జీ రామ్‌జీ.. రాష్ట్రాలకు భారం మోదీజీ!
- BAGADI NARAYANARAO

- Dec 25, 2025
- 3 min read
స్వరూప స్వభావాలు మార్చుకున్న ఉపాధి పథకం
పనిదినాలు 100 నుంచి 125కు పెంపు
రూ.133 నుంచి రూ.240కి పెరిగిన వేతనం
నిధుల్లో తన వాటా తగ్గించుకున్న కేంద్రం
రాష్ట్రాలు చెల్లించాల్సిన వాటా 40 శాతానికి పెంపు

(సత్యంన్యూస్, శ్రీకాకుళం)
గ్రామీణ ప్రాంతాల్లో నైపుణ్యం అవసరం లేని వ్యక్తులకు ఉపాధిని కల్పిస్తూ 2025లో యూపీఎ`1 ప్రభుత్వం తీసుకువచ్చిన చట్టాన్ని 20 ఏళ్ల తర్వాత సమూలంగా మార్పులు చేసి వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్‌గార్ అండ్ అజీవికా మిషన్ (వీబీజీ రామ్ జీ)గా ఎన్‌డీఏ ప్రభుత్వం నామకరణం చేసింది. గ్రామీణ పరిస్థితులకు అనుగుణంగా లేదని, పేదరికం తగ్గడం, డిజిటల్ వినియోగం పెరగడం వంటి మార్పుల నేపథ్యంలో చట్టంలో కొన్ని మార్పులు చేసి అధునీ కరించి పేరు మార్చినట్టు కేంద్రం ప్రకటించింది. పని దినాలను 100 నుంచి 125 రోజులకు పెంచ డం, కనీస వేతనం రోజుకు రూ.133 నుంచి రూ.240కి పెంచుతున్నట్టు పేర్కొంది. ప్రస్తుతం వేతనాల విష యంలో కొంత గందరగోళం ఉంది. వారాల తరబడి కూలీలకు వేతనాలు జమ కావడంలేదన్న విమ ర్శలున్నాయి. దీన్ని అధిగమించేందుకు నూతన చట్టంలో ప్రతి వారం వేతనాలు చెల్లించాలన్న నిబం ధన తీసుకువచ్చారు. కేంద్రం వాటాను 90 నుంచి 60కి తగ్గించడం వల్లనే పథకం అమలుపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కేంద్రం వీబీ రాంజీ అమలులో తన బాధ్యత నుంచి తప్పుకొని రాష్ట్ర ప్రభుత్వాలపై భారం మోపిందని విమర్శలు వినిపిస్తున్నాయి. రాష్ట్రం వాటాను 10 నుంచి 40కి పెంచడం వల్ల రాష్ట్ర ప్రభుత్వాలపై ఆర్ధిక భారం పెరుగుతుందని ఆర్ధిక నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. 2018లో ప్రారంభమైన ఇంటిం టికీ శుద్ధ జలాల పేరుతో కేంద్రం రూపొందించిన జల్‌జీవన్ మిషన్‌లో కేంద్రం వాటా 60, రాష్ట్రం 40 శాతంగా నిర్ణయించింది. ఎనిమిదేళ్లు పూర్త యినా ఇప్పటికీ ఈ పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం 30 శాతం కూడా అమలు చేయలేక పోయింది. రాష్ట్ర వాటా కింద 40 శాతం నిధులు వెచ్చించడం ఆర్ధిక భారం కావడం దీనికి కారణం. దీని మాదిరిగానే వీబీజీ రామ్‌జీ పధకం నీరుగారుతుందని చర్చ సాగుతుంది.
గ్రామీణ ప్రాంతాల నుంచి వలసలు నివారణకు ఉపాధి హమీ పథకం ఎంతో ఉపకరించిందన్న అభి ప్రాయం అందరిలోనూ ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలు కల్పించడం, సహజ నీటి వనరులను అభివృద్ది చేయడం, సామాజిక అడవు లను పెంచడం, పంట కాలువలు ఆధునీకరించ డం, గ్రామీణ రహదారులు మెరుగుపడడం, గ్రామా ల్లో ప్రభుత్వ భవనాలు, చెత్త సేకరణ కేంద్రాలు నిర్మాణం చేసి సాలిడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్‌ను పెంపొందిడం, చెక్ డ్యాంలు నిర్మాణం, పశుసంపద అభి వృద్ది చేయడం, మత్స్యకార ప్రాంతాల్లో ఫిష్‌ల్యాండ్ సెం టర్లు నిర్మాణం తదితర అభి వృద్ది కార్యక్రమాలు చేపట్టే అవ కాశం గ్రామీణ ప్రాంతాల్లో కలిగింది. ఉపాధి హమీ చట్టాన్ని రాజకీయ కోణంలో చూడ కుండా గ్రామీణ ప్రాంత ప్రజల ఉపాధికి భరోసా కల్పించే పథకంగా చూడాలని మేధావులు అభిప్రా యం. వీరి అభిప్రాయాన్ని కేంద్రంలోని ఎన్‌డీఎ ప్రభుత్వం పరిగణలోకి తీసుకోలేదు.
ఉపాది చట్టం పేరు మార్పుపై కాంగ్రెస్, మమ తాబెనర్జీ, వామపక్ష పార్టీలు మినహా మిగతా వారె వరూ ప్రశ్నించ లేదు. ఉపాది హమీ చట్టం అమ ల్లోకి రాకముందే రాష్ట్రంలో పనికి ఆహార పథóకాన్ని అప్పటి టీడీపీ ప్రభుత్వం అమలు చేసేది. ప్రభు త్వం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో చేసే అభివృద్ది పనులకు కూలీ రూపంలో బియ్యంతోపాటు నగదు అందించేది. ఉపాది హమీ చట్టం వచ్చిన తర్వాత గ్రామీణ ప్రాంతాల్లో పని కావాలని కోరుకున్నవా రందరికీ కనీసం 100 రోజులు పని కల్పించాలి. ఆ గ్రామం పరిధిలోనే పనులు చేయడానికి వీలుగా గ్రామసభలు నిర్వహించి పనులు గుర్తించి మట్టి పనులు కూలీలకు కల్పించడం ప్రారంభóమైంది. 2014 తర్వాత వ్యవసాయానికి అనుసం ధానం చేశారు. మరికొన్ని మార్పులు చేసిన ఉపాధి పనులు అధారంగా 40 శాతం సిమెంట్ పనులు చేయడా నికి అవకాశం కల్పించారు. దీని ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో సిమెంట్ రోడ్డులు, ప్రభుత్వ భవనాలు నిర్మాణం చేయడానికి అవకాశం కల్పించారు. ఇలా గ్రామీణ ప్రాంతాల్లో మౌళిక సదుపాయాలు కల్పిం చడానికి ఉపాది హమీ పధకంలో అనేక మార్పులు చేస్తూ వచ్చారు. మొదట్లో వేసవి కాలంలో కూలీ లకు ప్రత్యేక ఇన్‌సెంటివ్ ఇచ్చేవారు. దీన్ని ఆ తర్వాత తొలగించారు. పోస్టు ఆఫీస్‌ల నుంచి కూలీ లకు వేతనాలు చెల్లించే విధానికి స్వస్తి పలికి నేరుగా కూలీ బ్యాంకు ఖాతాల్లో వేతనాలను జమ చేస్తూ వస్తున్నారు. వేతనాలు ఎప్పుడు జమ అవుతాయో నని ఎదురు చూసే సందర్భాలున్నాయి. కూలీ పను లకు వేతనదారులు హాజరు విషయంలోనూ బయో మెట్రిక్‌ను అనుసంధానం చేశారు. ఇలా అనేక మార్పు లకు శ్రీకారం చుట్టారు. చివరకు పథకం పేరు మార్చి అమలు చేస్తున్నారు. గ్రామీణ ప్రాంతాలో ఆర్హులందరి నుంచీ జాబ్ కార్డుల కోసం ఇటీవల దరఖాస్తులను ప్రభుత్వం ఆహ్వానించింది. అర్హత కలిగిన వారందరికీ ఉపాధి పనులు చేయడానికి అవకాశం కల్పించనున్నారు. ప్రస్తుతం జిల్లా నీటి యాజమాన్య సంస్థ అధికారుల లెక్కల ప్రకారం జిల్లాలో 4.30 లక్షల మందికి జాబ్‌కార్డులు జారీ చేయగా, అందులో మనుగడలో ఉన్నవి 3.71 లక్షలు. క్రమం తప్పకుండా పనుల్లోకి వస్తున్నా వారిలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 3.16 లక్షల మంది ఉన్నారు. వీరిలో 100 రోజులు పనిని మొత్తం 3,036 కుటుంబాలకు కల్పించారు. ఇప్పటి వరకు సుమారు 534 కోట్ల విలువైన పనులు చేయగా అందులో వేతనాలు రూపంలో కూలీలకు రూ.322 కోట్లను చెల్లించారు. మెటీరియల్ కాంపొనెంట్ కింద రూ.192 కోట్లను చెల్లించారు. ఖరీప్ పూర్తి అయిన తర్వాత ఫిబ్రవరి నుంచి మే నెల వరకు ఉపాధి పనులకు విపరీతమైన డిమాండ్ ఉంటుంది. వ్యవసాయ పనులు లేని సమయంలోనే ఉపాది పనులు చేయడానికి కూలీలు ఆసక్తి చూపుతుం టారు. కొత్తగా కేంద్రం తీసుకువచ్చిన మార్పులు వల్ల ఉపాది హమీ పధకంపై ఎటువంటి ప్రభా వం చూపుతుందో వేచి చూడాలి.










Comments