top of page

సివిల్ ముసుగులో ‘క్రిమినల్ ’ దందా

  • Writer: BAGADI NARAYANARAO
    BAGADI NARAYANARAO
  • 2 days ago
  • 3 min read
  • నకిలీ పత్రాలతో కోట్లు విలువైన భూముల ఆక్రమణ

  • ఫోర్జరీ సంతకాలలో యథేచ్ఛగా అక్రమ రిజిస్ట్రేషన్లు

  • రక్తపు మరకలు లేకుండానే విలువైన భూములు అన్యాక్రాంతం

  • తహసీల్దార్ సంతకాలే ఫోర్జరీ... నాటకీయంగా బినామీ వారసుల సృష్టి

  • సామాన్యుడి ఆస్తులకు రక్షణ ఏది?

(సత్యంన్యూస్, శ్రీకాకుళం)

మనం పాటిస్తున్న చట్టాల మేరకు భూ వివాదాలు సివిల్ మేటర్. అదే భూ వివాదం కోసం కొట్టుకుంటే క్రిమినల్ ఇష్యూ. మొదటిదానిలో పోలీసులు కల్పించుకోవడానికి లేదు. రెండోదానిలో కేసు నమోదు చేయకపోతే తప్ప్పు. అయితే ఇప్ప్పుడు భూమి ధరలు అమాంతం పెరగడంతో సివిల్ మేటర్‌కే క్రిమినల్ ఇంటిమిడేషన్ చేరిపోయింది. అంటే.. భూమి కోసం కొట్టుకుంటున్నారనుకోకండి. చేతికి రక్తపు మరకలు అంటకుండా భూములు అన్యాక్రాంతమైపోతున్నాయి. ఫోర్జరీ, నకిలీ పత్రాలు సృష్టించి విలువైన భూములను కాజేస్తున్నారు. దీంతో పోలీసులు సివిల్ మేటర్‌లో క్రిమినల్ చర్యలపై కేసులు పెట్టాలా? లేదా? అన్న సందిగ్ధంలో ఉండిపోతున్నారు. పలుకుబడి ఉంటే.. లేదూ ఆ కేసుకు రాజకీయ రంగు ఉంటే కల్పించుకుంటున్నారు తప్ప సామాన్యుడి భూమికి నకిలీ పత్రాలు సృష్టించి, ఫోర్జరీ డాక్యుమెంట్లు పెట్టి రిజిస్ట్రేషన్లు చేయించుకుంటే ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా స్పందించడంలేదు. అడిగితే ఇది సివిల్ మేటరంటున్నారు. నకిలీ పత్రాలు సృష్టించడం, ఫోర్జరీ సంతకాలు పెట్టడం సివిల్ మేటర్ ఎలా అవుతుందో చెప్పడంలేదు. జిల్లాలో అనేక పోలీస్ స్టేషన్లలో ఇటువంటి ఫిర్యాదులున్నాయి. కానీ పోలీసులు చర్యలకు వెనకాడుతున్నారు. శ్రీకాకుళం రూరల్ పోలీస్‌స్టేషన్‌లో మాజీ స్పీకర్ తమ్మినేని కుటుంబం మీద సరిగ్గా ఇటువంటి ఫిర్యాదే వస్తే పోలీసులు స్పందించారు. ఆ తర్వాత సీతారాం, ఆయన భార్య, కుమారుడు కోర్టు నుంచి రక్షణ పొందారు, అది వేరే విషయం. కానీ ఒక సామాన్యుడికి కూడా ఇటువంటి న్యాయమే దక్కితే బాగుంటుందనే అభిప్రాయం జిల్లాలో వ్యక్తమవుతుంది. స్థానిక వరం కాలనీలో ఉన్న భూమిని య్పుమాని బతికుంటుండగానే చనిపోయాడని డెత్ సర్టిఫికెట్ సృష్టించి, ఆయన వారసురాలిగా మరో బినామీని తెర మీదకు తెచ్చి, ఆమె ద్వారా ఆస్తి దఖలుపడినట్లు సీతారాం తనయుడు రిజిస్ట్రేషన్ చేయించుకున్నారనేది రూరల్ పోలీస్‌స్టేషన్‌లో నమోదైన ఫిర్యాదు. ఇందులో పోలీసులు చకచకా కదిలారనడంలో సందేహం లేదు. కానీ ఇటువంటి కేసులే జిల్లాలో అనేకం ఉన్నాయి. వాటి మీద కూడా పోలీసులు ముందుకురికితే బాగుంటుందన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది.

తిత్లీలోనూ రిజిస్ట్రేషన్ జరిగిందట!

ఉద్దానం ప్రాంతంలో తిత్లీ సృష్టించిన విలయం మనం దరికీ తెలుసు. మొత్తం ఉద్దానం నేలకొరిగిపోగా, జిల్లాలో వారం రోజుల పాటు విద్యుత్ సౌకర్యం, జనజీవనం స్తంభించిపోయింది. అటువంటి సమయంలోనూ కవిటి మండలం బల్లిపుట్టుగ గ్రామంలో సర్వే నెంబరు 56/4 లో వారసత్వంగా వచ్చిన భూమిలో ఉన్న బెందాళం రోజా తిత్లీ ప్రళయం రోజుల్లో తన 6 సెంట్ల భూమిని అమ్మేసినట్లు రికార్డులు చెబుతున్నాయి. వాస్తవానికి ఆ డాక్యుమెంట్ల మీద ఉన్న సంతకం బి. రోజాది కాదు. ఆ డాక్యుమెంట్‌పై ఉన్న తేదీ నాటికి ఆ కుటుంబం మంగళగిరిలో ఉంది. ఎందుకంటే.. ఆమె భర్త బెందాళం కృష్ణారావు విజయవాడ ప్రజాశక్తి ప్రధాన కార్యాలయంలో పని చేస్తున్నారు. సరిగ్గా తుపాను సంభ వించిన తేదీ, డాక్యుమెంట్ తేదీ ఒకటే. అప్పటికి రెండు రోజుల ముందు నుంచి జిల్లాలో వర్షాలు కురుస్తున్నాయి. ఆ సమయంలో దస్తావేజు కొన్నట్టు, సంతకాలు చేసినట్లు చూపించి, ఇందుకు సాక్షులను నోటరీని పుట్టించి, ఈ భూమిని అమ్మేసినట్లు రిజిస్ట్రార్ కార్యాలయంలో పని పూర్తి చేశారు.

అయితే ఇక్కడ కూడా ఫోర్జరీ, నకిలీ మనుషుల సృష్టి వంటి క్రిమినల్ ఇంటిమిడేషన్ ఉంది. దీనిపైనే రోజా స్థానిక పోలీసులను కలిశారు. స్పందన రాకపోవడంతో ఎస్పీ గ్రీవెన్స్‌కు ఫిర్యాదు చేశారు. ఈ గొడవ మధ్యలోనే రోజా 2025 ఆగస్టులో చనిపోయారు. ఆమె భర్త ఎస్పీని కలిసి ఫిర్యాదు చేశారు. కానీ కబ్జాదారు ఆ భూమి నుంచి ఇప్పటికీ వైదొలగడంలేదు. సీఎం కార్యాలయం లో ఫిర్యాదు చేయడం వల్ల రీమÖ్యటేషన్ అయితే పూర్త యింది. కబ్జాదారులు అక్కడే ఉన్నారు.

ఇంకో ఉదాహరణ చూద్దాం..

శ్రీకాకుళం రూరల్ మండలం పాత్రునివలస నేషనల్ హైవే పక్కన డెంటల్ కాలేజీకి ఎదురుగా రామకృష్ణా నగర్ కాలనీలో ఉంటున్న పురాణం సతీష్‌కు 18 సెంట్ల స్థలం ఉంది. సతీష్ తల్లి పురాణం వెంకట వరాహ లక్ష్మి పేరుతో ఉన్న ఈ స్థలం ఆమె మరణానంతరం సతీష్‌కు దఖలుపడింది. 1984లో ఈ స్థలం వెంకట వరాహలక్ష్మి కొన్నట్టు రికార్డులు చెబుతున్నాయి. అయితే ఇప్ప్పుడు ఈ స్థలంపై వారణాశి రాజేష్ అనే వ్యక్తి ఉండటంతో సతీష్ ముఖ్యమంత్రి గ్రీవెన్స్‌ను ఆశ్రయించారు. తన భూమి ఎక్కడుందో చూపించి అప్పగించాలని కోరారు. ఈ మేరకు సర్వే సిబ్బంది పాత్రునివలస వచ్చి కొద్ది రోజుల క్రితం కొలతలు చూసుకొని వెళ్లారు. ఇక్కడ పోలీసులు ఎంటరైతే గాని స్థలం స్వాధీనం చేసుకోవడం కుదరదు. అతడు సినిమాలో తనికెళ్ల భరణి అన్నట్టు ‘స్థలం మీదే, పత్రాలు మాత్రం నావి’ అంటున్నారు ఆక్రమణదారులు. శ్రీకాకుళం నగరానికి ఆనుకొని నేషనల్ హైవే మీద ఉండటం వల్ల ఈ స్థలం కోట్లు విలువ చేస్తుంది. కాబట్టి ఎవరు బలహీనులో, ఎవరు స్థానికంగా ఉండరో చూసు కొని మరీ ఆక్రమణదారులు పాగా వేస్తున్నారు. ఇదంతా ఓ పద్ధతి ప్రకారం క్రిమినల్ ఇంటిమిడేషన్‌తో చేస్తున్నవే.

అద్దెకు ఉంటూ ఇంటిని మింగేసిన వైనం

నగరానికి చెందిన ఎస్‌బీఐ పూర్వ అధికారి సీహెచ్‌వీ పట్నాయక్‌కు చెందిన పాత శ్రీకాకుళంలోని కిల్లిపాలెం పంచాయతీ పరిధిలోని సర్వే నంబరు 10లోని 222.666 చదరపు గజాల డాబా ఇంటిని, 2025 డిసెంబరు 9న శ్రీకాకుళం తహసీల్దార్ కార్యాలయం జారీ చేసినట్లు ఒక ఎండార్స్‌మెంట్‌ను తయారుచేయించి రిజిస్ట్రేషన్ చేయించేశారు.

డాక్యుమెంట్ నంబరు 5564/2025లో సర్వే నంబరు 166/3ను నకిలీ ఎండార్స్‌మెంట్‌తో సర్వే నంబరు 10గా సవరణ చేశారు. స్థానిక విశాఖ-ఏ కాలనీకి చెందిన పొట్నూరు వెంకట గున్నరాజు, ఆయన కుమారుడు గణేష్ కలిసి ఈ నకిలీ ఎండార్స్‌మెంట్‌ను సృష్టించి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ చేయించినట్లు సీహెచ్‌వీ పట్నాయక్ శ్రీకాకుళం తహసీల్దార్‌కు ఫిర్యాదు చేయడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. వాస్త వానికి వెంకట గున్నరాజు సీహెచ్‌వీ పట్నాయిక్ ఇంటిలో అద్దెకున్నారు. దీనిపక్కనే గున్నరాజు కుటుంబానికి స్థలం ఉంది. ఈ రెండింటినీ కలిపేసి ఆస్తి మొత్తం తనదేనని ఒక ఎండార్స్‌మెంట్ తెచ్చి రిజిస్టర్ చేయించుకున్నారు. పట్నాయిక్ ఫిర్యాదుపై స్పందించిన అధికారులు కార్యాల యంలో అందుబాటులో ఉన్న రికార్డులను పరిశీలించి, ఆ ఎండార్స్‌మెంట్‌ను తహసీల్దార్ కార్యాలయం జారీ చేయలేదని నిర్ధారించారు. ఎండార్స్‌మెంట్‌పై ఉన్న సంత కం కార్యాలయ అధికారుల సంతకాలతో సరిపోలనం దున, ఈ ధ్రువీకరణను నకిలీ/ఫోర్జరీ పత్రంగా నిర్ధా రించి, ఇది తహసీల్దార్ కార్యాలయం నుంచి జారీ చేసిన అధికారిక సమాచార పత్రం కాదని జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయానికి నివేదిక అందించారు.


Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page