top of page

తొందరపడి ఓ కోయిల ముందే కూసింది!

  • Writer: NVS PRASAD
    NVS PRASAD
  • 1 hour ago
  • 3 min read
  • కొరికానను తొక్కేస్తున్నారంటూ కాపులు ర్యాలీ

  • సీరియస్‌గా తీసుకున్న జనసేన అధిష్టానం

  • కూటమిలో ఉంటూ విమర్శలు తగవంటున్న దేశం

  • సుడా చైర్మన్ ఇమేజ్‌ను తగ్గించేందుకు కుట్ర?

(సత్యంన్యూస్, శ్రీకాకుళం)

నగరంలో కార్గిల్ పార్క్ ప్రారంభోత్సవం సుడా చైర్మన్ కొరికాన రవికుమార్ లేకుండానే చేసేశారని జనసైనికులు నొచ్చుకోవడం, అది కమ్యూనికేషన్ గ్యాప్ మాత్రమేనని స్థానిక ఎమ్మెల్యే గొండు శంకర్ పేర్కొనడం, కొరికానను ఆహ్వానించామని, ఆయన మలేషియాలో ఉన్నారని చెప్పడంతోనే కేంద్రమంత్రి షెడ్యూల్ మేరకు పని కానిచ్చేశామని కలెక్టరేట్ వర్గాలు పరోక్షంగా లీకులివ్వడం ఇప్ప్పుడు జిల్లాలో అగ్గిని రాజేశాయి. గొండు శంకర్ స్టేట్‌మెంట్‌తో సద్దుమణగాల్సిన వ్యవహారం ఇప్ప్పుడు తెగేదాకా జనసైనికులు లాగుతున్నారా? అంటే అవుననేవారే ఎక్కువ మంది ఉన్నారు. సుడా చైర్మన్ కొరికాన రవికుమార్ పాత్ర ఇందులో ఎంత ఉందో తెలియదు గాని, సౌమ్యుడిగా, నో అనే పదం చెప్పడం రాని వ్యాపారవేత్తగా గుర్తింపు పొందిన రవికుమార్ ఇమేజ్‌పై ఇప్ప్పుడు కులం ముద్ర పడింది. కాపు సామాజికవర్గానికి చెందిన రవికుమార్‌ను విస్మరిస్తే ఊరుకునేది లేదంటూ ఆ సామాజికవర్గ నేతలు కొందరు ఈమధ్య ర్యాలీ నిర్వహించి, ఓ సమావేశం ఏర్పాటుచేసుకొని వార్నింగ్ ఇవ్వడమే ఇక్కడ చర్చనీయాంశమైంది. సుడా నిధులతో నిర్మితమైన కార్గిల్ పార్క్ నగరానికి వన్నె తెచ్చింది. ఇందులో సుడా ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సుగుణాకర్, చైర్మన్ కొరికాన రవికుమార్‌ల పాత్ర తీసిపారేయలేనిది. అలాగే కలెక్టర్ పుండ్కర్ పర్యవేక్షణను కూడా కాదనలేం. స్థానిక ఎమ్మెల్యే గొండు శంకర్ దగ్గర్నుంచి ఆ డివిజన్‌లో ఉన్న తెలుగుదేశం నేత వరకు దీని మీద చూపించిన శ్రద్ధ చిన్నది కాదు. అందుకే పార్క్ అంత సుందరంగా తీర్చిదిద్దబడింది. అయితే ఇప్ప్పుడు మూలపేట పోర్టు, భోగాపురం విమానాశ్రయం లాగే ఈ క్రెడిట్ దక్కే విషయంలోనే కూటమిలో భాగస్వాములైన జనసేన, టీడీపీ మధ్య రచ్చ మొదలైంది. అయితే ఇది కొరికాన రవికుమార్ రాజకీయ భవితవ్యానికి స్పీడ్‌బ్రేకర్‌గా మారకుండా ఉన్నంతవరకు ఫర్వాలేదు. కానీ కథ అడ్డం తిరిగితేనే తేడాలొస్తాయి. జనసేన తరఫున ఉమ్మడి జిల్లాలో పాలకొండకు ఒక ఎమ్మెల్యే ఉండివుండొచ్చు. కానీ ఆ పార్టీ భావజాలం నుంచి పుట్టిన నాయకుడు మాత్రం కొరికాన రవికుమారే. కూటమితో 15 ఏళ్లపాటు కొనసాగాలని పవన్‌కల్యాణ్ చెప్పినట్టు జరిగినా, కాకపోయినా ఆ పార్టీ తురుపుముక్క జిల్లాలో కొరికాన రవికుమారే. భవిష్యత్తులో నియోజకవర్గాల పునర్విభజనంటూ జరిగితే ఒక ప్రాంతం నుంచి కొరికాన రవికుమార్ ఎంపీగా, ఆయన భార్య భవానీ కాపు ప్రాబల్యం ఉన్న నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో కేవలం కులంకార్డును బయటకు తీసి కాపులను అణగొక్కుతున్నారని రోడ్డెక్కడం కొరికాన రాజకీయ భవిష్యత్తుకు అంత మంచిది కాదనే వాదనలు వినిపిస్తున్నాయి. ఆయనకు తెలిసే ఇవన్నీ జరుగుతున్నాయా? లేదూ ఆయన మెప్ప్పు కోసం ఇక్కడి నాయకులు నడుం బిగించారా? తెలియదు గాని కాపుల్లో చాలామంది ఈ వివాదానికి దూరంగా ఉన్నారంటే ఈ ఇష్యూను ఏ కోణంలో చూస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. పార్క్ ప్రారంభోత్సవం నాటికి కొరికాన రవికుమార్ విదేశాల్లో ఉన్నమాట వాస్తవం. తానొచ్చేవరకు వీలైతే ఆ ప్రారంభోత్సవాన్ని వాయిదా వేయమని ఆయన కలెక్టరేట్ అధికారులకు సూచించిన మాటా వాస్తవం. కాకపోతే కేంద్రమంత్రి ఇచ్చిన వాగ్దానం మేరకు నిర్మితమైన కార్గిల్ పార్క్‌ను ఆయన షెడ్యూల్‌లో ముందుగా పేర్కొన్న మేరకు ప్రారంభించేశారు. అయితే అప్పటికింకా 5 నుంచి 10 శాతం పనులు పెండింగ్‌లో ఉన్నాయని కొరికాన రవికుమార్ దష్టిలో ఉంది. అది పూర్తయ్యే నాటికి తాను విదేశాల నుంచి వచ్చేస్తానని, అప్ప్పుడు ప్రారంభించడం సబబని ఆయన భావించారు. అయితే కేంద్రమంత్రి జిల్లాలోకి వచ్చినప్ప్పుడే ప్రారంభోత్సవాలన్నీ పూర్తికావాలన్న షెడ్యూల్ ఉండటంతో అచ్చెన్నాయుడు, రామ్మోహన్ నాయుడు, ఎమ్మెల్యేల షెడ్యూల్ మేరకు కలెక్టరేట్ వర్గాలు ఓపెనింగ్ కానిచ్చేశాయి. తమ నిధులతో చేపట్టిన పార్క్‌ను సుడా చైర్మన్ లేకుండా ఎలా ప్రారంభిస్తారనేది జనసైనికుల వాదన. ఇందులో గొండు శంకర్ అన్నట్టు సుడాకు, స్థానిక ఎమ్మెల్యే లేదా కేంద్రమంత్రి కార్యాలయాలకు మధ్య సరిగ్గా కమ్యూనికేట్ కాకపోవడమే అసలు కారణం. కాకపోతే ఈ వ్యవహారాన్ని తెలుగుదేశం కన్విన్సింగ్‌గా కమ్యూనికేట్ చేయలేకపోయింది. దీంతో ప్రారంభోత్సవం జరిగిన రాత్రి నుంచే జనసేన పార్టీ నేతలు సోషల్ మీడియా ద్వారా తమ అసంతప్తిని బయటపెట్టారు. ఆ వెంటనే గొండు శంకర్ స్పందించారు. దీనికి అక్కడితో పుల్‌స్టాప్ పడివుంటే బాగుండేది. కానీ రెండు రోజుల క్రితం ఇది కాపు కులం కోణంలో టర్న్ తీసుకుంది. అదే ఇప్ప్పుడు జనసేన రాష్ట్ర నాయకులకు తలనొప్పిగా మారింది. ఈ విషయాన్ని ఇక్కడితే పుల్‌స్టాప్ పెట్టాలని, దీనిపై జనసేన నుంచి నాదెండ్ల మనోహర్, టీడీపీ నుంచి నిమ్మల రామానాయుడులు మాట్లాడతారని ఆ పార్టీ చెప్పిన తర్వాత కూడా కాపులకు అన్యాయం జరిగిందంటూ రోడ్డెక్కడాన్ని ఇప్ప్పుడు సీరియస్‌గా తీసుకున్నారు. కొరికాన రవికుమార్ మీద సాఫ్ట్ కార్నర్ ఉండటం, ఆయన మన రాష్ట్రంలో లేకపోవడం వల్ల పార్టీ వెనక్కు తగ్గుతుంది కానీ, కాపు కోటాలో పదవులు తీసుకున్నవారు కాపులకు అన్యాయం జరిగిందని రోడ్డెక్కడం పట్ల టీడీపీ గట్టిగానే అధిష్టానం దష్టికి తీసుకువెళ్లింది. జిల్లాలో ఆ రోజు ర్యాలీ నిర్వహించినవారిలో మార్క్‌ఫెడ్ డైరెక్టర్ ఆనెపు రామకష్ణ ఉన్నారు. అలాగే కాపు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పిసిని చంద్రమోహన్ దీనికి నేతత్వం వహించగా, ఆయన ప్రభుత్వ భాగస్వామ్యంలో ఉన్న జనసేనకు జిల్లా అధ్యక్షుడిగా ఉన్నారు. అలాగే గ్రంథాలయ చైర్మన్, డీసీసీబీ చైర్మన్ కాపులకే ఇచ్చారు. అయినా కాపులను అణగదొక్కేస్తున్నారని ప్రసంగించడం ప్రతిపక్షానికి ఆయుధం ఇవ్వడం లాంటిదే. దీనివల్ల వైకాపా లబ్ధి గాని పొందగలిగితే వేళ్లన్నీ రవికుమార్ వైపే చూపిస్తాయి. ఒక్క కార్గిల్ పార్కే కాదు.. జిల్లాలో అనేక అభివద్ధి పనులకు సుడా నిధులిచ్చింది. అలా అని ఏరోజూ పెత్తనం చెలాయించాలని చూడలేదు. కారణం.. రవికుమార్ స్థానికంగా ఉండటం. ఆయన పేరుతో ఇక్కడ ఎవరైనా లబ్ధి పొందాలని చూడటం తప్ప రవికుమార్ ఇటువంటి వ్యవహారాలను పట్టించుకున్న సందర్భాలు ఇంతవరకు ఎదురుకాలేదు. పలాసలో చరిత్రలో మొదటిసారి సుడా హౌసింగ్‌లు నిర్మిస్తే, వాటి అలాట్‌మెంట్‌కు గాని, ప్రారంభోత్సవాలకు గాని రవికుమార్ వెళ్లలేదు. కేవలం పెద్దపాడు రోడ్డు వెడల్పు, సెంటర్‌లైటింగ్ మాత్రమే కాకుండా ఆమదాలవలస నుంచి శ్రీకాకుళం కొత్తరోడ్డు వరకు కొత్తగా నిర్మిస్తున్న సెంటర్ లైటింగ్‌కు కూడా సుడానే నిధులిచ్చింది. కానీ ఏరోజూ ప్రారంభోత్సవాలకు, పబ్లిసిటీకి రవికుమార్ ముందుకు రాలేదు. కానీ కార్గిల్ పార్క్ విషయంలో ఎందుకింత రచ్చ జరుగుతుందో తెలియడంలేదన్న కాపు నాయకులు లేకపోలేదు. జనసేన బ్యానర్ మీద ఉద్యమించాలంటే ప్రభుత్వంతో కలిసి ఉన్నారు కాబట్టి కుదరక కులం కార్డును బయటకు తీసుంటారు. కాపు నాయకులు పెట్టిన సమావేశానికి పాతపట్నం ఎమ్మెల్యే మామిడి గోవిందరావు హాజరయ్యారు. కులానికి దూరమవకూడదని ఆయన వచ్చివుండొచ్చు. కానీ కొరికాన సూప్‌లో పడితే మొదటిగా లాభపడేది మామిడి గోవిందరావే. ఎందుకంటే రవి గాని, ఆయన భార్య భవాని గాని పాతపట్నం వైపే వచ్చే ఎన్నికలకు చూస్తారు. కాబట్టి ఆయన రాక వల్ల బలం పెరిగిందని భావించడం తప్ప్పు.

కొరికాన రవికుమార్ కేవలం కాపులకు మాత్రమే నాయకుడన్న మెసేజ్ పెడితే ఆయన రాజకీయ కల చెదిరిపోయే ప్రమాదం ఉంది. ఎమ్మెల్యేగా పోటీ చేసినా, ఎంపీగా పోటీ చేసినా ఏదో ఒక కులం మాత్రమే ఓట్లేస్తే గెలిచే పరిస్థితి ఉండదని ఆయన తరఫున ఇక్కడ రాజకీయం నడుపుతున్నవారు గ్రహిస్తే కొరికానకు మేలు చేసినవారవుతారు. లేదూ ఇలా బెదిరిస్తేనే దారికొస్తారనుకుంటే ఇటువంటి బాటనెంచుకున్నవారు దారీతెన్నూ లేకుండా మిగిలిపోయిన నాయకులు జిల్లాలో చాలామంది మనకు కనిపిస్తారు.


Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page