గోవా గవర్నర్‌గా అశోక్‌గజపతి
- DV RAMANA

- Jul 14
- 1 min read

(సత్యంన్యూస్, శ్రీకాకుళం)
కేంద్ర మాజీమంత్రి, తెలుగుదేశం సీనియర్ నాయకుడు పూసపతి అశోక్‌గజపతిరాజు గోవా గవర్నర్‌గా నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. మూడు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. ఆయనతోపాటు హర్యానా గవర్నర్‌గా ప్రొఫెసర్ అషీంకుమార్ ఘోష్, రాజీనామా చేసిన లడ్డాక్ గవర్నర్ బి.బి.శర్మ స్థానంలో కవిందర్ గుప్తాను ఆ కేంద్రపాలిత ప్రాంతానికి గవర్నర్‌గా నియమించారు. తెలుగుదేశం పార్టీలో ప్రస్తుతం ఉన్న నాయకుల్లో అత్యంత సీనియర్ అయిన అశోక్‌గజపతిరాజు.. పార్టీ పోలిట్‌బ్యూరో సభ్యుడితోపాటు అనేక పదవులు నిర్వహించారు. రాష్ట్ర మంత్రిగా, కేంద్ర మంత్రిగా కూడా సుదీర్ఘకాలం పని చేశారు. విజయనగరం రాజవంశానికి చెందిన ఆయనకు నిస్వార్థ రాజకీయ నేతగా గుర్తింపు ఉంది. 2024 ఎన్నికల్లో రాజకీయంగా రిటైర్‌మెంట్ తీసుకున్న ఆయన తన వారసురాలిగా కుమార్తె అదితి గజపతిరాజును తీసుకొచ్చారు. ఆమె విజయనగరం నుంచి ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్నారు. క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉన్న ఆశోక్‌కు పార్టీ అధినేత చంద్రబాబు ఏదో ఒక ఉన్నప పదవి ఇస్తారని చాలా రోజులుగా ప్రచారం జరుగుతోంది. తెలుగుదేశం ఎన్డీయేలో భాగస్వామిగా ఉన్నందున ఆ కోటాలో ఒకటిరెండు గవర్నర్ పదవులు టీడీపీకి ఇస్తారని, అందువల్ల అశోక్‌ను గవర్నర్‌గా పంపవచ్చని చాలా రోజులుగా ప్రచారం జరుగుతోంది. దాన్నే నిజం చేస్తూ తాజాగా కేంద్రం జరిపిన గవర్నర్ల నియామకంలో అశోక్‌గజపతిరాజుకు అవకాశం లభించింది.










Comments