top of page

టాటాకు ఏమైంది?

  • Writer: NVS PRASAD
    NVS PRASAD
  • 12 hours ago
  • 5 min read

రతన్ టాటా చనిపోయే ఇంకా రెండేళ్లు కూడా కాలేదు. అప్పుడే టాటా కంపెనీ లోపల చాలా పెద్ద భూకంపాలే వస్తున్నాయి. ఒకప్పుడు టాటా అంటే నమ్మకం, టాటా అంటే చారిటీ, టాటా అంటే ఒక ఎమోషన్. కానీ ఇప్పుడు టాటా లోపల జరుగుతున్న పాలిటిక్స్, పవర్ స్ట్రగుల్స్, కేవలం లాభాల కోసమే తీసుకుంటున్న నిర్ణయాలు చూస్తుంటే అసలు టాటా గ్రూప్‌కి ఏమవుతుంది అనే భయం అందరిలో మొదలైంది. టాటా కోర్ వాల్యూస్ అయిన ఎథిక్స్, ఎంప్లాయి కేర్ ఇప్పుడు కనుమరుగైపోతుందా? అసలు టాటా ట్రస్ట్‌లో ఎవరు ఎవరితో గొడవలు పడుతున్నారు? రిజర్వ్‌బ్యాంక్, సెంట్రల్ గవర్నమెంట్ టాటా మీద ఎందుకు ఒత్తిడి పెడుతున్నాయి? ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానాలు ఈ కథనంలో తెలుసుకుందాం. ఎందుకంటే ఇది కేవలం ఒక కంపెనీ కోసం కాదు. ఇది మన దేశ ఎకానమీని శాసిస్తున్న ఒక సామ్రాజ్యం కోసం.

టాటా గ్రూప్ ఎప్పుడూ కూడా లాభాల కోసం కక్కుర్తిపడే కంపెనీ కాదు. రతన్ టాటా టైంలో వాళ్లు ఎంప్లాయీస్‌ని, పబ్లిక్‌ని ఎంత రక్షణగా చూసేవారో మనందరికీ తెలుసు. 2008 నవంబర్ 29న ముంబై తాజ్ హోటల్ మీద టెర్రరిస్ట్ అటాక్ జరిగినప్పుడు రతన్ టాటా తీసుకున్న నిర్ణయాలు చరిత్రలో నిలిచిపోయాయి. ఆ దాడిలో చనిపోయిన ప్రతి స్టాఫ్ ఫ్యామిలీకి ఒక కోటి రూపాయల పరిహారంగా ఇచ్చారు. అది 2008లో అంతటితో ఆగలేదు. వాళ్ల ఫ్యామిలీలో ఎవరికైనా లైఫ్ టైం ఉద్యోగావకాశం ఇచ్చారు. వాళ్ల పిల్లలకి లైఫ్ టైం ఫ్రీ ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేశారు. గాయపడిన వారికి ఫ్రీ ట్రీట్మెంట్ ఇచ్చారు. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది.

రతన్ టాటా అనంతరం ఫోకస్ అంతా లాభాలను పెంచుకోవడం మీదకే వెళ్లిపోయింది. తాజాగా ఒక ఎయిర్ ఇండియా విమానం కూలిపోయింది. అందులో ఒక్కరు తప్ప అందరూ చనిపోయారు. అహ్మదాబాద్‌లో జరిగిన ఈ ప్రమాదంలో కూడా కోటి రూపాయలే ఇచ్చారు. కాకపోతే 2008 నాటి ధరలతో పోలిస్తే, ఇప్ప్పుడు ఇది సరిపోదు. దాంతో పాటు ఒక కండిషన్ పేపర్ మీద సైన్ చేయించుకున్నారు. మీరు మా కంపెనీ మీద భవిష్యత్తులో కేస్ వేయడానికి వీలు లేదని. ఇది టాటా డీఎనఏ కాదు. ఈ మార్పులన్నీ ఎందుకు వస్తున్నాయి. ఇది అర్థం కావాలంటే అసలు టాటా గ్రూప్ ఎలా పని చేస్తుంది. వాళ్ల సామ్రాజ్యం ఏంటో మనం కచ్చితంగా తెలుసుకోవాలి.

టాటా సన్స్ అసలు ఎవరిది? చాలామంది ఇది రతన్ టాటాది అని అనుకుంటారు. కానీ రతన్ టాటా పేరు మీద కేవలం 0.83% షేర్లు మాత్రమే ఉన్నాయి. ఆయన తన సంపద అంతా ట్రస్ట్‌కి రాసిచ్చారు. టాటా సన్స్‌లో 65.9% షేర్స్ టాటా ట్రస్ట్ దగ్గర ఉన్నాయి. అంటే టాటాకు చెందిన 400 కంపెనీలు సంపాదించిన ప్రాఫిట్‌లో 65.9% డైరెక్ట్‌గా టాటా ట్రస్ట్‌కి వెళ్తుంది. ఈ ఫండ్స్‌తోనే వాళ్లు చారిటీ లాంటివి చేస్తూ ఉంటారు.

సెకండ్ బిగ్గెస్ట్ షేర్ హోల్డర్ ఎవరంటే షాపూర్జి పల్లోంజి గ్రూప్ అంటే ఎస్పీజీ. వాళ్ల దగ్గర 18.44% షేర్స్ ఉన్నాయి. మిగిలిన షేర్స్ కొన్ని టాటా ఇంటర్నల్ కంపెనీల దగ్గర, రతన్ టాటా లాంటి ఇతర వ్యక్తుల దగ్గర ఉన్నాయి. రూల్ ప్రకారం ఎవరి దగ్గర 51% కంటే ఎక్కువ షేర్స్ ఉంటాయో వాళ్ల మాటే శాసనం. ఇక్కడ టాటా ట్రస్ట్ దగ్గర 65.9% ఉంది కాబట్టి టాటా ట్రస్ట్ చెప్పిందే టాటా సన్స్ వింటుంది. టాటా సన్స్ చెప్పిందే ఆ 400 కంపెనీలు వింటాయి.

టాటా ట్రస్ట్‌ని కంట్రోల్ చేసేది ఎవరు? రతన్ టాటా బతికున్నప్పుడు ఆయనే చైర్మన్. ఆయనతో పాటు ఇంకొక ఏడుగురు ట్రస్టీలు ఉండేవారు. రతన్ టాటా మరణించాక ఆయన సోదరుడు నోయల్ టాటా పొజిషన్‌లోకి వచ్చారు. ఈ కొత్త మేనేజ్మెంట్ వచ్చిన దగ్గర నుంచి చారిటీ కంటే ప్రాఫిట్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు. దీనివల్ల టాటా ట్రస్ట్ లోపల ఇంటర్నల్‌గా పెద్ద యుద్ధం మొదలైంది. టాటా ట్రస్ట్‌లో ఒక రూల్ ఉంది. ఈ ఏడుగురిలో ఎవరికైనా 75 ఏళ్లు వస్తే వాళ్ల పొజిషన్ మీద ఓటింగ్ జరుగుతుంది. ఆ 75 ఏళ్ల వ్యక్తిని పక్కన పెట్టి మిగిలిన ఆరుగురు ఓటు వేసి అతన్ని ట్రస్ట్‌లో ఉంచాలా లేక తీసేయాలా అని డిసైడ్ చేస్తారు. రతన్ టాటా ఉన్నప్పుడు విజయ్ సింగ్ అనే ఒక ట్రస్టీకి 75 ఏళ్లు వచ్చాయి. కానీ రతన్ టాటా సపోర్ట్ వల్ల అతన్ని మళ్లీ కొనసాగించారు. కానీ రతన్ టాటా చనిపోయిన వెంటనే ఈక్వేషన్స్ మారిపోయాయి. మళ్లీ ఓటింగ్ జరిగింది. ఈసారి నలుగురు ట్రస్టీలు విజయ్ సింగ్‌కి వ్యతిరేకంగా ఓటు వేశారు. దాంతో ఆయన్ని బయటికి పంపించారు. ఇప్పుడు టాటా ట్రస్ట్ లోపల ఉన్నవాళ్లు రెండు వర్గాలుగా విడిపోయారు.

గ్రూప్-ఏ రతన్ టాటా బ్రదర్స్.. వీళ్లు ఇద్దరే ఉన్నారు. కానీ వీళ్ల చేతిలో చైర్మన్ పవర్ ఉంది. ఇంకొక గ్రూప్‌లో నలుగురు ఉన్నారు. కానీ వీళ్ల దగ్గర మెజారిటీ ఉంది. సో ప్రతిఒక్కరు తమ మనుషుల్ని టాటా ట్రస్ట్ లోపల టాటా కంపెనీల బోర్డులో కూర్చోబెట్టాలని చూస్తున్నారు. ఈ ఇంటర్నల్ పాలిటిక్స్ వల్ల టాటా కంపెనీల నుంచి వచ్చే ప్రాఫిట్స్‌ని చారిటీకి ఎలా వాడాలి అనే దాని మీద ఇంకా క్లారిటీ లేదు. రీఇన్వెస్ట్ చేయాల్సిన ఫండ్స్ ఆగిపోతున్నాయి. దీంతో మన గవర్నమెంట్ భయపడుతుంది. అందుకే ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్, హోమ్ మినిస్టర్ అమిత్ షా ఎమర్జెన్సీ మీటింగ్ పెట్టి మరీ టాటా మేనేజ్మెంట్‌తో మాట్లాడారు. ఇందులో మనకొక డౌట్ రావచ్చు.. ఒక ప్రైవేట్ కంపెనీ లోపల గొడవలయితే గవర్నమెంట్‌కి ఎందుకు అంత భయం అని. ఎందుకంటే టాటా సన్స్ టోటల్ వాల్యేషన్ 45 లక్షల కోట్లు. ఇది ఎంత పెద్ద మొత్తం అంటే.. మన పక్క దేశం పాకిస్తాన్ టోటల్ స్టాక్ మార్కెట్ వాల్యూ కంటే ఇది చాలా ఎక్కువ. టాటా వ్యాపార సామ్రాజ్యం కింద 1 మిలియన్ అంటే 10 లక్షల మంది ఎంప్లాయీస్ పని చేస్తున్నారు. టాటా ట్రస్ట్ లోపల చిన్న భూకంపం వచ్చినా సరే అది దేశ ఎకానమీ మీద సునామీలా పడుతుంది. 2024లో టాటా సన్స్ 43 వేల కోట్ల లాభం తెచ్చింది.

అందులో ఎక్కువ శాతం ట్రస్ట్‌కి వెళ్తుంది. ఈ పైసల్ని సరిగ్గా రీఇన్వెస్ట్ చేయకపోతే గొడవలతో ఫండ్స్ బ్లాక్ అయితే రతన్ టాటా లెగసీ డేమేజ్ అవుతుంది. దేశంలో జాబ్ మార్కెట్, స్టాక్ మార్కెట్ దారుణంగా పడిపోతాయి. అందుకే గవర్నమెంట్ డైరెక్ట్‌గా కలుగజేసుకొని అసలు ఏం జరుగుతుంది, మీ గొడవలు ఏంటో త్వరగా సెటిల్ చేసుకోండి అని వార్నింగ్ ఇచ్చింది. ఒక పక్కన ట్రస్ట్‌లో గొడవలు అయితే ఇంకో పక్కన టాటా సన్స్‌కి సెకండ్ బిగ్గెస్ట్ షేర్ హోల్డర్ అయిన షాపూర్జి పల్లోంజి గ్రూప్ వాళ్లు టాటా మీద పిచ్చ కోపంతో ఉన్నారు. ఎస్‌పీజీ దగ్గర టాటా సన్స్ 18.44% షేర్లు ఉన్నాయి. వాటి విలువ 5.40 లక్షల కోట్లు. కానీ అసలు ప్రాబ్లం ఏంటంటే.. ఆ షేర్స్ అన్నీ కేవలం పేపర్ మీద మాత్రమే ఉన్నాయి. ఎందుకంటే టాటా సన్స్ ఏర్పడినప్పుడు ఒక రూల్ పెట్టారు. టాటా సన్స్ అనేది ఒక ప్రైవేట్ సామ్రాజ్యం. ఇది ప్రాఫిట్ కోసం కాదు. కాబట్టి షేర్స్‌ని ఎవరూ బయట వాళ్లకి అమ్మడానికి వీలు లేదనే రూల్ ఉంది. అయితే ఇప్పుడు ఎస్పీజీ వాళ్లు రూ.60వేల కోట్ల అప్పుల్లో ఉన్నారు. వాళ్ల దగ్గర 5.4 లక్షల కోట్ల ఆస్తులు ఉన్నా, వాటిని అమ్ముకొని అప్పు తీర్చుకోలేని పరిస్థితి. పోనీ ఆ షేర్స్‌ని బ్యాంకులో పెట్టి లోన్ తెచ్చుకుందామన్నా రతన్ టాటా ముందే రిజెక్ట్ చేశారు. ఎందుకంటే రేపు పొద్దున ఎస్పీజీ వాళ్లు లోన్ కట్టకపోతే బ్యాంక్స్ వచ్చి టాటా షేర్స్‌ని తీసుకుంటాయి. అప్పుడు టాటా ట్రస్ట్‌లోకి బయటి వాళ్లు వస్తారు. అది రతన్ టాటాకి ఇష్టం లేదు. అందుకే ఎస్పిజికి ఏం చేయాలో పాలుపోక టాటా మేనేజ్మెంట్ మీద యుద్ధానికి దిగింది. ఇదంతా ఒకెత్తు అయితే మన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా టాటా సన్స్‌కి గట్టి షాక్ ఇచ్చింది. టాటా సన్స్ లాంటి పెద్ద హోల్డింగ్ కంపెనీలని ఆర్‌బీఐ అప్పర్ లేయర్ ఎన్బిఎఫ్‌సీగా చూస్తుంది. అంటే నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీ. ఎగ్జాంపుల్ బజాజ్ వాళ్లు మనందరికీ లోన్స్ ఇస్తారు. కానీ వాళ్లది బ్యాంక్ కాదు ఫైనాన్స్ కంపెనీ అంతే. ఆర్బీఐ రూల్ ప్రకారం ఇంత పెద్ద టర్నోవర్ చేస్తున్న ఎన్బిఎఫ్‌సీ కచ్చితంగా స్టాక్ మార్కెట్‌లోకి రావాలి. స్టాక్ మార్కెట్‌లోకి వస్తే పబ్లిక్ ఇన్వెస్టర్స్ వస్తారు. కొంతమంది భారీగా షేర్లు కొని టాటా సన్స్‌లో వాటా పెంచుకుంటారు. కాబట్టి టాటా సన్స్ మీద లాభాలు రావాలన్న ఒత్తిడి పెరుగుతుంది. కానీ రతన్ టాటాకి ఇది ఇష్టం లేదు. ఎందుకంటే ఇది లాభాల కోసం నడిచేది కాదు.. ఇది సేవ కోసమే నడిచే కంపెనీ కాబట్టి. స్టాక్ మార్కెట్‌లోకి రావాలని ఆర్బీఐ టాటాకి మÖడేళ్లు సమయం ఇచ్చింది. అప్పట్లో రతన్ టాటా ఆర్బీఐతో మాట్లాడి తాము ఒక ట్రస్ట్‌లాగా రన్ అవుతున్నామని, ఐపిఓ వద్దని చెప్పారు. కానీ ఆర్బీఐ మాత్రం టాటా గ్రూప్ మీద 20వేల కోట్ల మార్కెట్‌లో లోన్ ఉంది కాబట్టి కచ్చితంగా రావాల్సిందేనని చెప్పింది. రతన్ టాటా వెంటనే ఆ 20వేల కోట్ల లోన్‌ని తీర్చేసి ఇప్పుడు తమపై ఏ అప్పు లేదని, ఆ లిస్ట్ నుంచి తమను తీసేయండంటూ అప్లికేషన్ పెట్టారు. దాని మీద ఆర్బీఐ ఇంకా డెసిషన్ తీసుకోలేదు. కానీ టాటా సన్స్‌కి ఇచ్చిన డెడ్‌లైన్ గత ఏడాది సెప్టెంబర్‌తోనే అయిపోయింది. ఈ ప్రెజర్ అంతా ఇప్పుడు టాటా మేనేజ్మెంట్ మీదనే పడుతుంది. పైన బోర్డ్ రూమ్‌లో ఇంత రచ్చ జరుగుతుంటే కింద ఆపరేటింగ్ కంపెనీలలో పరిస్థితి ఇంకా దారుణంగా ఉంది. కొత్త మేనేజ్మెంట్ మొత్తం లాభాల మీద ఫోకస్ చేయడంతో ఎంప్లాయీస్ సెక్యూరిటీ, కస్టమర్ ట్రస్ట్ కంప్లీట్‌గా కిందకు దిగిపోతున్నాయి.

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల మ్యాన్ పవర్ తగ్గించి ప్రాఫిట్ పెంచాలి. ఇది ఇప్పుడు టిసిఎస్ మంత్రం. ఒకప్పుడు టాటాలో జాబ్ వస్తే లైఫ్ సెటిల్. కానీ గత ఏడాది సెకండ్ క్వార్టర్‌లో 1975 మందిని ఆ తర్వాత 11,151 మంది ఎంప్లాయీస్‌ని టిసిఎస్ పీకేసింది. అంటే కేవలం ఆరు నెలల్లో 13వేల మందికి పైగా జాబ్స్ పోయాయి. అది కూడా ఇలా హెచఆర్‌లు పిలిచి మీరు సొంతంగా రిజైన్ చేసేయండి. లేకపోతే మేము ఫైర్ చేస్తామని బెదిరించి వాళ్ల చేత రిజైన్ చేయించారు. ఇది టాటా వాల్యూస్‌కి కంప్లీట్‌గా వ్యతిరేకం.

టాటా మోటార్స్ రీసెంట్‌గా చాలా మంచి సేఫ్ కార్లను ఉత్పత్తి చేస్తుంది. కానీ జనాలు టాటా కార్లు కొనాలంటే భయపడుతున్నారు. సర్వీస్ విషయంలో కస్టమర్ ట్రస్ట్ కంప్లీట్‌గా (సర్వీసింగ్) తగ్గిపోతుంది. ఎయిర్ ఇండియాని టాటా టేకోవర్ చేసినప్పుడు అందరూ సంబరపడిపోయారు. కానీ ఎయిర్ ఇండియా లాసెస్ చూస్తుంటే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే. 2021లో రూ.20వేల కోట్ల నష్టం, తర్వాత సంవత్సరం రూ.9,626 కోట్లు నష్టం. ఆ తర్వాత విస్తారాను టేకోవర్ చేసుకుంది. అప్పుడు లాస్ రూ.15,532 కోట్లకు పెరిగింది. గత ఏడాది ఇది రూ.10,860 కోట్ల దగ్గర ఉంది.

క్రోమా ప్రతి సంవత్సరం వెయ్యి కోట్ల లాస్‌లో ఉంటుంది. బిగ్ బాస్కెట్ రూ.800 కోట్ల నుంచి వెయ్యి కోట్ల లాస్. టాటా న్యూ యాప్‌ని పుష్ చేయడానికి మార్కెట్‌లో రూ.100 కోట్లు పోశారు. కానీ అనుకున్నంత రీచ్ రాలేదు. ఈ లాసెస్ అన్నిటిని కవర్ చేసేది మన టీసీఎస్, టాటా మోటార్స్ నుంచి వచ్చే ప్రాఫిట్స్. కానీ ఇప్పుడు కొత్త మేనేజ్మెంట్ ఈ లాస్ మేకింగ్ బ్రాంచెస్‌ని ప్రాఫిట్‌లోకి తీసుకురండి, లేకపోతే ముసేయండి అని సీరియస్‌గా వార్నింగ్ ఇస్తుంది. చూస్తుంటే ఒక విషయం క్లియర్‌గా అర్థమవుతుంది. రతన్ టాటా శకం ముగిసింది. ఆయన టైంలో ఉండే ఓపిక చారిటీ ఎంప్లాయి ఫస్ట్ అనే ఫిలాసఫీ ఇప్పుడు టాటాలో కనిపించట్లేదు. మోడర్న్ కాంపిటేటివ్ వరల్డ్‌లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రెవల్యూషన్ టైంలో టాటా మనుగడ సాగించాలంటే కచ్చితంగా ప్రాఫిట్ మైండెడ్‌గా ఉండాల్సిందే అని కొత్త మేనేజ్మెంట్ నమ్ముతుంది. కానీ ఒక వ్యాపార సామ్రాజ్యాన్ని నిలబెట్టేది కేవలం లాభాలు మాత్రమే కాదు.. నమ్మకం కూడా. టాటా ట్రస్ట్‌లో జరుగుతున్న పవర్ పాలిటిక్స్ ఎంప్లాయీస్‌ని భయపెట్టి పీకేయడం, కస్టమర్స్‌కి సర్వీస్‌లో స్కాన్ చేయడం ఇవి ఇలాగే కొనసాగితే.. టాటా అనే పేరుకున్న బ్రాండ్ వాల్యూ పడిపోవడానికి ఎంతో టైం పట్టదు. రూ.45 లక్షల కోట్ల సామ్రాజ్యాన్ని కూల్చడం ఎవరి వల్ల కాదు. కానీ ఆ భవంతిలో స్తంభాలు మాత్రం పెచ్చులూడుతున్నాయి. ఈ సంక్షోభాన్ని టాటా ఎలా హ్యాండిల్ చేస్తుందనేది మన దేశ భవిష్యత్తును కూడా డిసైడ్ చేస్తుంది.

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page