top of page

సిక్కోలు పేకాట.. కేరాఫ్ రాణిపేట

  • Writer: BAGADI NARAYANARAO
    BAGADI NARAYANARAO
  • 1 day ago
  • 2 min read
  • ఏడాదిన్నరగా పర్లాకిమిడిలో శిబిరం నిర్వహణ

  • శ్రీకాకుళం ప్రాంతాల నుంచి జూదరుల తరలింపు

  • ఎస్పీ కార్యాలయానికి కూతవేటు దూరంలోనే డెన్

  • ఎట్టకేలకు ఒడిశా పోలీసుల దాడి.. నిర్వాహకుడి అరెస్టు

(సత్యంన్యూస్, శ్రీకాకుళం)

పోలీసు దాడులు, నిఘా పుణ్యాన జిల్లాలో ఏడాదిన్నరగా పేకాట శిబిరాలు గల్లంతయ్యాయి. పేకముక్కలు పట్టుకోవడానికి అýవాటు పడిన చేతులు చాలారోజులుగా ఆటలేక చిమచిమలాడుతున్న తరుణంలో రా.. రామ్మని ఆహ్వానించింది.. ఒడిశా పరిధిలోని పర్లాకిమిడి రాణిపేట తోట. జిల్లాకు చెందిన పేకాటరాయుళ్లను ఆహ్వానించి సదరు తోటనే శిబిరంగా మార్చి కొన్నాళ్లుగా యథేచ్ఛగా గ్యాంబ్లింగ్ నిర్వహిస్తున్నాడో ‘మీసాల’రాయుడు. గజపతి జిల్లా ఎస్పీ కార్యాలయానికి సమీపంలోనే ఉన్న ఈ తోటలో సుమారు ఏడాదిన్నరగా గుట్టుగా సాగుతున్న ఈ పేకాట దందాకు ఎట్టకేలకు మంగళవారం సాయంత్రం తెరపడింది. ఈ శిబిరంపై ఒడిశా పోలీసులు మెరుపుదాడి చేసి శిబిరం నిర్వాహకుడు మీసాల లక్ష్మీనారాయణ, మరికొందరిని అదుపులోకి తీసుకోవడంతోపాటు రూ.7 లక్షల నగదు, 16 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. అయితే ఎటువైపు నుంచి ఎలాంటి ఒత్తిళ్లు వచ్చాయో గానీ.. కొద్దిసేపటికే లక్ష్మీనారాయణను వాహనాలతో సహా విడిచిపెట్టారని తెలిసింది. పర్లాకిమిడిలోని రామనగర్‌కు చెందిన లక్ష్మీనారాయణ మొదట సారా విక్రయించేవాడని తెలిసింది. తర్వాత తాపీమేస్త్రీ అవతారలోకి మారిన ఆయన కొంతకాలం పేకాట దందా మొదలుపెట్టి రూ. కోట్లకు పడగెత్తాడన్న ప్రచారం స్థానికంగా ఉంది.

కేసులు నమోదు

పర్లాకిమిడిలో నివాసం ఉంటున్న లక్ష్మీనారాయణ అత్తవారు మాత్రం శ్రీకాకుళానికి చెందినవారని అంటున్నారు. అలా ఏర్పడిన పరిచయాలతోనే జిల్లాకు చెందిన కొందరితో చేతులు కలిపి పర్లాకిమిడి రాణిపేటలో పేకాట శిబిరం నిర్వహిస్తున్నట్టు ఆరోపణలు ఉన్నాయి. ఈ శిబిరానికి శ్రీకాకుళం, నరసన్నపేట, పాతపట్నం, రాజాం ప్రాంతాల జూదరులు తరచూ వెళ్లి ఆడుతున్నారు. శ్రీకాకుళం జిల్లాలో పేకాట శిబిరాలు పోలీసుల తాకిడితో పూర్తిగా

మూతపడటంతో వీరంతా రాణిపేట శిబిరానికి క్యూకట్టారని తెలిసింది. అయితే ఇంతకాలం చూసీచూడనట్లు వదిలేసిన ఒడిశా పోలీసులు.. ఈమధ్య శ్రీకాకుళం జిల్లా పోలీసులు ఇచ్చిన సమాచారం, తమ ఉన్నతాధికారుల ఒత్తిడితో పేకాట శిబిరాలపై పర్లాకిమిడి పోలీసులు దాడులు చేసి కొందరిపై క్రిమినల్ కేసులు నమోదు చేశారు. దీంతో రెండు నెలలుగా ఒడిశా భూభాగంలో పేకాట శిబిరాలు నిర్వహిస్తున్నవారు ఇంటికే పరిమితమయ్యారు. స్థానిక పోలీసులకు, గ్రామ పెద్దలకు నెలవారీ మామÖళ్లు ముట్టజెప్పి శిబిరం నిర్వహిస్తున్న లక్ష్మీనారాయణకు స్థానికంగా రాజకీయ పెద్దల ఆండదండలు ఉన్నారన్న ప్రచారం ఉంది. ట్రాఫిక్ సమస్యలు, ఇతర ఇబ్బందులు ఎదురవుతాయన్న ఉద్దేశంతో శిబిరాలకు రావాలనుకునేవారిని పర్లాకిమిడిలో కార్లు నిలిపేసి అక్కడి నుంచి ద్విచక్ర వాహనాల్లోనే రావాలని నిర్వాహకులు షరతు పెడుతున్నారు. జిల్లా సరిహద్దుల్లో మరెక్కడా పేకాట శిబిరాలు లేకపోవడంతో మీసాల లక్ష్మీనారాయణ శిబిరానికి డిమాండ్ పెరిగిందని అంటున్నారు. ఎస్పీ కార్యాలయానికి కూతవేటు దూరంలో నే ఈ శిబిరం నడుస్తున్నా చూసీచూడనట్లు వ్యవహరించారు. అయితే శిబిరానికి వాహనాల రాకపోకలు పెరిగి ఇబ్బందులు తలెత్తడంతో స్థానికుల నుంచి ఫిర్యాదు పెరగడంతో దాడి చేయాల్సి వచ్చిందంటున్నారు. అయితే నెలవారీ మామÖళ్లు విషయంలో నిర్వాహకులు, పోలీసుల మధ్య అంగీకారం కుదరకపోవడం వల్లే ఈ దాడి జరిగిందని జిల్లాకు చెందిన పలువురు జూదరులు చెబుతున్నట్లు తెలిసింది.

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page