top of page

ఇండి ‘గోల’ వెనుక ఇంత కుట్రా!

  • Writer: Prasad Satyam
    Prasad Satyam
  • 2 days ago
  • 4 min read
  • సరిగ్గా పుతిన్‌ పర్యటన సమయంలోనే గందరగోళం

  • గతంలోనూ ఇవే చేదు అనుభవాలు

  • ప్రభుత్వాన్నే ఖాతరు చేయని విమానయాన సంస్థ

  • అంతర్జాతీయ రాజకీయాలే దాని చేష్టలకు మూలం

ree

(సత్యంన్యూస్‌,శ్రీకాకుళం)

డాట్‌ నెంబర్‌ 1..

డిసెంబర్‌ 6- 2021.. పుతిన్‌ భారత్‌కు ఇలా వచ్చి వెళ్లారో లేదో.. డిసెంబర్‌ 8న.. అంటే సరిగ్గా రెండు రోజులకు మన చీఫ్‌ ఆఫ్‌ డిఫెన్స్‌ స్టాఫ్‌ బిపిన్‌ రావత్‌ మరో 13 మంది హెలికాప్టర్‌ ప్రమాదంలో మరణించారు. వారు ప్రయాణించిన ఎంఐ 17వి-5 హెలికాప్టర్‌ రష్యాది. వాతావరణ ప్రతికూలత.. హెలికాప్టర్‌ ప్రయాణ నిర్ణయం.. బిపిన్‌ రావత్‌ అమెరికాతో చర్చలు.

..

డాట్‌ నెంబర్‌ 2..

అక్టోబర్‌ 2 నుంచి 5.. 2000లో పుతిన్‌ తొలి పర్యటన. సరిగ్గా దానికి ముందురోజు అంటే అక్టోబర్‌ 1న జమ్మూ కాశ్మీర్‌లో ఆర్మీ క్యాంప్‌పై భారీ ఉగ్రదాడి. అక్కడికి ఐదు రోజుల తర్వాత అంటే అక్టోబర్‌ 10న ఢల్లీిలో పార్లమెంట్‌ పరిసరాల్లో భద్రతా అలర్ట్‌.. పేలుడు అనుమానంతో..

..

డాట్‌ నెంబర్‌ 3..

2002 డిసెంబర్‌లో ఇండియా-రష్యా సమ్మిట్‌..

2002 డిసెంబర్‌ 2.. ఢల్లీిలో బస్‌ బ్లాస్ట్‌.. 10 మందికి పైగా గాయాలు. ఎవరికి రష్యా మీద.. భారత్‌ మీద.. దేశం ఫస్ట్‌ అనే వారి మీద కంటగింపు.

..

డాట్‌ నెంబర్‌ 4..

2025 డిసెంబరు 5 నుంచి రెండు రోజుల పాటు రష్యా అధ్యక్షుడు పుతిన్‌ భారత్‌లో పర్యటన. ఆ మరుసటి రోజే డిసెంబరు 6న దేశంలో ఇండిగో విమానాలు రద్దు. వేల సర్వీసులు నిలిచిపోయాయి.

వీటన్నింటినీ చెదురుమదురు ఘటనలుగా చూద్దామా?! ఈ డాట్స్‌ అన్నింటినీ కనెక్ట్‌ చేసి చూస్తే.. ఇప్పుడు పడిన ఇండిగో దెబ్బ ఎలాంటిది అన్నది అర్థం అవుతుంది. రామ్మోహన్‌నాయుడిని మంత్రి పదవి నుంచి ఉంచడం, తీసేయడం తర్వాత మాట. విమానయానం దేశ భద్రత కూడా కలిపి ఉన్న సున్నితమైన రంగం. ఇందులో ప్రభుత్వ పరువు తీయడానికి ఎన్నో అంతర్జాతీయ శక్తులు కాచుకుని ఉంటాయి. దీన్ని అంతర్జాతీయ పరువు ప్రతిష్ఠలు.. దేశ భద్రత కోణం లోంచి చూడాల్సిన అవసరం ఉంది. అలాంటప్పుడు పుతిన్‌ భారత్‌ పర్యటనలకు వెనుకా ముందు జరిగిన సంఘటనలు యాదృచ్ఛికమా.. అది కూడా బీజేపీ పాలకులు కేంద్రంలో ఉన్నప్పుడు.

సర్కారును సవాల్‌ చేయడమే

డిసెంబర్‌ 4-6... 2025. ఇండిగో సంస్థ వేల సంఖ్యలో విమాన సర్వీసులు ఆపేసింది. ఇది ఒక రకంగా టెర్రర్‌ యాక్ట్‌. అత్యధిక సంఖ్యాకులను భయాందోళనకు గురి చేయడం. ‘ఈ ప్రభుత్వం మమ్మల్ని ఏమీ పీకలేదు.. మేం తలచుకుంటే మిమ్మల్ని స్తంభింప చెయ్యగలం’...అన్న సందేశం ఇందులో లేదా? ఇండియా`రష్యా ఏదో తోపులం అనుకుంటున్నాయి. కీ మొత్తం మా చేతిలోనే ఉంది అని చెప్పడం కాదా? వాస్తవానికి ఇండిగో ఎయిర్‌లైన్స్‌ను భారతీయ మూలాలున్న ఇద్దరు వ్యక్తులు స్థాపించిన మాట వాస్తవం. ఆ తర్వాత కాలంలో వేరేవారికి దీన్ని అమ్మేశారు. ఇండిగోకు విమానాలు అమ్ముతున్నది నెదర్లాండ్స్‌కు చెందిన ఎయిర్‌బస్‌ అనే సంస్థ. నెదర్లాండ్స్‌తో పాటు ఫ్రాన్స్‌, జర్మనీలకు చెందినవారి వాటాలు కూడా ఇందులో ఉన్నాయి. ఇవన్నీ రష్యాకు వ్యతిరేకంగా పని చేస్తున్న నాటో కూటమి దేశాలే. రష్యా`ఉక్రెయిన్‌ యుద్ధం మొదలైన తర్వాత ఉక్రెయిన్‌కు ఆయుధాలు సరఫరా చేయడంతో పాటు రష్యాలో ఎయిర్‌బస్‌ విమానాలకు స్పేర్‌పార్ట్‌లు, సాఫ్ట్‌వేర్‌ సేవలను పూర్తిగా అందించడం లేదన్న కథనాలు కూడా వెలువడ్డాయి. ఇప్పుడు దీన్ని ఏ కోణంలో చూడాలో పాఠకులదే తుది నిర్ణయం.

కేంద్రమంత్రి తప్పు లేదా?

గతంలో ఎయిర్‌ ఇండియా కేంద్ర ప్రభుత్వ సంస్థగా ఉండేది. కొన్ని వందల విమాన సర్వీసులు నడిపే ఈ సంస్థకు చెందిన కొన్ని వేలమంది సిబ్బంది సెంట్రల్‌ గవర్నమెంట్‌ పరిధిలో పని చేసేవారు. అలాంటి ఎయిర్‌ ఇండియాను 2022లో టాటా గ్రూప్‌కి ఇచ్చి ప్రైవేట్‌ పరం చేసేశారు. అంటే ఇప్పుడు రామ్మోహన్‌ నాయుడు కంట్రోల్‌లో ఒక్కటంటే ఒక్క విమానం కూడా లేదన్నమాట. ఆయన కేవలం తన పరిధిలో లేని ఎయిర్‌లైన్స్‌ కంపెనీలకు మంత్రి. అందరి మాదిరిగానే పైలెట్లను ఎక్కువగా నియమించుకోవాలని ప్రభుత్వం ఇండిగోను కూడా కోరినా ఆ మేరకు నియామకాలు జరుగుతున్నాయా లేదా చూడటం విమానయాన శాఖ పరిధిలోనిదే. అలా పరిశీలించకుండా డీజీసీఏ చూసుకుంటుందని వదిలేయడం రామ్మోహన్‌నాయుడు చేసిన తప్పు. ప్రయాణికుల భద్రతకు, విమాన ప్రమాదాల నివారణకు పైలట్ల మీద పనిభారం తగ్గించడానికి డీజీసీఏ కొన్ని నిబంధనలు తీసుకువచ్చింది. అది కూడా పైలట్ల సంఘం కోరితేనే చేసింది. ఎనిమిది గంటలు పని చేయాల్సిన ఒక పైలెట్‌తో 12 గంటలు చేయించడం ద్వారా పూర్తిగా ఒక షిప్ట్‌ ఉద్యోగులను నియమించే అవసరం లేకుండా విమానయాన సంస్థలు పొదుపును పాటించాయి. దీనివల్ల తమమీద ఒత్తిడి పెరుగుతుందని, రెస్ట్‌ దొరకడం లేదంటూ పైలట్లు వాపోవడంతో పనిగంటల మీద, సెలవుల విషయంలో డీజీసీఏ కొత్త నిబంధనలు తెచ్చి, వాటిని పాటించాలని కోరింది. అయితే విమానయాన సంస్థలేవీ లాభాల్లో నడవడంలేదు. విమానం ఎక్కేవారి సంఖ్య గణనీయంగా పెరిగినా ఖర్చులు పెరగడంతో రిక్రూట్‌మెంట్లను ఔట్‌సోర్సింగ్‌ చేసేశాయి. కొత్త విమానాలు కొంటున్నా, కొత్త పైలెట్లను మాత్రం నియమించడంలేదు. ఇక్కడి నుంచే అసలు కథ మొదలైంది. స్పైస్‌ జెట్‌, ఎయిర్‌ ఇండియా, అలయన్స్‌ ఎయిర్‌ లాంటి అన్ని ఎయిర్‌లైన్‌ కంపెనీలు డీజీసీఏ నిబంధనల ప్రకారం పైలట్ల సంఖ్యను పెంచుకున్నాయి.. కానీ ఇండిగో మాత్రం పైలట్లను పెంచలేదు. ఒక ఎయిర్‌లైన్‌ కంపెనీ డీజీసీఏ నిబంధనలు పాటించకపోతే ఎవరి తప్పు అవుతుంది? ఇండిగో ఎయిర్‌లైన్‌ కంపెనీ తప్పే కదా? కానీ ఇక్కడే రామ్మోహన్‌నాయుడు గడువుకు ముందు ఇండిగోను సమీక్షించి వార్నింగ్‌ ఇవ్వాల్సింది.

ఇప్పుడే ఎందుకు చేశారు?

దేశంలో ఉన్న అన్ని ఎయిర్‌లైన్స్‌ కొత్త రూల్స్‌ ప్రకారం తమ స్టాఫ్‌ను పెంచుకోవడం, డ్యూటీస్‌ అడ్జస్ట్‌ చేసుకోవడం చేశాయి.. ఒక్క ఇండిగో మాత్రమే చేయలేదు. రోజుకి 2200 సర్వీసులు నడిపే ఇండిగో ఎయిర్‌లైన్స్‌ సడన్‌గా చేతులు ఎత్తేసింది.. అదీ భారత్‌లో పుతిన్‌ పర్యటిస్తున్నప్పుడు. నిజంగా ఈ నిబంధనల వల్ల తాము వ్యాపారం చేయలేమని ఇండిగో భావిస్తే నవంబరులోనే ఈ పని చేయాలి. కానీ డిసెంబరులో అది కూడా పుతిన్‌ భారత్‌లో పర్యటిస్తున్నప్పుడు చేయడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? ఇది పూర్తిగా జియో పాలిటిక్స్‌లో భాగం. ఇందులో కుట్ర ఉన్నా, వ్యాపారాలు ఉన్నా ఇదంతా అంతర్జాతీయ రాజకీయాలే. కానీ దీపక్‌రెడ్డి లాంటి వాళ్ల అత్యుత్సాహం వల్ల లోకేష్‌ పేరును చర్చలోకి లాగడం.. అర్ణబ్‌ గోస్వామి లాంటి జర్నలిస్టు దాన్ని అందుకోవడం వల్ల ఇంకా డ్యామేజ్‌ పెరిగింది. లోకేష్‌ తాను చేయాల్సినవి తాను చేస్తున్నారు. మొన్నటి శ్రీలంక తుఫాన్‌ సమయంలో ఆర్‌టీజీఎస్‌ సేవలు అందించింది మనమే అని ఎంతమందికి తెలుసు..? ఇవి మాట్లాడితే బాగుంటుంది. అంతే కానీ అవసరం లేనిచోట కూడా లోకేష్‌ పేరు తీసుకురావడం అనేది ఆయనకు మేలు చేయకపోగా చెడు జరిగే అవకాశమే ఎక్కువ.

గత ఆర్థిక సంవత్సరంలో భారత్‌లో ఎగిరిన విమానాలు సుమారు 11 లక్షలు. ప్రయాణికులు 16 కోట్ల పైమాట. టికెట్ల కోసం పెట్టిన ఖర్చు సుమారుగా రెండు లక్షల కోట్లు. అంటే దేశంలో ఉన్న మూడువేల విమానాలు అన్ని ట్రిప్పులు వేశాయన్నమాట. అదే 2013-14లో రూ.42వేల కోట్లు. అంటే పదేళ్లలో విమానయాన రంగం ఆదాయం ఐదు రెట్లు పెరిగింది. అయినా ఈ రంగం చాలా ఒడిదుడుకులతో కూడుకొన్నది. ప్రైమ్‌ ఆపరేటర్స్‌ అంతా నష్టాల్లో పడిన వాళ్లే.. ఎయిర్‌పోర్టులు మరింత ఆధునీకరణ చెందడంతో పాటు.. సౌకర్యాలు కూడా పెరగడం ప్రారంభించాయి. అసలు ఒక సంవత్సరంలో 16 కోట్ల మంది దేశీయంగా విమానాల్లో తిరిగారంటే చిన్నవిషయం కాదు.

ముక్తాయింపు..

ఇలాంటి సంక్షోభ సమయాల్లోనే సరైన రాజకీయ పాఠాలు నేర్చుకోవాలి. ఇదే రామ్మోహన్‌నాయుడుకు సరైన సమయంలో రాజకీయ పరమపద సోపాన పఠంలో వేసే పాచికలు మనకు ఫేవర్‌గా పడితే నడపడం కాదు. మనకు ఫేవర్‌ జరిగేలా పడటం ఎలానో నేర్చుకోవాల్సిన సందర్భం. వాస్తవానికి ఇండిగో సంక్షోభంలో దేశవ్యాప్తంగా, ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాల్లో బాగా ఫేమస్‌ అయినది అర్ణబ్‌ గోస్వామి. ఈయనపై మోడీ భక్తుడనే ఆరోపణ ఉంది. రిపబ్లిక్‌ టీవీ బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడిన సందర్భాలు దాదాపు ఉండవు. అయితే ఇప్పుడు ఈ సంక్షోభంలో ప్రజాగ్రహం మోదీ వైపు మరలకుండా ఉండేందుకు ఆ టీవీకి ఒక బలిపశువు కావాలి. రామ్మోహన్‌నాయుడును టార్గెట్‌ చేయడం కూడా అటువంటి చర్యలో భాగంగానే భావించాలి. అందుకేనేమో మీడియాను ముద్దుగా చూసుకునే చంద్రబాబు సైతం రిపబ్లిక్‌ టీవీ మీద విరుచుకుపడ్డారు. అర్ణబ్‌ గోస్వామి చెబుతున్నట్టు రామ్మోహన్‌నాయుడు ఆయనకు సమాధానం చెప్పలేనంత చిన్నోడేమీ కాదు. కమ్యూనికేషన్‌లో దిట్ట. అయితే ఇప్పుడైనా రామ్మోహన్‌నాయుడు గ్రహించాల్సిందేమిటంటే.. మంచితనం వేరు, పనితనం వేరు, పరిపాలన వేరు అని. ఇంతకీ అసలు విషయం చెప్పడం మర్చిపోయాం. మన దేశానికి పుతిన్‌ రావడం, అనేక విధానాల మీద గతంలో ఎన్నడూ లేనంత ముందడుగు పడటం, ముఖ్యంగా మన సముద్రం మీద, మన యుద్ధ పరికరాల మీద రష్యా సానుకూలంగా స్పందించడం వంటి ఎన్నో మంచి విషయాలు ఇండిగో మూలంగా మనెవరికీ తెలియకుండాపోయింది.

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page