top of page

ఏదో జరగబోతోంది..!

  • Writer: NVS PRASAD
    NVS PRASAD
  • 19 hours ago
  • 2 min read



‘జైసల్మేర్‌లో సైరన్ టెస్టింగ్ జరుగుతోంది... జోథ్‌పూర్, శ్రీనగర్, అదంపూర్ ఎయిర్‌పోర్టులు 30 రోజుల వరకు షట్‌డౌన్ అయ్యాయి... ప్రధాని మోడీ ముఖ్యమంత్రులతో సమావేశమయ్యారు... అజిత్ ధోవల్ ఒక హైలెవెల్ సెక్యూరిటీ మీటింగ్ కండక్ట్ చేశారు... డిఫెన్స్ మినిస్టర్ రాజ్‌నాథ్ సింగ్ మిగతా మంత్రులతో మీటింగ్ పెట్టారు...’ ఇవన్నీ ఒకే పేపర్‌లో వేర్వేరు పేజీల్లో వచ్చిన చిన్న చిన్న వార్తలు. కానీ వీటన్నిటినీ కనెక్ట్ చేస్తే ఏదో జరగబోతోందన్న అనుమానం కలగకమానదు. ఆర్మీ చీఫ్ జగన్నాథ్ టెంపుల్‌కి వెళ్లారు. మన ఎయిర్‌ఫోర్స్ చీఫ్ అమర్‌ప్రీత్ సింగ్ గురుద్వారాకు వెళ్లారు.

అసలు ఏం జరుగుతోంది..?

పశ్చిమాసియాలో యుద్ధం జరుగుతోంది. ఇటువంటి సంక్షోభంలో అందరూ యూనిటీతో ఉండాలని మోడీ పిలుపునిచ్చారు. సోమవారం మసూద్ అజర్ తమ్ముడు మొహమ్మద్ తాహిర్ అన్వర్‌ను ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు లేపేశారు. మార్చి 26న RAW అండ్ IB హెచ్చరికలు జారీ చేసింది. భారత్‌లోని బార్డర్ ఏరియాస్‌లో పెద్దఎత్తున పాకిస్తాన్ ఐడీ అటాక్స్ అండ్ ఒకేసారి డ్రోన్ స్ట్రైక్స్ లేదా సూసైడ్ అటాక్స్ ప్లాన్ చేస్తోందని చెప్పింది. లష్కరే ఆపరేటివ్ షబ్బీర్ అహ్మద్‌ను పోలీసులు మంగళవారం అరెస్ట్ చేసి విచారించారు. దేవాలయాలపై దాడి చేయడానికి కుట్ర చేస్తున్నామని ఒప్పుకున్నాడు. షబ్బీర్ అహ్మద్ బంగ్లాదేశ్ నుంచి కోల్‌కతాలో చొరబడ్డాడు.

పాకిస్తాన్ఇండియాపై ఎందుకు ఉగ్రదాడి చేయాలి అనుకుంటుందంటే.. ఇరాన్, USA మధ్య జరుగుతున్న యుద్ధంలో పాకిస్తాన్ , అమెరికా తరఫున మీడియేషన్ చేస్తోంది. ఫిబ్రవరి 28న ప్రపంచ వ్యాప్తంగా ఉన్న షియా ముస్లిమ్స్ మత గురువైన అలీ ఖమేనిని ఎవరు చంపారు? యూఎసఏ, ఇజ్రాయిల్ కలిసి చంపారు. బాధతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న షియా ముస్లిమ్స్ ప్రొటెస్ట్ చేశారు. పాకిస్తాన్‌లో ఉన్న షియా ముస్లిమ్స్ అక్కడున్న USA ఎంబసీస్‌పై దాడి చేశారు. పాక్‌లో ఉన్న షియా ముల్లాలు పాక్ ప్రభుత్వం పట్ల అసంతృప్తితో ఉన్నారు. అలీ ఖమేనీను చంపిన తర్వాత కూడా పాక్ ఇరాన్ తరఫున యుద్ధంలో దిగలేదు. USAతో పాక్ ఇంకా మంచి రిలేషన్స్‌ను మెయింటైన్ చేస్తోంది. నూర్‌ఖాన్ ఎయిర్‌బేస్, రావల్పిండిలో ఉన్న అమెరికన్ బేసెస్‌లో ఇంకా అమెరికన్ సైనికులు ఉన్నారు. ఇప్పుడు కూడా USA లాజిస్టిక్ కోసం పాకిస్తాన్‌ను వాడుకుంటుంది. పాక్ సున్నీ ప్రభుత్వం అలీ ఖమేనీను చంపిన డొనాల్డ్ ట్రంప్‌తో రాసుకు పూసుకు తిరుగుతుండడం షియా ముల్లాలకు నచ్చడం లేదు. అలీ ఖమేని మరణం తర్వాత పాకిస్తాన్ స్ట్రాంగ్‌గా స్టేట్మెంట్స్ ఏవి ఇవ్వలేదు. అమెరికా దౌత్యవేత్తలను పాకిస్తాన్ నుంచి గెంటేయలేదు. అలీ ఖమేని మరణం తర్వాత పాక్‌లో ఉన్న షియా ముస్లిమ్స్ తిరుగుబాట్లు చేశారు. ఈ సమయంలో 60 మంది షియా ముస్లిమ్స్ చనిపోయారు.

మీడియేషన్ పేరు మీద పాకిస్తాన్ ఇరాన్ సీక్రెట్స్‌ను అమెరికాకు లీక్ చేస్తోంది. పాకిస్తాన్ లాజిస్టిక్స్ USA కి ఇస్తే ఏమవుతుంది పాక్‌లో ఉన్న షియా ముల్లాలు గొడవకు దిగుతారు. ఈ షియా ముల్లాలను కన్‌ఫ్యూజ్ చేయాలి. ప్రజల దృష్టిని మళ్లించడానికి ఆఫ్ఘనిస్తాన్, ఇండియాపై దాడికి పాక్ ప్లాన్ చేస్తోంది. ఇప్పటివరకు భారత ప్రభుత్వం దీని గురించి ఎటువంటి కన్ఫర్మేషన్ ఇవ్వలేదు. పాక్ ఆర్మీ చీఫ్ అసిం మునీర్ గుంట నక్క తెలివితేటలు మన నాయకులకు కూడా తెలుసు. ఒకవేళ పాకిస్తాన్‌లో షియా ముల్లాలు తిరుగుబాటు చేశారనుకోండి.. వాళ్లను ఆపే దమ్ము పాకిస్తాన్ ఆర్మీకు లేదు. కాబట్టే ఇండియాపై ఉగ్రదాడికి ప్లాన్ చేస్తున్నారు. ఒకవేళ లష్కరే లేదా జైస్ ఎ మొహమ్మద్ ఇండియాపై ఉగ్రదాడి చేస్తే మనం కూడా ఆవేశంతో పాక్‌పై ప్రతిదాడి చేస్తాం. ముఖ్యంగా ఆపరేషన్ సింధూర్‌లో బహల్పూర్‌లో ఉన్న పాక్ మదరసాలపై దాడి చేసాం. దానికి ప్రతీకారంగా మసూద్ అండ్ హఫీజ్ ఇండియాలో ఏదో ఒక ఆపరేషన్ చేస్తారన్న ఇంటెలిజెన్స్ భోగట్టా మనకుంది. ఆ మేరకే బోర్డర్‌లో మనం అప్రమత్తంగా ఉన్నాం. మసూద్ అజర్ రీసెంట్‌గా వెయ్యి కంటే ఎక్కువ సూసైడ్ అటాక్ చేసేవారిని తయారు చేశాడు. ఇప్పుడు అమెరికా, ఇరాన్ వార్‌లో బిజీ అయి ఉంది. ఒకవేళ ఇండియాతో యుద్ధం జరిగితే అమెరికా డెఫినెట్‌గా పాకిస్తాన్‌కే సపోర్ట్ చేస్తుంది. ఎందుకంటే పాకిస్తాన్ జెండాతో షిప్ప్పుల్లో అమెరికన్ గూడ్స్‌ను హార్మోజ్ గుండా తరలిస్తున్నారు కాబట్టి. ఏదో జరగబోతుంది.. లేదంటే గత 48 గంటల నుంచి ఇన్ని మీటింగ్స్ జరగవు. ఇప్పుడు జియో పాలిటిక్స్ తారుమారయ్యాయి. కేవలం డాట్స్‌ను మాత్రమే కనెక్ట్ చేస్తే అర్థమైందిది. ఇలాగే జరగాలని లేదు. పాకిస్తాన్‌లో మాత్రం డెఫినెట్‌గా పాకిస్తాన్ ప్రజల దృష్టిని మళ్లించడానికి ఏదో ప్లానింగ్ జరుగుతోందనే న్యూస్ అయితే బయటికి వస్తోంది.

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page