top of page

నబిన్ ముంగిట పెద్ద సవాళ్లు

  • Writer: DV RAMANA
    DV RAMANA
  • 2 days ago
  • 3 min read

పుష్కర కాలంగా దేశాన్ని ఏలుతున్న ఎన్డీయే కూటమిలో ప్రధాన భాగస్వామిగా కేంద్ర ప్రభుత్వంలోనూ, జాతీయ రాజకీయాల్లోనూ చక్రం తిప్పుతున్న భారతీయ జనతాపార్టీ కొత్త జవసత్వాలు సంతరించుకునే దిశగా అడుగులు వేస్తోందా? పార్టీ జాతీయ అధ్యక్షుడిగా 46 ఏళ్ల నేతను ఎన్నుకోవడమే ఈ ప్రశ్నకు అవుననే సమాధానం ఇస్తోంది. అగ్ర నాయకత్వంతోపాటు సంస్థాగతంగా కూడా పార్టీలో భారీ మార్పులకు ఇది ఆరంభమని బీజేపీ శ్రేణుల్లోనే చర్చ జరుగుతోంది. ఎక్కడో బీహార్‌లో ఎమ్మెల్యేగా, రాష్ట్ర మంత్రిగా ఉన్న నితిన్ నబిన్‌ను అనూహ్యంగా తెరపైకి తీసుకొచ్చి పార్టీ జాతీయ అధ్యక్ష పీఠంపై ఏకగ్రీవంగా కూర్చోబెట్టడం ద్వారా పార్టీ రథసారధులైన మోదీ, షా ద్వయం తమ లక్ష్యమేమిటో స్పష్టం చేసేశారు. పార్టీ 12వ జాతీయ అధ్యక్షుడిగా, ప్రస్తుత అధ్యక్షుడు జేపీ నడ్డా వారసుడిగా నితిన్ నబిన్ సిన్హా బాధ్యతలు స్వీకరించారు. దాంతో పార్టీ పగ్గాలు చేపట్టిన అతి పిన్న వయస్కుడిగా చరిత్ర సష్టించారు. 1980 మే 23న ప్రస్తుత జార్ఖండ్(అవిభక్త బీహార్) రాజధాని రాంచీలో జన్మించిన నితిన్ నబిన్ ఇంటర్ వరకే చదువుకున్నారు. తండ్రి నబిన్ కిషోర్ సిన్హా బీజేపీ సీనియర్ నాయకుడు. ఆయన పట్నా వెస్ట్ నుంచి నాలుగుసార్లు ఎమ్మెల్యే అయ్యారు. తండ్రి ఆకస్మిక మరణంతో 2006లో రాజకీయాల్లోకి వచ్చిన నితిన్ నబిన్ తండ్రి నాయకత్వ లక్షణాలు పుణికిపుచ్చుకున్నట్లు కొద్దికాలానికే నిరూపించుకున్నారు. రాజకీయ వారసుడిగా వచ్చినా.. తనదంటూ ప్రత్యుక ఇమేజ్ సష్టించుకున్నారు. తండ్రి మరణంతో ఖాళీ అయిన పట్నా వెస్ట్ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లో తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన ఆయన నియోజకవర్గాల పునర్విభజన తర్వాత బంకీపూర్ నియోజకవర్గం నుంచి వరుసగా ఐదుసార్లు.. అంటే మొత్తం ఆరుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. నితీష్‌కుమార్ సారధ్యంలోని బీహార్ ప్రభుత్వంలో గతంలోనూ ఇప్పుడూ మంత్రి పని చేస్తూ అనేక శాఖలను సమర్థవంతంగా నిర్వహిస్తున్నారు. బీహార్ కేబినెట్‌లో రోడ్లు, పట్టణాభివద్ధి, గహనిర్మాణం వంటి కీలక శాఖలను నిర్వహించి బీహార్ ముఖచిత్రాన్ని మార్చే కషిలో చాలావరకు విజయవంతమయ్యారన్న ప్రశంసలు అందుకున్నారు. మౌలిక సౌకర్యాల కల్పన, కార్మికుల సంక్షేమానికి ప్రాధాన్యత ఇచ్చారు. ప్రభుత్వంలోనే కాకుండా పార్టీపరంగానూ విశేష సేవలందించారు. బీజేపీ యువజన విభాగానికి ప్రాతినిధ్యం వహించిన నితిన్ ఆ విభాగం సంస్థాగత నిర్మాణంలో గణనీయ పాత్ర పోషించారు. భారతీయ జనతా యువమోర్చా(బీజేవైఎం) జాతీయ ప్రధాన కార్యదర్శిగా, అనంతరం ఆ విభాగం రాష్ట్ర అధ్యక్షుడిగా పని చేసిన అనుభవం ఉంది. ఆ ీVAదాల్లో యువతను సమీకరించి పార్టీ ప్రచార కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనేలా చేశారు. జమ్మూకశ్మీర్‌లో పార్టీ నిర్వహించిన ఐక్యత యాత్ర, 1965 యుద్ధంలో అమరులైన యుద్ధవీరుల గౌరవార్థం గౌహతి నుంచి తవాంగ్ వరకు జరిగిన కవాతులో పాల్గొన్నారు. సిక్కిం బీజేపీ ఇన్‌ఛార్జీగా, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రానికి సహ ఇన్‌ఛార్జిగా బాధ్యతలు నిర్వర్తించారు. ఆ రాష్ట్రాల్లో ఎన్నికల నిర్వహణ, పార్టీ విస్తరణ కార్యకలాపాలకు నేతత్వం వహించారు. ఈ సామర్థ్యాలు, నాయకత్వ పటిమ ఆయన్ను జాతీయ నాయకత్వం దష్టిలో పడేలా చేశాయి. ఏకంగా పార్టీ అగ్రాసనం అధిష్టించేందుకు బాటలు వేశాయి. 2025 డిసెంబర్‌లోనే బీజేపీ పార్లమెంటరీ బోర్డు చేసిన ఏకగ్రీవ తీర్మానం ప్రకారం నితిన్ నబిన్‌ను పార్టీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా పార్టీ నియమించింది. ఆ ఎంపకతో ఆయన జాతీయస్థాయిలో చర్చనీయాంశమయ్యారు. భవిష్యత్తులో పార్టీ పూర్తిస్థాయి అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టే అవకాశాలు ఉన్నాయన్న అభిప్రాయాలు వినిపించాయి. దానికి తగినట్లే నితిన్ నబిన్ అందరి ఆమోదంతో పార్టీ అధ్యక్ష పగ్గాలు చేపట్టారు. 75 ఏళ్లు దాటిన వారికి పార్టీ పదవుల నుంచి తప్పించాలన్న నియమం కమలదళంలో ఇప్పటికే ఉంది. ఆ లెక్కన చూస్తే పార్టీలోనూ, ప్రభుత్వంలోనూ ఆ వయోపరిమితి దాటిన నాయకులు చాలామందే ఉన్నారు. నాయకత్వ స్థానాల్లో వద్ధ నాయకులే ఎక్కువగా ఉన్నారు. దానికితోడు ప్రస్తుత అధ్యక్షుడు జేపీ నడ్డా పదవీకాలం పూర్తి అయిన నేపథ్యంలో ఆ పదవిని 46 ఏళ్ల పిన్న వయస్కుడైన నితిన్ నబిన్‌కు అధ్యక్ష పగ్గాలు అప్పగించడం ద్వారానే పార్టీలో యువనాయకత్వం పెంపొందించే చర్యలు ప్రారంభమయ్యాయి. యువతకు అగ్రాసనం వేయాలన్న ఆలోచన మంచిదే. అయితే అది అంత ఈజీ కాదు. అనేక ముళ్లు, సవాళ్లను అధిగమించాల్సి ఉంటుంది. నతిన్ నబిన్ సారధ్యంలో బీజేపీ ఎదుర్కోవాల్సిన మొట్టమొదటి సవాల్ ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు. పశ్చిమ బెంగాల్, అస్సాం, కేరళ, తమిళనాడు, పుదుచ్చేరి రాష్ట్రాల్లో వచ్చే ఏప్రిల్, మే నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. వీటిలో అస్సాం, బెంగాల్ పార్టీకి కీలకమైన రాష్ట్రాలు అస్సాంలో అధికారం నిలుపుకోవడం, బెంగాల్‌లో కమలం పతాకం ఎగురవేయడం కొత్త అధ్యక్షుడిగా కత్తి మీద సాములాంటివే. పశ్చిమ బెంగాల్లో మమతాబెనర్జీని గద్దె దించి అధికారాన్ని హస్తగతం చేసుకునేందుకు గత మూడు ఎన్నికల నుంచి సర్వశక్తులు ఒడ్డుతున్నా బీజేపీకి సాధ్యం కావడం లేదు. అతిక్లిష్టమైన ఆ టాస్క్‌ను ఇప్పుడు నితిన్ పూర్తి చేయల్సి ఉంటుంది. కేరళ, తమిళనాడు, పుదుచ్చేరి వంటి దక్షిణాది రాష్ట్రాల్లో పునాది ఏర్పరచుకోవడానికి కూడా ఈ ఎన్నికలు కీలకం. కొత్త అధ్యక్షుడికి ఇవన్నీ అగ్నిపరీక్షే. జాతీయస్థాయిలో జరగనున్న నియోజకవర్గాల పునర్విభజన, చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు, 2029 లోక్‌సభ ఎన్నికల దిశగా పార్టీని సిద్ధం చేయాల్సిన బాధ్యత కూడా నితిన్ నబిన్‌పైనే ఉంటుంది. చిన్న వయసులోనే పార్టీ అధ్యక్షుడయ్యారన్న రికార్డు అందుకున్న నితిన్‌కు ఆ వయసే బాధ్యతలు మోయడంలో భారంగా మారుతుందేమోనన్న అనుమానాలున్నాయి. అయితే పాత్రధారి ఆయనే అయినా తెరవెనుక నుంచి నడిపించేది, చక్రం తిప్పేది మోదీ-షా ద్వయమేనన్నది బహిరంగ రహస్యం. అందువల్ల నితిన్ చేయాల్సిందల్లా వారు చెప్పినట్లు పార్టీని నడిపించడం, తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకోవడమే.

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page