top of page

కంచిలి కేసు కంచికేనా!

  • Writer: BAGADI NARAYANARAO
    BAGADI NARAYANARAO
  • 14 hours ago
  • 3 min read
  • ఏసీబీ దాడులపై డీజీపీకి నివేదిక

  • మరోవైపు విచారణకు త్రిసభ కమిటీ ఏర్పాటు

  • ఆరోపణలు ఎదుర్కొంటున్నవారే సభ్యులట!

  • రాజకీయంగానూ కేసును నీరుగార్చే యత్నాలు

(సత్యంన్యూస్, శ్రీకాకుళం)

ఇటీవలి ఏసీబీ దాడి కేసు కథను కంచికి పంపేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఆ మేరకు కొందరు రాజకీయ నాయకులతోపాటు కలెక్టరేట్ అధికారుల స్థాయిలో మంతనాలు జరుగుతున్నట్లు తెలిసింది. గత నెల 28న కంచిలి ఏబీసీడబ్ల్యూవో కార్యాలయంలో 11 వసతి గహాల నుంచి వసూలు చేసిన రూ.1.84 లక్షల నెలవారీ మామూళ్ల సొమ్మును ఐదుగురు వార్డెన్ల ఏబీసీడబ్ల్యూవో బాలముకుందరావుకు ఇవ్వగా ఏసీబీ అధికారులు దాడి చేసి పట్టుకున్న విషయం తెలిసిందే. కానీ ఈ కేసులో ఎవరినీ అదుపులోకి తీసుకోలేదు. నిబంధనల ప్రకారం స్వాధీనం చేసుకున్న మొత్తం రూ.50 వేలకంటే తక్కువగా ఉంటే చార్జ్ మెమో దాఖలు చేసి బాధ్యుడిని ఏసీబీ డీఎస్పీ స్థాయిలో అదుపులోకి తీసుకోవచ్చు. అయితే ఈ కంచిలిలో రూ.1.84 లక్షలు దొరకడంతో ఆ కేసు డీఎస్పీ పరిధి దాటి ఏసీబీ డీజీపీ పరిధిలోకి వెళ్లిపోయింది. స్వాధీనం చేసుకున్న నగదుతో పాటు వార్డెన్లు, ఏబీసీడబ్ల్యూ ఇచ్చిన వాంగ్మూలాలతో కూడిన నివేదికను డీజీపీ పంపి తదుపరి ఆదేశాల కోసం ఎదురుచూస్తున్నారు. కానీ ఈలోగానే కేసు తీవ్రతను తగ్గించడానికి లేదా పూర్తిగా నీరుగార్చడానికి రాజకీయ ప్రయత్నాలు మొదలయ్యాయని సమాచారం. స్వాధీనం చేసుకున్న నగదును తక్కువ చేసి చూపించడం ద్వారా నిందితులకు ఊరట కలిగించేలా ఇచ్ఛాపురానికి చెందిన టీడీపీ నాయకులు ప్రయత్నిస్తున్నట్లు తెలిసింది. బాలముకుందరావుపై ఇప్పటివరకు ఎలాంటి చార్జ్‌మెమోలు లేవు. విధి నిర్వహణలోనూ నిక్కచ్చిగా వ్యవహరిస్తారని ఆ శాఖ అధికారులే చెబుతున్నారు. కానీ డైట్ బిల్లులు జమ చేసిన తర్వాత ప్రతి వసతి గహం నుంచి నెలవారీ మామూళ్లు డీబీసీడబ్ల్యూవోకు ఇవ్వాల్సిందే. వీటిని ఏబీసీడబ్ల్యూవో ద్వారానే వసూలు చేయించి వాటాలు పంచుకుంటారు. హాస్టళ్లలో ఉండే ప్రతి విద్యార్థి తýకు రూ.50 చొప్పున లెక్కగట్టి వసూలు చేస్తుంటారు. ఆ విధంగా సోంపేట డివిజన్ పŸరిధిలోని 11 వసతి గహాల నుంచే రూ.1.84 వసూలు చేశారంటే జిల్లా మొత్తం మీద ఎంత ఉంటుందో అర్థం చేసుకోవచ్చు.

విచారణకు త్రిసభ్య కమిటీ

ఏసీబీ దాడులపై స్పందించిన కలెక్టర్ స్వప్నిల్ దినకర్ శాఖాపరమైన విచారణకు ఆదేశించారు. బీసీ సంక్షేమశాఖ అధికారి స్థాయి నుంచి హాస్టళ్ల వరకు జరుగుతున్న అవినీతిపై వారం రోజుల్లో సమగ్ర నివేదిక ఇవ్వాలని ఆదేశిస్తూ ముగ్గురు సభ్యుల కమిటీని ఏర్పాటు చేశారు. కమిటీలో సాంఘిక సంక్షేమశాఖ డీడీ, టెక్కలి మైన్స్ డీడీ, జిల్లా ఫారెస్ట్ సెటిల్‌మెంట్ అధికారి ఉన్నారు. సభ్యుల నియామకంతోనే నివేదికలో వాస్తవాలు ఎంతవరకు ఉంటాయన్న అనుమానాలు రేకెత్తుతున్నాయి. ఎఫఎస్‌వో మినహా మిగతా ఇద్దరు అధికారులు బీసీ సంక్షేమ శాఖకు మించి అవినీతికి పాల్పడుతున్నవారేనన్న ఆరోపణలు ఉన్నాయి. సాంఘిక సంక్షేమ శాఖ హాస్టళ్లలో కూడా విద్యార్ధుల సంఖ్యను బట్టి నెలవారీ వసూళ్లు చేసే సంస్కతి ఉంది. అవినీతి అక్రమాల్లో బీసీ సంక్షేమశాఖకు ఏమాత్రం తీసిపోని చరిత్ర సాంఘిక సంక్షేమశాఖదన్న ఆరోపణలు ఎప్పటినుంచో ఉన్నాయి. గతంలో ఈ శాఖ జిల్లా అధికారులపై ఎలాంటి ఆరోపణలు వినిపించాయో ప్రస్తుత అధికారిపైనా అలాంటివే ఉన్నాయి. అలాంటి అధికారిని బీసీ సంక్షేమ శాఖ అవినీతిపై విచారణ బాధ్యత అప్పగించడం విస్మయం కలిగిస్తోంది. కమిటీలో మరో సభ్యుడైన టెక్కలి మైన్స్ ఏడీ పనితీరుపైనా ఆ డివిజన్ మైనింగ్ వర్గాల్లో అనేక ఆరోపణలు, విమర్శలున్నాయి. వసూళ్లకు పాల్పడుతూ పలాస, టెక్కలి ప్రాంతాల్లో గ్రావెల్ క్వారీల అక్రమ తవ్వకాలను పట్టించుకోవడంలేదన్న ఆరోపణలు ఉన్నాయి. ఇకపోతే వైద్య ఆరోగ్యశాఖలో ఏఎనఎంల సమస్యకు పరిష్కారం చూపించగలిగారన్న భావనతో ఎఫఎస్‌వో లావణ్యను ఈ కమిటీలో సభ్యురాలిగా నియమించారు. మొత్తం మీద ఈ త్రిసభ్య కమిటీ వల్ల ఒరిగేదేమీ ఉండదన్న అభిప్రాయమే వినిపిస్తోంది.

కాపాడుతున్నది వారే..

మరోవైపు బీసీ సంక్షేమశాఖ అవినీతి అధికారులను కలెక్టరేట్ అధికారులే కాపాడుతున్నారని విమర్శలు ఉన్నాయి. కారుణ్య నియామకాలు, పదోన్నతులు, బదిలీలు, డిప్యూటేషన్లు, వార్డెన్లకు ఇన్‌ఛార్జి బాధ్యతలు కట్టబెట్టడం, నిధులు వినియోగం, డైట్ బిల్లులు చెల్లింపులు తదితర వ్యవహారాల్లో అవినీతి జరుగుతున్నదన్న ఆరోపణలపై స్పందించకపోగా బీసీ సంక్షేమశాఖ అధికారినే వెనకేసుకొచ్చిన కలెక్టరేట్ అధికారులు ఇప్పుడు ఆ శాఖ అవినీతిపై కమిటీ వేయడంపై అధికారవర్గాలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నాయి. బీసీ సంక్షేమశాఖ అవినీతిలో కూరుకుపోయిందని పత్రికల్లో తరచూ కథనాలు వస్తున్నా ఉన్నతాధికారులు పట్టించుకోలేదు. ఫిర్యాదులు వచ్చినా డీఆర్‌వోకు విచారణ బాధ్యత అప్పగించడం తప్ప చర్యలు మాత్రం శూన్యం. అలాంటిది ఇప్పుడు కమిటీ వేసినా బీసీ సంక్షేమశాఖ అధికారులను కాపాడే ప్రయత్నం తప్పితే ఒరిగేది ఏమీ లేదని విమర్శలు ఉన్నాయి. డీబీసీడబ్ల్యూవోకు వ్యతిరేకంగా మాట్లాడేందుకు ఆ శాఖలో ఎవరూ ఇష్టపడరు. ఏసీబీ దాడి అనంతరం ఇన్‌ఛార్జి ఏబీసీడబ్ల్యూవోగా ఇద్దరు వార్డెన్లకు అవకాశం కల్పించినా వారు నిరాకరించినట్టు తెలిసింది. కంచిలి వార్డెన్ ఉపేంద్ర డిప్యూటేషన్ రÁద్దు చేస్తే తప్ప ఏబీసీడబ్ల్యూవోగా బాధ్యతలు తీసుకోలేమని వారు షరతు పెట్టినట్లు తెలిసింది. అయితే ఉపేంద్ర డిప్యూటేషన్‌ను రద్దు చేస్తే ఆయన బ్లాక్‌మెయిల్ చేస్తారన్నది డీబీసీడబ్ల్యూవో భయమని ఆ శాఖలో ప్రచారం జరుగుతోంది. బొరివంకలోని డీబీసీడబ్ల్యూవో సొంతింటి నిర్మాణానికి ఉపేంద్ర టైల్స్ ఇచ్చినందుకు రాజపురం వసతి గహానికి, గహప్రవేశ ఫంక్షన్ ఏర్పాట్లు చేసినందుకు కతజ్ఞతగా ఎంఎస్‌పల్లి హాస్టల్ ఇన్‌ఛార్జి బాధ్యతలను ఉపేంద్రకు కట్టబెట్టినట్లు ఎప్పటి నుంచో ప్రచారం ఉంది. ఏసీబీ సోదాల తర్వాత బీసీ సంక్షేమ శాఖపై విమర్శలు పెరగడంతో దానికి కారణమని భావిస్తున్న ఉపేంద్రకు డిప్యూటేషన్ రద్దు చేస్తారని అందరూ భావించారు. కానీ డీబీసీడబ్ల్యూ వో మాత్రం ఉపేంద్ర తనను బ్లాక్‌మెయిల్ చేసి ఇరికిస్తాడన్న భయంతో ఉపేక్షిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఒకవైపు ఏసీబీ డీజీకి ఇచ్చిన నివేదిక, మరోవైపు ముగ్గురు కమిటీ సభ్యులు విచారణ ఎవరిని రక్షిస్తాయో.. ఎవరిపై వేటు వేస్తాయో రెండు రోజుల్లో తేలనుంది.

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page