ఉన్న ఒక్కటి కూడా డౌటేనా..?
- Guest Writer
- May 23
- 3 min read

కెరీర్ ఫామ్ లో ఉన్నప్పుడు వద్దన్నా సరే ఛాన్స్ లు వస్తాయి. కాస్త గ్రాఫ్ పడిపోతే మాత్రం చేతిదాకా వచ్చిన అవకాశం కూడా చేజారుతుంది. ఇలాంటివి ఇంతకుముందు చాలా మందికి జరిగాయి ఇప్పుడు కూడా జరుగుతున్నాయి. ఐతే ప్రస్తుతం ఇదే బుట్ట బొమ్మ పూజా హెగ్దే విషయంలో రిపీట్ అవుతుంది. టాలీవుడ్ లో వరుస స్టార్ సినిమాలతో దూసుకెళ్తున్న అమ్మడు ఎందుకో సడెన్ గా డ్రాప్ అయిపోయింది. ప్రభాస్ తో రాధే శ్యామ్ చేసిన అమ్మడు ఆ నెక్స్ట్ మహేష్ తో గుంటూరు కారం ఛాన్స్ కూడా అందుకున్నట్టే అనిపించగా సినిమా నుంచి మధ్యలో తప్పుకుంది. ఆ తర్వాత ఒక్కటంటే ఒక్క ఛాన్స్ పూజా హెగ్దేకి ఇవ్వలేదు. ఈమధ్య అమ్మడు రెట్రో సినిమా ప్రమోషన్స్ లో పూజా హెగ్దే ఒక తెలుగు సినిమా చేస్తున్నట్టు వెల్లడిరచింది. ఐతే ఆ టీం అఫీషియల్ గా అనౌన్స్ చేసే దాకా వెయిట్ చేయాలని అన్నది.
ఐతే తెలుస్తున్న సమాచారం ప్రకారం ఇప్పుడు ఆ ప్రాజెక్ట్ నుంచి పూజా హెగ్దేని తప్పించారని టాక్. సూర్య సినిమాలో ఆమె నటించినా సరే పెద్దగా ఇంపాక్ట్ క్రియేట్ చేయలేదు. ప్రస్తుతం పూజా హెగ్దే మీద ఆడియన్స్ అంత ఇంట్రెస్ట్ గా లేరన్నట్టుగా చెబుతున్నారు. అందుకే వచ్చిన ఆ ఒక్క ఛాన్స్ కూడా ఆమె నుంచి చేజారిందని అంటున్నారు. ఐతే అది నిజమా కాదా అన్నది మేకర్స్ అఫీషియల్ గా అనౌన్స్ చేశాక తెలుస్తుంది. ఏది ఏమైన పూజా బేబ్ కి టఫ్ టైం నడుస్తుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. అటు బాలీవుడ్ లో కూడా అమ్మడు సినిమాలైతే చేస్తుంది కానీ ఏ ఒక్కటి సరైన సక్సెస్ ఇవ్వట్లేదు. ప్రస్తుతం అమ్మడు వరుణ్ ధావన్ తో సినిమాకు రెడీ అవుతుంది. కనీసం సౌత్ లో ఎలాగు లక్ కలిసి రావట్లేదు కాబట్టి అమ్మడికి బాలీవుడ్ లో అయినా సక్సెస్ ఫేజ్ మొదలవుతుందేమో చూడాలి. పూజా హెగ్దే మాత్రం సౌత్ సినిమాల మీద తన ప్రేమను చూపిస్తూనే ఉంది. కానీ ఇక్కడ ఛాన్స్ లు మాత్రం అంత ఈజీగా రావట్లేదు. ఐతే టాలీవుడ్ లో ఉన్న పూజా ఫ్యాన్స్ మాత్రం ఆమె ఇక్కడ సినిమాలు చేయాలని కోరుతున్నారు. ఛాన్స్ రానిది ఆమె కూడా ఏం చేయలేదు కాబట్టి సో వెయిటింగ్ తప్పదని చెప్పొచ్చు.
తుపాకి.కామ్ సౌజన్యంతో..
థియేటర్ల దుస్ధితికి కారణం హీరోలేనా?

థియేటర్ వ్యవస్థ ఇది వరకు ఉన్నంత స్ట్రాంగ్ గా లేదన్నది నిజం. దానికి చాలా కారణాలు ఉన్నాయి. చాలా థియేటర్లు మూతపడ్డాయి. కొన్ని కల్యాణమండపాలుగా, షాపింగ్ కాంప్లెక్సులుగా మారిపోయాయి. మిగిలిన థియేటర్లలో కొన్నింటిని ఉంచాలా? మూసేయాలా? అనే తర్జన భర్జనలు జరుగుతున్నాయి. థియేటర్లని నడపలేమని ఎగ్జిబ్యూటర్లు గగ్గోలు పెడుతున్నారు. ఆ పంచాయితీ ఇప్పుడు నిర్మాతలకు నిద్ర లేకుండా చేస్తోంది. జూన్ 1 నుంచి సమ్మె లేకపోవొచ్చు కానీ, ఈ తలనొప్పి మాత్రం ఇక ముందు కూడా కొనసాగే అవకాశం ఉంది.
పంచాయితీ ఇప్పుడు పర్సంటేజీ గురించే కావొచ్చు. కానీ.. అసలు ఈ ముసలం మొదలవ్వడానికి కారణం ఒక రకంగా మన హీరోలే. పెద్ద హీరోలు యేడాదికి ఒకటి, రెండేళ్లకు ఒకటి అంటూ చాలా నిదానంగా సినిమాలు చేస్తున్నారు. దాంతో సీజన్ వచ్చేసరికి బాక్సాఫీసు దగ్గర సరైన సినిమా ఉండడం లేదు. అందుకు వేసవినే పెద్ద సాక్ష్యం. వేసవి సీజన్‌లో ఒక్క స్టార్ సినిమా కూడా రాలేదు. అలాంటప్పుడు థియేటర్లకు ఊపు ఎలా వస్తుంది?
చిన్న సినిమాల కోసం జనాలు థియేటర్ల దగ్గర క్యూ కట్టే పరిస్థితి లేదు. మీడియం రేంజ్ సినిమాలపై నమ్మకాలు తగ్గిపోతున్నాయి. ఓ పెద్ద స్టార్ సినిమా వస్తే తప్ప, బాక్సాఫీసుకు ఊపు రాదు. కానీ బడా హీరోలు మాత్రం సినిమాలు చేయడంలో మీన మేషాలు లెక్కేస్తున్నారు. ఎన్టీఆర్, చరణ్, బన్నీ, ప్రభాస్, మహేష్ వీళ్లే మనకున్న టాప్ హీరోలు. వీళ్లు రెండేళ్లకు ఒక సినిమా చేస్తున్నారు. ప్రభాస్ కొంతలో కొంత నయం. ఒకేసారి చేతిలో కొన్ని ప్రాజెక్టుల్ని ఉంచుకొన్నాడు. మిగిలిన వాళ్లు చాలా స్లో అండ్ స్టడీగా ముందుకు వెళ్తున్నారు.
వాళ్లకున్న క్రేజ్, ఆయా సినిమాలపై ప్రేక్షకులు, అభిమానులు పెట్టుకొన్న నమ్మకాలు హీరోల ముందరి కాళ్లకు బంధనాలుగా మారుతున్నాయి. అందుకే ప్రతీ చిన్న విషయంలోనూ జాగ్రత్తలు తీసుకొంటున్నారు. రీషూట్లు, రీ రైట్లూ చేసుకొంటూ కాలక్షేపం చేస్తున్నారు. ఈ విషయంలో వాళ్లని తప్పు పట్టలేం. కాకపోతే థియేటర్లకు కంటెంట్ కావాలి. జనాలు మళ్లీ థియేటర్ల వైపు చూడాలంటే స్టార్ సినిమాలు రావాలి. చాలా మంది నిర్మాతలు ఇదే విషయం గుర్తు చేస్తున్నారు. ఒకప్పుడు చిరంజీవి, బాలయ్య, నాగ్, వెంకటేష్ యేడాది పొడవునా సినిమాలు చేస్తుండేవారని, ప్రతీ సీజన్‌లోనూ ఓ స్టార్ సినిమా వచ్చేదని, ఓపెనింగ్స్ హడావుడి కనిపించేదని, ఇప్పుడు ఆ వాతావరణం ఎప్పుడో చూసే అవకాశమే రావడం లేదని మనోవేదన వెళ్లగక్కుతున్నారు.
ప్రస్తుతం జరుగుతున్న పంచాయితీని కూడా హీరోలు పట్టించుకొన్న దాఖలానే కనిపించలేదు. ‘ఇదేదో మన వ్యవహారం కాదులే’ అంటూ దూరంగానే ఉన్నారు. హీరోలు కూడా వాస్తవ పరిస్థితిని ఓసారి బేరీజు వేసుకోవాలి. సినిమా అనే వ్యవస్థకు నిర్మాత, హీరో ఎంత అవసరమో.. థియేటర్ కూడా అంతే అవసరం. దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత హీరోలపై ఉంది. పారితోషికాలు కాస్త తగ్గించుకొని, వీలైనన్ని ఎక్కువ సినిమాలు చేస్తే ఈ వాతావరణంలో మార్పు వచ్చే అవకాశం కచ్చితంగా ఉంది. మరి మన హీరోలు అంత త్యాగం చేస్తారా? అనేదే పెద్ద ప్రశ్న.
తెలుగు 360.కామ్ సౌజన్యంతో..
תגובות