top of page

అవునా.. అయితే మరోసారి హిందువుగా మారిపో!

  • Writer: NVS PRASAD
    NVS PRASAD
  • 2 hours ago
  • 3 min read
  • చీల్చిచెండాడుతున్న తమళ మీడియా

  • మెగాస్టార్ కంటే గొప్పవాడా?

  • తప్పులు , ఫ్లాపులు కప్పిపుచ్చుకోడానికే మతప్రస్తావన

(సత్యంన్యూస్, శ్రీకాకుళం)

భారతీయ సంగీత చరిత్రలో మహమ్మద్ రఫీ, నౌషాద్, బిస్మిల్లా ఖాన్, జాకీర్ హుస్సేన్ వంటి వారు మతానికి అతీతంగా పూజించబడ్డారు. చివరికి పాకిస్థాన్ నుంచి వచ్చిన నాజియా హసన్‌ను కూడా ఇక్కడి ప్రజలు తలమీద పెట్టుకున్నారు. అద్నాన్ సమీని గుండెల్లో పెట్టుకుని భారత పౌరసత్వం ఇచ్చేలా ప్రోత్సహించారు. ఇన్ని గొప్ప ఉదాహరణలు ఉన్న దేశంలో, రెహమాన్ తనకు అవకాశాలు తగ్గడానికి మతం కారణం అనడం ఎంతవరకు సమంజసం?

కానీ, ఇటీవల బాలీవుడ్‌లో తనకు అవకాశాలు తగ్గడానికి మతపరమైన కారణాలు ఉన్నాయని రెహమాన్ అపార్థం చేసుకోవడం విచారకరం. నిజానికి సినిమా రంగంలో ఒడిదుడుకులు ఎవరికైనా సహజం. శోభన్ బాబు, చిరంజీవి ఉదాహరణే ఒక గొప్ప పాఠం.

మల్లెపూవు సినిమాకు ముందు శోభన్‌బాబు అయిపోయాడు అన్నారు. ఆ తర్వాత విజృంభించాడు. 1992లో ఘరానా మొగుడు టాలీవుడ్‌లో మొదటి రూ.10 కోట్ల వసూళ్ల సినిమాగా రికార్డు సృష్టించింది. ఆ సమయంలోనే నేషనల్ మ్యాగజైన్స్ చిరంజీవి గారిని ‘బచ్చన్ కంటే పెద్ద స్టార’ అని అభివర్ణించాయి. ఆ తర్వాత అన్నీ వరుస పరాజయాలు. ఆ తర్వాత వచ్చిన ఆపద్బాంధవుడు (క్లాసిక్ అయినప్పటికీ కమర్షియల్‌గా ఆడలేదు), మెకానిక్ అల్లుడు, ఎస్.పి.పరశురామ్, బిగ్‌బాస్, రిక్షావోడు వంటి సినిమాలు బాక్సాఫీస్ వద్ద దారుణంగా విఫలమయ్యాయి. అప్పట్లో పత్రికలు ఆయన ‘పని అయిపోయింది’ అని కూడా రాశాయి. అయినా ఆయన ఎప్పుడూ నిరాశ చెందలేదు, సాకులు వెతకలేదు. ఓపికగా ఉండి, కథలను మార్చుకుని ‘హిట్లర’ సినిమాతో మళ్లీ తన సత్తా చాటారు. ఒక మెగాస్టార్‌కే తప్పని ఈ పరిస్థితులు, రెహమాన్‌కి ఎదురైనప్పుడు దానిని మతపరంగా చూడటం సమంజసం కాదు.

మార్కెట్ తగ్గడానికి అసలు కారణాలు

వరుస పరాజయాలు.. ఆయన సంగీతం అందించిన మొహెంజోదారో, ఒకే జాను, హీరోపంతి`2 వంటి సినిమాలు బాక్సాఫీస్ వద్ద విఫలమయ్యాయి. రజనీకాంత్‌కు బ్లాక్ బస్టర్ ఆల్బమ్స్ ఇచ్చిన రెహమాన్, గత పదేళ్లుగా కొచ్చాడయాన్, లింగా, 2.0, ఇటీవల లాల్ సలామ్ చిత్రాల్లో ఆ మ్యాజిక్ రిపీట్ చేయలేకపోయారు.

పెరిగిన పోటీ

బాలీవుడ్‌లో ఇప్పుడు ఒకే సినిమాకు ఐదారుగురు సంగీత దర్శకులను తీసుకునే సంస్కృతి పెరిగింది. అలాగే అనిరుధ్ వంటి యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ల హవా నడుస్తోంది. కోట్లలో రెమ్యునరేషన్ పెంచేయడం వల్ల కూడా చాలామంది నిర్మాతలు ఆయన జోలికి వెళ్లడం లేదు. మహాద్భుత సంగీత హిమాలయాల్లాంటి ఇళయరాజా, కెవి మహదేవన్, ఎమ్మెస్ విశ్వనాధన్‌లకే మార్కెట్ తగ్గింది. వారిని మించిన టాలెంట్ రెహమాన్‌కు ఉందనుకోవడం మూర్ఖత్వం. అంతటి దిగ్గజాలకే కాలక్రమేణా మార్కెట్ తగ్గింది. వారికి ప్రతిభ లేక కాదు, సినిమాల ఫలితాలు, మారుతున్న ప్రేక్షకుల అభిరుచి వల్ల. వాటిని అందుకోగలగాలి. దానికి తన లోపాలు తానే చూసుకోగలగాలి.

ఇలాంటి పరిస్థితుల్లో రెహమాన్ మతపరమైన కోణంలో మాట్లాడటం, ‘చావా’ వంటి చారిత్రక సినిమాలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం వల్ల ఆయన ఎందరో అభిమానులకు దూరం అవుతున్నారు. ఆయన త్వరగా వాస్తవాలను గ్రహించి, వివాదాలకు దూరంగా ఉండి, మళ్లీ తన అద్భుతమైన సంగీతంతో మనముందుకు రావాలని ఆశిద్దాం.

- గౌతమ్ కశ్యప్

రెహ్మాన్ చాలా ఖరీదైన సంగీత దర్శకుడు

ఊరికే ఒక్క బీట్ కూడా కొట్టడు...

అంతర్జాతీయ సెలబ్రిటీ కాబట్టి... ఆయన ఏ కార్యక్రమానికి రావాలన్నా బాగా పైసలు వసూల్ చేస్తాడు.. ఒకవేళ ఏదైనా యాడ్ చేసినా...బోలెడు డబ్బులు వస్తాయి... అంత పోడ్కాస్ట్... అంత టైము వెచ్చించాడు అంటే...ఊరికే చేస్తాడా... ఈయన దేశంలో అత్యధిక ప్రజాదరణ పొందిన సంగీతకారుడు...అందులోనూ ఇస్లాం విరుద్ధ సంగీతానికి ఎంత భారీగా ముడితే ధైర్యంగా ఇన్నాళ్లు సంగీతం చేసి ఉంటాడు... మళ్లీ సరస శృంగార గీతాలకు...కీబోర్డ్ మీద చెయ్యి వెయ్యాలంటే ఒక్కొక్క మెట్టుకీ ఒక్కో ప్రైస్ ఉండే ఉంటుంది... తప్పులేదు...అది ప్రొఫెషన్..అలాగే ఉండాలి... మరి ఉచితంగా ఇంటర్వ్యూలు ఇస్తాడా...ఆ అవసరం ఉన్న అపరిచితుడు కాదు కదా... అయితే అంతటి బిజీ సంగీతకారుడు ఒత్తిడిలో భారత్‌లో ఏం జరుగుతోంది అన్నది తెలియనంత డిటాచ్ అయిపోయి ఉండాలి...

చావా వంటి సినిమాలు చేసి... రామాయణం చేస్తూ... వాటికి వస్తున్న ఆదరణ కూడా అర్థం కానంత బిజీ అయిపోయి ఉండొచ్చు... బహుశా కంటెంట్ చూడకుండా... ఇచ్చే డబ్బు చూసి సంగీతం కొట్టి పాడేసి ఉంటాడా... అంటే ఇప్పుడు ఇచ్చిన పోడ్కాస్ట్ కూడా ఏం మాట్లాడుతున్నాడో తెలీక... డబ్బు ఏదో చూసుకుని మాట్లాడుకుంటూ పోయాడా? లేదా డబ్బులు ముట్టాయా...డబ్బులు మాట్లాడించాయా... అంత డబ్బు మనిషి కాకపోతే మతం మాట్లాడించిందా... అంత సులభంగా ప్రకాష్‌రాజ్‌లా మాట్లాడేసాడు అంటే నమ్మగలమా...!


తమిళ్ మీడియా పత్రికలు ఏమంటున్నాయి?

తమిళనాడులోని ప్రముఖ పత్రికలు “కుముదం”, :ఆనంద విగడన”, నక్కీరన్, సీనియర్ సినీ జర్నలిస్టులు రెహమాన్ ప్రస్తుత స్థితిని ఇలా విశ్లేషిస్తున్నారు:

వ్యక్తిగత జీవితం - ‘గోడల మధ్య దాచిన నరకం’

ఒంటరి పోరాటం చేసిన సైరా బాను.. రెహమాన్ తన మ్యూజిక్ స్టూడియోనే ప్రపంచంగా బతికారు. ‘ఒకే ఇంట్లో ఉన్నా, దశాబ్ద కాలంగా ఆయన భార్యతో మాట్లాడిన సందర్భాలు చాలా తక్కువ’ అని తమిళ పత్రికలు రాశాయి. ఇంటికి కూడా వెళ్లకుండా ఆమెకు కనీసం సమయం ఇవ్వకపోవడమే ఈమె విడాకులకు పునాది అంటున్నాయి.

కఠినమైన మత ఆంక్షలు: ‘సైరా బాను’ ఒక ఆధునిక భావాలున్న మహిళ. కానీ వివాహం తర్వాత తను పూలరంగడిలా తిరగడం ఆమెపై కఠినమైన మతపరమైన ఆంక్షలు (బుర్కా, సామాజిక దూరం) విధించారని ఆమె స్వేచ్ఛను దారుణంగా హరించడం వల్లే ఆమె మానసిక వేదనకు గురైందని ఇండస్ట్రీ టాక్.

మ్యూజిక్ గ్రూప్ వివాదాలు - ‘శిష్యురాలితో సాన్నిహిత్యం’

మోహిని డే కేవలం ఒక బృంద సభ్యురాలు మాత్రమే కాదు, గత కొన్నాళ్లుగా రెహమాన్ ఆమెకు వ్యక్తిగత జీవితంలో ఇస్తున్న ప్రాధాన్యత ఇండస్ట్రీలో చర్చనీయాంశమైంది. మోహిని డే భర్తకు విడాకులు ఇచ్చిన వెంటనే అప్పటిదాకా రెహమాన్ తిరుగుళ్ళు సహించిన సైరాబాను వెంటనే తను కూడా రెహమాన్‌కి విడాకులు ఇస్తూ ప్రకటించడం.. ఇలా వీరిద్దరూ ఒకే రోజు విడాకులు ప్రకటించడం కాకతాళీయం కాదని అని తమిళ జర్నలిస్టులు ఘాటుగా విమర్శిస్తున్నారు. రెహమాన్ తన ఇంట్లోని వ్యక్తుల కంటే, తన స్టూడియోలోని సిబ్బందితోనే ఎక్కువ సమయం గడపడం, వారితో విదేశీ పర్యటనలు చేయడం కుటుంబంలో చిచ్చు పెట్టిందని భావిస్తున్నారు.

అనిరుధ్ ప్రభంజనం ముందే రెహమాన్ పతనం

‘రెహమాన్ ట్యూన్స్ ఇప్పుడు మొద్దుబారాయి’ అని తమిళ సంగీత విమర్శకులు బాహాటంగానే చెబుతున్నారు. కొత్త తరం దర్శకులు అడిగే వేగాన్ని, ఎనర్జీని ఆయన ఇవ్వలేకపోతున్నారు. సంగీతంపై శ్రద్ధ కంటే, తన మ్యూజిక్ స్కూల్స్, అంతర్జాతీయ టూర్ల ద్వారా డబ్బు సంపాదించడం పైనే రెహమాన్ ఎక్కువ దృష్టి పెట్టారని, అందుకే ఆయన పాటల్లో పూర్వపు ఆత్మ కనిపించడం లేదని విమర్శిస్తున్నారు. బాలీవుడ్ తనను అణచివేస్తోందని ఆయన చేసిన కామెంట్స్ వెనుక అసలు ఉద్దేశం.. తన తప్పులు, ప్లాపులను కప్పిపుచ్చుకోవడానికి, మీడియా ద్వారా హైప్ తెచ్చుకోవాలనీ ప్రజల నుంచీ సానుభూతి తెచ్చుకోవడానికీ ముస్లిం మైనారిటీ ద్వారా మళ్లీ అంతర్జాతీయ ప్రాజెక్టులు పొందడమే లక్ష్యంగా ఈ వ్యూహం అనీ తమిళ మీడియా కుండబద్దలుకొడుతూ విశ్లేషిస్తోంది.

భవిష్యత్తుపై నీలినీడలు

ఒకప్పుడు ‘ఇసై పుయల’ (సంగీత తుపాను)గా పిలవబడ్డ రెహమాన్, నేడు విడాకులు, అక్రమ సంబంధాల ఆరోపణలు, మతపరమైన విభజన రాజకీయాల మధ్య చిక్కుకున్నారు. తమిళ మీడియా అభిప్రాయం ప్రకారం.. ‘ఆయన తన గతాన్ని అమ్ముకుని బతుకుతున్నారే తప్ప, భవిష్యత్తుకు కావాల్సిన సంగీతాన్ని ఇవ్వలేకపోతున్నారు.’

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page