గ్రీవెన్స్ ఫిర్యాదు వెనక్కి తీసుకోవాలని ఒత్తిడి
- BAGADI NARAYANARAO

- Sep 1
- 1 min read
బలగ వీఆర్‌వోపై జేసీకి బాధితుడి ఫిర్యాదు

(సత్యంన్యూస్, శ్రీకాకుళం)
ప్రజా సమస్యల పరిష్కార వేదిక గ్రీవెన్స్‌లో ఇచ్చిన ఫిర్యాదు వెనక్కి తీసుకోవాలని ఒత్తిడి చేస్తున్నట్టు బలగ వీఆర్‌వో, వార్డు సర్వేయర్‌పై బాధితుడు బోనెల చిరంజీవి ఫిర్యాదు చేశారు. సోమవారం గ్రీవెన్స్‌లో జేసీ ఫర్మాన్ ఖాన్‌ను కలిసి వీఆర్‌వోపై ఫిర్యాదులో వివరించారు. బలగ రెవెన్యూ పరిధిలో సర్వే నెంబర్ 1లోని సబ్ డివిజన్ 1/4 సర్వే నెంబరులో ఉన్న ప్రభుత్వ భూమి వరదగట్టు (కోనేరు) దురాక్రమణ చేసిన వారికి వీఆర్వో, సచివాలయం సర్వేయర్ అండగా నిలిచి రెవెన్యూ అధికా రులను తప్పుదోవ పట్టిస్తున్నారన్నారు. సర్వే నెంబర్ 1/4లో రెవెన్యూ రికార్డుల్లో 1.05 ఎకరాల వరదగట్టు (కోనేరు) ఆక్రమించి ప్లాట్లుగా విభజించి రియల్ వ్యాపారం చేస్తున్న వారిపై గతనెల 11న పీజీఆర్‌ఎస్‌లో ఇచ్చిన ఫిర్యాదును వెనక్కి తీసుకోవాలని ఒత్తిడి చేస్తున్నారన్నారు. వరదగుట్ట ఆక్రమణదారులకు అనుకూలంగా వీఆర్వో వ్యవహారిస్తూ సర్వే నెంబర్ 1/4లో ఉన్న వరదగట్టును ఆక్రమించిన ప్రాంతాన్ని సర్వే నెంబర్ 1/5గా చూపిస్తున్నారని జేసీకి విన్నవించారు. 1/5 సర్వే నెంబర్ ను 1/4గా చూపించి ఆక్రమణలు జరగలేదని వీఆర్వో, సచివాలయం సర్వేయర్, ఆర్‌ఐ, మండల సర్వేయర్ కలిసి తహశీల్దారుకు తప్పుడు నివేదిక ఇచ్చారని ఫిర్యాదులో పేర్కొన్నారు. వరదగట్టును గుర్తించి హద్దులు వేసి, హెచ్చరిక బోర్డు ఏర్పాటు చేయాలని తహశీల్దార్ అదేశించినా వీఆర్వో ఆక్రమణకు గురైన స్థలాన్ని గుర్తించకుండా సమస్యకు పరిష్కారం చూపించినట్టు సంతకం పెడితే పీజీఆర్‌ఎస్‌లో ఇచ్చిన ఫిర్యాదును క్లోజ్ చేస్తామని సర్వేయర్‌తో కలిసి ఒత్తిడి చేస్తున్నారన్నారు. బలగ వీఆర్వోగా విధులు నిర్వహిస్తున్న ఉద్యోగి గతంలో గూడాం, పాత్రునివలసలో పని చేశారని, అసమయంలో గ్రామానికి చెందిన వారంతా ఆమె అవినీతి, అక్రమాలపై సీఎంవోకు ఫిర్యాదు చేసి వీఆర్వోగా తప్పించాలని కోరినట్టు ఫిర్యాదులో పేర్కొన్నాడు. వీఆర్వో అవినీతిపై సమగ్ర విచారణ జరిపించి, నాగావళి వరదగట్టును సర్వే చేయించి హద్దులు ఏర్పాటు చేయాలని కోరారు.










Comments