గుండ వారసులొస్తే స్వచ్ఛందంగా తప్ప్పుకుంటా!
- NVS PRASAD

- 3 days ago
- 2 min read
ప్రత్యక్ష రాజకీయాలకు శాశ్వతంగా దూరం జరుగుతా
అవసరమైతే ఆఫీసులో టీకప్ప్పులందించుకుంటాను
అప్పలసూర్యనారాయణ సంతాపసభలో కన్నీరు పెట్టుకున్న ఎమ్మెల్యే

(సత్యంన్యూస్, శ్రీకాకుళం)
దివంగత అప్పలసూర్యనారాయణ కుటుంబం నుంచి ఆయన తనయులు రాజకీయ వారసులుగా వస్తానంటే, వారికి పార్టీ సముచిత స్థానం కల్పించాలని భావిస్తే రాజకీయాల నుంచి స్వచ్ఛందంగా తప్ప్పుకుంటానని ఎమ్మెల్యే గొండు శంకర్ అన్నారు. స్థానిక పార్టీ కార్యాలయంలో ఆదివారం అప్పలసూర్యనారాయణ మతికి నివాళిగా సంతాప సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే భావోద్వేగానికి లోనయ్యారు. అప్పలసూర్యనారాయణ తనయులు రాజకీయాల్లోకి రావాలనుకుంటే తాను స్వచ్ఛందంగా తప్ప్పుకుంటానని, తాను పోటీ చేసినప్ప్పుడు గ్రూపు తగాదాలుగా భావించడం వల్ల అప్పలసూర్యనారాయణ వారసులకు అటువంటి బాధ రాకుండా స్వచ్ఛందంగా ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్ప్పుకుంటానని ఆయన అన్నారు. అప్పలసూర్యనారాయణ ఫొటో వైపు ప్రమాణం చేస్తున్నట్టుగా చేయి చాచి కన్నీరు పెట్టుకున్నారు. ఎవరు ఎన్ని అనుకున్నా, పార్టీలో యువతకు ప్రాధాన్యత ఇస్తారని తెలిసిన తర్వాతే తాను టిక్కెట్‌కు దరఖాస్తు చేసుకున్నానని, ఇప్ప్పుడదే యువత కోటాలో వారికివ్వాలని పార్టీ భావిస్తే పూర్తిగా రాజకీయాల నుంచే తప్ప్పుకుంటానని, పార్టీ సేవ చేసుకుంటానని, అవసరమైతే విజయవాడ కార్యాలయంలో టీకప్ప్పులు ఇవ్వడానికి కూడా వెనుకాడనని ఆయన అన్నారు. 40 ఏళ్లపాటు తెలుగుదేశంలో వివిధ హÃదాల్లో పని చేసిన అప్పలసూర్యనారాయణను పార్టీ ఎప్ప్పుడూ విడిచిపెట్టదని, తానేదో వారిని కాదని టిక్కెటు తెచ్చుకున్నానని చాలామంది భావిస్తున్నారని దాన్ని అంగీకరించనన్నారు. కొన్ని విషయాలు బహిరంగంగా మాట్లాడలేం కాబట్టి చెప్పడంలేదని, అప్పలసూర్యనారాయణ లాంటి మంచి వ్యక్తి రాజకీయాల్లో అరుదుగా ఉంటారన్నారు. ఎవరి మీదైనా ఆగ్రహం వ్యక్తం చేసినా కొద్దిసేపేనని, ఆ తర్వాత వారిని అక్కున చేర్చుకునేవారన్నారు.
నిజాయితీ ఆయన నైజం

దివంగత నేత గుండ అప్పల సూర్యనారాయణ సేవలు అజరామరమని, నీతి, నిజాయితీ, ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉండే తత్వం ఆయనదని ఎమ్మెల్యే గొండు శంకర్ పేర్కొన్నారు. ఆదివారం 80 అడుగుల రోడ్డులోని టీడీపీ జిల్లా కార్యాలయ సమావేశ మందిరంలో అప్పల సూర్యనారాయణ సంతాప సభను ఎమ్మెల్యే శంకర్ ఆధ్వర్యంలో నిర్వహించారు. త్వరలో దివంగత అప్పల సూర్యనారాయణ విగ్రహాన్ని మంచి స్థలం చూసి ఏర్పాటు చేసేందుకు బాధ్యతలు తీసుకుంటున్నానని పేర్కొన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని సంతాపం వ్యక్తం చేస్తూ రెండు నిమిషాలు మౌనం పాటించారు. సంతాప సభలో టీడీపీ పార్లమెంటు పార్టీ జిల్లా అధ్యక్షులు మొదలవలస రమేష్, పట్టణ పార్టీ అధ్యక్షులు పాండ్రంకి శంకర్, రూరల్ అధ్యక్షులు మూకళ్ల శ్రీను, గొండు, పుప్పాల చిన్న మహాలక్ష్మి, శవ్వాన ఉమామహేశ్వరి, జామి భీమశంకర్, కవ్వాడి సుశీల, మాజీ మున్సిపల్ చైర్‌పర్సన్ పైడిశెట్టి జయంతి, కొర్ను నాగార్జున ప్రతాప్, పిఎంజె బాబు, పిరియా మాధవి, చిట్టి మోహన్, దివ్వల రమణమ్మ, ఎస్వీ రమణ మాదిగ, పి.విజయరామ్, సింతు సుధాకర్, బడగల వెంకట అప్పారావు, కోరాడ హరిగోపాల్, దుంగ శ్రీధర్, కంచు దశరథ, పొట్నూరు కృష్ణమూర్తి, కైబాడి రాజు, సూరాడ అప్పన్న, మైలపల్లి నరసింహమూర్తి, కలగ జగదీష్, రంధి అప్పలస్వామి, మల్ల అబ్బాయినాయుడు, జి.కోటేశ్వరరావు, డి.జ్యోతి భాస్కర్, వెలమల శ్రీనివాసరావు, అంబటి వైకుంఠం, మాదారపు వెంకటేష్, పలువురు సీనియర్ నాయకులు పాల్గొన్నారు.










Comments