top of page

‘డోపింగ్‌’ కేసుల్లో మనమే ఫస్ట్‌

  • Writer: Prasad Satyam
    Prasad Satyam
  • Dec 24, 2025
  • 3 min read

ప్రపంచ డోపింగ్‌ నిరోధక సంస్థ(వాడా) కొత్త నివేదిక ప్రకారం, 2024లో భారతదేశం మొత్తం 260 డోపింగ్‌ ఉల్లంఘనలను నమోదు చేసింది. అన్ని దేశాల కంటేకూడా ఇది చాలా ఎక్కువ. దీంతో భారతదేశం వరుసగా మూడవ సంవత్సరం ప్రపంచంలో అత్యధిక డోపింగ్‌ ఉల్లంఘనలు జరిగిన దేశంగా నిలిచింది. ఈక్రమంలోనే ఫ్రాన్స్‌ రెండవ స్థానం, ఇటలీ మూడవ స్థానంలో నిలిచాయి. డోపింగ్‌ కేసుల్లో భారత అథ్లెట్లు మరోసారి ప్రపంచంలోనే అగ్రస్థానంలో నిలిచారు. ప్రపంచ డోపింగ్‌ నిరోధక సంస్థ(వాడా) కొత్త నివేదిక ప్రకారం, 2024లో భారతదేశం మొత్తం 260 డోపింగ్‌ ఉల్లంఘనలను నమోదు చేసింది, అన్ని దేశాల కంటేకూడా ఇది చాలా ఎక్కువ. టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా కథనం ప్రకారం, డిసెంబర్‌ 16న వాడా వెబ్‌సైట్‌లో విడుదల చేసిన ఈ నివేదికలో భారతదేశం వరుసగా మూడవసారి ప్రపంచంలోనే అతిపెద్ద డోపింగ్‌ నేరస్థ దేశంగా పేర్కొనబడిరది. 2030లో కామన్వెల్త్‌ క్రీడల శతాబ్ది ఎడిషన్‌ను నిర్వహించడానికి భారతదేశం సిద్ధమవుతుంది. ఈ తరుణంలో భారతదేశ అత్యధిక డోపింగ్‌ రికార్డును వెల్లడిరచే ఈ నివేదిక వెలువడిరది. 2036 ఒలింపిక్‌ క్రీడలను కూడా నిర్వహించడానికి భారతదేశం కృషి చేస్తోంది. దీనికంటే ముందు, భారత ప్రతినిధి బృందంతో జరిగిన సమావేశంలో పునరావృతమయ్యే డోపింగ్‌ కేసులపై అంతర్జాతీయ ఒలింపిక్‌ కమిటీ(ఐఓసీ) ఆందోళన వ్యక్తం చేసింది. వాడా నివేదిక ప్రకారం, భారతదేశంలో డోపింగ్‌ సంబంధిత కేసుల సానుకూలత రేటు 3.6 శాతం, అంటే మొత్తం 260 కేసులు నమోదయ్యాయి. ఇది అన్ని దేశాలలో కంటే అత్యధికం. ది హిందూలో వచ్చిన కథనం ప్రకారం, 2024లో క్రీడా విభాగాలలో అథ్లెటిక్స్‌లో అత్యధికంగా డోపింగ్‌ 76 కేసులు కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత వెయిట్‌ లిఫ్టింగ్‌లో 43, రెజ్లింగ్‌లో 29 కేసులు నమోదయ్యాయి. ఇతర దేశాలలో 2024లో 91 మంది అథ్లెట్లకు పాజిటివ్‌ రావడంతో ఫ్రాన్స్‌ రెండవ స్థానంలో ఉండగా, ఇటలీ 85 కేసులతో మూడవ స్థానంలో ఉంది. ఈ నివేదిక విడుదలైన తర్వాత, భారతదేశ జాతీయ డోపింగ్‌ నిరోధక సంస్థ(ఎన్‌ఏడీఏ) డోపింగ్‌కు వ్యతిరేకంగా తన నిబద్ధతను పునరుద్ఘాటిస్తూ ఒక ప్రకటనను విడుదల చేసింది. ‘గత కొన్ని సంవత్సరాలుగా భారతదేశ డోపింగ్‌ నిరోధక చట్రాన్ని గణనీయంగా బలోపేతం చేశారు. క్రీడలలో డోపింగ్‌ సమస్యను ఎదుర్కోవడానికి, నాడా ఇండియా పరీక్షల సంఖ్యను పెంచడమే కాకుండా విద్య, అవగాహనను కూడా నొక్కి చెప్పింది’ అని నాడా తన ప్రకటనలో పేర్కొన్నది. వాడా నివేదిక ప్రకారం, భారత్‌లో 260 అడ్వర్స్‌ అనలిటికల్‌ ఫైండిరగ్స్‌ (ఏఏఎఫ్‌ఎస్‌) నమోదయ్యాయి. అంటే డోపింగ్‌ పరీక్షల పాజిటివిటీ రేటు 3.6 శాతంగా ఉంది. 5వేలు లేదా అంతకంటే ఎక్కువ పరీక్షలు నిర్వహించిన అన్ని దేశాల్లో ఇదే అత్యధికం. ఢల్లీి కేంద్రంగా పనిచేసే నేషనల్‌ యాంటీ డోపింగ్‌ ఏజెన్సీ (నాడా), గత ఏడాది మొత్తం 7,113 పరీక్షలు నిర్వహించింది. ఇందులో 6,576 మూత్ర నమూనాలు (యూరిన్‌ శాంపిల్స్‌), 537 రక్త నమూనాలు ఉన్నాయి. వీటిలో 253 మూత్ర నమూనాలు నిషేధిత పదార్థాల వాడకం వల్ల పాజిటివ్‌గా తేలగా, ఏడు రక్త నమూనాలు డోప్‌ టెస్టులో విఫలమయ్యాయి. అయితే, ఈ గణాంకాలు డోపింగ్‌ పెరగడం వల్ల కాదని, తాము పరీక్షల సంఖ్యను పెంచడం వల్లే ఇన్ని కేసులు బయటపడ్డాయని నాడా స్పష్టం చేసింది. 2023లో 5,606 నమూనాలను సేకరించగా 213 కేసులు పాజిటివ్‌గా వచ్చాయి. ప్రపంచంలోని ఇతర అగ్రశ్రేణి క్రీడా దేశాలు భారత్‌ కంటే ఎక్కువ పరీక్షలు నిర్వహించినప్పటికీ, అక్కడ పాజిటివిటీ రేటు చాలా తక్కువగా ఉంది. ఫ్రాన్స్‌ 11,744 పరీక్షల్లో కేవలం 91 కేసులు (0.8 శాతం), రష్యా 10,514 పరీక్షల్లో 76 కేసులు (0.7 శాతం), చైనా 24,214 పరీక్షల్లో కేవలం 43 కేసులు (కేవలం 0.2 శాతం), అమెరికా 6,592 పరీక్షల్లో 1.1 శాతం పాజిటివిటీ రేటు నమోదైంది. భారతీయ క్రీడా సంస్కృతిలో ఈ డోపింగ్‌ సమస్య ఎంత లోతుగా ఉందో ఈ నివేదిక ఎత్తి చూపుతోంది. దేశంలో పటిష్టమైన శాస్త్రీయ, పరిశోధనా వ్యవస్థ అవసరమని ఇది పునరుద్ఘాటించింది. అంతేకాకుండా, వివిధ క్రీడలతో సంబంధం ఉన్న భారతీయ కోచ్‌లు, వైద్యులు, ఫిజియోథెరపిస్టులకు పనితీరును పెంచే మందులు, సప్లిమెంట్ల గురించి ప్రాథమిక అవగాహన లేదని ఈ గణాంకాలు చెబుతున్నాయి. ఈ గణాంకాలు ఆందోళన కలిగించేవిగా అనిపించినప్పటికీ, ఇది భారత్‌ తన పరీక్షా విధానాన్ని కఠినతరం చేయడం, విస్తరించడం వల్ల వచ్చిన ఫలితమే తప్ప, డోపింగ్‌ వినియోగం అకస్మాత్తుగా పెరగడం వల్ల కాదని మనం గుర్తించాలి అని నాడా ఒక ప్రకటనలో తెలిపింది. 2025లో ఇప్పటి వరకు నాడా 7,068 పరీక్షలు నిర్వహించగా, పాజిటివిటీ రేటు 1.5 శాతానికి (110 కేసులు) తగ్గినట్లు సమాచారం. డోపింగ్‌ ముప్పును అరికట్టడానికి భారత ఒలింపిక్‌ అసోసియేషన్‌ (ఐవోఏ) ఇటీవల కొత్త యాంటీ డోపింగ్‌ ప్యానెల్‌ను ఏర్పాటు చేసింది. అలాగే, క్రీడల్లో అత్యున్నత ప్రమాణాలను, నిజాయితీని కాపాడటానికి ప్రభుత్వం జాతీయ యాంటీ డోపింగ్‌ బిల్లును కూడా ఆమోదించింది. గతంలో డోపింగ్‌ (నిషేధిత ఉత్ప్రేరకాల వాడకం) పరీక్షల్లో విఫలమై, నిషేధానికి గురైన ప్రముఖ భారతీయ క్రీడాకారుల్లో నరసింగ్‌ యాదవ్‌ (కుస్తీ) 2016 రియో ఒలింపిక్స్‌కు ముందు దొరికిపోయారు. ఈయన్ను నాలుగేళ్లు నిషేధించారు. దీపా కర్మాకర్‌ (జిమ్నాస్టిక్స్‌) ‘హిజెనమైన్‌’ అనే నిషేధిత పదార్థం వాడినందుకు 21 నెలల నిషేధం. అశ్విని అక్కుంజి (అథ్లెటిక్స్‌) 2011లో ఉత్ప్రేరకాలు వాడినట్లు తేలింది. రెండేళ్ల నిషేధం. సీమా పునియా (డిస్కస్‌ త్రో) 2000 వరల్డ్‌ జూనియర్‌ ఛాంపియన్‌షిప్‌లో దొరికి పతకం కోల్పోయారు. సరబజిత్‌ కౌర్‌ (వెయిట్‌లిఫ్టింగ్‌) 2020లో డోప్‌ టెస్టులో విఫలమయ్యారు. నాలుగేళ్ల నిషేధం. సందీప్‌ కుమారి (డిస్కస్‌ త్రో) 2018లో వాడా పరీక్షల్లో దొరికిపోయారు. నాలుగేళ్ల నిషేధం. నిర్మల షెరాన్‌ (అథ్లెటిక్స్‌) 2018లో డోపింగ్‌ ఉల్లంఘన వల్ల నాలుగేళ్ల నిషేధం ఎదుర్కొన్నారు. సంజీతా చాను (వెయిట్‌లిఫ్టింగ్‌) 2023లో నిషేధిత అనబోలిక్‌ స్టెరాయిడ్‌ వాడినందుకు నాలుగేళ్ల నిషేధానికి గురయ్యారు. వెయిట్‌లిఫ్టింగ్‌, అథ్లెటిక్స్‌.. ఈ రెండు క్రీడల్లోనే మన దేశంలో నమోదవుతున్నాయి. చాలా సందరాÄ్భలలో క్రీడాకారులు తమకు తెలియకుండానే లేదా కోచ్‌ల సలహాతో సప్లిమెంట్లను తీసుకోవడం వల్ల దొరికిపోతుంటారు. ప్రస్తుతం భారత ప్రభుత్వం, నాడా క్రీడాకారుల్లో అవగాహన పెంచడానికి ‘నో యువర్‌ మెడిసిన్‌’ వంటి యాప్‌లను, విద్యా కార్యక్రమాలను నిర్వహిస్తోంది.

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page