ఈ-ట్వంటీ పెట్రోల్‌పై ఆందోళన వద్దు
- DV RAMANA
- 3 days ago
- 2 min read

పెట్రోల్‌లో ఇథనాల్ కలిపి విక్రయించే విధానాన్ని వ్యతిరేకిస్తున్న వారికి సర్వోన్నత న్యాయస్థానం లో చుక్కెదురైంది. ఇథనాల్ కలిపిన పెట్రోల్ వినియోగం వల్ల వాహనాలు దెబ్బతింటాయన్న ఆందో ళనలు, ప్రచారాల నేపథ్యంలో ఆ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ న్యాయవాది అక్షయ్ మల్హోత్రా దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. మన దేశ చమురు అవసరాల్లో 80 శాతం మేరకు దిగుమతులపైనే ఆధారపడాల్సి వస్తోంది. అయితే ధరల పెరుగుదల, అంతర్జాతీయ రాజకీయ ఒడిదొడుకుల కారణంగా చమురు దిగుమతుల బిల్లు దేశ ఆర్థిక వ్యవస్థకు పెనుభారంగా మారు తోంది. దీన్ని సాధ్యమైనంతవరకు తగ్గించుకోవడంతో పాటు వాహన కాలుష్యం తగ్గించడం, ఇంధన భద్రత వంటి లక్ష్యాలను అందుకునేందుకు భారత ప్రభుత్వం ఇథనాల్ కలిపిన పెట్రోల్ విక్రయ విధానానికి తెరతీసింది. కోర్టు దీనికి మద్దతు తెలపడంతో దేశవ్యాప్తంగా ఈ20 పెట్రోల్ వినియోగిం చాలనే ప్రతిపాదన ముందుకు సాగేందుకు మార్గం సుగమమైంది. ఈ20 ఇంధనం పాత వాహనాల సామర్థ్యాన్ని దెబ్బతీస్తుందేమోనని వాహనదారులు వ్యక్తం చేస్తున్న అనుమానాలపై పెట్రోలియం శాఖ ఇప్పటికే స్పష్టతనిచ్చింది. ఇథనాల్ కలిపిన పెట్రోల్‌తో ఎలాంటి ఇంజిన్ సమస్యలు తలెత్తవని వెల్ల డిరచింది. పైగా ఇథనాల్ వల్ల కర్బన ఉద్గారాలు తగ్గుతాయని, గ్రామీణ ఆర్థికవ్యవస్థ మెరుగుపడు తుందని వ్యాఖ్యానించింది. పెట్రోల్‌తో పోలిస్తే ఇథనాల్ ఎనర్జీ డెన్సిటీ తక్కువగా ఉంటుంది. దాని వల్ల మైలేజీలో తగ్గుదల ఉన్నప్పటికీ అది అతి స్వల్పమేనని వెల్లడిరచింది. లక్ష కిలోమీటర్ల మేర సంప్రదాయ, ఈ20 ఇంధనం నింపిన వాహనాలకు జరిపిన పరీక్షలో పవర్, ఇంధన సామర్థ్యంలో పెద్దగా తేడాలు కనిపించలేదని వివరింది. అయితే ఈ20 పెట్రోల్ వల్ల వాహనాల్లో ఇంధన సామ ర్థ్యం 2 నుంచి 5 శాతం మేర తగ్గిపోవచ్చని వాహన పరిశ్రమ నిపుణులు అంచనా వేస్తున్నారు. కార్ల వేరియంట్ల ఆధారంగా ఇందులో కొంత తేడాలు ఉండొచ్చని భావిస్తున్నారు. తక్షణం ఎలాంటి ప్రభావం లేకపోయినా దీర్ఘకాలంలో గ్యాస్కెట్లు, ఇంధన రబ్బరు గొట్టాలు, పైపులు కోతకు గురవుతా యంటున్నారు. ఇవే భయాలను ప్రస్తావిస్తూ పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. ఆరు శాతం ఇథనాల్ కలిపిన పెట్రోల్‌తో పాత వాహనాల మైలేజీ తగ్గుతుందని వాదించారు. 2023కు ముందు తయారైన వాహనాల్లో ఈ సమస్య ఉందని అన్నారు. నచ్చిన ఇంధనాన్ని ఎంచు కునే స్వేచ్ఛ వినియోగదారులకు ఉండాలన్నదే తమ వాదన అని చెప్పారు. ఈ20 పెట్రోల్‌కు తాము వ్యతిరేకం కాదని స్పష్టం చేశారు. ఇంధన వినియోగానికి సంబంధించి ఇది సహేతుక చర్యేనని కూడా అన్నారు. అయితే ఇథనాల్ కలపని పెట్రోల్ అందుబాటులో లేకపోవడంపైనే తమ అభ్యం తరమని తెలిపారు. 2023 తర్వాత తయారైన వాహనాలు మాత్రమే ఈ20 పెట్రోల్‌కు అనువైనవని చెప్పుకొచ్చారు. అయితే పిటిషనర్ వాదనలను అటార్నీ జనరల్ వెంకటరమణి తోసిపుచ్చారు. స్వీయ ప్రయోజనాలున్న లాబీ తరుపున ఈ పిటిషనర్ దాఖలు చేసినట్లుందన్నారు. ఈ20 పెట్రోల్ విని యోగంతో విదేశీ మారకద్రవ్యం ఆదా అవుతుందన్నారు. ఈ నేపథ్యంలో ఇరువర్గాల వాదనలు విన్న కోర్టు పిటిషనర్ వాదనలను తోసి పుచ్చింది. సాధారణ పెట్రోల్‌తో పోలిస్తే.. చెరకు, మొక్కజొన్న ఆధారిత ఇథనాల్ కలిపిన పెట్రోల్ వాడకంతో కర్బన ఉద్గారాల విడుదల వరుసగా 65 శాతం, 50 శాతం మేర తగ్గుతుందని నీతి అయోగ్ అధ్యయనంలో వెల్లడైన విషయాన్ని కేంద్రం తన వివరణలో పొందుపర్చింది. దీనివల్ల ఎందరో రైతులకు జీవనోపాధి లభించి ఆత్మహత్యల ఉదంతాలు తగ్గాయని వెల్లడిరచింది. ఇప్పుడు ఇథనాల్‌ను కలపకూడదంటే కాలుష్యం పెరగడంతోపాటు రైతుల ఉపాధి దెబ్బతిని, గ్రామీణ ఆర్థిక వ్యవస్థపై ఆ ప్రభావం పడుతుందని, అన్నింటికీ మించి దేశ చమురు దిగుమతుల బిల్లు అమాంతం పెరిగిపోయి మన ఆర్థిక వ్యవస్థ కుదేలవుతుందని కేంద్రం పేర్కొంది. అందువల్లే అన్ని రకాలుగా ప్రయోజనం చేకూర్చేలా పెట్రోల్‌లో ఇథనాల్ మోతాదును పెంచాలని కూడా నిర్ణయించినట్లు కేంద్ర మంత్రిత్వశాఖ వెల్లడిరచింది. 2022-23లో పెట్రోల్‌లో ఇథనాల్ శాతం 12.06గా ఉండేది. ఆ మరుసటి ఏడాది దాన్ని 14.6 శాతానికి, ఈ ఏడాది ఫిబ్రవరిలో 19.6 శాతా నికి పెంచారు. తాజాగా ఈ మోతాదును 27 శాతానికి పెంచాలని కేంద్రం సన్నాహాలు చేస్తోంది.
Comments