top of page

నకిలీ సర్టిఫికెట్లపై విచారణ జరపండి

  • Writer: BAGADI NARAYANARAO
    BAGADI NARAYANARAO
  • 31 minutes ago
  • 3 min read
  • రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రి లోకేష్

  • తోలాపి ‘వైకల్యం’పై చర్యలకు ఆదేశం

(సత్యంన్యూస్, శ్రీకాకుళం)

నకిలీ దివ్యాంగుల సర్టిఫికేట్‌లతో ప్రభుత్వ ఉద్యోగులుగా, ఉన్నత విద్యాసంస్థల్లో విద్యార్ధులుగా 81 మంది కొనసాగుతూ దివ్యాంగ హక్కులను కాలరాస్తున్నట్టు గ్రామానికి చెందిన ఉపాధ్యాయుడు నూకరాజు రాష్ట్ర ఐటీ మంత్రి నారా లోకేష్‌కు ఒక లేఖ రాసి, గ్రీవెన్స్‌లో ఫిర్యాదు చేశారు. స్పందించిన లోకేష్ కార్యాలయం దీనిపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని దివ్యాంగుల శాఖ రాష్ట్ర డైరెక్టర్‌కు ఆదేశించారు. ఆ శాఖ డైరెక్టర్ జిల్లా దివ్యాంగుల శాఖ ఏడీకి వివరాలు సేకరించి నివేదించాలని ఆదేశించారు. దీనిపై జిల్లా దివ్యాంగుల శాఖ ఏడీ స్పందిస్తూ కలెక్టర్‌కు నివేదించి ఆయన ఆదేశాలతో తదుపరి చర్యలు తీసుకోవడానికి సన్నద్ధమవుతున్నట్టు ఫిర్యాదుదారుడు నూకరాజుకు అధికారులు సమాచారం అందించారు.

నూకరాజు ఇచ్చిన ఫిర్యాదును అనుసరించి తోలాపిలో 81 మంది నకిలీ పీహెచ్‌సీ పత్రాలతో ఉద్యోగాలు, ఉన్నత విద్యను అభ్యసిస్తున్న వారిలో సచివాలయ ఉద్యోగులు 19 మంది, ఉపాధ్యాయ వత్తిలో 19 మంది, వివిధ బ్యాంకుల్లో 10 మంది, విశాఖ స్టీల్ ప్లాంట్‌లో 8 మంది, వివిధ రాష్ట్ర ప్రభుత్వ శాఖలో 15 మంది, కేంద్ర ప్రభుత్వ ఉన్నత విద్యాసంస్థల్లో 10 మంది విద్యను అభ్యసిస్తున్నారని పేర్కొన్నారు. దివ్యాంగుల కోటాలో ఉద్యోగం పొందినవారంతా శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తెలంగాణలో ఉద్యోగాలు చేస్తున్నారు.

రాజకీయ జోక్యంతో..

వాస్తవంగా తోలాపి గ్రామంలో నకిలీ దివ్యాంగుల సర్టిఫికేట్‌లు వ్యవహారంపై ఐదేళ్లుగా ఉన్నతాధికారులకు ఫిర్యాదులు అందుతున్నాయి. దీనిపై ఉన్నతాధికారులు విచారణ ప్రారంభిస్తే రాజకీయ జోక్యంతో నిలిచిపోతున్నాయి. అలా అని కొత్తగా నకిలీ సర్టిఫికేట్‌లు తయారుచేయడం లేదా అంటే ఇది నిరంతర ప్రక్రియగానే సాగుతుంది. వాటితో ఉద్యోగాలు సాధిస్తున్నారు. రూ.లక్షల్లో డబ్బులు కుమ్మరించడమో, ఆస్తిని వారి పేరుతో బదలాయించి రుణం తీర్చుకోవడమో చేస్తున్నారు. దీనికి అడ్డుకట్ట వేయాలని గ్రామానికి చెందిన ఉపాధ్యాయుడు నూకరాజు చేస్తున్న ప్రయత్నాలను ఆపాలని, గ్రామ ప్రతిష్టకు భంగం కలుగుతుందని కొందరు పెద్దలు ఒత్తిడి చేస్తున్నారు. గ్రామ పెద్దలు ఒత్తిడిని కాదని నూకరాజు అన్ని ప్రభుత్వ శాఖలకు లేఖలు రాసి వారి పరిధిలో నకిలీ దివ్యాంగుల కోటాలో ఉద్యోగం పొందిన వ్యక్తి వివరాలను అందించి చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు. దీనిపై ఆయా శాఖలు అధికారులు ఇప్ప్పుడిప్ప్పుడే సంబంధిత ఉద్యోగుల వివరాలను ఆరా తీస్తున్నట్టు తెలిసింది.

విద్యాంతులు ఆందోళన

పొందూరు మండలం తోలాపి గ్రామంలో ఉన్న విద్యావంతులు రేయింబవళ్లు నిద్రాహారాలు లేకుండా చదవి ప్రభుత్వ ఉద్యోగం సంపాదించినా.. చుట్టుపక్కల గ్రామాల వారందరకీ ఏదో అనుమానం. ఎందుకంటే ఆ గ్రామంలో కొందరు ప్రuTద్ధులు చేసిన నిర్వాకానికి అందర్నీ వేలెత్తి చూపే దుస్థితి వచ్చిందని, గ్రామంలో 90 శాతం మంది విద్యాంతులు, ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కష్టపడి మెరిట్‌లో ఉద్యోగం సాధించినవారు కొన్ని సందర్భాల్లో బాధపడిన సందర్భాలూ ఉన్నాయి. ఎందుకంటే.. గ్రామంలో నకిలీ సర్టిఫికేట్లు కలిగినవారే ముందుగా దివ్యాంగుల కోటాలో ఉద్యోగాల్లో చేరిపోతున్నారు. ఏళ్ల తరబడి కోచింగ్ సెంటర్లలో నలిగి మెరిట్ సాధించినా దివ్యాంగుల కోటాలో నకిలీ సర్టిఫికేట్‌తో గ్రామంలో జులాయిగా తిరిగిన వ్యక్తి ముందు వరుసలో నిలుస్తున్నాడన్న ఆవేదన గ్రామంలో ఎప్పటి నుంచో వెంటాడుతుంది. ఉన్నత విద్యాసంస్థల్లో చేరాలని ప్రయత్నిస్తున్నవారికి నిరాశ ఎదురువుతుందని గ్రామస్తులు చెబుతున్నారు. నకిలీ సర్టిఫికేట్‌తో తక్కువ మార్కులు వచ్చినా ఉన్నత విద్యాసంస్థలో దివ్యాంగుల కేటగిరిలో చేరిపోతున్నారని ఆవేదన వెలిబుచ్చుతున్నారు. ఈ నకిలీ వ్యవహారాన్ని ఎవరూ బహిరంగంగా ప్రశ్నించడం లేదు. అలా అని సమర్థించడం లేదు. అందరూ ఒకే గ్రామానికి చెందినవారు కావడం, అందరికీ బంధుత్వాలు ఉండడంతో గమ్మున ఉండిపోతున్నారు. ఒకటో, రెండో తప్ప్పులు చేస్తే వెనకేసుకురావచ్చు. కానీ నిరంతరం డబ్బు యావతో తప్ప్పులు చేస్తే ఎవరూ సమర్థించరు. తోలాపిలో ప్రస్తుతం జరుగుతున్న తంతు అలాంటిదే. గ్రామంలో సుమారు 350 మంది వివిధ హÃదాల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ, ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉద్యోగులుగా విధులు నిర్వహిస్తున్నవారు ఉండగా, వీరిలో 81 మంది దివ్యాంగుల కోటాలో ఉద్యోగాలు, ఉన్నత విద్యాసంస్థల్లో ఉన్నత విద్యను అభ్యసిస్తున్నారు.

ఒకే కుటుంబంలో 30 మంది

వీరందరికీ గ్రామానికి చెందిన కష్ణారావు అనే ఒక ప్రభుత్వ ఉద్యోగి సమకూర్చిన దివ్యాంగుల సర్టిఫికేట్ýతో.. ఆయన కుటుంబానికి చెందిన 30 మంది నకిలీ ధ్రువీకరణ పత్రాలతో దివ్యాంగుల కోటాలో ఉద్యోగాలు పొందారంటే వ్యవహారం ఏ స్థాయిలో జరిగిందో అంచనా వేయవచ్చు. ఈ సర్టిఫికేట్‌లన్నీ కంటిచూపు కోల్పోయినట్టు, పుట్టుకతో మూగ, చెవుడుతో బాధ పడుతున్నట్టు సదరంలో వైద్యులను మేనేజ్ చేసి జనరేట్ చేûయించారు. కష్ణారావుకు ఏజెంట్‌గా విశాఖలో నకిలీ సర్టిఫికేట్‌తో దివ్యాంగుల కోటాలో స్టీల్‌ప్లాంట్‌లో ఉద్యోగం చేస్తున్న నారాయణరావు వ్యవహరిస్తున్నట్టు గ్రామంలో ప్రచారం సాగుతుంది. వీరిచ్చిన సదరం సర్టిఫికేట్‌లతో కొందరు ఉద్యోగాల కోసం ఉపయోగిస్తే, మరికొందరు ఉన్నత విద్యాసంస్థల్లో చదువుకొని ప్రభుత్వ కొలువులు సాధించినవారూ ఉన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, బ్యాంకు ఉద్యోగాలకు నోటిఫికేషన్ వస్తే చాలు వీరి పంట పండినట్టే. వారికి తెలిసిన కుటుంబాల్లో నిరుద్యోగులను గుర్తించి దివ్యాంగుల సర్టిఫికేట్ ద్వారా ఉద్యోగం ఇప్పిస్తామని బేరం పెట్టుకుంటారు. వీరు మాట ఇచ్చారంటే కచ్చితంగా చేస్తారన్న భరోసా తోలాపి ప్రాంతంలోని ప్రజలందరిలోనూ ఉంది. వీరి స్ట్రైక్‌రేట్ వంద శాతం కావడంతో వీరికి నగదు, లేదంటే ఆస్తి రిజస్ట్రేషన్ చేసి ఇచ్చి బేరం కుదుర్చుకుంటారు. ఇప్పటికీ గ్రామానికి చెందిన కష్ణారావు ఇదే పనిలో నిరంతరం ఉంటాడని గ్రామంలో ప్రచారం ఉంది. అన్ని వ్యవస్థలను మేనేజ్ చేస్తూ ఎక్కడా ఎటువంటి ఆటంకం లేకుండా వ్యవహారాన్ని నడిపిస్తున్నట్టు స్థానికులు చెబుతున్నారు. ఉన్నతాధికారులకు ఫిర్యాదులు అందినా, పత్రికల్లో కథనాలు వచ్చినా రాజకీయ అండతో వాటిని చక్కబెడుతున్నట్టు విమర్శలు ఉన్నాయి. విశాఖ, అనకాపల్లి, విజయనగరంలోనూ అనేక మందికి నకిలీ సర్టిఫికేట్‌లను పొంది దివ్యాంగుల కోటాలో ఉద్యోగాలు ఇచ్చినట్టు ఫిర్యాదుదారుడు ఆరోపిస్తున్నారు.

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page