top of page

ఇంధన ఎమర్జెన్సీ దిశగా ప్రపంచం

  • Writer: DV RAMANA
    DV RAMANA
  • 1 day ago
  • 2 min read

రెండు దేశాల అభిజాత్యం.. మధ్యలో ఒక అగ్రదేశపు అహంకారం.. వీటి మధ్యలో ప్రపంచంలోని దేశాలు నలిగిపోతున్నాయి. యుద్ధంతో తమకు ఏమాత్రం సంబంధం లేకపోయినా శిక్ష అనుభవిస్తున్నాయి. ఇరాన్, అమెరికా`ఇజ్రాయెల్ మధ్య దాడులు ఆగినట్లే ఆగి.. అంతలోనే పెచ్చరిల్లడంతో ఇప్పట్లో దీనికి పరిష్కారం.. ప్రపంచ దేశాలకు ఉపశమనం లభించదేమోనన్న ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ యుద్ధం నేపథ్యంలో ఒక్క హర్మూజ్ జలసంధే చాలా దేశాల ఎకానమీని తల్లకిందులు చేసేస్తోంది. ఇప్పటికే పలు దేశాలు ఇంధన ఎమర్జెన్సీని ప్రకటించాయి. తన చమురు అవసరాల్లో 98 శాతం మేరకు గల్ఫ్ దేశాలపైనే ఆధారపడిన ఫిలిప్పీన్స్ అక్కడి నుంచి పెట్రో ఉత్పత్తులు అందే పరిస్థితి లేని విపత్కర పరిస్థితుల్లో ఇంధన ఎమర్జెన్సీని ప్రకటించింది. అత్యవసరమైతే తప్ప ఏ రూపంలోనూ ఇంధనం విధంచకూడదన్నది ఈ ఎమర్జెన్సీ సారాంశం. ప్రపంచంలో ఇంధన వినియోగంపై ఎమర్జెన్సీ ప్రకటించిన తొలి దేశంగా నిలిచింది. ఇక పాకిస్తాన్, బంగ్లాదేశ్, మలేషియా , శ్రీలంక, వియత్నాం, వంటి పలు దేశాలు సైతం దాదాపు ఇవే గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్నాయి. ఆయా దేశాల్లో పెట్రోల్ బంకుల వద్ద నోస్టాక్ బోర్డులు లేదా భారీ క్యూలు కనిపిస్తున్నాయి. మిగతా దేశాలు కూడా క్రమంగా ఈ పరిస్థితులకు చేరువ అవుతున్నాయి. ప్రస్తుత దుర్భర పరిస్థితులను అంతర్జాతీయ ఇంధన సంస్థ(ఐఈఏ) చరిత్రలో అతి భయంకరమైన ఇంధన సంక్షోభంగా అభివర్ణించింది. ఆ సంస్థ గణాంకాల ప్రకారం ప్రస్తుతం ప్రపంచం తన రోజువారీ అవసరాల్లో 11 మిలియన్ బ్యారెళ్ల ఇంధనాన్ని కోల్పోతున్నది. 1970 ప్రాంతంలో ఇటువంటి చమురు సంక్షోభాన్నే ప్రపంచం ఎదుర్కొంది. ఆనాడు రోజుకు సగటున ఐదు మిలియన్ బ్యారెళ్ల సరఫరాను కోల్పోతే.. ఇప్పుడు ఆ నష్టం రెట్టింపు కంటే అధికంగా ఉండటం గమనార్హం. ఈ భారీ కొరత ప్రపంచ ఆర్థిక వ్యవస్థ పునాదులను కదిలిస్తోంది. చాలా ఐరోపా దేశాల్లో సైతం ఇంధన సంక్షోభం మొదలైంది. మనదేశంపైనా ఆ నీలినీడలు ప్రసరిస్తున్నాయి. గ్యాస్ డెలివరీలో జాప్యాల కారణంగా ీVAటల్ పరిశ్రమ, చిరుబళ్ల వ్యాపారులు ఇప్పటికే దాని బారిన పడ్డారు. గహవినియోగ గ్యాస్ పంపిణీలో తీవ్ర జాప్యం జరుగుతున్నదన్న ఆందోళనలు కనిపిస్తున్నాయి. హర్మూజ్ జలసంధి నుంచి ఒక్కొక్కటిగా మన చమురు, గ్యాస్ నౌకలు బయటపడి గమ్యస్థానాలకు చేరుతున్నా.. యుద్ధంలో ఉత్పత్తి కేంద్రాలే నాశనం కావడం వల్ల అవసరాలకు తగినంత అందే పరిస్థితి అయితే లేదు. యుద్ధం ఇప్పటికిప్పుడు ఆగిపోయినా కొరత మాత్రం ఇప్పట్లో తీరే పరిస్థితి లేదు. భవిష్యత్తు సంగతెలా ఉన్నా.. యుద్ధం కొనసాగుతున్న పరిస్థితుల్లో మరింత అప్రమత్తంగా, ఆచితూచి వ్యవహరించాలని సాక్షాత్తు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పార్లమెంటు వేదికగా దేశప్రజలను సుతిమెత్తగా హెచ్చరించడం ముంచుకొస్తున్న ముప్పుకు సంకేతంగా భావించాల్సి ఉంటుంది. పరిస్థితి మరింత దిగజారితే.. మళ్లీ లాక్‌డౌన్ తరహా వాతావరణం నెలకొంటుందన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. యుద్ధం ప్రభావం, ప్రస్తుత విపత్కర పరిస్థితులపై మొదటిసారి పార్లమెంటులో స్పందించిన ప్రధాని పరోక్షంగా లాక్‌డౌన్‌ను ప్రస్తావించారు. లాక్‌డౌన్ విధించాల్సి వస్తుందని ఆయన నేరుగా చెప్పకుండా 2020లో కోవిడ్ సంక్షోభ సమయంలో లాక్‌డౌన్ ఆంక్షలు విధించిన విషయాన్ని ప్రస్తావించడం విశేషం. ఆనాడు అన్ని రంగాల సప్లై చైన్స్ దెబ్బతిని ప్రపంచ మార్కెట్లు తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొన్నాయి. యూరియా ధర క్వింటాలు రూ.మూడు వేలకు ఎగబాకింది. అయినా కూడా దేశంలో ఆ ధరలను రూ.300 దాటకుండా ఉంచమని అంటూ కోవిడ్ సంక్షోభ సమయంలో ప్రభుత్వం వ్యవహరించిన తీరును వివరించడం ద్వారా ఇప్పుడు కూడా అలాంటి పరిస్థితులే ఉన్నాయని అంతర్లీనంగా చెప్పుకొచ్చారు. నాడు కోవిడ్ సష్టించిన భయానక పరిస్థితులే ఇప్పుడు పశ్చిమాసియా యుద్ధం కారణంగా తలెత్తే ప్రమాదముందని ప్రజలను అప్రమత్తం చేయడమే ఆయన ఉద్దేశం కావచ్చు. అలాగే ఆనాడు ప్రజలు సంపూర్ణంగా సహకరించి ప్రభుత్వంతో కలిసి కోవిడ్‌పై విజయం సాధించినట్లే ఇప్పుడు కూడా సహకరించాలన్న విజ్ఞప్తి కూడా ఉన్నట్లు భావిస్తున్నారు. ప్రపంచ మార్కెట్లు కుదేలవుతున్న పరిస్థితుల్లో ఆ ప్రభావం మన దేశంపైనా పడుతుంది. ద్రవ్యోల్బణం ఎగబాకే ముప్పు కూడా ఉంది. మోదీ తన ప్రసంగంలో కోవిడ్ ప్రస్తావన తెచ్చారు. ప్రజలను భయపెట్టడానికి కాదు.. గత సంక్షోభాల కంటే ఇప్పటితరం ఎదుర్కొన్న అతిపెద్ద సంక్షోభం కోవిడ్ మాత్రమే కావడం ఆయన ప్రస్తావనకు కారణం. సాధారణంగా యుద్ధం కారణంగా వాటిల్లే కష్టాలు ఎంత తీవ్రంగా, ఎలా ఉంటాయో ఇప్పటి తరానికి ప్రత్యక్షంగా తెలియదు. అన్ని రకాల సరుకుల లభ్యత తగ్గిపోవడం, ధరలు అందుబాటులో లేకుండాపోవడం, పనులు లేక ఆదాయ వనరులు క్షీణించడం వంటి అనేకానేక సమస్యలు చుట్టుముట్టి పౌరజీవనం అతలాకుతలం అవుతుంది. అలాంటి దుర్భర పరిస్థితులను చూసి భయపడకుండా ముందునుంచే ప్రత్యామ్నాయ ఏర్పాట్లతో సన్నద్ధులై ఉంటే తీవ్రంగా ప్రభావితం కాకుండానే సంక్షోభాల నుంచి గట్టెక్కవచ్చన్నది ప్రధాని మోదీ కోవిడ్ లాక్‌డౌన్ ప్రస్తావన వెనుకనున్న లక్షం. ఇదే సమయంలో అప్పటి మాదిరిగానే సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు సర్వసన్నద్ధంగా ఉందన్న భరోసా దేశప్రజలకు కల్పించడం అంతరార్థంగా భావిస్తున్నారు. అయితే ఇప్పటికిప్పుడు లాక్‌డౌన్ విధించాల్సిన దుర్భర పరిస్థితి అయితే దేశంలో లేదు. ప్రభుత్వానికి కూడా అటువంటి ఆలోచనలేదు. కానీ యుద్ధం మరింత ముదిరితే మాత్రం ప్రభుత్వం కాదు.. ప్రజలే స్వచ్ఛందంగా తమకుతాము లాక్‌డౌన్ విధించుకునే దుస్థితి దాపురిస్తుందన్నది మాత్రం నిజం. ఎందుకంటే పరిశ్రమలు, జీవిత రథచక్రాలు తిరగడానికి అవసరమైన పెట్రోల్, డీజిల్ దొరకవు. ఇంట్లో వంటలు చేసుకోవడానికి గ్యాస్ కూడా ఉండదు. ఒకవేళ అవి అందుబాటులో ఉన్నా ధరలు ఆకాశంలో ఉంటాయి. ప్రాజెక్టులు నిలిచిపోతాయి. నిరుద్యోగం పెరిగిపోతుంది.

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page