ఏఐ భూతం కాదు.. పెద్ద వరం!
- DV RAMANA

- 10 hours ago
- 3 min read

సాఫ్ట్‌వేర్ రంగం ఎప్పుడూ స్థిరంగా ఉండదు. నిత్యం కొత్త ఆవిష్కరణలు, సాంకేతికతలతో ఆ రంగ ఉద్యోగులను సవాల్ చేస్తూనే ఉంటుంది. ఈ మార్పులతో పోటీ పడుతూ.. పరుగులు తీస్తూ వాటిని అందుకోగలిగినవారికి భవిష్యత్తు ఉంటుందని ఇప్పటికే అనేక సందర్భాల్లో రుజువైంది. ఇదే క్రమంలో ఐటీ రంగాన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) సాంకేతికతను తీవ్రంగా ప్రభావితం చేస్తున్నది. నిపుణు లతో సహా ఉద్యోగులు చేయాల్సిన పనులన్నింటినీ వారికి మించిన కచ్చితత్వం, వేగం, నాణ్యతలతో ఏఐ చేసి పెడుతుండటంతో ఐటీ రంగంతో పాటు ఇతర అనేక రంగాýకు చెందిన లక్షలాది ఉద్యో గుల భవిష్యత్తును ప్రశ్నార్థకం చేస్తూ భయపెడుతోంది. ఏఐ సాంకేతికత విస్తరిస్తే ఉద్యోగాలు కోల్పో వాల్సి వస్తుందన్న ఆందోళన వ్యక్తమవుతున్న సంగతి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. కానీ ఏఐ విష యంలో విపరీతంగా జరుగుతున్న ఇటువంటి ప్రచారాల్లో పెద్దగా వాస్తవికత లేదని ప్రపంచ బ్యాంకు భరోసా ఇచ్చింది. ప్రపంచ బ్యాంకు అభివృద్ధి నివేదిక`2026లో ఈ మేరకు భరోసా ఇస్తూ అభివృద్ధి చెందుతున్న దేశాల ఆర్థిక పురోగతికి కృత్రిమ మేథ(ఏఐ) వాస్తవానికి ఒక ఛోదక శక్తిగా ఉపయోగపడు తుందని వెల్లడించింది. ఒక దేశం లేదా ప్రాంతం సామాజికంగా ఆర్థికంగా అభివృద్ధి సాధించడానికి సాధారణంగా శతాబ్దకాలం పడుతుందని.. అయితే సరైన ప్రణాళికలతో కృత్రిమ మేథను ఉపయోగిస్తే అదే అభివృద్ధిని కేవలం దశాబ్దకాలంలో సాధించగలిగే అవకాశాలు మెండుగా ఉంటాయని ప్రపంచ బ్యాంకు తన నివేదికలో పేర్కొంది. అయితే సంపన్న, అభివృద్ధిచెందుతున్న దేశాల మధ్య ఏఐ చూపించే ప్రభావంలో స్పష్టమైన వ్యత్యాసం ఉంటుందని వెల్లడించింది. ఉదాహరణకు అధిక ఆదాయం ఉన్న దేశాల్లో ఏఐ ఆధారిత ఆటోమేషన్ ప్రభావంతో సుమారు 14.2 శాతం జనరేటివ్ ఉద్యోగాలు ప్రమా దంలో పడితే.. అభివృద్ధి చెందుతున్న దేశాల విషయంలో మాత్రం ఆ ప్రమాదం 4.5 శాతం మేరకే ఉంటుందని ప్రపంచ బ్యాంకు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. మరోవైపు తక్కువ, మధ్యస్త ఆదాయం కలిగిన దేశాల్లో ఏఐ గణనీయ ప్రభావం చూపి 16.2 శాతం ఉద్యోగాల కల్పనకు దోహదపడుతుంది. ఈ అంశాలను పరిగణనలోకి తీసుకుంటే అభివృద్ధి చెందుతున్న దేశాలు ఏఐ కోసం కార్మికులను, ఉద్యోగులను తొలగించడం కాకుండా.. అదే ఏఐని ఒక సాధనంగా ఉపయోగించుకుని వారి పని సామర్థ్యాన్ని, వృత్తి నైపుణ్యాలను పెంచేందుకు ఉపయోగించుకోవ్చని ప్రపంచ బ్యాంకు సూచిస్తున్నది. అలా అని ఈ సాంకేతిక విప్లవాన్ని అందిపుచ్చుకోవడానికి పేద, అభివృద్ధి చెందుతున్న దేశాలు వందల కోట్ల ఖర్చుతో భారీ ప్రాజెక్టులు, పెద్ద డేటా సెంటర్లు ఏర్పాటు చేయాల్సిన అవసరమేమీ లేదని ప్రపంచ బ్యాంకు పేర్కొంది. తక్కువ ఖర్చుతో సమకూరే చిన్న ఏఐ సాధనాలతోనే స్థానిక అవసరాలు, భాషలకు అనుగుణంగా మలచుకోవడం ద్వారా ఆరోగ్యం, విద్య, వ్యవసాయం, రవాణా తదితర అనేక రంగాý సేవలను మరింత వేగంగా సామాన్యులకు చేరవేయవచ్చు. అయితే ఈ అవకాశాలు అందిపుచ్చుకోవ డానికి కూడా కొంత పరిశ్రమ అవసరం అని ఈ నివేదిక రూపకర్తల్లో ఒకరైన గౌరవ్ నాయర్ పేర్కొ న్నారు. ఏఐ ప్రయోజనాలను పూర్తిస్థాయిలో పొందాలంటే నిరంతర విద్యుత్ సరఫరా, హైస్పీడ్ ఇంట ర్నెట్, పటిష్టమైన వ్యవస్థలు, నైపుణ్యం కలిగిన మానవ వనరులు చాలా అవసరం. ఈ ప్రాథమిక వసతులు కొరవడితే మాత్రం ఏఐ వినియోగం, ప్రయోజనాలు పొందడంలో అభివృద్ధి చెందిన, అభి వృద్ధి చెందుతున్న దేశాల మధ్య అంతరం తగ్గడానికి బదులు మరింత పెరిగిపోయే ప్రమాదం ఉం టుంది. ఈ సవాళ్లను అధిగమించడానికి దేశాలు తమ కార్యాచరణను దశలవారీగా అమలు చేయాల్సి ఉంటుందంటున్నారు. ఇక మన దేశం విషయానికి వస్తే ఏఐ విస్తరణ వల్ల ఉద్యోగాలు పోతాయని, వెనుకబడిపోతామని భారతీయులు భయపడటం లేదని నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. దానికి ప్రధానం గా నాలుగు కారణాలను పేర్కొంటున్నారు. ధనిక దేశాల్లో ఏఐ ఆటోమేషన్ వల్ల 14.2 శాతం ఉద్యో గాలు పోయే ప్రమాదం ఉండగా, భారత్‌లాంటి అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఈ ప్రమాదం కేవలం 4.5 శాతమే. భారతీయ వ్యవస్థలో అత్యధిక ఉద్యోగాలు మానవ శ్రమ, సేవలు, క్షేత్రస్థాయి పనితో ముడిపడి ఉండటమే దీనికి కారణం. ఏఐ భారత్‌లో ఉద్యోగులను తొలగించడానికి కాకుండా వారిలో ఉత్పాదక శక్తిని పెంచడానికి దోహదపడుతుంది. మనదేశంలో సుమారు 16.2 శాతం ఉద్యోగాలు ఏఐ అనుసంధానంతో మరింత వేగంగా, సమర్థవంతంగా మారతాయి. భారత ఐటీ, సేవా రంగాలు ఏఐని ఓ భయంకర శత్రువులా కాకుండా ఒక ఉత్ప్రేరకంగా చూడటానికి ఇప్పుడిప్పుడే అలవాటు పడుతు న్నాయి. భారత్ భయపడాల్సిన అవసరం లేదని చెప్పడానికి మరో కారణం.. ఏఐ ప్రయోజనాలు పొందడానికి బిలియన్ల కొద్దీ డాలర్లు ఖర్చు పెట్టి పెద్ద పెద్ద డేటా సెంటర్లు, ఇతర ఏఐ సంస్థలు నిర్మిం చాల్సిన అవసరం లేదు. స్థానిక భాషలకు, స్థానిక అవసరాలకు తగినట్లుగా తక్కువ ఖర్చుతో కూడిన ఏఐ సాధానాలను ఉపయోగించుకోవచ్చు. వాస్తవానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) భారత్‌కు అరుదైన అవకాశాన్ని తెచ్చిపెట్టింది. కొత్త సాంకేతికతను అందిపుచ్చుకోవడంలో మనవాళ్లు ఎప్పుడూ ముందంజలో ఉంటారనేది ఇక్కడ గమనార్హం. డిజిటల్ ఇండియా కార్యక్రమాలు, యÖపీఐ విప్లవాల్లాగే ఏఐని ఉపయోగించుకోవడం ద్వారా ఏళ్ల తరబడి పరిష్కారం కాని సమస్యలను పరిష్కరించుకుని తక్కువ సమయంలోనే అభివృద్ధి చెందిన దేశాలుగా వికసించడానికి భారత్‌లాంటి దేశాలకు ఏఐ ఒక సాధనంగా ఉపయోగపడుతుందని ప్రపంచ బ్యాంకు నివేదిక వివరించింది. వీటిని పరిగణనలోకి తీసు కుని కృత్రిమ మేథను ఉద్యోగులను కబళించడానికి వచ్చిన భూతంలా చూడటం మానుకుని మన వ్యవస్థýకు దాన్ని అనుసంధానించే ప్రక్రియను ఎంత వేగంగా చేపడితే దేశం అంత వేగంగా అభివృద్ధి చెందుతుందని భారతీయ నిపుణులు, ఉద్యోగులు తెలుసుకోవాల్సి ఉంది.






Comments