top of page

‘నిజాయితీ’ వెనుక అసలు రంగు ఇదీ.. సాక్ష్యాలతో బట్టబయలు చేసిన‘క్రెడాయ్ ’

  • Writer: Prasad Satyam
    Prasad Satyam
  • 15 hours ago
  • 2 min read
  • నీతిమంతుడినని చెప్పుకుంటూ సాగించిన కాలక్షేపానికి తెర!

  • వైకాపా నేతలకు ఒక న్యాయం.. సామాన్యులకు మరో న్యాయమా?

  • సోషల్ మీడియా భజన బృందాల నోళ్లు మూయించేలా ఆధారాలు

(సత్యంన్యూస్, శ్రీకాకుళం)

తాను మహా నిజాయితీపరుడినని, తన కళ్లతో చూస్తే గానీ ఏ ఫైల్ మీదా సంతకం పెట్టనని చెబుతూ కాలక్షేపం చేసిన శ్రీకాకుళం మునిసిపల్ మాజీ కమిషనర్ హనుమంతు కూర్మారావు అసలు రంగు క్రెడాయ్ ఫిర్యాదుతో సాక్ష్యాధారాలతో సహా బట్టబయలైంది. కూర్మారావు దగ్గర పప్పులు ఉడకకనే కొందరు రాజకీయ నాయకులు ఆయన్ను ఇక్కడి నుంచి పంపించేశారంటూ సోషల్ మీడియాలో తెగ ‘ఫీల’ అయిపోతున్న భజన బృందాల నోళ్లు మూయించేలా ఈ వ్యవహారంలో నగ్న సత్యాలు వెలుగులోకి వచ్చాయి. మునిసిపల్ పరిపాలన, పట్టణాభివృద్ధి శాఖ (ఎంఏ Ê యÖడీ) ప్రధాన కార్యదర్శి సురేష్ కుమార్ ఐఏఎస్‌కు ప్రతిష్టాత్మక సంస్థ అయిన ‘క్రెడాయ’ ఇచ్చిన అధికారిక ఫిర్యాదును చదివితే.. కూర్మారావు పాలనలో ప్రభుత్వ ఆదాయానికి ఎలా గండిపడిందో, నిర్మాణ రంగంలో ఉన్నవారు ఎలా కుదేలైపోయారో స్పష్టమవుతుంది.

పాలసీ అందరికీ ఒకేలా ఉందా? ఇవీ కమిషనర్ ‘సెలెక్టివ’ సంతకాలు

కమిషనర్ తన నిజాయితీ పాలసీని నగరంలో అందరిపైనా ఒకేలా అమలు చేశారా అంటే అదీ లేదు. అక్కడ కూడా ‘వ్యక్తులను బట్టి వర్తనం’ అన్న చందంగానే వ్యవహరించారనే దానికి నగరంలో జరిగిన ఈ రెండు ఉదాహరణలే సజీవ సాక్ష్యాలు..

వైకాపా నేతకు రెడ్ కార్పెట్:

నగరంలో వందలాది వేకెంట్ ల్యాండ్ ట్యాక్స్ (వీఎల్‌టీ) దరఖాస్తులు మున్సిపల్ కార్యాలయంలో పెండింగ్‌లో ఉంచి, తానే స్వయంగా చూసి ట్యాక్స్ వేస్తానని మున్సిపాలిటీకి రావాల్సిన ఆదాయాన్ని దెబ్బతీసిన కూర్మారావు.. వైకాపా నాయకుడు కిల్లి సత్యనారాయణ ఒక స్థలాన్ని అపార్ట్‌మెంట్ల నిర్మాణం కోసం డెవలప్‌మెంట్‌కు తీసుకుని వీఎల్‌టీకి అప్లై చేయగానే చకచకా సంతకం చేసేశారు. మరి ఇక్కడ ఏమైంది ఆయన పాలసీ, ఆయన నిజాయితీ?

ఏవీఎన్ టవర్స్‌పై ప్రత్యేక ప్రేమ:

మున్సిపాలిటీకి మార్ట్‌గేజ్ (తాకట్టు) చేసిన ప్లాట్లను విడిపించడానికి బిల్డర్లు పదే పదే ఆయన సీటు చుట్టూ తిరిగినా అస్సలు స్పందించని ఇదే కమిషనర్.. పీఎన్ కాలనీకి ఆనుకుని ఉన్న సోడా లేఅవుట్‌లో మున్సిపల్ పార్కు పక్కనే వేసిన ‘ఏవీఎన్ టవర్స’ మార్ట్‌గేజ్ విడుదల దరఖాస్తు రాగానే వెనుకా ముందూ చూడకుండా వెంటనే సంతకం పెట్టేశారు. అంతకంటే ముందు దరఖాస్తు చేసుకుని కార్యాలయం చుట్టూ తిరుగుతున్న మిగతా బిల్డర్లను మాత్రం ఆయన పట్టించుకోలేదు. మరి ఇక్కడ ఏమైంది ఆయన నిబద్ధత?

దీన్ని బట్టి కూర్మారావు నీతిమంతుడు అంటూ గుడ్డలు చించుకుంటున్న సోషల్ మీడియా పులులు, ఇంకా ఇలాంటి అనేక వివాదాస్పద లావాదేవీలను బయటపెడితే ఇంకెంతగా చించుకుంటారోననే చర్చ నగరంలో సాగుతోంది.

పడకేసిన మునిసిపల్ పరిపాలన.. దెబ్బతిన్న ఖజానా

శ్రీకాకుళం మునిసిపల్ పరిపాలన పూర్తిగా పడకేసిందని, కమిషనర్ హనుమంతు కూర్మారావు అసమర్థత వల్లే ఈ పరిస్థితి దాపురించిందని, మునిసిపల్ కమిషనర్‌కు పట్టణాభివృద్ధి శాఖ నిబంధనలపై కనీస అవగాహన లేదని క్రెడాయ్ ఆ లేఖలో స్పష్టంగా పేర్కొంది. అవగాహన లోపం కారణంగా ఖాళీ స్థలాల పన్ను (వీఎల్‌టీ) మదింపులు, లేఅవుట్ క్రమబద్ధీకరణ (ఎలఆరఎస్) క్లియరెన్స్‌లు, భవన నిర్మాణ అనుమతులు, మార్టిగేజ్ విడుదలలు వంటి కీలకమైన ఫైళ్లు వారాల తరబడి కార్యాలయంలోనే మగ్గిపోయేలా చేశారని ఆరోపించింది. భవన నిర్మాణ అనుమతుల్లో జరుగుతున్న సుదీర్ఘ జాప్యం వల్ల చట్టబద్ధంగా వ్యాపారం చేసే బిల్డర్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, దీనివల్ల నగరంలో అనధికారిక నిర్మాణాలు పెరగడానికి పరోక్షంగా ప్రోత్సాహం లభించిందని క్రెడాయ్ ఆవేదన వ్యక్తం చేసింది.

ఆర్థిక సంక్షోభంలో నిర్మాణ రంగం.. సామాన్యుడికి వేధింపులు

ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ (ఓసీ) వచ్చినప్పటికీ, తాకట్టు పెట్టిన ఫ్లాట్లను విడుదల చేసే చిన్న క్లరికల్ పనిని కూడా కమిషనర్ నెలల తరబడి ఆలస్యం చేయడంతో, ఫ్లాట్లను విక్రయించలేక నగదు లావాదేవీలు నిలిచిపోయి బిల్డర్లు తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయారు. ప్రాజెక్ట్ గడువులు తప్పుతుండటంతో అటు కార్మికులకు చెల్లింపులు చేయలేక, ఇటు కొనుగోలుదారులకు సమాధానం చెప్పలేక సతమతమవుతున్నారు. అనుమతుల ప్రక్రియ పూర్తిగా నిలిచిపోవడంతో మునిసిపాలిటీకి రావాల్సిన చట్టబద్ధమైన ఫీజులు వసూలు కాకుండా ప్రభుత్వ ఖజానాకు భారీగా ఆదాయ గండి కొట్టారు. కేవలం రియల్టర్లకే కాకుండా, రోజువారీ పనుల కోసం మునిసిపల్ ఆఫీసుకు వచ్చే సామాన్య ప్రజలను కూడా కార్యాలయంలో గంటల తరబడి వేచి చూసేలా చేస్తూ తీవ్ర వేధింపులకు గురిచేశారని క్రెడాయ్ తన ఫిర్యాదులో బట్టబయలు చేసింది.

‘నిజాయితీ’ అనే రంగు రంగుల ముసుగు వేసుకుని కాలక్షేపం చేస్తూ, తెరవెనుక కొందరికే ప్రయోజనం చేకూర్చిన కూర్మారావు అసలు సిసలు పరిపాలనా వైఫల్యం ఇప్పుడు క్రెడాయ్ ఇచ్చిన ఫిర్యాదుతో సాక్ష్యాధారాలతో సహా రుజువైంది. ఇప్పటికైనా ఆయన భజన బృందాలు వాస్తవాలను తెలుసుకుని వాదనలు ఆపితే నగరానికి మంచిది.

 
 
 

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page