గ్రూపులు కడితే ఒప్పుకోను
- BAGADI NARAYANARAO

- Nov 13
- 2 min read
ఎమ్మెల్యే నిర్ణయాన్ని అందరూ అంగీకరించాల్సిందే
పార్టీ కమిటీల ప్రమాణ స్వీకారోత్సవంలో గొండు శంకర్

(సత్యంన్యూస్,శ్రీకాకుళం)
పార్టీలో నాయకులు గ్రూపులు కడితే ఒప్పుకొనే ప్రసక్తి లేదు. మీకు ఇష్టం లేకపోయినా ఐదేళ్లు తనను భరించాల్సిందేనని, పార్టీ అధిష్టానం సూచనలు, ఆదేశాలతో నియోజకవర్గంలో ఎమ్మెల్యే తీసుకొనే నిర్ణయాన్ని నాయకులు అందరూ అంగీకరించి తూచా తప్పకుండా పాటించాలని ఎమ్మెల్యే గొండు శంకర్ స్పష్టం చేశారు. గురువారం స్థానిక 80 అడుగులరోడ్డులో ఉన్న పార్టీ జిల్లా కార్యాలయంలో పార్టీ పరిశీలకులు చింతల రామకృష్ణ ఆధ్వర్యంలో నియోజకవర్గ టీడీపీ నగర, గార, శ్రీకాకుళం రూరల్ మండల అధ్యక్షులు, కార్యదర్శులు, యూనిట్, క్లస్టర్, గ్రామ, బూత్ కమిటీల ప్రమాణస్వీకారం కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. పార్టీలో ఎవరికి ఎటువంటి సమస్య వచ్చినా వారికి అండగా ఉంటానన్నారు. పార్టీ నాయకులు సమన్వయంతో పని చేసి అధిష్టానం ఆదేశాలను, సూచనలను పాటిస్తూ మందుకు సాగాలన్నారు. నియోజకవర్గంలో టీడీపీ ప్రోటోకాల్ తానేనన్నారు. పార్టీని నియోజకవర్గంలో ఐదేళ్లు ముందుకు తీసుకువెళ్లే బాధ్యత తనదేనన్నారు. ఎవరికి ఇష్టం ఉన్నా లేకున్నా పార్టీ కోసం పనిచేయాల్సిందేనన్నారు. దొంగ రాజకీయాలు, గ్రూపులు కడితే సంహించనని కేడర్‌కు హెచ్చరిం చారు. పార్టీ కోసం మనస్పర్తిగా పనిచేసే ప్రతి ఒక్కరి పాదాలు కడిగి, చెప్పులు తుడవమన్నా తుడుస్తానన్నారు. చంద్రబాబు, లోకేష్ అప్పగించిన గురుతర బాధ్యతలను నిర్వర్తిస్తున్నానన్నారు. తాను కేవలం సేవకుడినే, లీడర్‌ను కాదన్నారు. తనకు ఎవరిపైనా విద్వేషం లేదన్నారు. ఎమ్మెల్యే కార్యాలయం నుంచి కమ్యూనికేషన్ గ్యాప్ ఉంద న్నారు. దీన్ని అధిగమించడానికి వ్యక్తిగత సహాయకులుగా సేవలందిస్తున్న ఇద్దరినీ సంప్రదించాలని సూచించారు. కొత్తగా బాధ్యతలు స్వీకరించిన కమిటీల ప్రతినిధులంతా పార్టీ బలోపేతం కోసం సమ ష్టిగా పని చేయాలని పిలుపునిచ్చారు. ప్రతి కార్యకర్త ప్రజలకు చేరు వగా ఉండి, ప్రభుత్వ పథకాలను ప్రతి కుటుంబానికి చేరవేయాలని సూచించారు. ప్రజల సమస్యలను తక్షణమే గుర్తించి పరిష్కారం దిశగా కృషి చేయాలని కోరారు. ముందుగా కమిటీల అధ్యక్షులు, కార్యదర్శులతో ప్రమాణ స్వీకారం చేయించారు. కార్యక్రమంలో నగర అధ్యక్షులుగా ప్రమాణ స్వీకారం చేసిన పాండ్రంకి శంకర్ మాట్లాడుతూ అందరిని కలుపుకొని పార్టీ బలోపేతం కోసం కృషి చేస్తానన్నారు. నగర ప్రజల అవసరాలను గుర్తించి వాటిని పరిష్కరించేందుకు ఎమ్మెల్యే గొండు శంకర్ నాయకత్వంలో కృషి చేస్తానన్నారు. కార్యక్రమంలో నగర పార్టీ ప్రధాన కార్యదర్శి కోరాడ హరిగోపాల్, గార మండల అధ్యక్షులు లోపింటి రాధాకృష్ణ (వమరవల్లి చిన్న), శ్రీకాకుళం మండల అధ్యక్షులు మూకళ్ల శ్రీను, పార్టీ నాయకులు గొండు జగపతి, పీఎంజే బాబు, కొర్ను ప్రతాప్, ప్రధాన విజయరాం, మాదారపు వెంకటేష్, కవ్వాడి సుశీల, గండేపల్లి కోటీశ్వరరావు, బలగ శివప్రసాద్ దేవ్, నాగావళి కృష్ణ, దుంగ శ్రీధర్, అరవల రవీంద్ర, బరాటం ఉదయ్ శంకర్ గుప్తా, సాధు వెంకటేష్, నాగేంద్ర యాదవ్, విస్సు, ఇంట ర్నెట్ నవీన్, తదితరులు పాల్గొన్నారు.










Comments