top of page

కంత్రీలను సాగనంపే తంత్రం

  • Writer: Prasad Satyam
    Prasad Satyam
  • 4 days ago
  • 3 min read
  • సమగ్రశిక్షలో రాష్ట్రవ్యాప్త ప్రక్షాళన మంత్రం

  • శ్రీకాకుళం అనుభవాలతో ఇక్కడినుంచే శ్రీకారం

  • స్వయంగా రంగంలోకి దిగిన మంత్రి లోకేష్

  • బదిలీవేటుతో అక్రమార్కుల బెదిరింపులు

  • వారు తిరిగి రాకుండా గేట్లు ముసేసిన కలెక్టర్

  • సచివాలయాల నుంచి డిప్యూటేషన్‌పై ఆ స్థానాలు భర్తీ

(సత్యంన్యూస్, శ్రీకాకుళం)

సమగ్రశిక్ష ప్రాజెక్టులో రాష్ట్రవ్యాప్తంగా ప్రక్షాళన ప్రారంభమైంది. స్వయంగా విద్యాశాఖ మంత్రి నారా లోకేషే ఇందుకు నడుం బిగించడం శుభసూచకం. 2014`19 మధ్య లోకేష్ మంత్రిగా ఉన్నప్ప్పుడు ప్రస్తుత సమగ్రశిక్ష రాష్ట్ర ప్రాజెక్టు డైరెక్టర్(ఎస్పీడీ) శ్రీనివాస్ ఆయన వద్ద పని చేశారు. ఇప్ప్పుడు వీరిద్దరి కాంబినేషన్‌లో సమగ్రశిక్షలో సమÖల మార్పులకు శ్రీకారం చుట్టారు. దీనికి శ్రీకాకుళం వేదిక కావడం, మన కలెక్టర్ పుండ్కర్‌కు స్థానం దక్కడం విశేషం. సమగ్రశిక్ష ప్రాజెక్టు చాలా ఏళ్లుగా పని చేయని ఉద్యోగులకు పునరావాస కేంద్రంగా మారిపోయింది. ఈ ప్రాజెక్టు జిల్లా విభాగాలకు ఏపీసీలుగా ఎవరో ఒకరు రావడం.. వారికి అవగాహన లేకపోవడంతో చాలా జిల్లాల్లో కిందిస్థాయి సిబ్బంది ఆడిందే ఆట, పాడిందే పాటగా తయారైంది. ఈ శాఖలో ఎప్ప్పుడు ఉద్యోగాలు భర్తీ చేసినా, బదిలీలు చేసినా, పదోన్నతులు కల్పించినా పత్రికల్లో పతాక శీర్షికలకు ఎక్కకుండా జరగలేదు. దీనికి కారణం.. ప్రాజెక్టు ప్రారంభమైనప్పటి నుంచీ పాతుకుపోయిన సిబ్బందే. పీఎంశ్రీ, పీఎం జన్‌మన్, కేజీబీవీ వంటి ప్రతిష్టాత్మకమైన పథకాలు అమలు చేస్తున్న ఈ సంస్థలో ఉద్యోగులు మాత్రం ప్రభుత్వ ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేయడంలేదు.. టార్గెట్లు చేరుకోవడంలేదు. ఇప్ప్పుడు అటువంటివారందర్నీ ఏరేసే కార్యక్రమం మొదలైంది. దీనికి శ్రీకాకుళం వేదికైంది.

కాంట్రాక్టర్ల సహాయ నిరాకరణ

కేంద్ర ప్రభుత్వ నిధులతో నిర్ధిష్ట పాఠశాలల్లో గార్డెన్ కిచెన్ దగ్గర్నుంచి ప్రహరీ, ర్యాంపుల వరకు సకల సౌకర్యాలు ఏర్పాటు కు పీఎంశ్రీ కింద మంజూరు చేసిన నిధులతో ఏమేరకు పనులు పూర్తిచేశారో తెలుసుకుందామని గత ఏడాది డిసెంబరు చివరిలో స్టేట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ శ్రీనివాస్ సమీక్ష నిర్వహించారు. అయితే దీనికి జిల్లా నుంచి ఏడుగురు సైట్ ఇంజినీర్లు హాజరుకాకపోగా.. వర్క్ ప్రొగ·స్‌పై సరైన సమాధానం కూడా ఇవ్వలేదు. దీంతో వారందర్నీ అల్లూరి సీతారామరాజు మన్యం, పార్వతీపురం మన్యం జిల్లాలకు బదిలీ చేశారు. అయితే తమను కాదని ఇక్కడ ఉద్యోగం చేయలేరని, కొద్ది రోజుల్లో మళ్లీ తామే వస్తామని ఈ విభాగంలోని కంత్రీత్రయం కాంట్రాక్టర్లను భయపెట్టడంతో నెల రోజుల క్రితం జిల్లాలో సమగ్రశిక్షకు చెందిన అన్ని నిర్మాణ పనులు ఆగిపోయాయి. మొదట్నుంచీ వీరే ఏఈలు, డీఈలు, ఈఈలు కావడంతో సంబంధిత కాంట్రాక్టర్లు కూడా ఏదో ఒకరోజు రాజకీయ పలుకుబడితో ఇక్కడికే వస్తారని, వారి మాట కాదని, పనులు చేపట్టడం అనవసరమని.. ఏపీసీలు వస్తుంటారు, పోతుంటారు కానీ.. కంత్రీ త్రయం మాత్రం శాశ్వతమనే భావనతో పనులు చేయకుండా చేతులెత్తేశారు. ముఖ్యమంత్రితో కలెక్టర్ల సమావేశానికి డేట్ నిర్ణయించినప్ప్పుడు జిల్లాలో వివిధ శాఖల పనితీరును కలెక్టర్ దినకర్ తెలుసుకుంటున్న క్రమంలో సమగ్రశిక్షలో కాంట్రాక్టర్ల సహాయ నిరాకరణ జరుగుతున్నట్లు తేలింది. రెండు మన్యం జిల్లాలకు ఏడుగురు బదిలీ కావడంతో ఇక్కడి పనులు నిలిచిపోయాయని, వారు తెర వెనుక భయపెడుతున్నారని గ్రహించిన కలెక్టర్ ఉన్నఫళంగా పంచాయతీరాజ్ అసిస్టెంట్ ఇంజినీర్లను డిప్యూటేషన్‌పై వారి స్థానంలో నియమించారు. సచివాలయాలకు ఏఈలుగా వచ్చి ప్రస్తుతం అక్కడ పని లేకుండా ఉన్నవారిని పంపాలని కలెక్టర్ కోరడంతో ఎనిమిది మంది ఏఈలు సమగ్రశిక్షకు డిప్యూట్ అయ్యారు. దీంతో మన్యం జిల్లాలకు పనిష్మెంట్ మీద బదిలీ అయినవారు ఇంత వేగం వెనక్కి వచ్చే పరిస్థితి లేదని గ్రహించిన తర్వాతే కాంట్రాక్టర్లు పనులను పట్టాలెక్కించారు. జవాబుదారీతనం లేకుండా వేల కోట్ల విలువైన సివిల్ పనుల పురోగతిపై జనవరి 28న ఒక సమావేశం జరిగితే, ఈ ఏడుగురూ హాజరుకాలేదు. అలాగే లీప్ యాప్ ద్వారా వీరు విధులకు సక్రమంగా హాజరుకాలేదని కూడా తేలింది. అయితే దీని మీద చర్యలేమిటనేది పక్కన పెడితే ప్రస్తుతానికి బదిలీ చేసి పంపించారు. ఈ`బిల్లుల రూపకల్పన, ఎంబుక్ నమోదులో వీరు తీవ్ర జాప్యం చేయడం వల్ల కేంద్రం నుంచి మంజూరైన రూ.9 కోట్లు సకాలంలో ఖర్చుకాక వెనక్కు మళ్లాయి. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకునే వీరిని మన్యంగిరులు పట్టించారు. సమగ్రశిక్షలో ఇంజినీర్లుగా ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులే ఉన్నారు. ఇప్ప్పుడు వారి స్థానంలో సచివాలయ ఇంజినీర్లను నియమించడం వల్ల అకౌంటబిలిటీ పెరుగుతుంది. అలాగే కొత్తగా వచ్చారు కాబట్టి పని చేయాలన్న నిబద్ధత కూడా ఉంటుంది. ఏజెన్సీ ప్రాంతాల్లో గిరిజన విద్యార్థుల కోసం మంజూరైన రూ.133 కోట్ల పీఎం జన్‌మన్ నిధులు, అలాగే పీఎంశ్రీ పాఠశాల నిర్మాణ పనులు, ఈ`బిల్లింగ్ ఇప్ప్పుడు వేగవంతమయ్యాయి.

ఒకరి బిల్లులు మరొకరి ఆమోదం

సమగ్రశిక్షలోనైనా, మరోచోటైనా ఏఈ అనేవాడు వర్క్ రికార్డ్ చేస్తాడు. డీఈ ఆ వర్క్‌కు చెక్ మెజర్మెంట్ ఇస్తాడు. ఈఈ సూపర్ చెక్‌తో పాటు బిల్ పాస్ ఆర్డర్ వేస్తారు. అయితే మన కంత్రీ త్రయంలో ఇద్దరు ఏఈలుగానే ఉంటూ పొలిటికల్ ఇన్‌ఫ్లూయెన్స్‌తో డిప్యూటీ ఈఈలుగా అవతారమెత్తి అదనపు బాధ్యతలు ఎత్తుకొని ఎక్కడా పనులు కాకుండా, ఒకవేళ చేస్తే పర్సంటేజీలు మాట్లాడుకొని వ్యవస్థను భ్రష్టుపట్టించేశారు. విడ్డూరమేమిటంటే.. సూపర్‌చెక్ చేయాల్సిన ఈఈ లేదా డిప్యూటీ ఈఈ క్యాడర్‌లో ఉన్న రామానంద్, పట్టాభిరామారావులు ఒకరి పనులను ఒకరు సూపర్‌చెక్ చేసినట్లు రికార్డుల్లో చూపించుకొని నిధులు ఆరగించేశారన్న ఆరోపణలు ఉన్నాయి. వైస్‌వెర్సాగా సాగిన ఈ దోపిడీలో ఒకరి పనులకు ఒకరు సర్టిఫికెట్లు ఇచ్చుకొని బిల్లులు విత్‌డ్రా చేసేశారన్నమాట. ఇప్ప్పుడు వీటన్నింటిపైనా సమగ్రమైన విచారణ జరుగుతుంది. అలాగే ఈ నెల 15న రాష్ట్రవ్యాప్తంగా సమగ్రశిక్షలో పని చేస్తున్న ఉద్యోగుల సర్టిఫికెట్ల వెరిఫికేషన్ మొదలుకానుంది. ఫేక్ సర్టిఫికెట్లు పెట్టినవారు ఇంటికెళ్లిపోవడం ఖాయం. వారి స్థానంలో శ్రీకాకుళం మాదిరిగానే సచివాలయంలో ఉన్న గ్రేడ్`2 ఏఈలను దిగుమతి చేసుకోనున్నారు.

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page