బలమైన కంటెంట్‌ సినిమా నుంచి వదలాలి. అది ట్రేడ్‌, జనాలకు నచ్చాలి. గ్రాఫిక్స్‌పై ఉన్న అనుమానాలు తొలగాలి. అప్పుడే ఆటోమేటిక్‌గా బజ్‌ వస్తుంది. ఇప్పుడు టీం కూడా అదే ప్లాన్‌లో ఉందని తెలుస్తుంది. సినిమా నుంచే వచ్చే తర్వాత కంటెంట్‌పై చాలా కేర్‌ తీసుకుంటున్నారు. ఈసారి విశ్వంభర నుంచి వచ్చే కంటెంట్‌ ఖచ్చితంగా అంచనాలు పెంచేదిగా ఉంటుందని తెలుస్తోంది.

-తెలుగు 360.కామ్‌ సౌజన్యంతో..



స్లో గా సర్ప్రైజ్‌ చేస్తున్న మహావతారా నరసింహ

పవన్‌ కళ్యాణ్‌ సినిమాకు పోటీగా ఓ యానిమేటెడ్‌ ఫిల్మ్‌ మార్కెట్‌ లో ఎంట్రీ ఇస్తుందని ఎవరు ఊహించి ఉండరు. ఈ మధ్య కాలంలో యానిమేషన్‌ సినిమాలకు బాగానే రెస్పాన్స్‌ ఉంది కానీ. ఓ పాన్‌ ఇండియా గ్రాండియర్‌ తో పాటు ఇలాంటి సినిమాను దింపడం అనేది సాహసమనే చెప్పాలి. నిన్న విడుదలైన మహావతార నరసింహకు స్లో స్లో గా పోసిటివ్‌ టాక్‌ బయటకు వస్తుంది. వాస్తవానికి సినిమాకు మరీ అంతా బజ్‌ లేదు. కెజిఎఫ్‌ , సాలార్‌ నిర్మాతలు భారీ బడ్జెట్‌ కేటాయించి ఈ సినిమాను తెరమీదకు తీసుకుని వచ్చారు. హై క్వాలిటీ విజువల్స్‌ తో ఆడియన్స్‌ కు థ్రిల్లింగ్‌ ఎక్స్పీరియెన్స్‌ కలిగించేలా రూపొందించారు. పైగా డివోషనల్‌ కంటెంట్‌ కావడంతో ప్రేక్షకులలో ఇంకాస్త ఆసక్తి పెరుగుతుంది.

ప్రస్తుతం ఈ సినిమాకు సాలిడ్‌ రెస్పాన్స్‌ లభిస్తుంది. ఈ సినిమా కథ తెలియనిది కాదు. ఇప్పటివరకు చాలా సినిమాల్లో ఈ కథను చూసాము కూడా. భక్త ప్రహల్లాదుడి మోర విని.. బయటకు వచ్చిన నరసింహ అవతారం రాక్షస రాజు.. హిరణ్య కశిపుడిని అంతం చేసే కథ ఇది. పూర్తి కథ మాత్రం 1967 లో వచ్చిన భక్త ప్రహ్లాద సినిమాలోనే చూసి ఉంటారు. ఆ తర్వాత మరోసారి ఈ సినిమా చేసే ప్రయత్నం ఎవరు చేయలేదు. అలాంటి క్లాసిక్స్‌ ను రీక్రియేట్‌ చేయాలంటే కచ్చితంగా ప్రేక్షకులను స్క్రీన్‌ ప్లే తో మెస్మరైజ్‌ చేయాల్సి ఉంటుంది. ఇక ఇప్పుడు ఇన్నేళ్ల తర్వాత ఈ సినిమాను యానిమేషన్‌ రూపంలో తీసుకుని వచ్చారు.

ఇందులో విజువల్స్‌ తో పాటు బ్యాక్‌ గ్రౌండ్‌ స్కోర్‌ కు కూడా స్పెషల్‌ గా అట్ట్రాక్ట్‌ చేస్తుంది. సామ్‌ సిఎస్‌ ఈ సినిమాకు సంగీతం సమకూర్చారు. లైవ్‌ యాక్టర్స్‌ లేకపోయినా బ్యాక్గ్రౌండ్‌ యానిమేషన్‌ తోనే అవి నిజమైన పాత్రలుగా రూపొందించి టీం సక్సెస్‌ అయ్యారు. ముఖ్యంగా మొదటి అరగంట.. అలాగే క్లైమాక్స్‌ ఈ రెండిటికి ప్రేక్షకులు ఫిదా అయిపోతారు. సో ఈ సినిమా ఇలానే టాక్‌ తోనే కంటిన్యూ అయితే మంచి హిట్‌ అందుకునే అవకాశం లేకపోలేదు. ఇక ఏమౌతుందో చూడాలి.

-ఐడ్రీమ్‌పోస్ట్‌.కామ్‌ సౌజన్యంతో..

నేను సిగ్గు లేని ఆశావాదిని..

అధిక బరువు తగ్గడం కోసం నటీమణులు పడే కష్టం అంతా ఇంతా కాదు. నిరంతరం జిమ్ముల్లో కసరత్తులు చేస్తున్నారు. తిండి కట్టేసి చాలా నియమనిష్ఠలతో ప్రయత్నిస్తున్నారు. ఒజెంపిక్‌ తీసుకుని బరువు తగ్గారని విమర్శల్ని ఎదుర్కొన్న కరణ్‌ జోహార్‌- బోనీకపూర్‌ ల జాబితాలో వీళ్లు లేరు. ఇప్పుడు ప్రముఖ హిందీ నటి విద్యాబాలన్‌ తన అధిక బరువు సమస్య గురించి, బరువు హెచ్చు తగ్గుల కారణంగా తాను ఎదుర్కొన్న ఇబ్బందుల గురించి మాట్లాడారు.

తాను ప్రతిసారీ బరువు తగ్గినా తిరిగి కొంతకాలానికి యథాతథ స్థితికి పెరగడంపై కలత చెందేదానిని అని విద్యాబాలన్‌ పేర్కొన్నారు. అయితే పెరిగిన బరువుతోనే నటిగా తన ప్రయత్నాలు తాను కొనసాగించానని, లీడ్‌ పాత్రల్లో కొనసాగానని విద్యా చెప్పారు. నేను సిగ్గు లేని ఆశావాదిని... నాకు చాలా ఆత్మవిశ్వాసం ఉంది. నేను వెనుకబడిపోకుండా నా గొప్పతనాన్ని నేను ప్రదర్శించాను! అని బాలన్‌ తెలిపారు. చుట్టూ ఉన్న జనాలు బరువు తగ్గాలని సూచించినా కానీ, నాలో ఏ తప్పు లేదని భావించానని విద్యా అన్నారు.

నేను ఎప్పుడూ లీడ్‌ పాత్రలను వదిలిపెట్టలేదు.. నాలో అభద్రతా భావం లేనే లేదు! అని తన ఆత్మవిశ్వాసాన్ని వ్యక్తం చేసారు విద్యా బాలన్‌. జీవితాంతం సన్నగా ఉండటానికి ప్రయత్నించాను. కఠినమైన ఆహార, వ్యాయామ నియమాలు అనుసరించాను.. కొన్నిసార్లు బరువు తగ్గినా తిరిగి యథాస్థితికి వచ్చేదానిని అని తెలిపారు. ఆకు కూరలు, కూరగాయలు తిన్నాను. జీవితాంతం శాఖాహారిని. అయితే అన్ని కూరగాయలు అందరికీ సూట్‌ కావు. కొన్నిటిని ఎంపిక చేసుకుని తినాలని కూడా బాలన్‌ వెల్లడిరచారు. ఎన్టీఆర్‌ బయోపిక్‌ లో బసవతారకం పాత్రలో విద్యాబాలన్‌ నటించిన సంగతి తెలిసిందే. బాలీవుడ్‌ లో ఎన్నో క్లాసిక్‌ హిట్‌ చిత్రాల్లో నటించిన బాలన్‌, తెలుగమ్మాయి, పాపులర్‌ నటి సిల్కుస్మిత పాత్రలో నటించిన సంగతి తెలిసిందే. ది డర్టీ పిక్చర్‌ పేరుతో విడుదలైన ఈ చిత్రం 100 కోట్లు వసూలు చేసింది.

-తుపాకి.కామ్‌ సౌజన్యంతో..

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page