హైమవతికి ‘త్రిసభ్య’ పొగ
- BAGADI NARAYANARAO

- 4 days ago
- 2 min read
పాత పనిష్మెంట్‌కు మళ్లీ కమిటీ నియామకం
వారంలో నివేదిక ఇవ్వాలని ఆదేశం

(సత్యంన్యూస్, శ్రీకాకుళం)
వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్‌తో ధిక్కార స్వరంతో మాట్లాడినందుకు టెక్కలి ఆర్డీవో కారాలయం ఏవో హైమవతిపై శాఖాపరమైన చర్యలు తీసుకోవడానికి ఉన్నతాధికారులు సిద్ధమవుతున్నారు. ఏవోకు సంబంధం లేని అంశంపై వివరణ కోరిన కలెక్టర్‌కు తాను బాధ్యురాల్ని కాదని చెప్పడం, అందుకు ఆయన సస్పెండ్ చేస్తానని హెచ్చరించడం, దాన్ని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నానని హైమావతి జవాబు ఇవ్వడాన్ని కలెక్టర్ సీరియస్‌గా తీసుకున్నారని రెవెన్యూ వర్గాల్లో చర్చ సాగుతుంది. ఇందులో భాగంగానే హైమవతిపై క్రమశిక్షణ చర్యలు తప్పవని తెలిసింది. వాస్తవానికి 22ఏ భూముల వ్యవహారానికి, ఆర్డీవో ఆఫీసులో ఏవోకు సంబంధం లేదు. దీంతో హైమవతి మందసలో తహసీల్దారుగా విధులు నిర్వహించిన సమయంలో వచ్చిన ఆరోపణలపై త్రిసభ్య కమిటీ వేశారు. ఈ కమిటీలో ముగ్గురు మహిళా అధికారులు శ్రీకాకుళం ఆర్డీవో ప్రత్యూష, బీసీ కార్పొరేషన్ ఈడీ గడ్డెమ్మ, కేఆర్‌సీసీ ఎస్‌డీసీ పద్మావతిని నియమిస్తూ కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. కమిటీ నివేదికను వారం రోజుల్లో సమర్పించాలని ఆదేశించినట్టు తెలిసింది. అయితే మందస తహసీల్దారుగా విధుల్లో ఉన్నప్ప్పుడు నియమించాల్సిన త్రిసభ్య విచారణ కమిటీని అక్కడి నుంచి బదిలీపై వచ్చిన ఆరు నెలల తర్వాత వేయడం కక్షసాధింపు చర్యగానే రెవెన్యూ అధికారులు భావిస్తున్నారు. వీడియో కాన్ఫరెన్స్‌లో ధిక్కార స్వరం వినిపించినందునే విచారణ పేరుతో కమిటీ వేశారని చర్చ రెవెన్యూ అధికారుల్లో నడుస్తుంది. మందసలో వచ్చిన ఆరోపణలపై కలెక్టర్ ఆమెను 50 రోజుల పాటు విధులకు దూరంగా ఉంచారు. ఆ కాలంలో రావాల్సిన వేతనం ఇప్పటికీ అందలేదని ఏవో హైమవతి చెబుతున్నారు. మందస తహసీల్దారుగా ఉద్దేశపూర్వకంగానే తనను తప్పించడానికి చేసిన ప్రయత్నాల్లో భాగంగానే అభియోగాలు మోపారన్నది ఆమె వాదన. అప్ప్పుడు ఏ కమిటీ లేకుండానే ఏకపక్షంగా నిర్ణయం తీసుకొని జీతం కూడా అందకుండా చేయడాన్ని ఇప్ప్పుడు ఆమె తెర మీదకు తెచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే.. ఆమె ఏవో పోస్టింగ్ కూడా కోర్టు కంటెంప్ట్ ద్వారా వచ్చిందే. ఇప్ప్పుడు మళ్లీ కమిటీ పేరుతో విచారణ అంటే.. తనను వేధిస్తున్నారన్న కోణంలో ఆమె కోర్టును ఆశ్రయించినా ఆశ్చర్యం లేదు. నిజంగా మందసలో ఆమె అధికార దుర్వినియోగానికి పాల్పడితే, అందుకు పనిష్మెంట్ పర్తయినట్టే. ఇప్ప్పుడు మళ్లీ ఆ కేసును తవ్వడం అనవసరం. ఇంత జరుగుతున్నా ఈ వ్యవహారంలో జిల్లా రెవెన్యూ అధికారుల సర్వీసుల సంఘం మాత్రం జోక్యం చేసుకోవడం లేదు. కలెక్టర్, తహసీల్దారు మధ్య వివాదంతో సంఘానికి సంuంధం లేనట్టే వ్యవహరిస్తున్నారు. దీనిపై రెవెన్యూ అధికారుల్లోనూ భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఏవో హైమవతి బాధ్యతారాహిత్యంగా వ్యవహరించారని కొందరు, వీఆర్వో స్థాయిలో 22ఏ పెండింగ్‌పై కలెÉక్టర్ లేవనెత్తిన అంశంతో ఏవో హైమవతికి ఏమిటి సంuంధం అంటూ మరికొందరు రెవెన్యూ అధికారులు ప్రశ్నిస్తున్నారు. ఉన్నతాధికారులు, రెవెన్యూ అధికారులు అసలు డ్యూటీ చార్టును వదిలేసి సమావేశాలు, వీడియో, ఆడియో కాన్ఫరెన్స్‌ల పేరుతో పని కాలయాపన జరుగుతుంటే క్షేత్రస్థాయిలో పనులెలా జరుగుతాయని ప్రశ్నించినవారూ లేకపోలేదు. త్రిసభ్య కమిటీ నివేదిక వచ్చిన తర్వాత హైమవతిపై తీసుకునే చర్యల మేరకు కార్యాచరణ ప్రకటిద్దామన్న ఆలోచనలో ఉద్యోగుల జేఏసీ ఉంది. సమావేశాల్లో హైమవతిని టార్గెట్ చేసి మాట్లాడడంతోనే మానసికంగా ఎదుర్కొంటున్న ఒత్తిడిని తట్టుకోలేక కలెక్టర్‌కు ఎదురు సమాధానం ఇచ్చినట్లు తెలుస్తుంది.






Comments