top of page

అంతర్జాతీయ విమానయానానికి రాము రెక్కలు

  • Writer: DV RAMANA
    DV RAMANA
  • Sep 12, 2024
  • 3 min read
  • ఆసియా పసిఫిక్‌ ఏవియేషన్‌ సమిట్‌ లక్ష్యం

  • 1944లో అంతర్జాతీయ పౌర విమానయాన సంస్థ ఏర్పాటు

  • దానికి అనుబంధంగా మంత్రుల రెండో శిఖరాగ్ర సదస్సు

  • మన మంత్రి కింజరాపు రాముకు ఛైర్మన్‌గా అపూర్వ అవకాశం

(డి.వి.రమణ, సత్యం ప్రత్యేక ప్రతినిధి)

అంతర్జాతీయ విమానయాన రంగానికి ఆధునిక రెక్కలు తొడిగేందుకు తీసుకోవాల్సిన చర్యలు, పరస్పర సహకారానికి సంబంధి విస్తృత చర్చలు జరిపి తీర్మానాలు ఆమోదించడం, వాటిని సభ్య దేశాలు అమల్లోకి తెచ్చేలా కృషి చేయడమే లక్ష్యంగా ఆసియా`పసిఫిక్‌ దేశాల మంత్రుల సమావేశంలో బుధవారం ఢల్లీిలో ప్రారంభమైంది. ఈ సమావేశాల పరంపరలో రెండోదైన ఈ సమిట్‌గా భారత్‌ అతిథ్యం ఇస్తుండగా.. భారత పౌరవిమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్‌నాయుడును ఈ సదస్సుకు అధ్యక్షుడిగా సభ్య దేశాలు ఏకగ్రీవంగా ఎన్నుకున్నాయి. ఆయన పేరును సింగపూర్‌ ప్రతిపాదించగా, మిగతా సభ్యదేశాలన్నీ బలపరచడంతో ఛైర్మన్‌గా ఎన్నికైన రాము సమావేశాల్లో ప్రారంభంలోనే అధ్యక్ష బాధ్యతలు స్వీకరించారు. తద్వారా తనను ఎన్నుకున్న శ్రీకాకుళం జిల్లా కీర్తిప్రతిష్టలను అంతర్జాతీయంగా ఇనుమడిరపజేశారు. చిన్న వయసులోనే ఎంపీగా ఎన్నికై రికార్డు సృష్టించిన రాము వరుసగా మూడోసారి మొన్నటి ఎన్నికల్లో ఎంపీగా విజయం సాధించి హ్యాట్రిక్‌ కొట్టారు. అదే ఊపులో కేంద్రంలో నరేంద్ర మోదీ కేబినెట్‌లో విమానయాన శాఖ మంత్రిగా చోటు సంపాదించారు. ఆ విధంగా కేంద్ర కేబినెట్‌లో చిన్న వయస్కుడిగా మరో రికార్డు సృష్టించారు. కాగా అంతర్జాతీయ స్థాయిలో జరుగుతున్న ఆసియా`పసిఫిక్‌ మంత్రుల సదస్సుకు సైతం ఛైర్మన్‌గా ఎన్నికైన ఘనత సాధించిన ఆయన ఆ గురుతర బాధ్యత చేపట్టిన పిన్నవయస్కుడిగా మరోచరిత్ర సృష్టించారు. ఆసియా`పసిఫిక్‌ శిఖరాగ్ర సదస్సును మొదట 2018లో చైనా రాజధాని బీజింగ్‌ అతిథ్యమిచ్చి నిర్వహించింది. ఆరేళ్ల తర్వాత రెండో సదస్సు బుధవారం ఢల్లీిలో ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో అసలు ఏమిటీ అసియా`పసిఫిక్‌ ఏవియేషన్‌ సదస్సు? దీని ప్రాధాన్యత ఏమిటి? లక్ష్యాలు ఏమిటి? అన్న ప్రశ్నలకు సమాధానమే ఈ కథనం.

అంతర్జాతీయ పౌరవిమానయా సంస్థకు అనుబంధంగా..

కొన్ని దశాబ్దాల క్రితమై గ్లోబలైజేషన్‌ పెరిగింది. ప్రపంచ దేశాల మధ్య సంబంధాలు విస్తృతమవుతున్నాయి. ఫలితంగా వివిధ దేశాల మధ్య జరిగే ప్రయాణాల్లో విమానయాన(ఏవియేషన్‌) రంగం పాత్రే కీలకంగా మారింది. అయితే ఈ రంగంలో ఒక్కో దేశానికి ఒక్కో విధానం ఉండటం వల్ల అంతర్జాతీయ ప్రయాణాలతోపాటు విమాన సర్వీసుల నిర్వహణ కష్టతరంగా మారింది. ఈ ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని విమానయాన రంగంలో దేశాల మధ్య సహకార, సమన్వయం పెంచేందుకు 1944 డిసెంబర్‌ ఏడో తేదీన చికాగో వేదికగా అంతర్జాతీయ విమానయాన సంస్థ అంటే ఇంటర్నేషనల్‌ సివిల్‌ ఏవియేషన్‌ ఆర్గనైజేషన్‌(ఐసీఏవో) ఏర్పడిరది. 1947లో ఈ సంస్థ ఐక్యరాజ్యసమితికి అనుబంధంగా మారింది. అంతర్జాతీయ విమానయాన ప్రమాణాలు పెంచడం, భద్రతా ప్రమాణాలు కాపాడటం, విమానయానం వల్ల పర్యావరణానికి నష్టం వాటిల్లకుండా చూడటం, దేశాల మధ్య సమన్వయం సాధించి రవాణా సౌకర్యాలు మెరుగుపడటం ఈ సంస్థ ప్రధాన లక్ష్యాలు. ప్రారంభంలో 36 దేశాలు ఇందులో సభ్యులుగా ఉండగా, ప్రస్తుతం సభ్యదేశాల సంఖ్య 193కు పెరిగింది. దీనికి అనుబంధంగా ప్రాంతీయ స్థాయిలో ఆసియా, పసిఫిక్‌ దేశాల మధ్య మరింత సహకారం పెంపొందించాలన్న లక్ష్యంతో ఈ రీజియన్‌లోని భారత్‌తో సహా 39 దేశాలు ఏకమై తొలిసారి 2018 ఫిబ్రవరిలో చైనాలోని బీజింగ్‌లో శిఖరాగ్ర సదస్సు నిర్వహించి విమానయానరంగానికి సంబంధించి పలు తీర్మానాలు చేశాయి. దానికి కొనసాగింపుగా ప్రస్తుతం న్యూఢల్లీి వేదికగా రెండురోజులపాటు సమావేశం నిర్వహిస్తున్నాయి. బీజింగ్‌ సదస్సులో తీసుకున్న నిర్ణయాల అమలుతీరును సమీక్షించడంతోపాటు ఇకముందు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించి తీర్మానాలు చేస్తున్నారు.

అసియా`పసిఫిక్‌ ప్రాధాన్యత పరిరక్షణ

ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎయిర్‌ ట్రాఫిక్‌(విమాన సర్వీసులు)లో అసియా`పసిఫిక్‌ రీజియన్‌ ఒక్కటే 33.41 శాతం వాటా కలిగి ఉంది. దానికి అనుగుణంగా ఈ ప్రాంత ప్రాధాన్యతను ఎప్పటికప్పుడు ప్రపంచానికి చాటిచెప్పడంతోపాటు తదనుగుణంగా పాసింజర్‌, కార్గో సేవలను పెంచడం, భద్రతా ప్రమాణాలు మెరుగుపరిచేలా మిగతా దేశాలను ఒప్పించడానికి అసియా`పసిఫిక్‌ సమిట్‌ ప్రధాన లక్ష్యాల్లో ఒకటిగా ఉంది. 39 సభ్య దేశాల మధ్య పరస్పర సహకారాన్ని మరింత మెరుగుపర్చడానికి కూడా ఈ సదస్సు కృషి చేస్తుంది. విమానయాన రంగం ఎదుర్కొంటున్న సవాళ్లపై చర్చించి, వాటిని అధిగమించేందుకు గల మార్గాలను సూచిస్తుంది. విమాన ప్రయాణాల్లో ఆసియా-పసిఫిక్‌ ప్రాంతం వేగవంతమైన వృద్ధి సాధిస్తోంది. ఇంటర్నేషనల్‌ సివిల్‌ ఏవియేషన్‌ ఆర్గనైజేషన్‌ అంచనాల ప్రకారం ఈ ప్రాంతంలో 2023లో 4.5 బిలియన్ల మంది విమాన ప్రయాణాలు చేయగా 2050 నాటికి ఆ సంఖ్య 11.5 బిలియన్లకు పెరగనుంది. ఈ అంచనాలకు అనుగుణంగా విమానాలు, సౌకర్యాలు, భద్రత ఏర్పాట్లు పెంచే దిశగా సభ్య దేశాలను మోటివేట్‌ చేస్తుంది. సైబర్‌ నేరాలు, బెదిరింపులు వంటి సరికొత్త సమస్యలను అధిగమించే విషయంలో పరస్పర సహకారాన్ని సాధించే అంశాలను చర్చించి నిర్ణయాలు తీసుకుంటుంది. ఆసియా-పసిఫిక్‌ ప్రాంతంలో ఎయిర్‌ కనెక్టివిటీని అవసరాలకు అనుగుణంగా మెరుగుపరచడం, దేశాల మధ్య పర్యాటక వాణిజ్యం పెంచడంపై సదస్సు దృష్టి సారిస్తుంది. విమాన సర్వీసులు పెరిగేకొద్దీ ఎయిర్‌ ట్రాఫిక్‌ సమస్యలు పెరుగుతాయి. దీన్ని కంట్రోల్‌ చేసేందుకు డిజిటల్‌ టెక్నాలజీ, డేటా అనలిటిక్స్‌ వినియోగించే విషయంలో సభ్య దేశాలకు సహకరిస్తుంది. విమానయాన రంగంలో భద్రత, ప్రమాదాల నియంత్రణ అతి ముఖ్యమైనవి. వివిధ దేశాల ఎయిర్‌ ట్రాఫిక్‌ కంట్రోల్‌ వ్యవస్థల మధ్య పూర్తి సమన్వయం ఉంటే తప్ప ఇది సాధ్యం కాదు. దీన్ని సాధించడం కూడా ఈ సదస్సు ముఖ్య ఉద్దేశాల్లో ఒకటి. ఇలాంటి మరెన్నో అంశాలపై అసియా`పసిఫిక్‌ సదస్సులు చర్చించి, తీర్మానాలు చేస్తున్నారు. మళ్లీ వచ్చే సమావేశాల నాటివరకు వీటి అమలు తీరును ఆసియా`పసిఫిక్‌ మంత్రుల శిఖరాగ్ర సదస్సు ఛైర్మన్‌ హోదాలు కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్‌నాయుడు పర్యవేక్షించాల్సి ఉంటుంది.

తెలుగులోనే రాము ప్రమాణం

దేశం తరఫున తనకు దక్కిన ఈ గౌరవాన్ని బాధ్యతగా స్వీకరిస్తానని మంత్రి కింజరాపు రామ్మోహన్‌నాయుడు చెప్పారు. సదస్సు ప్రారంభ వేదికపై అధ్యక్షుడిగా మాతృభాష అయిన తెలుగులోనే ప్రమాణ స్వీకారం చేసిన ఆయన అనంతరం మాట్లాడుతూ తనను ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు సభ్యదేశాలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. విమానయాన రంగాన్ని సాధారణ ప్రజలకు మరింత చేరువ చేయడంతోపాటు సభ్యదేశాల మధ్య రాకపోకలను సులభతరం చేసేందుకు కృషి చేస్తానన్నారు. ఆసియా పసిఫిక్‌ ప్రాంతంలో దాదాపు శతాబ్దం కిందట వాణిజ్య విమాన సేవలు ప్రారంభమయ్యాయని అంటూ 2035 నాటికి ఈ రీజియన్‌ ఏడాదికి 3.5 బిలియన్ల ప్రయాణికులతో అతిపెద్ద మార్కెట్‌గా అవతరించనుందని చెప్పారు. ఆ మేరకు మౌలిక సదుపాయాలు, వ్యూహాత్మక పెట్టుబడులు, స్థిరమైన, సమతుల్య వృద్ధిని సాధించడానికి భాగస్వామ్య దేశాల మధ్య సహకారం అవసరమన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో భారత ఏవియేషన్‌ రంగం వేగవంతమైన పురోగతి సాధిస్తోందని వివరించారు. 2014లో ఆపరేషనల్‌ ఎయిర్‌పోర్టులు 74 ఉంటే.. ప్రస్తుతం వీటి సంఖ్య 157కి చేరిందని, మౌలిక సదుపాయాలు విస్తరించాయని చెప్పారు. 2047 నాటికి ఈ సంఖ్యను 350-400కి పెంచాలని యోచిస్తున్నట్టు తెలిపారు. గత దశాబ్దంలో దేశీయ విమాన ప్రయాణికుల సంఖ్య రెట్టింపు కంటే ఎక్కువగా ఉందని, భారతీయ విమానయాన సంస్థలు తమ సేవలను గణనీయంగా విస్తరించుకున్నాయని ఆయన తెలిపారు.

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page