top of page

ఇదేం మర్యాద!

  • Guest Writer
  • Jun 11
  • 2 min read
ree

ఏ ప్రోగ్రాం అయినా సరే, కొన్ని అలిఖిత మర్యాదలు, ప్రొటోకాల్స్‌ ఉంటాయి. పాటించబడాలి.. లేకపోతే అహాల సమస్యలు వస్తాయి, కొత్త తలనొప్పులు క్రియేటవుతాయి.. సీఎం పేరు మరిచిపోతే, దాన్ని వెకిలిగా సమర్థించుకోబోతే అల్లు అర్జునుడు ఎంత భంగపడ్డాడో, ఇండస్ట్రీ అంతా ఎలా షాకయిందో చూశాం కదా.. తాజాగా ఓ సంఘటన. ఫేస్‌బుక్‌లో మిత్రుడు డా.మహ్మద్‌ రఫీ వాల్‌ మీద కనిపించింది. ఆసక్తికరంగా ఉంది. ముందు ఆ వార్త చదవండి.

ఏదైనా ఒక కార్యక్రమానికి మంత్రి ముఖ్య అతిధిగా వస్తే గొప్పగా వుంటుందా? సినిమా హీరో లేదా హీరోయిన్‌ వస్తే గొప్పగా వుంటుందా? మారిన కాలంలో సినిమా నటులకే ప్రాధాన్యం ఇస్తున్నట్లు కనిపిస్తోంది! అమెరికాలో తెలుగు సంఘాలు నిర్వహించే కార్యక్రమాల్లో రాజకీయ నేతల కన్నా సినిమా నటులకే క్రేజ్‌ ఉంటుంది! అదే అక్కడ సంప్రదాయంగా కొనసాగుతోంది! ఆ సంప్రదాయమే మన హైదరాబాద్‌ కు కూడా వచ్చినట్లు అనిపిస్తోంది!

ఇవాళ హైదరాబాద్‌ లో ఓ హోటల్‌ లో జరిగిన ఏదో లాంచ్‌ ప్రోగ్రామ్‌! తెలంగాణ ఐటి శాఖ మంత్రి దుద్ధిళ్ల శ్రీధర్‌ బాబు సమయానికి వచ్చేసారు! మంత్రి వచ్చారు కాబట్టి కార్యక్రమం ప్రారంభించారు. అక్కడ యాంకర్‌ ఎంతో అనుభవం వున్నఝాన్సీ!

మంత్రి శ్రీధర్‌బాబు మాట్లాడుతున్నారు! అంతలో హీరోయిన్‌ శ్రీలీల వచ్చింది! ముందు వరసలో కూర్చుంది! నిర్వాహకులు చెప్పారో తనకే ఆలోచన వచ్చిందో తెలియదు కానీ, మంత్రి దగ్గరకు వెళ్లి ‘‘ఏమనుకోవద్దు సార్‌ చీఫ్‌ గెస్ట్‌ శ్రీలీల వచ్చింది. వేదిక మీదకు పిలుద్దాం! ఈ యాప్‌ ఆమె లాంచ్‌ చేయాల్సి వుంది’’ అని మంత్రి స్పీచ్‌ ఆపేసింది!

ఆయన ఎంతో సౌమ్యుడు కాబట్టి, నేను మాట్లాడటం ఆపేయాలా లేదా నేను ఆమెను వేదిక పైకి పిలవాలా అనడిగారు! లేదు సార్‌ నేనే పిలుస్తాను అంటూ ఝాన్సీ వేదికపైకి శ్రీలీలను ఆహ్వానించింది! ఆమె వచ్చి మంత్రి శ్రీధర్‌ బాబును పలకరిస్తే, సరే అక్కడ ఉండండి అంటూ స్టేజిలో అతిధులు నిలబడిన చోటు చూపించి, ఆమె అక్కడకు వెళ్ళాక తన ప్రసంగం ప్రారంభించి ముగించారు!

ఇలా ఒక మంత్రి మాట్లాడుతున్నప్పుడు ఆపడమే సభా మర్యాద కాదు! ఆపి, అలస్యంగా వచ్చిన హీరోయిన్‌ ను హడావిడిగా పిలవడం ఏమిటో రaాన్సీకే తెలియాలి! కనీసం వేదికపై కుర్చీలు కూడా లేవు! మంత్రి ప్రసంగం అయ్యేంత వరకు ఆమె కింద విఐపిల కోసం ఏర్పాటు చేసిన కుర్చీల్లో కూర్చోబెట్టి, మంత్రి ప్రసంగం అయ్యాక పిలిచి ఉండొచ్చు! ఇదేం మర్యాద!

కనీసం సభా మర్యాద కూడా తెలియదనుకోవాలా? లేక మన సినిమా వాళ్ళు అంతే అనుకోవాలా? శ్రీలీల వయసెంత? చేసిన సినిమాలు ఎన్ని? అనుభవం ఎంత? దుద్దిళ్ల శ్రీధర్‌ బాబు వయసు ఎంత? సుదీర్ఘ అనుభవం వున్న రాజకీయ దిగ్గజం!

ఎన్నో సార్లు ప్రభుత్వంలో కీలక మంత్రిగా వ్యవహరించిన నేత! ప్రస్తుతం ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి! అలాంటిది శ్రీలీల వచ్చిందని ఆయన ప్రసంగాన్ని మధ్యలో ఆపేయించడం ఆశ్చర్యం! కాసేపు ఆయన కూడా విస్తుపోయారు! కనీసం సభా మర్యాద ఉండక్కరలేదా?

ఒక్కసారి ఊహించండి.. అదే మంత్రి ప్లేసులో ఇంకెవరైనా కాస్త అహమున్న వీవీఐపీ ఉండి ఉంటే..? రచ్చ రచ్చ అయ్యేది కాదా..? అవునూ, రaాన్సీ..? ఇదేం పిచ్చి పని..?! దీన్నే మూర?త్వం అని కూడా అంటారమ్మా.. ఇన్నాళ్లూ నీమీద కాస్త సదభిప్రాయం ఉండేది..!!

- ముచ్చట సౌజన్యంతో..

Komentar


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page