top of page

నర్గీస్‌ ఫక్రీ..! తన మొహం కాదు, ఉపవాసమూ వికృతమే!!

  • Guest Writer
  • Jul 8
  • 3 min read
ree

బరువు తగ్గాలి.. బీపీ తగ్గాలి.. సుగర్‌ లెవల్స్‌ తగ్గాలి.. ఏం చేయాలి..? చాలామంది ఈమధ్య పాటిస్తున్న పద్ధతి ఐఎఫ్‌..అంటే ఇంటర్మిటెంట్‌ ఫాస్టింగ్‌..అంటే రోజుకు 16 గంటలపాటు లేదా 18 గంటలపాటు ఏమీ తీసుకోకుండా ఉండటం..

తినాలనుకున్నవి ఆ 8 లేదా 6 గంటల్లో తీసుకోవడం.. చాలా ప్రాచుర్యంలోకి వచ్చింది. రిజల్ట్స్‌ కూడా ఉంటున్నాయి ఓమేరకు.. అయితే ఇప్పుడు ఇది ఎందుకు చెప్పుకోవడం అంటే.. సెలబ్రిటీల బుర్రలు ఈ ఆరోగ్య విషయాల్లో కాస్త విజ్ఞతతో పనిచేయాలి అని చెప్పడానికి.. నర్గీస్‌ ఫక్రీ.. ఈ బాలీవుడ్‌ తార పవన్‌ కల్యాణ్‌ సినిమా హరిహర వీరమల్లులో నటించింది. తను చెబుతోంది ఏదో ఇంటర్వ్యూలో..

‘‘ఏడాదికి రెండుసార్లు సుదీర్ఘ ఉపవాసం ఉంటాను.. 9 రోజుల చొప్పున.. నో ఫుడ్‌, కేవలం నీళ్లు మాత్రమే.. దాంతో నా ముఖం వికృతంగా మారుతుంది. తరువాత ముఖంలో గ్లో వస్తుంది. హైప్రొటీన్‌ ఫుడ్‌ తీసుకుంటాను, నార్మల్‌ అయిపోతాను..’’

సమస్య ఏమిటంటే.. ఈ సెలబ్రిటీలు ఏవో పిచ్చి కూతలు కూస్తారు. పిచ్చి అభిమానులు పాటిస్తారు. ప్రాణాల మీదకు తెచ్చుకుంటారు. ‘మామూలుగానే నీ ముఖం వికృతంగా ఉంటుంది కదా, కొత్తగా మారేదేముంది’’ అని వ్యాఖ్యానించాడు ఓ నెటిజెన్‌..

నిజమా, సరే, అది వదిలేస్తే.. ఐఎఫ్‌ వరకూ వోకే.. రోజుకు 16 గంటలో, 18 గంటలో ఏమీ తీసుకోకుండా ఉండటం.. కష్టపడితే ఆచరించవచ్చు.. అదీ సుగర్‌ప్రాబ్లం ఎక్కువగా ఉన్నవాళ్లకు ఇలా చేస్తే సుగర్‌ లెవల్స్‌ పడిపోయి కొత్త ప్రాబ్లమ్స్‌ వస్తాయి కూడా..

వాళ్లు ఏదో కూస్తారు, పాటిస్తారో లేదో ప్రపంచంలో ఎవడికీ తెలియదు, పాటించినా సరే, ఆ పద్ధతులు అందరికీ పనిచేయాలని లేదు, లేదా కొందరికి ప్రాణాల మీదకు తెస్తాయి, ఆ మట్టి బుర్రలకు అది అర్థం కాదు. వాటిని పబ్లిష్‌ చేసే మీడియాకు అంతకన్నా అర్థం కాదు.

ఈమె వికృత సలహాలు పాటింనీయమేనా అనడిగితే.. ఓ ఎఐ ప్లాట్‌ఫామ్‌ ఓ సుదీర్ఘ సమాధానం ఇచ్చింది. సంక్షిప్తంగా చెప్పాలంటే..

తొమ్మిది రోజుల పాటు ఆహారం తీసుకోకపోవడం అనేది సుదీర్ఘ ఉపవాసం. దీనివల్ల ఆరోగ్యానికి చాలా ప్రమాదాలు ఉన్నాయి. తక్కువ సమయం ఉపవాసం ఉండటం వల్ల కొన్ని ప్రయోజనాలు ఉన్నప్పటికీ.., ఎక్కువ కాలం ఆహారం లేకుండా ఉండటం వల్ల కండరాలు క్షీణించడం, అవయవాలు దెబ్బతినడం, చివరికి మరణం కూడా సంభవించవచ్చు.

నిజమే... 9 రోజుల ఉపవాసం వల్ల కలిగే ప్రతికూల ప్రభావాలు...:

కండరాల క్షీణత, పోషకాహార లోపాలు, అవయవాలు దెబ్బతినడం, రోగనిరోధక శక్తి బలహీనపడటం, ఎలక్ట్రోలైట్‌ అసమతుల్యతలు , మానసిక ప్రభావాలు , రీ-ఫీడిరగ్‌ సిండ్రోమ్‌ ప్రమాదరౌ. ముగింపుగా.., తొమ్మిది రోజుల పాటు ఆహారం తీసుకోకపోవడం వల్ల తీవ్రమైన ఆరోగ్య ప్రమాదాలు ఉన్నందున ఇది అస్సలు సిఫార్సు చేయబడదు. మరి ఆ పిచ్చిది ఎందుకు చెబుతున్నట్టు..? మీడియా ఎందుకు రాస్తున్నట్టు..? అసలు వీళ్లను కదా 9 రోజులపాటు ఎండబెట్టాల్సింది..!!చెప్పేవాడికి వినేవాడు, రాసేవాడికి చదివేవాడు లోకువ..!!

` ముచ్చట సౌజన్యంతో...


కీరవాణి ఇంట విషాదం
ree

టాలీవుడ్‌లో విషాదం నెలకొంది. సినిమా ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ రచయిత శివ శక్తి దత్తా తుది శ్వాస విడిచారు. సోమవారం రాత్రి సమయంలో శివ శక్తి దత్తా మృతి చెందినట్లు కుటుంబ సభ్యుల నుంచి అధికారిక ప్రకటన వచ్చింది. ప్రముఖ సంగీత దర్శకుడు ఎం ఎం కీరవాణి తండ్రి ఈ శివ శక్తి దత్తా అనే విషయం తెల్సిందే. రచయితగా ఎన్నో సినిమాలకు శివ శక్తి దత్తా పని చేశారు. ముఖ్యంగా రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన సినిమాలకు శివ శక్తి దత్తా తన రచన సహకారం అందించారు. బాహుబలి సినిమా కోసం మమతల తల్లి, సాహోరే బాహుబలి పాటలను శివ శక్తి దత్తా రాశారు. ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమాలోని థీమ్‌ సాంగ్‌కి సైతం శివ శక్తి దత్తా సాహిత్యం అందించారు.

ప్రముఖ రచయిత విజయేంద్ర ప్రసాద్‌కు స్వయానా అన్న అయిన శివ శక్తి దత్తా ఇండస్ట్రీలో ఎన్నో రకాలుగా సేవలు అందించారు. కొన్ని వారాల ముందు వరకు కూడా ఆయన పలు మీడియా సంస్థలకు ఇంటర్వ్యూలు ఇస్తూ యాక్టివ్‌గా కనిపించారు. ఆయన ఇంటర్వ్యూలు ఎన్నో యూట్యూబ్‌లో ఉంటాయి. విజయేంద్ర ప్రసాద్‌, రాజమౌళి, కీరవాణి, వల్లి, రమా ఇలా ఫ్యామిలీ మెంబర్స్‌ అందరి గురించి ఆయన మాట్లాడిన మాటలు ఎప్పటికప్పుడు వైరల్‌ అవుతూ వచ్చాయి. సినిమా ఇండస్ట్రీలో వారి ఫ్యామిలీకి ఉన్న స్థాయి, క్రేజ్‌ నేపథ్యంలో ఆయన ఇంటర్వ్యూలకు భారీ డిమాండ్‌ ఉండేది, ఆయన ఇంటర్వ్యూల్లో ఎన్నో విషయాలను తెలియజేస్తూ ఉండేవారు.

1932లో రాజమహేంద్రవరం పక్కన ఉండే కొవ్వూరులో జన్మించిన శివ శక్తి దత్తా అసలు పేరు కోడూరు సుబ్బరాజు. చిన్నప్పటి నుంచి కళలపై ఆసక్తి కలిగి ఉన్న ఈయన ఇంట్లో చెప్పకుండా వెళ్లి పోయి ముంబైలోని ఆర్ట్స్‌ కాలేజ్‌లో గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేశారు. ఆ తర్వాత కొవ్వూరు తిరిగి వచ్చిన ఈయన చిత్రకారుడిగా కొన్నాళ్లు కొనసాగారు. ఆ తర్వాత సంగీతంపై ఆసక్తితో గిటార్‌, సితార్‌, హార్మోణియం నేర్చుకున్నారు. మద్రాస్‌లో సోదరుడు విజయేంద్ర ప్రసాద్‌తో కలిసి సినిమాల కోసం ప్రయత్నాలు చేశాడు. వీరిద్దరు కలిసి ‘జానకి రాముడు’ సినిమాకి వర్క్‌ చేశారు. ఆ సినిమా సూపర్‌ హిట్‌ కావడంతో ఇండస్ట్రీలో వీరిద్దరికి మంచి గుర్తింపు లభించింది.

శివ శక్తి దత్తాకు ముగ్గురు సంతానం. కీరవాణి, కళ్యాణి మాలిక్‌, శివ శ్రీ కంచి. ముగ్గురిలో కీరవాణి, కళ్యాణి మాలిక్‌ సంగీత దర్శకులగా పరిచయం అయ్యారు. శివ శక్తి దత్తా యొక్క తమ్ముడి కొడుకు రాజమౌళి. ఇండస్ట్రీలో శివ శక్తి దత్తా ఫ్యామిలీకి చెందిన వారు పదుల సంఖ్యలో ఉన్నారు. దర్శకులుగా, నటులుగా, సంగీత దర్శకులుగా, సింగర్స్‌గా కొనసాగుతున్నారు. శివ శక్తి మరణంతో ఆ ఫ్యామిలీ మొత్తం తీవ్ర దుఃఖంలో ఉంది. ఇండస్ట్రీ ప్రముఖులు పలువురు శివ శక్తి దత్తాకు నివాళ్లు అర్పించారు. కీరవాణి, రాజమౌళి అభిమానులతో పాటు, తెలుగు సినిమా ప్రేమికులు శివ శక్తి దత్తాకు సోషల్‌ మీడియా ద్వారా నివాళ్లు అర్పిస్తున్నారు.

తుపాకి.కామ్‌ సౌజన్యంతో...

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page