‘సీత’ గీత దాటేసినట్లేనా?
- Prasad Satyam
- 14 hours ago
- 2 min read
ఒకేరోజు ఒకో ప్రోగ్రామ్ వేర్వేరుగా
ఇన్‌ఛార్జిని కాదని తమ్మినేని బలప్రదర్శన
పార్టీ లైన్‌కు ఇది భిన్నమని చెప్పడానికి భయపడుతున్న నేతలు
ఆమదాలవలస దాటి వెళ్లేది లేదన్న సంకేతాలు

(సత్యంన్యూస్, శ్రీకాకుళం)
ఈ రెండు పేపర్ క్లిప్పింగ్‌లు జాగ్రత్తగా పరిశీలించండి.. మొదటిది ఆమదాలవలస నియోజకవర్గం వైకాపా ఇన్‌ఛార్జి చింతాడ రవికుమార్ ఆధ్వర్యంలో జరిగిన ప్రొగ్రామ్ కవరేజ్. రెండోది అదే నియోజకవర్గం మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం తనయుడు చిరంజీవి నాగ్ నేతత్వంలో జరిగిన కార్యక్రమం. రెండింటి ఉద్దేశం ఒక్కటే. తిరుపతి లడ్డూపై సిట్ ఇచ్చిన నివేదిక అనంతరం రాష్ట్రంలో జరిగిన అల్లర్లపై, మరీ ముఖ్యంగా అంబటి రాంబాబును అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ వైకాపా రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన కార్యక్రమంలో భాగమిది. ఒకే నియోజకవర్గానికి చెందిన ఇద్దరు నేతలు ఒకేరోజు విడివిడిగా ఒకే కార్యక్రమాన్ని రెండుసార్లు నిర్వహించడం ఇప్ప్పుడు చర్చకు దారితీసింది. రాష్ట్రవ్యాప్తంగా వైకాపా నియోజకవర్గాల ఇన్‌ఛార్జిల ఆధ్వర్యంలో సంబంధిత అధికారులకు వినతిపత్రాలు ఇవ్వాలని ఆదేశించింది. ఈమేరకు చింతాడ రవికుమార్ నేతత్వంలో ప్రోగ్రాం జరిగింది. కానీ అదేరోజు చిరంజీవి నాగ్ కూడా తమతో కలిసొచ్చిన నాయకులతో మధ్యాహ్నం ఈ కార్యక్రమం చేపట్టారు.
ఆమదాలవలస నియోజకవర్గంలో అసలేం జరుగుతోంది? అని పార్టీ దష్టి సారించే వీలు లేకుండా ఈమధ్య సీతారాం వర్గం ఒత్తిడి పెంచింది. ఇప్పటి వరకు పార్టీ పార్లమెంటరీ ఇన్‌ఛార్జిగా ఉన్న తమ్మినేని సీతారాంకు ఆ పోస్టు కూడా ఉండదని ఆమధ్య తేలిపోయింది. దీనిపై రాద్ధాంతం జరగడంతో సీతారాం పదవికి వచ్చిన ముప్ప్పు లేదనే డ్యామేజ్ కంట్రోల్ చర్యలు చేపట్టారు. కానీ సీతారాం మాత్రం ఆమదాలవలసను విడిచిపెట్టే ప్రసక్తే లేదన్న విధంగా సంకేతాలు పంపుతున్నారు. అందులో భాగంగానే ఆయన తనయుడు నియోజకవర్గ ఇన్‌ఛార్జితో కాకుండా సొంతంగా పార్టీ నిర్దేశించిన కార్యక్రమాన్ని చూడాలి. ఆమదాలవలసలో చింతాడ రవితో పార్టీలో సీనియర్లు లేరనే సంకేతం ఆయన పంపుతున్నారు. ఇటీవల పొందూరు నుంచి ఒకరు, ఓవీ పేట నుంచి మరొకరు పార్టీకి రాజీనామా చేసి సీతారాంతో అడుగులు వేస్తుండటం ఇందుకు తాజా ఉదాహరణ. భవిష్యత్తులో ఆమదాలవలస నుంచి తనకు గాని, తన కమారుడికి గాని అవకాశం ఇవ్వకపోతే పార్టీలో రాజీనామాల సంఖ్య మరింత పెరుగుతాయనే పరోక్ష సంకేతాలు వెళ్తున్నాయి. అందుకే ఒకేరోజు వేర్వేరుగా కార్యక్రమాలు చేపట్టినా పార్టీ ఎటువంటి హెచ్చరికలూ జారీ చేయలేదు. సీతారాం తన తనయుడితో వేరేగా ర్యాలీ నిర్వహించడం వెనుక పెద్ద వ్యూహమే కనిపిస్తుంది. జగన్మోహన్‌రెడ్డి నియమించిన ఇన్‌ఛార్జి వెనుక కార్యకర్తలు లేరని నిరూపించడం కోసం కాళింగ కార్పొరేషన్ మాజీ చైర్మన్ దుంపల లక్ష్మణరావు, వైకాపా రాష్ట్ర కార్యదర్శి కిల్లి సత్యనారాయణతో పాటు మరికొందరు సీనియర్లతో కొడుకును పంపారు. తాను కార్యక్రమం చేపడితే రావడానికైనా, రాజీనామా చేయమంటే చేయడానికైనా ఆమదాలవలసలో నాయకులున్నారు జాగ్రత్త అనే సందేశాన్ని సీతారాం పరోక్షంగా పార్టీ అధిష్టానానికి పంపినట్లే. మరోవైపు కాళింగ సామాజికవర్గం మద్దతు తనకే ఉంటుందన్న బలప్రదర్శన కూడా ఆమధ్య చేపట్టారు. వాస్తవానికి సీతారాం కుటుంబానికి ఆమదాలవలస నియోజకవర్గంలో కాకుండా వేరే స్థానంలో కూర్చోబెట్టడానికి గత ఎన్నికలప్ప్పుడే జగన్మోహన్‌రెడ్డి నిశ్చయించుకున్నారు. కానీ ‘వై నాట్ 175’ కాన్ఫిడెన్స్‌లో సీతారాంను ఓకే చేశారు. అయితే ఎన్నికల తర్వాత మొట్టమొదట ఆమదాలవలసనే మార్చారు. అప్పట్నుంచి ఇన్‌ఛార్జి చింతాడ రవికి సీతారాం వైపు నుంచి సహాయ నిరాకరణ ఎదురవుతోంది. ఈ రెండేళ్లలో ప్రతిపక్షం చేపట్టిన ప్రతీ కార్యక్రమాన్ని చింతాడ రవి తన స్థాయికి మించి విజయవంతం చేశారు. జిల్లాలో సీనియర్లకు ఏమాత్రం తీసిపోకుండా జన సమీకరణ చేస్తున్నారు. అయితే ఇవన్నీ తాను బరిలో లేనందునే జరుగుతున్నాయని, పేర్లల్‌గా తాను రంగంలోకి దిగితే పార్టీ కేడర్ ఎవరితో ఉంటుందో తెలియజెప్పేందుకే సీతారాం నిర్ణయించుకున్నట్లు తెలుస్తుంది. అందుకే రెండేళ్లుగా చింతాడ రవి నియోజకవర్గంలో ప్రోగ్రామ్‌లు చేస్తుంటే, సీతారాం టెక్కలికో, పలాసకో పయనమయ్యేవారు. కానీ బుధవారం కార్యక్రమం మాత్రం ఇన్‌ఛార్జికి పేర్లల్‌గా నిర్వహించారు. అధిష్టానంతో తాడోపేడోకు కూడా సిద్ధమవుతున్నారు. చింతాడ రవి పుంజుకుంటున్న సమయంలో సీతారాం బ్రేకులు వేయడం సరికాదని పార్టీలో కొందరు భావిస్తున్నారు. భారీ మెజార్టీతో కూన రవి గెలిచిన తర్వాత కూడా పార్టీ కోసం పని చేసిన చింతాడకు ఇప్ప్పుడిప్ప్పుడే అన్ని మండలాల నుంచి మద్దతు పెరుగుతున్న సమయంలో సీతారాం ఆ గట్టునుంటారో, ఈ గట్టునుంటారో తేల్చుకోవాలన్న విధంగా కేడర్‌ను కన్ఫ్యూజ్ చేయడం పార్టీకి నష్టం కలిగిస్తుందని, దీని వల్ల తాము నలిగిపోతున్నామంటూ కార్యకర్తలు అక్కడ వాపోతున్నారు.










Comments