జనాభా వృద్ధిలో అసమానతలు
- DV RAMANA

- Jul 30, 2025
- 2 min read

హిందువుల జనాభా నానాటికి తగ్గిపోతోందని హిందూ సంఘాలు తరచూ ఆందోళన వ్యక్తం చేస్తుం టాయి. అయితే ఒక్క మన దేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా హిందూ జనాభా తగ్గుతోంది. అంతర్జాతీయ సర్వే సంస్థ ఫ్యూ రీసర్చ్ సెంటర్ కొన్ని సంచలన విషయాలు వెల్లడిరచింది. దక్షిణా సియాలో హిందూ జనాభా భారీగా తగ్గినట్లు గణాంకాలతో సహా వివరించింది. 2010`20 మధ్య భారత్, పాకిస్తాన్, నేపాల్, బంగ్లాదేశ్‌లలో హిందూ జనాభా ఐదు శాతం మేరకు తగ్గిందని ఈ నివేదిక పేర్కొంది. ప్రపంచంలోనే నాలుగో అతిపెద్ద మతంగా ఉన్న హిందూ మతానికి చెందినవారు 120 కోట్ల మంది ఉన్నట్లు తెలిపింది. అలాగే షేర్ ఆఫ్ రెలీజియస్ మైనారిటీస్ ` ఎ క్రాస్ కంట్రీ అనాలిసిస్ (1950-2015) పేరిట విడుదలైన ఒక రిపోర్టులో మరికొన్ని కీలకాంశాలు వెల్లడయ్యా యి. 1950 నుంచి 2015 మధ్య కాలంలో భారతదేశంలో ముస్లిం జనాభా అత్యధికంగా పెరిగిం దని.. దాని పెరుగుదల రేటు ఏకంగా 43 శాతం మేరకు ఉందని పేర్కొంది. అదే సమయంలో హిందూ జనాభా పెరుగుదల రేటు ఎనిమిది శాతం వరకు తగ్గిపోయింది. పీఈడబ్ల్యూ రీసెర్చ్ సెంటర్ అధ్యయన నివేదిక ప్రకారం ప్రపంచ జనాభాలో మొదటి స్థానంలో క్రైస్తవులు ఉండగా రెండో స్థానంలో ముస్లింలు, మూడో స్థానంలో బౌద్ధ మతస్తులు ఉన్నారు. ఆ తర్వాత స్థానంలో హిందువులు ఉన్నారు. ప్రపంచ హిందువుల్లో దాదాపు 99 శాతం మంది ఆసియా-పసిఫిక్ ప్రాంతంలోనే నివసి స్తున్నారు. భారతదేశం, నేపాల్, మారిషస్‌లలో హిందువులు మెజారిటీ మత సమూహంగా ఉన్నారు. 2010-20 మధ్య మధ్యప్రాచ్యం, ఉత్తర ఆఫ్రికా ప్రాంతాల్లో హిందూ జనాభా 62 శాతం (దాదాపు 32 లక్షలకు) పెరిగింది. ఇదే కాలంలో ఉత్తర అమెరికాలో హిందూ జనాభా 55 శాతం (36 లక్షలకు) పెరిగింది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, యూరప్ వంటి ప్రాంతాల్లో కూడా హిందూ జనాభా కాస్త పెరిగినా భారతదేశం, నేపాల్, పాకిస్తాన్, బంగ్లాదేశ్‌లతో కూడిన దక్షిణాసియా ప్రాంతంలో మాత్రం హిందూ జనాభా వృద్ధి రేటు ఐదు శాతం వరకు తగ్గింది. 15 నుంచి 19 ఏళ్ల వయస్సు గల ముస్లిం మహిళల్లో ఎనిమిది శాతం టీనేజ్ గర్భధారణలతో ఇతర మతాల్లో కంటే ఎక్కువగా ఉన్నాయని నివేదిక పేర్కొంది. అలాగే మరో బిడ్డను కనాలనుకునే మహిళలు ముస్లిం మతంలోనే ఎక్కువ శాతం ఉన్నారు. 15 నుంచి 49 ఏళ్ల వయస్సున్న వివాహిత మహిళల్లో 72 శాతం మంది సిక్కులు, 71 శాతం మంది హిందువులు అదనపు పిల్లలను కనకూడదని భావిస్తుంటే.. ముస్లిం మతంలో ఇలా భావించే మహిళల సంఖ్య 64 శాతం మాత్రమే. భారతదేశంలోనే ఇదే పరిస్థితి నెలకొన్నట్లు ప్రధానమంత్రి ఆర్థిక సలహామండలి నివేదిక పేర్కొంది. 1950`2015 మధ్య కాలంలో దేశంలో హిందూ జనాభా 7.8 శాతం తగ్గిపోయింది. అదే సమయంలో మైనారిటీ జనాభా పెరిగింది. ముస్లిం జనాభా ఏకంగా 43.15 శాతం, క్రిస్టియన్ జనాభా 5.38 శాతం, సిక్కు జనాభా 6.58 శాతం పెరిగినట్లు నమోదైంది. 1950లో దేశ జనాభాలో హిందువుల వాటా 84 శాతం. కానీ 2015 నాటికి ఇది 78 శాతానికి పడిపోయిందని నివేదిక వెల్లడిరచింది. మరోవైపు గత 65 ఏళ్లలో ముస్లిం జనాభా 9.84 శాతం నుంచి 14.09 శాతానికి పెరిగింది. మెజారిటీ జనాభా తగ్గుదలలో దేశాల పరిస్థితిని పరిశీలిస్తే మయన్మార్ తర్వాత భారత్ రెండోస్థానంలో ఉంది. మయన్మార్‌లో మెజారిటీ జనాభా పది శాతం తగ్గగా.. భారత్‌లో దాదాపు ఎనిమిది శాతం తగ్గుదల ఉంది. మూడో స్థానంలో ఉన్న నేపాల్‌లోనూ మెజారిటీ జనాభాగా ఉన్న హిందువుల్లో 3.6 శాతం తగ్గుదల నమోదైంది. భారత దేశంలో జనాభా వృద్ధి రేటులో ఇటువంటి అసాధారణ అసమానతలకు కారణం ప్రభుత్వం అనుసరి స్తున్న కుటుంబ నియంత్రణ విధానాలు, కొన్ని మతాల్లోని మూఢ నమ్మకాలేనని భావిస్తున్నారు. మన దేశంలో హిందువులతో పోలిస్తే ముస్లింలలో అక్షరాస్యత తక్కువ, కట్టుబాట్లు చాలా ఎక్కువ. గ్రామీణ ప్రాంతాల్లో ఇది మరింత ఎక్కువగా కనిపిస్తుంది. దాంతో జనాభా నియంత్రణ పద్ధతులను ఈ వర్గీయులు పెద్దగా పాటించడంలేదని ఎన్నో అధ్యయనాల్లో వెల్లడైంది. హిందువులు, క్రిస్టియన్లు, ఇతర వర్గాలవారు ఒకరు లేదా ఇద్దరు పిల్లలతో సరిపెట్టుకుంటే. ముస్లిం వర్గీయులు ఇప్పటికీ బహుళ సంతానం వైపే మొగ్గు చూపుతున్నారు. అధిక శాతం ముస్లింలు కు.ని. విధానాలను పాటించడానికి ఇష్టపడటంలేదు. ఓట్ల రాజకీయాల కారణంగా ప్రభుత్వాలు కూడా వారిని ఏమీ అనలేకపోతున్నాయి. ఇదే జనాభాలో అసమానతలకు దారితీస్తోంది.










Comments