21 మున్సిపాలిటీల్లో త్వరలో ఎన్నికలు
- Prasad Satyam
- Jul 16, 2025
- 1 min read

(సత్యంన్యూస్, శ్రీకాకుళం)
విలీన గ్రామాల సమస్యలు, కోర్టు కేసుల వల్ల రాష్ట్రంలో ఎన్నికలు జరగని 21 మున్సిపాలిటీల్లో మూడు నెలల్లో ఎన్నికలు నిర్వహిస్తామని మున్సిపల్ శాఖామంత్రి నారాయణ ప్రకటించారు. ఎన్నికలు జరగకపోవడం వల్ల 15వ ఆర్థిక సంఘం నిధులు విడుదలవ్వక అభివృద్ధి జరగడంలేదని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ విషయాన్నే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు దృష్టికి తీసుకువెళితే కోర్టులో కేసులు పరిష్కరించి ఎన్నికలు జరిగేవిధంగా చర్యలు తీసుకోమన్నారని, మూడు నెలల్లో ఎన్నికలకు వెళ్తామని మంత్రి నారాయణ బుధవారం తెలిపారు.










Comments