top of page

తప్ప్పుమీద తప్ప్పు.. దిద్దుకుంటే ఒట్టు!

  • Writer: Prasad Satyam
    Prasad Satyam
  • 3 hours ago
  • 2 min read
  • ANMల ప్రమోషన్ల జాబితా నుంచి ఆరుగురి తొలగింపు

  • ఇందుకు అనుసరించిన పద్ధతేంటో ఎవరికీ తెలియదు

  • ఎన్ని అక్రమాలు జరుగుతున్నా చర్యలు లేకపోవడమే కారణం

(సత్యంన్యూస్, శ్రీకాకుళం)

జిల్లా వైద్యఆరోగ్యశాఖాధికారి కార్యాలయంలో అధికారులు, సిబ్బంది కేవలం తప్ప్పులు చేయడానికే జీతాలు తీసుకుంటున్నారా? అంటే అవుననే సమాధానమే వినిపిస్తుంది. అడ్మినిస్ట్రేషన్ మీద అవగాహన లేని డీఎంహెచ్‌వోలు, పైసలిస్తే ఏ ఫైల్‌నైనా ఓకే చేసే మిగిలిన అధికారులు ఉన్నచోట తప్ప్పులు కాక ఒప్ప్పులు జరుగుతాయనుకోవడం పొరపాటే. అయితే ఆ తప్ప్పును దిద్దుకోవడానికి మరో తప్ప్పు చేయాల్సి రావడం ఇక్కడ విశేషం. సొమ్ములు తీసుకొని ఉద్యోగాలు, పదోన్నతులు ఇచ్చే వైద్య ఆరోగ్యశాఖ సూపరింటెండెంట్లు, ఏవో, గుమస్తాలు ఇప్ప్పుడు వాటిని సరిచేయకపోతే ఉద్యోగానికి ఎసరొస్తుందనేసరికి ఉద్యోగులను బలి తీసుకోడానికి సిద్ధపడిపోతున్నారు. గ్రేడ్-3 ANMలకు ప్రమోషన్లు కల్పించే విషయంలో సీనియారిటీ జాబితా తయారుచేసి, అందుకు రోస్టర్ పాటించామని, సహజ న్యాయసూత్రాల మేరకు ఒక జాబితా తయారుచేశామంటూ చాలామంది నుంచి సొమ్ములు కలెక్ట్ చేసి గ్రేడ్-2 ANMలుగా పదోన్నతులు కల్పించిన డీఎంహెచ్‌వో అధికారులు ఇప్ప్పుడు ఈ వ్యవహారం జిల్లా కలెక్టర్ పరిధి దాటి, జాతీయ ఎస్టీ కమిషన్ దృష్టికి వెళ్లడంతో జైలుకు వెళ్లిపోవడం ఖాయమని తెలుసుకున్న అధికారులు ఇప్ప్పుడు ఏఎనఎంలను బలి తీసుకోడానికి సిద్ధపడిపోతున్నారు. గ్రేడ్`3 ఏఎనఎంలను గ్రేడ్-2 ANMలుగా చేస్తూ తయారుచేసిన జాబితాలో ఆదివాసీలకు రూల్ ఆఫ్ రిజర్వేషన్ ప్రకారం అన్యాయం జరిగిందని, ఈమేరకు 9 మంది ఆదివాసీలకు పదోన్నతి రావాలని, అందులో ఆరుగురికి పూర్తిగా అన్యాయం జరిగిందని ఆదివాసీల తరఫున వాబ యోగి ఎస్టీ కమిషన్‌ను ఆశ్రయించారు. అసలు ప్రమోషన్లకు రూల్ ఆఫ్ రిజర్వేషన్ పాటించాల్సిన అవసరం లేదని, గత నోటిఫికేషన్‌లోనే ఆదివాసీలకు అది దక్కిందని కొన్నాళ్లు వాదించుకొచ్చిన ఏవో అండ్ సూపరింటెండెంట్లు ఆ తర్వాత సహజ న్యాయసూత్రాల ఉల్లంఘన జరిగిందని తేలడంతో రోస్టర్ బుక్ పోయిందని నాటకమాడారు. ఇప్ప్పుడు అది కూడా బూటకమని తేలిపోవడంతో ఆదివాసీ ఏఎనఎంలకు ప్రమోషన్లు ఇవ్వక తప్పని పరిస్థితి ఏర్పడింది. దీంతో ఆరుగురు ANMలను ఈ పదోన్నతి జాబితా నుంచి తప్పించి, ఆ స్థానంలో ఆదివాసీలకు ఇవ్వడానికి రంగం సిద్ధం చేసేశారు. అసలు ఈ ఆరుగురూ రాత్రికి రాత్రే సీనియారిటీ జాబితా నుంచి తమ పేర్లు లేకపోవడం చూసి గుండెలు బాదుకున్నారు. అసలు ఏ పద్ధతిలో ఈ ఆరుగురి పేర్లు తొలగించారు? గతంలో ఏ విధానంలో వీరికి పదోన్నతి కల్పించే విధంగా లిస్టులో చేర్చారు? అనేది ఎక్కడా తెలపలేదు. కనీసం పదోన్నతి జాబితాలో ఉన్న మీ పేర్లు సరికాదనే షోకాజ్ నోటీసు కూడా ఇవ్వలేదు. మొదటి సీనియారిటీ జాబితాను సరైనదిగా నిర్ధారించిన కమిటీ నివేదికను పరిగణలోకి తీసుకోలేదు. గుట్టుచప్ప్పుడు కాకుండా ఓ ఆరుగురి పేర్లను తొలగించేసి కొత్త జాబితాను తయారుచేశారు. అసలు ఎందుకు తొలగించారో పూర్తి వివరాలు బయటపెట్టాలని ఇప్ప్పుడు బాధితులు కోరుతున్నారు. అది బయటకొస్తే.. మిగిలినవారి జాతకాలు కూడా బయటపడిపోతాయని డీఎంహెచ్‌వో కార్యాలయ అధికారులు కేవలం ఒకరికి తెలియకుండా ఒకరి పేర్లు తొలగించేశారు. అసలు తొలగించడానికి అనుసరించిన ప్రాతిపదిక ఏమిటో చెప్పలేదు. మొదట్లో తాము రూపొందించిన జాబితాకు కలెక్టర్ ఆమోదముద్ర వేశారని సమర్ధించుకున్న అధికారులు మరి ఇప్ప్పుడెందుకు మార్చినట్టు? అప్పట్లో ఆదివాసీల వ్యవహారంపై PGRSలో ఫిర్యాదిస్తే కలెక్టర్ ఒక నిజనిర్ధారణ కమిటీ వేశారు. వారు మొదట రూపొందించిన జాబితా సక్రమమైనదేనని నివేదించారు. అలా అయితే ఈ నివేదిక తప్పా? లేదూ అంటే అసలు ఈ రోస్టరే తప్పా? అనేది చెప్పాలి.

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page