కేజీబీవీ ప్రిన్సిపాల్ సౌమ్య ఆత్మహత్యాయత్నం
- BAGADI NARAYANARAO
- 5 days ago
- 1 min read
రిమ్స్‌లో చికిత్స అందిస్తున్న వైద్యులు

(సత్యంన్యూస్, శ్రీకాకుళం)
పొందూరు కేజీబీవీ ప్రిన్సిపాల్ సౌమ్య సోమవారం డీసీసీబీ కాలనీ తిలక్‌నగర్‌లోని తన నివాసంలో ఆత్మహత్యకు యత్నించారు. ఒక టీవీ చానల్ ఆమెను ఇంటర్వ్యూ చేస్తుండగా పక్కకు ఒరిగిపోయారు. హుటాహుటిన సౌమ్యను ఆమె కారు డ్రైవర్, వంట మనిషి కలిసి రిమ్స్‌కు తరలించారు. అపస్మారక స్థితిలో ఉన్న ఆమెను పరీక్షించిన వైద్యులు మోతాదుకు మించి నిద్రమాత్రలు వేసుకుందని, ప్రస్తుతం ఆరోగ్యం నిలకడగానే ఉన్నా అపస్మారక స్థితిలో ఉన్నట్టు తెలిపారు.
వివరాల్లోకి వెళితే.. ఆమదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్ వేధింపులకు గురిచేస్తూ అకారణంగా కంచిలి బదిలీ చేయించారని ఇటీవల ఆమె దళిత సంఘాలతో కలిసి ఆందోళన చేశారు. కూన రవికుమార్ వల్ల తనకు, తన కుటుంబానికి ప్రాణహాని ఉందని రెండు రోజులుగా ఆరోపిస్తున్నారు. ఈ వివాదంపై రాష్ట్రవ్యాప్తంగా సోషల్ మీడియాలో తీవ్ర రచ్చ సాగుతోంది. దీనిపై ఆదివారం సీఎం చంద్రబాబు ఆరా తీసి ఆగ్రహం వ్యక్తం చేసినట్లు ప్రధాన స్రవంతి మీడియాలో కూడా వార్తలొచ్చాయి. ఇంతలోనే సౌమ్య ఆత్యహత్యకు ప్రయత్నించడం చర్చనీయంశంగా మారింది. సామాజిక మాధ్యమాల్లో సౌమ్యను టీడీపీ శ్రేణులు ట్రోల్ చేయడంతో పాటు, బెదిరింపులకు పాల్పడడంతోనే ఆత్యహత్యకు యత్నించినట్లు కుటుంబ సభ్యులు ‘సత్యం’తో పేర్కొన్నారు. ప్రస్తుతం సౌమ్య రిమ్స్ ఎమర్జన్సీ వార్డులో చికిత్స పొందుతున్నారు.
Comentarios