అసమానతలు పెంచుతున్న పట్టణీకరణ
- DV RAMANA

- Oct 21, 2025
- 2 min read

భారతీయ సమాజంలో పౌర సమానత్వం మిలియన్ డాలర్ ప్రశ్నగానే మిగిలిపోయింది. ‘పౌరసత్వం`అసమానతలు, పట్టణ ప్రాంత పాలనా వ్యవస్థలు’ అనే అంశంపై భారత్, అమెరికాల పరిశోధకులు ఎపింక చేసిన నగరాల్లో 15 ఏళ్ల సుదీర్ఘకాలం నిర్వహించిన సంయుక్త అధ్యయనంలో విస్తరిస్తున్న పట్టణీకరణ, పర్యవసానాలు, సామాజిక రాజకీయ రంగాలపై వాటి ప్రభావాలపై 14 రాష్ట్రాల్లో 31,803 కుటుంబాలను కలిశారు. భారతీయ జీవన ప్రమాణాలను నిర్ధారించే ముఖ్యమైన అంశం ‘వర్గం’మని ఈ అధ్యయనంలో వెల్లడైంది. ఒక్కో కుటుంబాన్ని ఒక్కో వర్గానికి ప్రతినిధులుగా పరిగణిస్తూ సర్వేలో పాల్గొన్న కుటుంబాలను ఐదు కేటగిఈలుగా వర్గీకరించారు. మురికివాడలు మొదలుకొని గేటెడ్ కమ్యూనిటీల్లో నివసించే కుటుంబాలను కూడా అధ్యయనానికి ఎంచుకున్నారు. పట్టణీకరణ పెరుగుతున్న కొద్దీ కనీస వసతులు, సేవలకు నోచుకోని కుటుంబాల సంఖ్య గణనీయంగా పెరుగుతున్నట్లు అధ్యయనంలో తేలింది. ఉదాహరణకు కేరళలోని కొచ్చిన్‌లో కేవలం 1.4 శాతం కుటుంబాలు మురికివాడలు, పారిశుద్ధ్య వసతులు లేని ప్రాంతాల్లో నివసిస్తుంటే.. ముంబై జనాభాలో 62 శాతం ప్రజలు ఇటువంటి దుస్థితిలోనే నివసిస్తున్నారని తేలింది. భోపాల్ మినహా మిగిలినా అన్ని రాష్ట్రాల్లోనూ మురికివాడల నివాసులు తమ ఇళ్లను ఎప్పుడు ఖాళీ చేయాల్సి వస్తుందోనన్న ఆందోళనతో జీవిస్తున్నారు. మురికివాడల్లో నిమ్న వర్గాలకు చెందినవారే. అదే సమయంలో ఉన్నత పౌరసేవలు అందుబాటులో ఉండే గేటెడ్ కమ్యూనిటీల్లో నివసించే నిమ్న వర్గాల వారి సంఖ్య చాలా తక్కువగా ఉంటోంది. ఢల్లీి, చైన్నై, కోల్‌కతా వంటి మహానగరాల్లో నివాస ప్రాంతాల మధ్య కులాలవారీగా స్పష్టమైన విభజన రేఖలు ఉన్నట్లు ఈ అధ్యయనం గుర్తించింది. కుల ఆధారిత విభజన, వివక్ష కొత్తరూపాలు కూడా సంతరించుకుంటోంది. కొన్ని పట్టణాల్లో బీసీ, జనరల్ కేటగిరీ కులాల మధ్య ఉన్న విభజన రేఖలకంటే మిగిలినవారితో విభజన రేఖలు మరింత తీవ్రంగా ఉన్నాయి. ఇది ఓటర్ల జాబితాపై కూడా ప్రభావం చూపుతోంది. ఉదాహరణకు ముంబై, జలంధర్, హైదరాబాద్ నగరాల్లో ఎక్కువమంది తమ పేర్లను ఓటర్ల జాబితాలో నమోదు చేయించుకోవడం లేదు. ఇక మురికివాడల జనాభాలో దాదాపు 50 శాతం మంది ఓటర్లుగా నమోదుకావడంలో ఏదో ఒక సమస్యను ఎదుర్కొంటున్నారు. కానీ పట్టణ ప్రధాన జనావాసాల్లో నివసిస్తున్న వారిలో 74శాతం మంది ఎటువంటి ఇబ్బందులు లేకుండానే ఓటర్లుగా నమోదు కాగలగుతున్నారు. ఈ పరిణామం సార్వత్రిక ప్రాతినిధ్య ప్రజాస్వామ్యమనే భావనకు ముప్పు తెచ్చేదిగా పరిణమించనుంది. ఈ అధ్యయనం ప్రకారం గుజరాత్‌లోని జామ్‌నగర్, వడోదర, కేరళలోని కొచ్చిన్ నగరాల్లో పౌరసేవలు మెరుగ్గా ఉంటే చెన్నై, ముంబైలలో నాసిరకంగా ఉన్నాయి. కొచ్చిన్ మినహా మిగిలిన అన్ని నగరాల్లో రోజుకు గంటా రెండుగంటల మినహా నీటి సరఫరా ఉండడం లేదు. పారిశుద్ధ్యం విషయంలో కూడా ఇవే పరిస్థితులు వ్యత్యాసాలు కొనసాగుతున్నాయి. కొచ్చిన్, వడోదర, అహ్మదాబాద్, ఢల్లీిల్లో మెరుగైన పారిశుద్ధ్య సేవలు అందుబాటులో ఉంటే ముంబై అట్టడుగున ఉంది. ముస్లింలు పొందే పౌరసేవల విషయంలో ఇటువంటి వివక్ష, వ్యత్యాసం కనిపించాయి. అధ్యయనం జరిగిన 14 నగరాలకు గాను 10 నగరాల్లో ముస్లింలు అత్యధికంగా మురికివాడల్లోనే నివసిస్తున్నారు. కానీ కొచ్చిన్, చైన్నై, భోపాల్, ఢల్లీిల్లో పరిస్థితి భిన్నంగా ఉంది. ఇక్క ముస్లింలు కొన్ని నిర్దేశిత ప్రాంతాల్లో కేంద్రీకృతమై ఉంటున్నారు. ఉదాహరణకు ఎక్కువ సంఖ్యలో ముస్లింలు నివసించే ఢల్లీిలోని షాహిన్‌బాగ్ లాంటి ప్రాంతాలను పరిపాలన యంత్రాంగం అనధికార మురికివాడలుగా పరిగణిస్తోంది. అధ్యయనానికి ఎంపిక చేసిన నగరాలన్నీ వందల సంవత్సరాల చరిత్ర కలిగినవే. అయినా ఈ నగరాల్లో సామాజిక జీవనం అభివృద్ధి దశకు చేరుకోలేదు. అధ్యయనంలో పాల్గొన్న వారందరూ తమకున్న స్నేహాలు, కుటుంబ బాంధవ్యాలు , కులాలు, మతాల చట్రాలకు లోబడే ఉంటున్నామని చెప్పడం విశేషం. కొచ్చిన్, చైన్నైలలో మాత్రం సామాజిక సంబంధాలు కులచట్రం, మతవ్యవస్థ పరిధులను అధిగమించి ఉన్నట్టుగా అధ్యయనం గుర్తించింది. ధార్మిక ప్రదేశాలకు ఎవరినైనా అనుమతించే విషయంలో ఈ కట్టుబాట్లు మరింత తీవ్రంగా ఉన్నాయి. అధిక శాతం నగరాల్లో లౌకిక జీవనం వేళ్లూనుకోలేదు. ఓ మత స్థలానికి మరో మతానికి చెందిన వారిని రానివ్వకుండా బలీయమైన అనధికారిక ఆంక్షలు అమల్లో ఉన్నాయి. ఈ విషయంలో ఢల్లీి పరిస్థితి కాసింత మెరుగ్గా ఉంది. రాజ్యాంగం హామీ ఇచ్చిన సమానావకాశాలు, పరమత సహనం అనే భావనలు నేటికి కాగితాలకే పరిమితమయ్యాయి. అల్పసంఖ్యాకులు, దళితులు, ఆదివాసీ తెగలకు చెందినవారు మౌలిక సేవలు పొందడంలోనూ, సామాజిక`రాజకీయ హక్కులను అనుభవిచండంలో తీవ్రమైన వివక్షకు గురవుతున్నారు. తాజా అధ్యయనం, పరిశీలనల నేపథ్యంలో తాజా అధ్యయనం కులం, మతం, వర్గమనే మూడు సామాజిక అస్తిత్వాల కారణంగా పౌరులు భారతదేశంలో సంపూర్ణమైన, ఫలవంతమైన అవకాశాలను, సేవలను పొందలేకపోతున్నారని, హక్కులను అనుభవించలేకపోతున్నారని నిర్ధారించింది. రాజ్యాంగం సమానపౌరసత్వానికి హామీ ఇచ్చినప్పటికీ పట్టణ జీవనంలో వివక్ష, విభజన రేఖల వల్ల అవి అమలు కాలేకపోతున్నాయి. సాధారణ ప్రజలు ఎంత మెరుగైన జీవితాన్ని అనుభవిస్తారనే అంశం ఆయా కుటుంబాలు ఏ వర్గానికి చెందినవనే అంశంతో ముడిపడి ఉంటే.. మతపరమైన, కులపరమైన మైనార్టీలు పౌరజీవనంలో సంపూర్ణ భాగస్వామ్యం పొందలేని విధంగా కుల`మత విభజన రేఖలు అడ్డుకుంటున్నాయి.










Comments