top of page

కేసీఆర్‌తో అలా.. బాబుతో ఇలా.. ఎందుకు రేవంత్‌?

  • Writer: DV RAMANA
    DV RAMANA
  • Jul 25, 2025
  • 2 min read

చంద్రబాబు టూ ఇన్‌ వన్‌ మనిషి. రాజకీయాల్లో పాదరసంలాంటివారు. విలువల గురించి మాట్లాడుతూనే తనకు అవసరమైనప్పుడు వాటిని నిర్మొహమాటంగా పక్కన పెట్టేసి.. తనకు నచ్చేదే, ప్రయోజనం చేకూర్చేదే చేస్తారు. అందులోంచి వచ్చిందే తెలంగాణ సమాజం, తెలుగువారి సమైక్యత అనే రెండు కళ్ల సిద్ధాంతం. ఇప్పటికీ దాన్నే ఆయన పాటిస్తున్నట్లుంది. తెలంగాణలో ప్రస్తుతం అధి కారం చెలాయిస్తున్న పార్టీ తన ప్రత్యర్థే అయినా ఆ ప్రభుత్వాన్ని నడిపిస్తున్నది తన అనుంగు శిష్యుడు రేవంత్‌రెడ్డి కావడంతో చంద్రబాబు పరోక్షంగా సహకరిస్తున్న సూచనలు కనిపిస్తున్నాయి. బనకచర్ల వంటి రెండు రాష్ట్రాల మధ్య వివాదాస్పద అంశాలపై తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డిని ఇర కాటంలో పెట్టేలా వ్యవహరిస్తున్నట్లు చంద్రబాబుపైకి కనిపిస్తారు. ఆ కలరింగ్‌ ఇచ్చేలా మాట్లాడు తుంటారు. తన రెండు కళ్ల సిద్ధాంతం తెలంగాణ ప్రజల మనసుల్లో ఇంకా పచ్చిగానే ఉందని, అధికారం కోల్పోయిన బీఆర్‌ఎస్‌ ఇప్పుడు మళ్లీ దాన్ని తెరపైకి తెస్తోందని తెలిసి కూడా తన పూర్వ సహచురుడు రేవంత్‌ను రాజకీయంగా ఇబ్బంది కలిగించేవిధంగా మాట్లాడకూడదనే పట్టింపు చంద్ర బాబుకు ఏమాత్రం లేదు. అలాగని.. అలాగని శత్రువుగానూ పరిగణిస్తున్నారనుకుంటే పొరపాటే. కొన్ని పరిణామాలను గమనిస్తే ఈ వాదనలో నిజముందని నమ్మకతప్పదు. దీన్ని గుర్తించినా రేవంత్‌, చంద్రబాబుల విషయంలో జనం ఇప్పటికిప్పుడు ఒక నిర్ణయానికి రాకపోవచ్చు గానీ.. రేవంత్‌కు వ్యతిరేకంగా నిర్మితమయ్యే జనాభిప్రాయంలో అది ఒక ముఖ్యమైన అంశం కావచ్చు. ఆ బీజం ఇప్పటికే పడిరది. ఇలాంటివాటిని జనం నమ్ముతున్నారా లేదా అన్నది అలోచించాల్సిన అవసరముంది. అటువంటి ఆలోచనల కారణంగానే కాంగ్రెస్‌ సీఎం రేవంత్‌కు, కేంద్ర ప్రభుత్వానికి మధ్య ఉన్న సంబంధాల గురించి ఇప్పటికే కొన్ని ‘ఇంప్రెషన్స్‌’ ఏర్పడ్డాయి. కేంద్ర ప్రభుత్వ పెద్దలను రేవంత్‌ తరచూ కలవడం, వారు కూడా అడిగిన వెంటనే అపాయింట్‌మెంట్‌ ఇవ్వడం చర్చకు తావి స్తున్నాయి. రాష్ట్ర ప్రయోజనాల కోసం కేంద్ర పెద్దలతో రేవంత్‌ కలుస్తున్నారని సమర్థించుకున్నా.. ఆయన విషయంలో తెలంగాణ బీజేపీ కూడా మృదువుగా వ్యవహరిస్తుండటం పలు రకాల ఊహా గానాలకు ఆస్కారమిస్తోంది. ఇతర రాష్ట్రాల్లోని ప్రతిపక్ష ప్రభుత్వాలను ముప్పుతిప్పలు పెడుతున్న కేంద్రం.. రేవంత్‌ నేతృత్వంలోని కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని మాత్రం ఎందుకు టచ్‌ చేయడంలేదన్నది ఆలోచించాల్సిన ప్రశ్నే. ఎన్డీయే కూటమిలో చంద్రబాబు టీడీపీ భాగస్వామిగా ఉండటం వల్లే ఈ సఖ్యత ఏర్పడిరదేమోనన్న అనుమానాలూ ఉన్నాయి. అప్పుడప్పుడు రేవంత్‌ బీజేపీని కాస్త ఘాటుగా విమర్శిస్తారు గానీ.. తెలంగాణ బీజేపీ పెద్దలు ఓడిపోయిన బీఆర్‌ఎస్‌నే ఇంకా టార్గెట్‌ చేస్తున్నారు. ‘గోదావరి వరదజలాల విషయంలో ఏపీ ముఖ్యమంత్రి ఏదో ప్రణాళికతో వచ్చారు.. ఆయన కంటే ఆరునెలల ముందు నువ్వు ముఖ్యమంత్రివి అయ్యావు.. గోదావరి గురించి ఏం ఆలోచించావు’ అని కిషన్‌రెడ్డి వేసిన ప్రశ్నే ఇప్పటివరకు తెలంగాణ సీఎం మీద బీజేపీ చేసిన పెద్ద విమర్శ కావడం గమనార్హం. ఇంకో విషయమేంటంటే.. పదేళ్ల కిందటి నుంచి తెలంగాణ రాజకీయ సంవాదంలో సంస్కారం తగ్గుతూ వస్తోంది. కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత అది మరింత క్షీణించింది. గతంలో నాజూకుగా, నాగరికంగా మాట్లాడినవారు కూడా ముతక భాష నేర్చుకుంటున్నారు. ప్రతి విషయంలోనూ ముఖ్యమంత్రి ప్రమాణం చేసి నిజానిజాలు చెప్పవలసి రావడమే తెలంగాణ రాజకీ యాల్లో కొత్త విషాదం. సరిగ్గా ఇదే కోణంలో తెలంగాణ సమాజం ఆలోచిస్తోంది. చంద్రబాబుతో ఎంతో మర్యాదగా మాట్లాడే రేవంత్‌రెడ్డి.. కేసీఆర్‌ విషయంలో అంత దురుసుగా ఎందుకు వ్యవహ రించాలన్న ప్రశ్న తలెత్తుతోంది. పాలమూరు బిడ్డ అయిన తాను మంచి పనులు చేసి పదేళ్లపాటు ముఖ్యమంత్రిగా కొనసాగాలి.. అది చూసి కేసీఆర్‌ కుమిలిపోవాలంటారు రేవంత్‌. ప్రత్యర్థులు ఈర్ష్య పడేలా మంచి పనులు చేయడం సంతోషకరమే.. కానీ మాటలో అంత హింసాత్మకత ఎందుకు? ఎన్ని ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తుల విషయంలోనైనా కొన్ని రకాల భావవ్యక్తీకరణలను సభ్య సమాజం హర్షించదు. దుర్భాష మాత్రమే కాదు.. దుర్భావం కూడా వాంఛనీయం కాదు. చంద్ర బాబులాగే కేసీఆర్‌ ఒక పార్టీ నాయకుడు, తెలంగాణ సాధించిన ఉద్యమ నాయకుడు. కొత్త రాష్ట్రా నికి తొలి సీఎం. ఆయన్ను ఆ విధంగా గౌరవించండి.. సద్విమర్శలు చేయండి.

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page