అక్కడ పొదుపు.. ఇక్కడేదీ?!
- DV RAMANA

- 6 days ago
- 2 min read

3 నెలలుగా ఆరని కాష్టంలా రగులుతున్న పశ్చిమాసియా ఉద్రిక్తతలు.. ప్రపంచానికి అవసరమైన 20 శాతం చమురు రవాణా చేసే హర్మూజ్ జలసంధి దిగ్బంధంలో చిక్కుకోవడం, దాడుల్లో పలు గల్ఫ్ ఆయిల్ క్షేత్రాలు ధ్వంసమై ఉత్పత్తి స్తంభించిపోవడంతో ప్రపంచవ్యాప్తంగా తలెత్తిన ఇంధన, ఆర్థిక సంక్షోభం తీవ్రతరం కావడంతో ఇప్పటికే అనేక దేశాలు అవస్థలు పడుతుండగా.. ఇప్పుడు మనదేశంలోనూ ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి. ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ ఆ సంకేతాలు పంపిన ఆయన దేశప్రజలకు పొదుపు సూత్రాలు ప్రవచించారు. అక్కడితో ఆగకుండా తానే వాటిని పాటించడంలో ఆద్యుడిగా నిలిచారు. రాష్ట్రపతి తర్వాత అత్యంత ప్రముఖ నాయకుడిగా ఉన్న ఆయనకు అదేస్థాయిలో అత్యున్నత భద్రత కల్పిస్తున్నారు. ఆ మేరకు బయటకు అడుగుపెడితే చాలు భారీ భద్రతా వలయంలో ప్రయాణించే ప్రధాని కాన్వాయ్‌ని పూర్తిగా కుదించేశారు. ప్రస్తుతం రెండు వాహనాలు మాత్రమే కనిపిస్తున్నాయి. సాధారణంగా ప్రధాని కాన్వాయ్‌లో 12 నుంచి 15 వరకు అత్యాధునిక భద్రతా వ్యవస్థలతో కూడిన వాహనాలు ఉంటాయి. బుల్లెట్‌ప్రూఫ్ కార్లు, జామర్ వాహనాలు, అంబులెన్సులు, భద్రతా సిబ్బంది వాహనాలు ప్రధాని వాహనాన్ని ఫాలో అవుతాయి. అయితే పొదుపు చర్యల్లో భాగంగా తన కాన్వాయ్‌ని కూడా కుదించాలని ప్రధాన స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్(ఎస్పీజీ) అధికారులను ఆదేశించారు. ఫలితంగా ఢిల్లీ వీధుల్లో రెండు మÖడు రోజులుగా మోదీ ప్రయాణిస్తున్న కాన్వాయ్లో రెండు కార్లు మాత్రమే కనిపిస్తున్నాయి. ఒకటి అత్యంత భద్రత కలిగిన రేంజ్ రోవర్ సెంటినెల్ వాహనం కాగా.. మరొకటి ప్రత్యేక భద్రతా వ్యవస్థతో రూపొందించిన టయోటా ఫార్చ్యూనర్. ప్రధాని కోసం ఉపయోగిస్తున్న రేంజ్ రోవర్ సెంటినెల్ సాధారణ కారు కాదు. ఇది ఒక కదిలే భద్రతా కోటలా ఉంటుంది. తుపాకీ గుళ్లు, గ్రెనేడ్ దాడులు, భారీ పేలుళ్లను కూడా తట్టుకునేలా దీన్ని ప్రత్యేకంగా రూపొందించారు. అంటే 7.62 ఎంఎం హై వెలాసిటీ తుపాకీ తూటాలు కూడా దీన్ని ఏమీ చేయలేవు. ఈ వాహనంలో సొంతంగా మంటలను ఆర్పుకునే వ్యవస్థ, ఆక్సిజన్ సరఫరా సౌకర్యం కూడా ఉన్నాయి. అత్యున్నత స్థాయి బుల్లెట్‌ప్రూఫ్ గ్లాస్, స్టీల్ బాడీ, స్వయంచాలకంగా మూసుకుపోయే ఇంధన ట్యాంక్ వంటి ఫీచర్లు ఉన్నాయి. టైర్ పంక్చర్ అయినా కూడా గంటకు 80 కిలోమీటర్ల వేగంతో పరుగులు తీయగల సామర్థ్యం ఈ కారుకు ఉంది. 15 కిలోల వరకు పేలుడు పదార్థాలు ప్రయోగించినా కూడా లోపల ఉన్నవారికి ప్రమాదం లేకుండా రక్షణ కల్పించేలా దీన్ని రూపొందించారు. ఇక దీన్ని ఫాలో అయ్యే ఫార్చ్యూనర్ కూడా షోరూమ్‌లో దొరికే సాధారణ రకానికి చెందినది కాదు. భద్రతా అవసరాల కోసం దీన్ని ప్రత్యేకంగా తయారు చేశారు. ప్రధానని కంటికి రెప్పలా కాపాడే ఎస్‌పీజీ అధికారులు ఇందులో ప్రయాణిస్తారు. అత్యవసర పరిస్థితుల్లో రెప్పపాటులో స్పందించేలా దీన్ని సన్నద్ధం చేశారు. భారతీయ రోడ్లపై అత్యంత విశ్వసనీయ ఎస్‌యూవీలలో ఫార్చ్యూనర్‌కు ఉన్న పేరే ఇప్పుడు ప్రధాని భద్రతా వ్యవస్థలో చేరేలా చేసింది. ఇంధన పొదుపు పాటించాలని ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం పిలుపునిచ్చింది. అవసరం లేని ప్రయాణాలు తగ్గించుకోవాలని, సాధ్యమైన చోట ఇంటి నుంచే పని చేయాలని, ఎక్కువగా పబ్లిక్ ట్రాన్స్‌పోర్టు సిస్టమ్‌ను వినియోగించుకోవాలని కూడా సూచనలు వచ్చాయి. ఆ మేరకు ప్రధాని గుజరాత్, అసోం, హైదరాబాద్ పర్యటనల్లో కూడా చిన్న కాన్వాయ్‌నే ఉపయోగించడం విశేషం. ఇకపై కేంద్ర మంత్రులు, సీఎంలు కూడా ఇదే మార్గాన్ని అనుసరించే అవకాశముంది. ప్రధాని కాన్వాయ్ ని కుదించడం వల్ల భద్రతాపరమైన సమస్యలు తలెత్తే ప్రమాదముందని ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఎస్పీజీ అధికారులు ఈ ఆందోళనలను, వాదనలను కొట్టిపారేస్తున్నారు. కాన్వాయ్ పరిమాణం తగ్గినా భద్రతలో ఎలాంటి రాజీ లేదని అధికారులు స్పష్టం చేస్తున్నారు. ఎస్‌పీజీ నిబంధనలు, భద్రతా ప్రొటోకాల్ కచ్చితంగా అమలవుతాయని చెబుతున్నారు. ప్రస్తుతం కాన్వాjáYTలో ఉన్న రెండు వాహనాల్లోనే ఆ వ్యవస్థలన్నింటినీ ఇమిడ్చారు. కాగా ప్రధానమంత్రిని స్ఫూర్తిగా తీసుకుని పలు రాష్ట్రాల సీఎంలు, కేంద్ర రాష్ట్రాల మంత్రులు కూడా తమ కాన్వాయ్ లను కుదించుకుంటున్నారు. ఇటీవల జరిగిన ఏపీ కేబినెట్ మీటింగులో ఈ నిర్ణయాలతోపాటు వారంలో ఒకటి రెండు రోజులు వర్క్ ఫ్రమ్ హోమ్, ఒకరోజు నో వెహికల్ డే పాటించాలని నిర్ణయించారు. వీలైనంత వరకు మంత్రులు వారంలో ఒకరోజు సచివాలయానికి సైకిళ్లపై వచ్చేలా ప్లాన్ చేయాలని సీఎం చంద్రబాబు సూచించారు. ఆ ప్రకారం జలవనరుల మంత్రి నిమ్మల రామానాయుడు ఇప్పటికే సైకిల్ సవారీ ప్రారంభించి చిత్తశుద్ధి చాటుకున్నారు. అంతవరకు బాగానే ఉంది. కానీ నాయకుడు ముందు ఆచరిస్తే మిగతావారు వారిని స్ఫూర్తిగా తీసుకుంటారు.. అనుసరిస్తారు. జాతీయస్థాయిలో మోదీ అదే చేసి చూపిస్తున్నారు. కానీ అదే మోదీ పిలుపు మేరకు పొదపు చర్యలు అని గొప్పగా ప్రకటించిన రాష్ట్ర పాలకులు మాత్రం ‘చెప్పేటందుకే నీతులు ఉన్నాయి’ అన్న నానుడిని పాటిస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. దేశంలో ఇప్పుడు ఆర్థిక సంక్షోభం ఏర్పడిందేమో గానీ.. మన రాష్ట్రాన్ని ఎప్పటినుంచో ఆ సంక్షోభం సతాయిస్తున్నది. కానీ ఇంతకుముందు.. ఇప్పుడు మోదీ పిలుపు తర్వాత కూడా చంద్రబాబు అండ్ కో మాటల్లో తప్ప చేతల్లో పొదుపు సూత్రాలు పాటించడంలేదు. కార్లలో తిరగొద్దని సహచరులకు చెబుతున్న వీరు మాత్రం ప్రత్యేక విమానాల్లో విహరిస్తున్నారు. కేవలం మంత్రిగా ఉన్న చంద్రబాబు తనయుడు పుట్టపర్తి పర్యటనకు చార్టర్డ్ ఫ్లైట్‌లో వెళ్లడం, అక్కడి నుంచి భారీ వాహన కాన్వాయ్ నిర్వహించారు. కాగా నరసన్నపేటలో చంద్రబాబు పర్యటనకు వాహనాలను పెద్దసంఖ్యలో వినియోగించడం పొదుపు ఎలా అవుతుందో ఆలోచించాలి.






Comments