కుక్కలా.. మనుషులా.. ఎవరు ముఖ్యం?
- DV RAMANA

- Aug 13
- 2 min read

ఊరకుక్కలను వీధుల్లో ఉంచరాదని సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై జంతు ప్రేమికులు విరుచుకుపడుతున్నారు. ఢల్లీి ఎన్‌సీఆర్ ప్రాంతంలో వీధి కుక్కల బెడదకు సంబంధిం చిన కేసులో తీర్పునిచ్చిన న్యాయమూర్తులకు జాలి, దయ, కరుణ లేవా? అని ప్రశ్నిస్తున్నారు. కుక్కలు కూడా మనుషుల్లాంటివేనని.. వాటికీ ఈ సమాజంలో జీవించే హక్కు ఉందని, కానీ నోరు లేని విశ్వాసపాత్రమైన ఆ జీవులను నిర్దయగా ఊరవతలికి తరిమేసి.. షెల్టర్లలో నిర్బంధించమనం తీవ్ర అన్యాయమని ఆక్రోశిస్తున్నారు. కానీ అవే కుక్కలు వీధుల్లో స్వైరవిహారం చేస్తూ మనుషులపై పడి పిక్కలు పీకేయడం, తీవ్ర గాయాల పాల్జేస్తుంటే మాత్రం స్పందించరు. గుంపులు గుంపులుగా తిరుగుతూ ఆ ప్రాంతం తమదే అన్నట్లు గ్రామసింహాలు రెచ్చిపోతున్న ఘటనలు ఒక్క ఢల్లీిలోనే కాకుండా దేశంలోని ప్రతి గ్రామం, పట్టణంలోనూ కనిపిస్తాయి. వాటి మానాన అవి తిరిగితే ఏ గొడవా ఉండదు.. ఎవరికీ ఇబ్బంది ఉండదు. కానీ ఆ మార్గంలో మనుషులు వెళితే చాలు.. ఒక్కుమ్మడి వారి వెంటపడతాయి. భయపడి వారు పరుగులు తీస్తే మీద పడి కండలు పీకేస్తాయి. ఇక ద్విచక్ర వాహనదారులు ఈ శునక సమూహాల దాడి నుంచి తప్పించుకునేందుకు ఒక్కసారిగా వాహనాల స్పీడు పెంచి ప్రమాదాల పాలవుతున్న ఘటనలు కూడా ఉన్నాయి. అలాగే ఇళ్ల ముంగిట ఉన్న ముక్కుపచ్చలారని పసిపిల్లలను కుక్కలు నోటకరుచుకుని ఈడ్చుకుపోతున్న ఉదంతాలు ఇటీవలి కాలంలో చాలానే జరుగుతున్నాయి. టీకాలు వేయని కుక్కల కాటుకు గురైనవారు ర్యాబిస్ వ్యాధి బారిన పడుతున్నవారు పెద్దసంఖ్యలో మరణిస్తున్న సో కాల్డ్ జంతు ప్రేమికులు ఏమాత్రం స్పందించరు. కుక్కలను ఏమీ చేయవద్దని ప్రచారం చేస్తారే తప్ప.. వాటివల్ల మనుషులకు జరుగు తున్న హాని గురించి మాట్లాడరు. నిజమే.. మనుషుల్లాగే కుక్కలు కూడా జీవులే. వాటికీ జీవించే హక్కు, స్వేచ్ఛ ఉన్నాయి. కానీ వాటి వల్ల ఎవరికీ ఎటువంటి ప్రమాదం లేనప్పుడు.. వాటిని ఎవరూ ఏమీ అనరు. పట్టించుకోరు. కానీ కుక్కలు మీద పడి కరిచేస్తుంటే, ప్రాణాలు తీస్తున్నా కూడా వాటిని ఏమీ అనకుండా పోనీలే వదిలేయడం, వాటి మానానా అవే పోతాయిలే అనుకోవడం.. తనకు మాలిన ధర్మమే అవుతుందన్నది ఈ జంతు ప్రేమికులకు అర్థం కాదు. అంతెందుకు.. సాటి మనుషులెవరైనా తమ మీదికి దాడికి వస్తే.. దాడి చేసి గాయపరిస్తే.. వీరు ఊరుకుంటారా? ఎంతమాత్రం కాదన్నది వాస్తవం. తమ శక్తికి మించి ఎదుటి వ్యక్తుల దాడి నుంచి తప్పించేందుకు ప్రయత్నిస్తారు. అది కుదరనప్పుడు ఎదురుదాడికి దిగి వారిని కొట్టడానికి ప్రయత్నిస్తారు. దీన్నే ఆత్మరక్షణ అంటారు. సాటి మనిషి విషయంలోనే ఇలా ప్రవర్తించినప్పుడు.. కుక్కలు దాడికి పాల్పడి, ప్రాణాలు తీస్తున్నా వీలైన రక్షణ చర్యలు తీసుకోకుండా వాటిని అలాగే స్వేచ్ఛగా వీధుల్లో తిరగ నివ్వాలనడం ఏం న్యాయమో జంతు ప్రేమికులు ఆలోచించాలి. ఈ కేసులో జస్టిస్ జెబి పార్దివాలా, జస్టిస్ ఆర్.మహదేవన్‌లతో కూడిన ధర్మాసనం కూడా ఇచ్చిన తీర్పు ఏమాత్రం నిర్హేతుకంగా, అస మంజసంగా లేదు. వీధికుక్కలను ‘కనిపిస్తే కాల్చివేయండి’ అని ఆదేశించలేదు. అసలు వీధికుక్క లను జనావాసాల నుంచి పూర్తిగా తరిమికొట్టాలని, నాశనం చేయాలని అసలు చెప్పలేదు. వాటిని జనావాసాలకు వీలైనంత దూరంగా ఉంచాలని మాత్రమే నిర్దేశించింది. కుక్కల కోసం పరితపిస్తున్న జంతు ప్రేమికులు.. రేబిస్ బారిన వారిని ఆదుకోగలరా? ఆ వ్యాధితో మరణించినవారిని వెనక్కి తీసుకురాగలరా? అని ధర్మాసనం సూటిగా ప్రశ్నించడంలో ఏమాత్రం తప్పులేదు. పట్టుకున్న వీధికుక్కలను డాగ్ షెల్టార్లకు తరలించి ఆశ్రయం కల్పించాలని, అక్కడ వాటిని పట్టుకొని స్టెరి లైజేషన్ చేయించడం ద్వారా వాటి సంతతి పెరగకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. వాటికి రోగనిరోధక శక్తి అందించే నిపుణులను అందుబాటులో ఉంచాలని, షెల్టర్ల నుంచి కుక్కలను బయటకు వదలకూడదని, అవి తప్పించుకోకుండా చూసుకోవడానికి కాపలా పెట్టడంతో పాటు, సీసీటీవీలు ఏర్పాటు చేయాలని కోర్టు ఆదేశించింది. కుక్క కాటు కేసుల కోసం ఒక హెల్ప్‌లైన్‌ను ప్రారంభించాలని కూడా అధికారులకు సూచించింది. అయినా కోర్టు వాటి జీవిక హక్కును హరిం చేసినట్లు జంతు ప్రేమికులు.. ముఖ్యంగా సెలబ్రిటీలు గగ్గోలు పెడుతున్నారు. స్వయంగా అనుభ విస్తే తప్ప వారికి వీధికుక్కలతో ఎంత బాధో అర్థం కాదు.










Comments