top of page

అందుకే భారత్‌పై ట్రంప్‌ అక్కసు!

  • Writer: DV RAMANA
    DV RAMANA
  • Aug 2, 2025
  • 2 min read

ఒకవైపు స్నేహం అంటూనే.. మరోవైపు మంట పెడతున్న ట్రంప్‌ తీరు ఒక్క భారతదేశాన్నే కాక చాలా ప్రపంచ దేశాలను విస్మయానికి గురిచేస్తోంది. ‘భారత్‌ మాకు మిత్రదేశమే.. మోదీ నా ఫ్రండే.. కానీ రష్యా నుంచి ఆయిల్‌, ఆయుధాలు కొనుగోలు చేస్తోంది కాబట్టి 25 శాతం సుంకాలు విధిస్తున్నాం’ అని ప్రకటించిన ట్రంప్‌.. అదే సమయంలో ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్తాన్‌తో వాణిజ్య ఒప్పందం చేసుకోవడమే కాకుండా చమురు వెలికితీతకు ఆ దేశంతో కలిసి పని చేస్తామని ప్రకటించడం విడ్డూరంగా ఉంది. రెండోసారి అధ్యక్ష పగ్గాలు చేపట్టిన తర్వాత ట్రంప్‌ పలు భారత వ్యతిరేక నిర్ణయాలు తీసుకున్నారు. జన్మతః పౌరసత్వం రద్దు, అక్రమ వలసదారులను వెనక్కిపంపడం, వీసా నిబంధనలు కఠినతరం చేయడం, దిగుమతులపై సుంకాలు విధించడం, పాకిస్తాన్‌కు ప్రాధా న్యత ఇవ్వడం వంటివన్నీ భారత్‌కు ఇబ్బంది కలిగించేవే. ట్రంప్‌ ఇలా వ్యవహరించడానికి కారణం తన మాటలను భారత నాయకత్వం పట్టించుకోకపోవడం, తన పెత్తనాన్ని అంగీకరించకపోవడమే. మరోవైపు చైనా, భారత్‌ సభ్యులుగా ఉన్న బ్రిక్స్‌ కూటమి బలపడుతుండటం ట్రంప్‌కు కంటగింపుగా మారింది. అందుకే గత కొన్నాళ్లుగా భారత వ్యతిరేక వైఖరిని అవలంభిస్తున్నారు. పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో పాక్‌లో ఉగ్ర శిబిరాలే లక్ష్యంగా భారత్‌ చేపట్టిన ఆపరేషన్‌ సింధూర్‌ను తానే అడ్డుకున్నా నని.. భారత్‌ తన హెచ్చరికలను ఔదల దాల్చిందని సంధు దొరికినప్పుడల్లా ట్రంప్‌ ప్రచారం చేసుకు న్నారు. ఆ క్రెడిట్‌ మొత్తాన్ని తానే కొట్టేయాలని తెగ తాపత్రయపడ్డారు. అయితే భారత్‌ ట్రంప్‌ ప్రచా రాన్ని నిర్ద్వంద్వంగా ఖండిరచింది. ఆపరేషన్‌ సింధూర్‌ నిలిపివేయడం వెనుక ఎవరి ప్రమేయం లేదని, పాక్‌ కాళ్లబేరానికి రావడం వల్లే పాక్‌పై సైనిక చర్యను నిలిపామని పార్లమెంటు సాక్షిగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టంగా ప్రకటించారు. అయితే నోబెల్‌ శాంతి బహుమతి కోసం తెగ ప్రయత్నిస్తున్న ట్రంప్‌ భారత వైఖరిని తట్టుకోలేకపోతున్నారు. ట్రంప్‌ అక్కసుకు మరో కారణం రష్యాతో వాణిజ్య బంధం. రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధం నేపథ్యంలో రష్యా నుంచి భారత్‌ చమురు కొనుగోలు చేయడం అమెరికాతో పాటు పశ్చిమ దేశాలకు ఏమాత్రం ఇష్టం లేదు. రష్యా నుంచి ఎస్‌ 400 డిఫెన్స్‌ సిస్టమ్‌ కొనుగోలు చేస్తే ఆంక్షలు విధిస్తామని కూడా అమెరికా గతంలో హెచ్చరించింది. అయినా భారత్‌ వెనక్కి తగ్గలేదు. తనతో దోస్తీ కొనసాగాలంటే రష్యాను భారత్‌ పూర్తిగా పక్కనపెట్టాలని అమెరికా కోరుకుంటోంది. కానీ రష్యాతో దశాబ్దాలుగా ఉన్న స్నేహాన్ని వదులుకునేందుకు భారత్‌ సిద్ధంగా లేదు. అలీన విధానానికి కట్టుబడిన భారత్‌.. రష్యాతో సహా అన్ని దేశాలతోనూ స్నేహ సంబంధాలు కొన సాగిస్తోంది. అమెరికా వెనకాల నిలబడ్డానికి అంగీకరించడంలేదు. అమెరికాను భయపెడుతున్న మరో అంశం బ్రిక్స్‌. భారత్‌, చైనా, రష్యా, బ్రెజిల్‌, సౌతాఫ్రికా తదితర దేశాల కలయికతో ఏర్పడిన బ్రిక్స్‌ కూటమి తనకు వ్యతిరేకమని, డాలర్‌ ఆధిపత్యానికి గండికొట్టడానికే అది ఏర్పడిరదని అమెరికా అను మానిస్తోంది. అందుకే బ్రిక్స్‌ కూటమిపై ట్రంప్‌ బెదిరింపు ధోరణితో పలు సందర్భాల్లో వ్యాఖ్యలు చేశారు. రష్యా, చైనా ఎలాగూ తనకు వ్యతిరేకం కాబట్టి మిగిలిన భారత్‌, బ్రెజిల్‌, సౌతాఫ్రికా తదితర దేశాలను తనవైపు తిప్పుకోవాలని అమెరికా ప్రయత్నిస్తోంది. అందులో భాగంగానే టారిఫ్‌లు, వీసా ఆంక్షలు, నిధుల నిలిపివేత వంటి చర్యలతో ఒత్తిడి పెంచుతోంది. వాటితోపాటు ఇండియాను బెది రించి తనవైపు తిప్పుకొనేందుకు పాకిస్తాన్‌ను మళ్లీ దువ్వడం మొదలుపెట్టింది. అందుకే భారత్‌పై 25 శాతం సుంకాల విధింపు ప్రకటన చేసిన వెంటనే పాకిస్తాన్‌తో వాణిజ్య ఒప్పందం కుదుర్చుకున్నామని ప్రకటించడంతో పాటు.. ఆ దేశంలో గుర్తించిన భారీ చమురు నిక్షేపాల నుంచి చమురు వెలికి తీసేందుకు ఇస్లామాబాద్‌తో కలిసి పని చేస్తామని ట్రంప్‌ ప్రకటించారు. అంటే భారత్‌ను బెదిరిం చడంతో పాటు పాకిస్తాన్‌లోని చమురు నిక్షేపాలపైనా అమెరికా కన్నేసిందన్నమాట. భారత మార్కెట్లోకి తమ వ్యవసాయ, పాల ఉత్పత్తులను ప్రవేశపెట్టాలని ట్రంప్‌ తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. కానీ భారత పాడి పరిశ్రమను తీవ్రంగా దెబ్బతీసే ఆ ప్రతిపాదనను ఎంత ఒత్తిడి చేసినా భారత్‌ తిరస్కరించింది. బ్రిక్స్‌ దేశాలపై ఒత్తిడి పెంచుతున్నామనుకుంటున్న ట్రంప్‌.. ఆ క్రమంలో ఆయనే భారత్‌ను చైనా, రష్యాలకు మరింత చేరువ చేస్తున్నారు. ఒకవేళ ట్రంప్‌ బెదిరింపులు బెడిసి కొట్టి భారత్‌, చైనాలు కలిస్తే మాత్రం అమెరికాకు చుక్కలు కనిపించడం ఖాయం!

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page