ఆట, మాట ఒక ‘జ్వాల’.. మనసేమో పండువెన్నెల!
- DV RAMANA

- Sep 12, 2025
- 2 min read
ఉదారత చూటుకున్న క్రీడాకారిణి గుత్తా జ్వాల
బ్యాడ్మింటన్‌లో ఎన్నో పతకాలు సాధించిన ఘనత
ఆమె చుట్టూ ఎన్నో వివాదాలు.. విమర్శలు
తాజాగా చనుబాల దానంతో దానశీలిగా తెరపైకి
ఆరు నెలల్లోనే 30 లీటర్లు ఇవ్వడం రికార్డు

(డి.వి.రమణ, సత్యం ప్రత్యేక ప్రతినిధి)
చనుబాలు.. బాలింతల్లో మాత్రమే లభించే ఈ పాలు బిడ్డలకు అమృతంతో సమానం. విస్తృతమైన పోషక విలువలు, రోగనిరోధక శక్తిని ఇచ్చి బిడ్డల ఎదుగుదలకు దోహదం చేస్తాయి. అందుకే బిడ్డలకు కనీసం ఏడాది వయసు వచ్చే వరకు తల్లిపాలు పట్టాలని వైద్యులు సూచిస్తుంటారు. కానీ ఆధునిక యుగంలో అందంపై విపరీతమైన మోజు పెంచుకున్న మహిళలు తమ బిడ్డలకే చనుబాలు ఇచ్చేందుకు ఇష్టపడటం లేదు. చనుబాలు ఇస్తే శరీరాకృతి పోతుందని, అందం చెడిపోతుందన్న భయమే దీనికి కారణం. అలాంటిది ఇతరుల బిడ్డలకు చనుబాలు దానం చేయడానికి అసలు ముందుకురారు. అందులోనూ సెలబ్రిటీల సంగతి చెప్పనక్కర్లేదు. కానీ ఒక సెలబ్రిటీ.. బిడ్డను కన్నప్పటి నుంచి ఇప్పటివరకు ఏకంగా 30 లీటర్ల మేరకు తన చనుబాలు దానం చేశారంటే నమ్ముతారా? కానీ అది పచ్చి నిజం. ఆమె ఉదారతకు నిదర్శనం. వాస్తవానికి వివాదాస్పదురాలిగా ముద్రపడిన ఆమె అమృత తుల్యమైన తన చనుబాలను బ్రెస్ట్ మిల్క్ బ్యాంకులకు విరాళంగా ఇస్తూ తన మనసు పండు వెన్నెల అని చాటుకున్నారు. ఆమె మరోవరో కాదు ఒకప్పటి ప్రముఖ బ్యాడ్మింటన్ స్టార్ గుత్తా జ్వాల.
బిడ్డను ప్రసవించినప్పటి నుంచీ..
ఒకప్పుడు బ్యాడ్మింటన్ కోర్టులో ప్రత్యర్థులను, బయట తనపై విమర్శలు చేసే వారిని తన ఆట, మాట తీరుతో గడగడలాడిరచిన గుత్తా జ్వాల ఇప్పుడు మళ్లీ తన దానగుణంతో తెరపైకి వచ్చింది. తల్లిగా ప్రమోషన్ పొందిన ఆమె తన చనుపాలతో ఎంతోమంది పసిపాపలకు ప్రాణం పోస్తోంది. ఈ ఏడాది ఏప్రిల్ 22న పండంటి పాపకు జన్మనిచ్చిన ఆమె ఆప్పటినుంచి చనుబాలు దానం చేస్తోంది. తన బిడ్డకు ఇవ్వడంతోపాటు ఇంకా పుష్కలంగా లభిస్తున్న తన చనుబాలను రోజుకు 600 మి.లీటర్ల మేరకు ప్రభుత్వ ఆస్పత్రుల్లో బ్రెస్ట్ మిల్క్ బ్యాంకులకు పంపుతోంది. అలా గత ఆరు నెలల్లో సుమారు 30 లీటర్ల పాలు విరాళంగా ఇచ్చి అరుదైన సేవ చేస్తోంది. బ్యాడ్మింటన్ కోర్టులో తిరుగులేని షాట్లతో ప్రత్యర్థులను మట్టికరిపించిన గుత్తా జ్వాల ఇప్పుడు తన వ్యక్తిగత జీవితంలో మాత్రం మరింత గొప్ప పోరాటం చేస్తోంది. ఇది మెడల్ కోసం చేసే పోరాటం కాదు.. కొన్ని ప్రాణాలనైనా కాపాడాలనే ఆరాటం. ఈ చర్య ఆమె మనసు ఎంత విశాలమో స్పష్టం చేస్తోంది. తీవ్ర అనారోగ్యం, ప్రసవ సమయంలో ఉత్పన్నమయ్యే ఆరోగ్య సమస్యలు, ఇతరత్రా పలు కారణాలతో తమ బిడ్డలకు చనుబాలు ఇవ్వలేని దుస్థితిని చాలామంది తల్లులు ఎదుర్కొంటుంటారు. అటువంటి వారికి పుట్టిన బిడ్డలు తల్లిపాలకు నోచుకోక.. డబ్బాపాలకు పరిమితమై.. రోగ నిరోధక శక్తి తగ్గిపోయి ఎదుగుదల లోపించి శుష్కించిపోతుంటారు. ఇటువంటి అభాగ్య పిల్లలను ఆదుకునేందుకే ప్రభుత్వం తల్లిపాల బ్యాంకుల ఏర్పాటును ప్రోత్సహిస్తూ నిర్ణయాలు తీసుకుంది. ఆ మేరకు చాలా ప్రభుత్వ ఆస్పత్రులతోపాటు ప్రత్యేకంగా తల్లిపాల బ్యాంకులు ఏర్పాటవుతున్నాయి. ప్రసవానంతరం పుష్కలంగా చనుబాలు ఇవ్వగలిగే ఆరోగ్యవంతమైన తల్లులు తమ బిడ్డలకు ఫీడిరగ్ ఇచ్చిన తర్వాత అవకాశమున్నంత మేరకు మిగిలిన చనుబాలను ఈ బ్యాంకులకు అందజేస్తే.. వాటి ద్వారా అవి అవసరమైన చంటిపిల్లలకు అందుతుంటాయి. అయితే ఈ విషయం ఇంకా ప్రాచుర్యం పొందలేదు. తల్లిపాల బ్యాంకులు ఉన్నాయని, వాటికి చనుబాలు విరాళంగా ఇవ్వవచ్చని చాలామందికి ఇప్పటికీ తెలియదు. తెలిసినా కూడా సొంత బిడ్డలకే చనుబాలు ఇచ్చేందుకు వెనుకాడుతున్న ఈ రోజుల్లో ఇతరులకు దానంగా ఇవ్వడానికి పెద్దగా ముందుకు రావడంలేదు. ఈ నేపథ్యంలో సెలబ్రిటీ అయినా కూడా గుత్తాజ్వాల సామాజిక స్పృహతో తన చనుబాలను విరాళంగా ఇస్తుండటం ఆమెలాంటి చాలామందకి స్ఫూర్తినిస్తుందనడంలో సందేహం లేదు.
ఒకప్పడు రెబల్ స్టార్
హైదరాబాద్‌కు చెందిన గుత్తాజ్వాల కొన్నేళ్ల క్రితం వరకు ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణిగా వెలుగొందింది. ఎడమ చేతి వాటం కలిగిన ఈమె సింగిల్స్, డబుల్స్, మిక్స్‌డ్ డబుల్స్ విభాగాల్లో ప్రతిభ చాటి ఎన్నో పతకాలు గెలుచుకుంది. భారత్ తరఫున ఒలింపిక్ క్రీడల్లో పాల్గొన్న జ్వాల ప్రపంచ బ్యాడ్మింటన్ డబుల్స్ పోటీల్లో కాంస్య పతకం సాధించింది. 2014 కామన్వెల్త్ క్రీడల్లో స్వర్ణం సాధించిన ఆమె జాతీయ స్థాయిలో అనేక పోటీల్లో పాల్గొని పతకాలు సాధించింది. తన ప్రతిభకు గుర్తింపుగా కేంద్ర ప్రభుత్వం నుంచి అర్జున అవార్డు అందుకుంది. ఆటలో ఎంత దూకుడుగా ఉంటుందో.. తన వైఖరి కూడా అంతే దూకుడుగా ఉంటుంది. ఒక సందర్భంలో ఏకంగా బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా(బాయ్)పైనే తిరుగుబాటు చేసినంత పని చేసి.. ఆరోపణలతో విరుచుకుపడిరది. తనపై వచ్చిన మ్యాచ్ ఫిక్సింగ్, డోపింగ్ ఆరోపణలకు ప్రతిస్పందనగా ఈ చర్యకు పాల్పడిరది. ఇవే ఆరోపణలతో ఆమెపై నిషేధం విధించాలని బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా 2013లో ప్రతిపాదించింది. దీనిపై ఢల్లీి హైకోర్టును ఆశ్రయించగా న్యాయస్థానం ఆ ప్రతిపాదనను రద్దు చేసింది. 2005లో తోటి బ్యాడ్మింటన్ ఆటగాడు చేతన్ ఆనంద్‌ను వివాహం చేసుకున్నా.. ఆరేళ్లకే 2011లో విభేదాలతో అతని నుంచి విడాకులు తీసుకుంది. అనంతరం 2021 ఏప్రిల్ 22న తమిళ నటుడు విష్ణు విశాల్, గుత్తాజ్వాల వివాహ బంధంతో ఒక్కటయ్యారు. ఈ జంటకే సరిగా అదే ఏప్రిల్ 22న ఈ ఏడాది బిడ్డ జన్మించింది.










Comments