చెయ్యని పాత్రా, వెయ్యని వేషం లేదు!!
- Guest Writer
- Jul 30
- 3 min read

60/70లలో కెరీర్ ప్రారంభించిన ప్రతీ నటుడికి ఏదొక దశలో అప్పుడప్పుడూ గ్యాప్ వస్తూండేది. ఫ్లాపులు పడో లేక ట్రెండ్ మారో.. ఔట్ డేటెడ్ అయ్యో లేక ప్రేక్షకులకి బోర్ కొట్టేసో ఎక్కడొకచోట బ్రేక్ పడేది. కానీ చంద్రమోహన్ ఆ గ్యాప్పులకి, బ్రేకులకి అతీతుడు. వయోభారం వల్ల తనకి తాను తగ్గించుకుంటే తప్ప ఆఖరివరకూ ఆయనకి అవకాశాలకి కొదవ లేదు..! మార్కెట్ మార్పులకు తగ్గట్టుగా ధోరణిని మలచుకుంటూ, వివాదాలకి అతీతంగా మెలగుతూ.. అలుపెరగకుండా యాభైఏళ్ళ పైబడి పరిగెత్తడమన్నది ఓ కళ. అది అందరికీ చేతకాదు. అందులో చంద్రమోహనుడు త్రివిక్రముడు..!!
70-80 దశకాల సినిమాలు విరివిగా వేసే యే ఈటీవీనో, లేక మరో ఛానెలో సరదాగా ఓసారి పెట్టండి. ఎక్కడోచోట చంద్రమోహన్ కనబడకపోడు. 70ల కాలంలో కొత్త హీరోయిన్లతో ఆడిపాడే లక్కీమస్కట్ గా కనిపిస్తాడు.
80ల టైర్-1 బ్యాచ్ కృష్ణ-శోభన్‌లు ముందడుగు లాంటి మల్టీస్టారర్లు చేస్తే వాళ్ళ మధ్య ఓ క్యారెక్టర్ ఆర్టిస్టుగా దూరిపోయి మెరిపిస్తాడు.
మురళీమోహన్‌లాంటి టైర్-2 బ్యాచ్ చిన్నచిన్న మల్టీస్టారర్లు చేసుకుంటే అందులో రెండోహీరోగా భుజం కాస్తాడు. సీనియర్లతోనే కాబోలనుకుంటే, లేదూ లేత రాజేంద్రుడితో సైతం జతకట్టి బోలెడన్ని బడ్జెట్ సినిమాలతో నవ్విస్తాడు.
90ల్లో ప్రేక్షకుల అభిరుచి మారినప్పుడు ఎంతోమంది పాతనటులు ఆ ఒరవడిని అందుకోలేక మమ్మల్నొదిలెయ్యండంటూ అక్కడే ఆగిపోయారు. కానీ చంద్రమోహన్ మాత్రం ట్రెండ్ కంటే ముందే పరిగెత్తి పరిశ్రమని కూడా అక్కడికి లాక్కెళ్లాడు. రాబోయే మార్పుల్ని త్వరగా పసిగట్టింది, భేషజాలకి పోకుండా అవకాశాల్ని ఒడిసిపట్టుకుంది ఈయనేనేనేమో..!!
అప్పటిదాకా హీరో తండ్రంటే సఫారీ సూటో లేదంటే పంచెకట్టో వేసుకుని, జుట్టుని ఇదాయకంగా తెల్లబరుచుకుని నాటకీయంగా కనబడే స్థితినుంచి కృష్ణవంశీ పుణ్యమాని తండ్రి పాత్రకి కొంచెం గ్లామరద్దాడు చంద్రమోహన్. టీషర్టూ, జీన్సులేసి కొడుకుతో కల్సి అల్లరి చేశాడు. పోట్లాడాడు. నవ్వించాడు. ఏడిపించాడు. సగం పైగా సినిమాల్లో కొడుకుగారి భవిష్యత్తు మీద బెంగతోనే ఆందోళనగా కనబడేవాడు.
88లో త్రినేత్రుడుదాకా చిరంజీవికి మిత్రుడిగా వేసిన చంద్రమోహన్ అదే చిరంజీవికి ఇద్దరుమిత్రులులో తండ్రిగా మారిపోడానికి పదేళ్ళు కూడా పట్టలేదు.
2000 ప్రారంభంలో నలభైయేళ్ళ వెంకీకి, ఇరవైయేళ్ళ ఉదయ్ కిరణ్ కి ఇద్దరికీ చంద్రమోహనే తండ్రి..నాటకీయతని, అతిని ప్రదర్శించే రోజుల్లో రంగప్రవేశం చేసినా సరే.. తెచ్చిపెట్టుకున్నట్టు కాకుండా నిజంగా ప్రవర్తిస్తున్నట్టు నటించటం ఈ సహజనటుని ప్రత్యేకత..!
బ్లాక్ Ê వైట్ కె. విశ్వనాథ్ మొదలుకుని బాపు, జంధ్యాల, నేటి ట్రెండ్ సెట్టర్లు త్రివిక్రమ్, శ్రీనువైట్లదాకా అందరి దగ్గరా పాత్రల్ని సునాయాసంగా పోషించి రక్తి కట్టించిన నటులెవరన్నా ఉన్నారా..? ఒకేఒక్క చంద్రమోహనున్నాడు..!!
బాపు తీసిన రాధాకల్యాణంలో పాల్ఘాట్ మాధవన్‌గా తమిళయాసని పట్టుకోవడం అంత సులభమేమీ కాదు. కానీ ప్రతిభాశాలి చంద్రమోహన్‌కి అదేమంత పెద్దపని కాలేదు. 7జీ బృందావన్ కాలనీలో కొడుకుని పడేసి తన్నే తండ్రి పాత్రలో ఇంట్లో తండ్రులే కనబడ్డారు.
పదహారేళ్ళవయస్సులో అమాయకత్వంగా, కలికాలం, ఆమె చిత్రాలలో కరుణగా.. ఆడదేఆధారం, పెద్దరికంలో కామెడీగా.. పాపే నా ప్రాణంలో విలన్‌గా.. వేటికవే.. ఏ పాత్ర పండిరచినా ఫస్ట్ క్లాసే.. దాదాపు 900 పైగా సినిమాల్లో హీరో, సైడ్ హీరో, కమెడియన్, విలన్, సహాయనటుడు.. చెయ్యని పాత్రా, వెయ్యని వేషం లేదు. అలాంటి మరో నటుణ్ణి చూస్తామోలేదో కూడా తెలీదు.
అందమైన చీర కట్టులో సోనాలి !!

ఇండస్ట్రీకి ఎంతో మంది హీరోయిన్స్ వస్తుంటారు.. పోతుంటారు. కానీ కొద్ది మంది హీరోయిన్స్ మాత్రమే ఎప్పటికీ గుర్తుండి పోతారు. కొందరు హీరోయిన్స్ ఇండస్ట్రీలో అడుగు పెట్టి రెండు మూడు దశాబ్దాలు అవుతున్నా ఇప్పటికీ ప్రేక్షకులను మెప్పిస్తూనే ఉంటారు. వారిలో సోనాలి బింద్రే ఒకరు అనడంలో సందేహం లేదు. ఈమె మధ్యలో సినిమాలను మానేసినా కూడా జనాలు ఈమెను మర్చి పోలేదు. ఈమె గురించిన వార్తలు ఎప్పుడూ వస్తూనే ఉన్నాయి. ముఖ్యంగా సోనాలి క్యాన్సర్‌తో పోరాటం చేసి గెలిచి నిలిచింది. దాంతో ఆమెను ఎంతో మంది ఆదర్శంగా తీసుకుని ఆరాధిస్తూ ఉంటారు, వయసు మీద పడ్డా కూడా క్యాన్సర్‌తో పోరాటం చేసి, తిరిగి సినిమా ఇండస్ట్రీలో అడుగు పెట్టిన అరుదైన స్టార్ అంటూ ఈమె గురించి ఆమె సన్నిహితులు, అభిమానులు చెబుతూ ఉంటారు.
సోనాలి బింద్రే అందమైన ఫోటో షూట్ అందమైన సోనాలి బింద్రే ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో రెగ్యులర్‌గా తన అందమైన ఫోటోలను షేర్ చేస్తూ వస్తోంది. సాధారణంగా హీరోయిన్స్ సోషల్ మీడియాలో ఫోటోలు షేర్ చేయడం కామన్‌గా చూస్తూ ఉంటాం. యంగ్ హీరోయిన్స్ స్కిన్ షో చేస్తే, నడుము అందం చూపిస్తే ఖచ్చితంగా వైరల్ అవుతాయి. యంగ్ హీరోయిన్స్ చీర కట్టి నడుము అందం చూపించి, నాభి అందాలను చూపిస్తే నెటిజన్స్ ఆ ఫోటోలను తెగ వైరల్ చేయడం మనం చూస్తూ ఉంటాం. సీనియర్ హీరోయిన్స్ అలా స్కిన్ షో చేస్తే ఎబెట్టుగా ఉంటుంది. అలా చూపించినా కూడా చూసేందుకు ఆసక్తి చూపించరు. వారి వయసు తగ్గట్లుగా, వారి అందాన్ని చూపించినప్పుడు మాత్రమే ఆ ఫోటోలు వైరల్ అవుతూ ఉంటాయి.
సోనాలి బింద్రే ఆ విషయంలో చాలా జాగ్రత్తగా ఉన్నట్టు అనిపిస్తూ ఉంటారు. 50 ఏళ్ల సోనాలి బింద్రే రెగ్యులర్‌గా తన అందమైన ఫోటోలను షేర్ చేస్తారు, ఎప్పటికప్పుడు ఆ ఫోటోలు అందరి దృష్టిని ఆకర్షిస్తూ ఉంటాయి. శృతి మించకుండా అందమైన ఫోటోలను, అందంగా కనిపిస్తూ సోనాలి షేర్ చేయడం మనం చూస్తూ ఉంటాం. తాజాగా మరోసారి సోనాలి బింద్రే తన చీర కట్టు ఫోటోలతో సర్ ప్రైజ్ చేసింది. పింక్ చీర కట్టులో సోనాలి అందమైన ఫోటోలను షేర్ చేశారు. 50 ఏళ్ల వయసులోనూ సోనాలి చాలా అందంగా ఉన్నారు అంటూ అభిమానులతో పాటు అంతా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికీ సీనియర్ హీరోలకు జోడీగా హీరోయిన్‌గా నటించేంత అందం సోనాలి సొంతం అనే అభిప్రాయం ను కొందరు వ్యక్తం చేస్తున్నారు.
-తుపాకి.కామ్ సౌజన్యంతో...
Comments