top of page

కేసుల ‘సంపన్నులు’!

  • Writer: DV RAMANA
    DV RAMANA
  • Aug 25, 2025
  • 2 min read

మనను పాలించేవారు, మనకు ప్రాతినిధ్యం వహించేవారు సచ్ఛీలురు, సద్వర్తనులు అయి ఉండా లని కోరుకోవడంలో తప్పులేదు. అటువంటివారే చిత్తశుద్ధితో నిస్వార్థంగా పని చేయగలుగుతారు. ఎమ్మెల్యేలు, ఎంపీల సంగతెలా ఉన్నా.. రాష్ట్రాధిపతులైన ముఖ్యమంత్రులు ముమ్మూర్తులా ఇటువంటి లక్షణాలే పుణికిపుచ్చుకోవాలని కోరుకోవడంలో తప్పులేదు. స్వార్థం అంతకంటే కాదు. కాదు దుర దృష్టవశాత్తు అవినీతి, క్రిమినల్‌, తదితర కేసుల్లో ఉన్నవారే నేడు చాలా రాష్ట్రాలను పాలిస్తున్న దురవస్థ కనిపిస్తోంది. వారి వెనుక భారీ ఆస్తులు కూడా ఉండటం వారి ప్రజాసేవాతత్పరతపై అను మానాలు రేపుతోంది. అసోసియేషన్‌ ఫర్‌ డెమోక్రటిక్‌ రిఫార్ట్స్‌ (ఏడీఆర్‌) సంస్థ తాజాగా విడుదల చేసిన ముఖ్యమంత్రులు కేసులు, ఆస్తుల చిట్టా చేస్తే.. నిర్వేదం కలుగుతుంది. 30 రాష్ట్రాల ముఖ్య మంత్రుల్లో 12 మందిపై క్రిమినల్‌ కేసులు ఉన్నట్లు ఈ నివేదిక పేర్కొంది. అలాగే దాదాపు అదే సంఖ్యలో ముఖ్యమంత్రులు కోట్లాది రూపాయల స్థిర, చరాస్తులు కలిగి ఉన్నట్లు వారు ఎన్నికల సంఘానికి సమర్పించిన అఫిడవిట్ల ఆధారంగానే ఏడీఆర్‌ వెల్లడిరచడం గమనార్హం. ఈ పరిస్థితి ప్రజాస్వామ్య వ్యవస్థకు ప్రమాదంగా పరిణమించే అవకాశముందని హెచ్చరించింది. క్రిమినల్‌ కేసు లున్న సీఎంల జాబితాలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మొదటి స్థానంలో ఉన్నారు. ఆయనపై మొత్తం 89 కేసులు ఉన్నాయట. తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్‌ 47 కేసులతో రెండో స్థానంలో ఉండగా ఆయన తర్వాత 19 క్రిమినల్‌ కేసులతో ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మూడో స్థానంలో ఉన్నారు. ఈ గణాంకాలు రాష్ట్రాల రాజకీయాల్లో నేరచరిత్ర ప్రభావం ఎంత ఎక్కువగా ఉందో తెలియజేస్తున్నాయి. వీటిలో రేవంత్‌రెడ్డిపై ఓటుకు కేసు, చంద్ర బాబునాయుడుపై స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కుంభకోణం వంటి అవినీతి కేసులు కూడా ఉన్నాయి. వీరితో పాటు పదిమంది ముఖ్యమంత్రులు క్రిమినల్‌ కేసులు ఎదుర్కొంటున్నారు. వీటిలో హత్య, కిడ్నాప్‌, లంచం తీసుకోవడం, ఇతర నేరపూరిత చర్యలకు సంబంధించిన కేసులు ఉన్నాయని ఏడీఆర్‌ నివేదిక వెల్లడిరచింది. ఈ నివేదికలు పౌరులకు తమ నాయకుడి నేర చరిత్ర గురించి తెలుసుకుని సరైన నిర్ణయం తీసుకోవడానికి సహాయపడతాయి. అయితే కేసుల స్వభావం కూడా ముఖ్యమే. పదిమంది సీఎంలపై క్రిమినల్‌ కేసులు ఉండగా, మిగతా సీఎంలపై ఉన్న కేసుల్లో చాలావరకు రాజకీయ ప్రేరేపితమైనవి, ప్రజా ఉద్యమాల్లో పాల్గొన్నప్పుడు నమోదైనవి కూడా ఉన్నాయి. రాజ కీయాలను నేర రహితంగా మార్చడానికి, నేర చరిత్ర కలిగిన వారిని ప్రజాప్రతినిధులుగా ఎన్నుకో కుండా ఉండటానికి ప్రజలు, రాజకీయ పార్టీలు, న్యాయవ్యవస్థ ఎవరి స్థాయిలో వారు కృషి చేయా ల్సిన అవసరాన్ని ఈ గణాంకాలు గుర్తుచేస్తున్నాయి. కేసుల్లో మూడో స్థానంలో ఉన్న ఏపీ ముఖ్య మంత్రి ఆస్తుల విషయంలో ఏకంగా మొదటిస్థానంలో ఉన్నట్లు ఏడీఆర్‌ మరో నివేదికలో పేర్కొంది. దేశంలోని 30 మంది ముఖ్యమంత్రుల మొత్తం ఆస్తుల విలువ రూ.1632 కోట్లుగా పేర్కొన సదరు నివేదిక.. అందులో 50 శాతానికి పైగా అంటే రూ.931 కోట్లు చంద్రబాబునాయుడు(టీడీపీ) ఆస్తు లేనని వెల్లడిరచింది. ఆ తర్వాత చిన్న రాష్ట్రాల్లో ఒకటైన అరుణాచల్‌ప్రదేశ్‌ ముఖ్యమంత్రి ఫెమా ఖండూ (బీజేపీ) రెండో స్థానంలో నిలిచారు. ఆయనకు సుమారు రూ.332 కోట్ల ఆస్తులు ఉన్నాయి. వీరిద్దరూ బిలియనీర్‌ ముఖ్యమంత్రులుగా పేరొందారు. వీరి తర్వాత కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధ రామయ్య (కాంగ్రెస్‌) రూ.51 కోట్ల ఆస్తులతో మూడో స్థానంలో ఉన్నారు. మొత్తంగా దేశంలో ముఖ్యమంత్రుల సగటు ఆస్తి రూ.54.42 కోట్లు అని నివేదికలో పేర్కొన్నారు. కాగా అత్యల్ప ఆస్తులున్న ముఖ్యమంత్రుల్లో పశ్చిమబెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ ముందున్నారు. ఆమె మొత్తం ఆస్తుల విలువ రూ.15 లక్షలు మాత్రమే. ఆమె పేరు మీద ఇల్లు, భూమి వంటివేవీ లేవు. జమ్మూ కాశ్మీర్‌ ముఖ్యమంత్రి ఒమర్‌ అబ్దుల్లా రూ. 55 లక్షల ఆస్తులతో ఆమె తర్వాత స్థానంలో ఉండగా కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ రూ.కోటి ఆస్తులతో చివరి నుంచి మూడోస్థానంలో ఉన్నారు. మిగతా ముఖ్యమంత్రులు ఆస్తులు సగటున రూ.50 కోట్ల మేరకు ఉండటం వల్లే ఎన్నికల వ్యయాలు పెరిగిపోతున్నాయి. పార్టీలు కూడా బాగా ఆస్తులుండి, విస్తారంగా ఖర్చు చేయగలిగిన వారికి, కేసులున్నవారికే అభ్యర్థిత్వాలు కట్టబెడుతూ ఎన్నికల రంగాన్ని నేరమయం చేస్తున్నాయి.

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page