నువ్వే కావాలి
- NVS PRASAD

- Sep 12, 2025
- 1 min read
కార్పొరేట్ ఫుడ్ యాప్‌ల మెడలు వంచిన వినోద్
ఏపీహెచ్‌ఏ జాయింట్ సెక్రటరీగా ఎన్నిక
బీటెక్ చదువుకున్నాడు.. ఇంటర్నేషనల్ బిజినెస్ స్కూల్‌లో ఎంబీఏ చేశాడు.. బెంగళూరు, టోక్యో (జపాన్)ల్లో ఏడేళ్లు పెద్ద స్థాయిలో పని చేశాడు. కానీ తండ్రి సృష్టించిన బ్రాండ్ ఎస్‌వీడీని విశ్వవ్యాప్తం చేయడం కోసం అన్నింటినీ వదులుకొని సిక్కోలు చేరుకున్నాడు. సీన్ కట్ చేస్తే.. బ్రాండిరగ్ చేయాల్సింది తన సొంత సంస్థకు కాదని, సిక్కోలులో అంతంత మాత్రంగా మిగిలిపోయిన ఆతిథ్య రంగానికని అర్థం చేసుకున్నాడు. ఓవైపు ఎస్‌వీడీ హోటల్, ఎస్‌వీడీ కన్వెన్షన్ బాధ్యతలు చూస్తూ, మరోవైపు ఏపీహెచ్‌ఏ బ్రాండిరగ్‌కు నడుం బిగించాడు. జిల్లాలో హోటల్ అసోసియేషన్‌కు ఎటువంటి సమస్య వచ్చినా పరిష్కరించడానికి ముందుకొచ్చాడు.

(సత్యంన్యూస్, శ్రీకాకుళం)
ఆయన పేరు గజరావు వినోద్. నిండా 34 ఏళ్లు. శ్రీకాకుళంలో మహామహులు ఉన్న హోటల్ రంగంలో ఇప్పుడు అందరికీ తలలో నాలుకయ్యా డు. తాజాగా ఆంధ్రప్రదేశ్ హోటల్స్ అసోసియే షన్ జోనల్‌కు జాయింట్ సెక్రటరీగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారంటే అందుకు కారణం ఆయన పని తీరే. స్విగ్గీ, జొమోటా వంటి సంస్థలు తమలాంటి హోటల్ నుంచి తక్కువ మొత్తానికి ఆర్డర్ తీసుకొని డోర్ డెలివరీ పేరిట కస్టమర్‌కు ఎక్కువ ధరకు అమ్ముతుందని, తమకు చెల్లించాల్సిన బకాయిలు కూడా పారదర్శకంగా లేవంటూ వారి మీద యుద్ధం ప్రకటించి సొంతంగా యంజి అనే సొంత ఫుడ్ యాప్‌ను తయారుచేసి, అందులో జిల్లాలో ఉన్న హోటల్స్ నుంచి తక్కువ ధరకే ఫుడ్ అందే ఏర్పాటు చేయడంతో రాష్ట్రవ్యాప్తంగా మహా మహుల దృష్టిని ఆకర్షించాడు. స్విగ్గీ, జొమోటోలు దిగొచ్చేటట్టు చేశారు. మళ్లీ అదే సంస్థల నుంచి అసోసియేషన్ కార్యక్రమాలకు రాష్ట్ర చరిత్రలో మొదటిసారిగా విరాళం తెప్పించగలిగాడు. అందుకే ఎగ్జిక్యూటివ్ జాయింట్ సెక్రటరీగా జిల్లా వరకే పరిమితమైన ఆయన సేవలను రాష్ట్రస్థాయి కి వినియోగించుకోవాలని ఎస్‌వీడీ వినోద్‌ను ఐదు జిల్లాలకు జాయింట్ సెక్రటరీని చేశారు. శ్రీకాకు ళంలో ఎస్‌వీడీ హోటల్ ఒక బ్రాండ్. ఎస్‌వీడీ మురళీ అంటే తెలియని సిక్కోలువాసులు ఉండక పోవచ్చు. ఆయన తనయుడిగా వినోద్ ఇప్పుడు ఏపీహెచ్‌ఏ తరఫున ఎటువంటి ఉత్తర ప్రత్యుత్తరా న్నయినా జరపడంలో దిట్టగా మారారు. హోటల్స్ ను పరిశ్రమగా గుర్తించాలని, రాత్రులు 12 గంట ల వరకు తెరిచివుంచే వెసులుబాటు ఇవ్వాలని ప్రజాప్రతినిధులను కలిసే ప్రక్రియలో వినోద్ పోషించిన పాత్ర కీలకమైనది. ఇంతవరకు శ్రీకా కుళం హోటల్స్ ప్రతినిధులకు ఎస్‌వీడీ మురళీ పెద్దదిక్కుగా ఉన్నా ఎప్పుడూ అసోసియేషన్ వైపు చూడలేదు. విద్యావంతుడు కావడంతో దేశవ్యాప్తం గా ఆతిధ్య రంగంమీద అధ్యయనం చేసిన వినోద్ సరికొత్త మార్పుల వైపు అడుగులు వేస్తున్నారు.










Comments