top of page

డెనిమ్స్‌లో మీనాక్షి సోయగాలు

  • Guest Writer
  • Jul 11, 2025
  • 2 min read

అందంతో కవ్విస్తుంది.. ఫ్యాషన్‌ సెన్స్‌తో మురిపిస్తుంది. కాంపిటీషన్‌ ఎంత ఉన్నా, తననే ప్రజల కళ్లు వెంబడిరచే సెంటరాఫ్‌ అట్రాక్షన్‌ గా నిలుస్తుంది. ఈ భామలో మల్టీ ట్యాలెంట్‌ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఇంతకీ ఎవరీ ముద్దుగుమ్మ? అంటే.. నిస్కంకోచంగా మీనాక్షి చౌదరి గురించే ఇదంతా. ఇప్పుడు మీనాక్షి బ్లూ డెనిమ్స్‌ లో గుబులు రేపే ఫోజులతో చెలరేగిపోయింది. ప్రస్తుతం ఈ స్పెషల్‌ ఫోటోషూట్‌ కుర్రకారు కంటికి కునుకుపట్టనీకుండా చేస్తోంది. మీనాక్షి బ్లూ అండ్‌ బ్లూ డెనిమ్‌ లుక్‌ లో ఎంతో సూపర్భ్‌ గా కనిపిస్తోందంటూ అభిమానులు ప్రశంసిస్తున్నారు. మీనాక్షి తన చేతికి బరువైన గాజులు, చెవికి కాంబినేషన్‌ జూకాల్ని ధరించి సంథింగ్‌ స్పెషల్‌ గా కనిపిస్తోంది.

వెంకీతో ‘సంక్రాంతికి వస్తున్నాం’, మహేష్‌తో ‘గుంటూరు కారం’ లాంటి భారీ చిత్రాల్లో నటించిన మీనాక్షి చౌదరి, టాలీవుడ్‌ కోలీవుడ్‌ లో పలు విజయవంతమైన చిత్రాల్లో నటించింది. హిట్‌ ది సెకండ్‌ కేస్‌, గోట్‌, లక్కీ భాస్కర్‌ లాంటి క్రేజీ చిత్రాల్లోను మీనాక్షి నటించింది. ఈ భామ నాగచైతన్య సరసన ఓ చిత్రంలో నటిస్తోంది. అలాగే అనగనగా ఒక రోజు అనే చిత్రంలోను నటిస్తోంది. ఈ రోజుల్లో ఇండస్ట్రీలో నెగ్గుకు రావాలంటే, యూనిక్‌నెస్‌తో దూసుకురావాలని చెప్పే మీనాక్షి తనదైన యూనిక్‌నెస్‌తో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.

- తుపాకి.కామ్‌ సౌజన్యంతో...


అనుష్క ఇక బయటకు రాదా?

ఒకప్పుడు టాలీవుడ్‌లో నెంబర్‌ వన్‌ హీరోయిన్‌ ఎవరంటే అనుష్క పేరే చెప్పేవారు. క్రేజ్‌ పరంగా, పారితోషికం పరంగా.. తనే నెంబర్‌ వన్‌. అయితే ఇప్పుడు ఆ వైభవం, వైభోగం రెండూ పోయాయి. అనుష్క ని వెండి తెరపై చూసి చాలా కాలం అయ్యింది. సినిమా ఫంక్షన్లలో స్వీటీ కనిపిస్తే ఒట్టు. చివరిగా తాను ఓ ఈవెంట్‌ కి ఎప్పుడు హాజరైందో కూడా గుర్తే లేదు. బాహుబలి సినిమా విడుదలై పదేళ్లు అయిన సందర్భంగా బాహుబలి టీమ్‌ రీ యూనియన్‌ ఏర్పాటు చేసింది. రాజమౌళి, ప్రభాస్‌ తో సహా చాలామంది నటీనటులు, టెక్నీషియన్లు ఈ రీ యూనియన్‌ లో మెరిశారు. కానీ అనుష్క మాత్రం కనిపించలేదు. తన చేతిలో %`%ఘాటీ%`% అనే ఒకే ఒక్క తెలుగు సినిమా వుంది. ఈ సినిమా ప్రమోషన్లలో కూడా స్వీటీ కనిపించడబోవడం లేదని తెలుస్తోంది. అనుష్క లేకుండానే ఈ సినిమా ప్రమోషన్లని క్రిష్‌ అండ్‌ కో ప్లాన్‌ చేసిందని సమాచారం అందుతోంది.

అసలు స్వీటీకి ఏమైంది? సినిమా ప్రమోషన్లకు, ఈవెంట్లకు ఎందుకు రావడం లేదు? తన నుంచి ఒక్క లేటెస్ట్‌ పిక్‌ గానీ, వీడియో గానీ ఎందుకు చూడలేకపోతున్నాం? అని ఫ్యాన్స్‌ కూడా చాలా నిరుత్సాహానికి గురవుతున్నారు. స్వీటీ చాలాకాలం నుంచి వ్యక్తిగత సమస్యలతో బాధ పడుతోంది. అందుకే సినిమా అవకాశాలూ తగ్గుతూ వస్తున్నాయి. వీటన్నింటికీ కారణం ‘సైజ్‌ జీరో’ అనే సినిమా. రాఘవేంద్రరావు తనయుడు ప్రకాష్‌ దర్శకత్వంలో ‘సైజ్‌ జీరో’ అనే ఓ సినిమా వచ్చిన సంగతి గుర్తుండే ఉంటుంది. ఈ సినిమా కోసం స్లిమ్‌ గా ఉన్న అనుష్క కాస్త బొద్దుగా మారింది. అయితే ఆ సినిమా పూర్తయిన తరవాతి నుంచీ సన్నబడడానికి చేసిన ఏ ప్రయత్నమూ వర్కవుట్‌ కాలేదు. పైగా ఆ ప్రయత్నాలు అనుష్కని శారీరకంగా మరింత ఇబ్బంది పెట్టాయి. తను ఈమధ్య మరీ లావుగా మారిపోయిందని, ఆ రూపంతో బయటకు రావడం ఇష్టం లేకే.. ఇలా సినిమా ఈవెంట్లకు, ప్రమోషన్లకు డుమ్మా కొడుతోందని సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి.

తాను షూటింగ్‌కి వచ్చినా సెట్లో చాలా తక్కువ మందే ఉండాలని అనుష్క కండీషన్‌ పెడుతోందట. సీజీలతో లావుగా ఉన్న అనుష్కని సన్నగా చూపించడానికి చాలా కష్టపడాల్సివస్తోందని, అనుష్క రెమ్యునరేషన్‌ కంటే తన సీజీల కోసమే నిర్మాతలు ఎక్కువ ఖర్చు పెడుతున్నారని ఇన్‌ సైడ్‌ వర్గాలు చెబుతున్నాయి. అయితే సన్నబడడానికి అనుష్క ఇప్పటికీ ప్రయత్నిస్తోందని, ఆ ప్రయత్నాలు సఫలీకృతమైతేనే స్వీటీ బయటు వస్తుందని, లేదంటే ఇలానే ప్రైవసీ కొనసాగిస్తుందని అంటున్నారంతా. అనుష్క బయటకు రాకపోవడానికి అసలు కారణం తెలిసి స్వీటీ ఫ్యాన్స్‌ కూడా ఫీలవుతున్నారు. అనుష్క ఎప్పుడు స్లిమ్‌ అవుతుందో.. ఎప్పుడు బయటకు వస్తుందో?

- తెలుగు 360.కామ్‌ సౌజన్యంతో...

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page