సింగిల్ సిలిండర్‌కు 25 రోజులు.. డబుల్ సిలిండర్‌కు 45 రోజులు వెయిటింగ్ పీరియడ్!
- 4 hours ago
- 3 min read
యుద్ధం వల్ల గ్యాస్ దొరకదని ఇబ్బడిముబ్బడిగా బుకింగ్‌లు
చేతులెత్తేసిన సర్వర్‌లు
హోటళ్లకు కమర్షియల్ సిలిండర్లు కరువు
కట్టెలపొయ్యకొచ్చిన మెస్‌లు
మరి రెండు రోజుల్లో మరిన్ని హో టళ్ల మూత

(సత్యంన్యూస్, శ్రీకాకుళం)
జిల్లాలో గహావసరాల గ్యాస్‌బండకు కొరత లేదని, అవసరమైనంత స్టాకు అందుబాటులో ఉందని ఓవైపు చెబుతునే, మరోవైపు గతం మాదిరిగా కాకుండా సింగిల్ సిలెండర్ కనెక్షన్ ఉన్నవారు 25 రోజుల వరకు రీఫిల్ బుక్ చేయడానికి వీళ్లేకుండా, డబుల్ సిలిండర్ ఉన్నవారు 45 రోజుల్లోపు రీఫిల్ చేయడానికి వీళ్లేకుండా సర్వర్‌ను మార్చేశారు. గతంలో డొమెస్టిక్ వినియోగదారుల్లో రెండు సిలిండర్లు ఉంటే.. ఒకటి ఖాళీ కాగానే బుక్ చేస్తే, ఒకటి రెండు రోజుల్లో వచ్చేసేది. ఇప్ప్పుడు బుక్ చేయడానికే 45 రోజులు టైమ్ పీరియడ్ పెట్టారు. ఇక సింగిల్ సిలిండర్ ఉన్నవారి పరిస్థితి బితుకుబితుకే.
కానీ జిల్లాలో వంట గ్యాస్ కొరత లేదని గ్యాస్ ఏజెన్సీ డీలర్లు స్పష్టం చేస్తున్నారు. ఉత్తరాంధ్ర పరిధిలో ఉన్న గహ అవసరాలకు గ్యాస్ కొరత మరో నెల రోజులు వరకు ఉండదని వారే అంటున్నారు. ఉత్తరాంధ్ర పరిధిలోనే పెట్రోలింగ్ సంస్థలకు ఫిల్లింగ్ యూనిట్‌లు ఉన్నందున గ్యాస్ సరఫరాలో జాప్యం ఉండదని డీలర్లు చెబుతున్నారు. ఫిల్లింగ్ ప్లాంట్స్‌లో 45 రోజులకు సరిపడ గ్యాస్ అందుబాటులో ఉందని డీలర్లు చెబుతున్నారు. జిల్లాలో ఇండేన్, భారత్, హిందుస్థాన్ పెట్రోలియం కార్పోరేషన్‌కు చెందిన 37 ఏజెన్సీలు ఉన్నాయి. వీటిలో పట్టణాల పరిధిలో సుమారు 15 వేలు, గ్రామీణ ప్రాంతాల పరిధిలో సుమారు 12 వేలు చొప్ప్పున 6.93 లక్షల గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి. సాధారణ కనెక్షన్లలో సింగిల్ సిలిండర్లు 2 లక్షలు, డబుల్ సిలిండర్లు 1.41 లక్షలు ఉన్నాయి. దీపం పథకంలో సింగిల్ సిలిండర్లు కలిగి ఉన్నవారు 2.11 లక్షలు మంది, డబుల్ సిలిండర్లు కలిగి ఉన్నవారు 31 వేలు మంది, సీఎసఆర్ కింద పంపిణీ చేసిన సిలిండర్లు 18 వేలు ఉన్నాయి.
గడువు పెరిగింది
గ్యాస్ సిలిండర్లు ఆన్‌లైన్‌లో బుక్ చేసుకొనే గడువును 21 నుంచి 25 రోజులకు పెంచింది. వారం రోజులుగా ఇండేన్, భారత్, హిందుస్థాన్ పెట్రోలియం సంస్థలు దేశ వ్యాప్తంగా ఎస్సెస్‌మెంట్ చేసి వంట గ్యాస్‌ను క్రమబద్ధీకరించే ప్రక్రియకు శ్రీకారం చుట్టాయి. దీంతో వంట గ్యాస్ కొరత ఉందని ప్రచారం జోరుగా సాగుతోంది. గ్యాస్ ఏజెన్సీలన్నీ ఫిక్సిడ్‌గా కొన్ని హోటల్స్‌కు నిరంతరాయంగా వాణిజ్య సిలిండర్లను సరఫరా చేస్తుంటాయి. ఇప్ప్పుడది గ్యాస్ డీలర్, హోటల్ యజమానికి మధ్య ఉన్న సంబంధం మేరకు సరఫరా అవుతోంది.
యజమానుల కాళ్లబేరం
గ్యాస్ సరఫరాపై కేంద్రం తీసుకున్న నిర్ణయం తర్వాత శ్రీకాకుళంలో కొందరు హÃటల్స్ యజమానులు గ్యాస్ డీలర్లతో కాళ్లబేరానికి వచ్చేశారు. పాతబకాయిలు చెల్లిస్తే తప్ప వాణిజ్య సిలిండర్లను సరఫరా చేయడానికి గ్యాస్ డీలర్లు నిరాకరిస్తున్నారు. దీంతో బకాయిలు చెల్లించని వారికి వాణిజ్య గ్యాస్‌ను సరఫరా నిలిపేస్తున్నారు. ఈ కారణంతో కొందరు హోటల్స్‌ను మూసేస్తుంటే, మరికొందరు కట్టెలను ఆశ్రయిస్తున్నారు. జిల్లాలో 10 రోజులకు సరిపడే వాణిజ్య గ్యాస్ అందుబాటులో ఉన్నట్టు పెట్రోలియం సంస్థలు చెబుతున్నాయి. అయితే గ్యాస్ ఏజెన్సీల వద్ద మాత్రం వారం రోజులకు సరిపడే వాణిజ్య సిలిండర్లు మాత్రమే ఉన్నాయి. దీనికి కారణం కొందరు ఏజెన్సీల నిర్వాహకులు అధిక మొత్తానికి బ్లాక్‌లో వాణిజ్య సిలిండర్లను విక్రయించేసినట్టు విశ్వసనీయ సమాచారం. వీటిని అధికారికంగా విక్రయించినట్టు రికార్డుల్లో చూపించడం లేదు. దీంతో ఆయా ఏజెన్సీలో వాణిజ్య గ్యాస్ ఉన్నట్టు పెట్రోలియం సంస్థలు చూపిస్తున్నాయి. మిగతా ఏజెన్సీలు కేవలం వారి ఫిక్సిడ్ హోటల్ యజమానులకు మాత్రమే వాణిజ్య సిలిండర్లను విక్రయించడానికి సిద్ధమయ్యారు. వాణిజ్య గ్యాస్ కనెక్షన్లు కలిగివున్నప్పటికీ కొంతమంది గ్యాస్‌ను విడిపించడం మానేశారు. కొరత ప్రారంభం కావడంతో వారంతా వాణిజ్య సిలిండర్లు కావాలని ఏజెన్సీలను ఆశ్రయిస్తున్నారు. వారికి గ్యాస్ ఇవ్వడానికి డీలర్లు నిరాకరిస్తున్నారు. రెగ్యులర్ కస్టమర్లకు మాత్రమే ప్రాధాన్యత ఇస్తున్నారు. నగరంలో భారత్ గ్యాస్‌కు సంuంధించిన వాణిజ్య గ్యాస్ అందుబాటులో లేదని చెబుతున్నారు.
వినియోగదారులు ఎగబడుతున్నారు
ఇంటి అవసరాలకు వినియెగించే గ్యాస్ బుకింగ్‌కు దాదాపు నెల రోజులు సమయం ఉండాలని నిబంధన విధించడంతో వినియోగదారులు ఆన్‌లైన్‌లో గ్యాస్ బుక్ చేయడానికి చేస్తున్న ప్రయత్నాలు విఫలమవుతున్నాయి. కారణం.. పెట్రోలియం సంస్థలు గ్యాస్ ఏజెన్సీల వద్ద అందుబాటులో ఉంచిన సర్వర్ కెపాసిటీ మించితే కొత్తగా బుకింగ్ తీసుకోకపోవడమే. బుకింగ్ రిసీవ్ చేసుకొని, సిలిండర్ డెలివరీ చేసి ఓటీపీ ద్వారా క్లోజ్ చేయాలి. క్లోజ్ చేస్తేనే కొత్త బుకింగ్‌కు అవకాశం ఉంటుందని చెబుతున్నారు.
తలసరి లెక్కించి సరఫరా
పెట్రోలియం సంస్థలు గ్యాస్ ఏజెన్సీలకు తలసరి లెక్కించి ప్రతి ఏడాది గ్యాస్ సిలిండర్లను డెలివరీ చేస్తుంటారు. ప్రతి మూడు నెలలకు ఈ తలసరి లెక్కిస్తారు. సగటున ఒక కుటుంబం ఒక నెలలో ఎన్ని కేజీల గ్యాస్‌ను వినియోగించారో లెక్కిస్తారు. యుద్ధం వస్తుందని సమాచారంతో గ్యాస్ కొరతపై పెట్రోలియం సంస్థలు ఎస్సెస్‌మెంట్ ప్రారంభించాయి. గడిచిన రెండు నెలల్లో ఏ ఏజెన్సీకి ఎన్ని సిలిండర్లు సరఫరా అయ్యాయి, వీరి పరిధిలో ఎంతమంది వినియోగదారులకు గ్యాస్ సరఫరా అయిందన్న లెక్కలు తీస్తున్నారు. గహ అవసరాల వంట సి¾లిండర్‌పై 350 సార్లు ఆహారం తయారు చేయవచ్చని పెట్రోలియం సంస్థలు అంచనా. దాని ప్రకారం ఒక కుటుంబానికి ఒక సిలిండర్ 30 రోజులు వస్తుందని లెక్కగట్టారు. దాని ఆధారంగా గత 20 ఏళ్లుగా ఏజెన్సీలకు గ్యాస్ సరఫరా చేస్తున్నారు. ప్రస్తుతం పెట్రోలియం సంస్థలు ఎస్సెస్‌మెంట్ నిర్వహించి కొత్త పాలసీని తెరపైకి తీసుకురావచ్చని ఏజెన్సీ డీలర్లు చెబుతున్నారు. అందుకు అనుగుణంగా ప్రస్తుతం 25 రోజులు గడువు విధించి ఆన్‌లైన్‌లో గ్యాస్ బుక్ చేసుకోవడానికి అవకాశం కల్పించారు. జిల్లాలో సగటు వినియోగం గ్రామీణ ప్రాంతాల్లో ఒక కుటుంబం 3.75, అర్బన్ ప్రాంతాల్లో 5.75 సిలిండర్లు, దీపం కనెక్షన్లు అర్బన్ ఏరియాలో 5, గ్రామీణ ప్రాంతాల్లో 4 సిలిండర్లు వినియోగం అవుతుంది. దీనికి అనుగుణంగా జిల్లాలోని గ్యాస్ ఏజెన్సీలకు గ్యాస్ సరఫరా జరుగుతుంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితులను దష్టిలో పెట్టుకొని జాయింట్ కలెక్టర్ కొన్ని నిబంధనలు జారీ చేశారు. హాస్టళ్లకు, హాస్పిటళ్లకు మాత్రమే కమర్షియల్ సిలిండర్లు సరఫరా చేయాలని, హÃటళ్లకు నిబంధనల మేరకే ఇవ్వాలని అందులో పేర్కొన్నారు.






Comments