పాక్ ఆర్థిక రంగానికి కోలుకోలేని దెబ్బ
- DV RAMANA

- May 14, 2025
- 2 min read

భారత్‌తో కోరి కయ్యానికి దిగిన పాకిస్తాన్ అందుకు తగిన ఫలితం అనుభవిస్తోంది. ఆపరేషన్ సింధూర్ పేరుతో పాక్‌తో పాటు పాక్ ఆక్రమిత కశ్మీర్ భూభాగాల్లోకి చొరబడి భారత సైనికదళాలు జరిపిన దాడులు పాక్‌ను తీవ్ర నష్టానికి గురిచేశాయి. పహల్గాం ఉగ్రవాద దాడులకు ప్రతీకారంగా భారత్ ఈ నెల ఏడో తేదీన కేవలం ఉగ్రవాదులనే లక్ష్యంగా చేసుకుని తొమ్మిది శిబిరాలను క్షిపణి దాడులతో ధ్వంసం చేసింది. ఉగ్రవాదులను పెంచి పోషిస్తున్న పాకిస్తాన్ దీన్ని తట్టుకోలేక అక్కసుతో సరిహద్దుల్లోని భారత పౌర ఆవాసాలు, సైనిక శిబిరాలను లక్ష్యంగా చేసుకుని దాడులకు పాల్పడటం ద్వారా కోరి కొరివితో తలగోక్కుంది. భారత త్రివిధ దళాలు ప్రతిదాడులకు దిగాయి. ఆపరేషన్ సింధూర్ తొలిరోజు కేవలం ఉగ్రవాద శిబిరాలనే ధ్వంసం చేసిన భారత బలగాలు, మరుసటి రోజు నుంచి పాకిస్తాన్ సైనిక, వైమానికి లక్ష్యాలపై గురిపెట్టి దాడులు చేసి పెను విధ్వంసం సృష్టించాయి. దీనివల్ల పాకిస్తాన్‌కు ఆర్థికంగా, సైనికపరంగా అపారనష్టం వాటిల్లింది. ఉగ్రవాద శిబిరాలపై దాడు ల్లో వందమందికిపైగా ఉగ్రవాదులు హతమయ్యారు. ఆ తర్వాత మూడు రోజులపాటు వరుసగా నిర్వహించిన దాడుల్లో ఒక స్క్వాడ్రన్ లీడర్‌తో సహా సుమారు 50 మంది పాక్ సైనికులు మరణిం చారు. ఈ విషయాన్ని ఆ దేశం కూడా అంగీకరించింది. ఒక్క పదో తేదీనే పాక్‌కు చెందిన కీలకమైన 11 వైమానిక స్థావరాలపై భారత్ జరిపిన దాడులతో పాక్ ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన 20 శాతం ఆస్తులు ధ్వంసమయ్యాయి. సరిహద్దులు దాటి పాక్ భూభాగంలోని వందల కిలోమీటర్ల పరిధిలో జరిపిన ఈ దాడుల్లో పాకిస్తాన్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ పూర్తిగా నాశనమైంది. స్కాల్ప్ క్షిపణులు, హేమర్ బాంబులతో కూడిన రాఫెల్ జెట్‌లతో భారత్ జరిపిన దాడులతో దాయాది దేశం బెంబే లెత్తిపోయింది. టర్కీ, చైనాలు అందజేసిన డ్రోన్‌లు, క్షిపణులు చూసుకుని పెట్రేగిపోయిన పాక్.. వాటన్నింటినీ భారత్‌కు చెందిన ఎస్ 400, బ్రహ్మోస్ వంటి రక్షణ వ్యవస్థలు గాలిలోని తుత్తునీ యలు చేయడంతో అవాక్కయ్యింది. ఈ దాడుల వల్ల భరత సైనిక శక్తి ఏమిటో ప్రపంచానికి తెలిసి వచ్చింది. ఇక మూడురోజుల స్వల్పకాలిక యుద్ధానికి పాక్ ఎంత దారుణంగా నష్టపోయిందన్న వివ రాలు ఒక్కొక్కటిగా బయట ప్రపంచానికి తెలుస్తున్నాయి. భారత ప్రతిదాడుల తీవ్రతతో అగ్రరాజ్యం అమెరికా కూడా ఉలిక్కిపడిరది. అణ్వాయుధ యుద్ధం తప్పదనే భయం ఒకవైపు.. పాక్ వద్ద ఉన్న తమ ఆయుధాలు భారత ఆయుధాల ముందు తేలిపోతున్నాయన్న ఆందోళన మరోవైపు అగ్రదేశాన్ని కలవరపాటుకు గురి చేసింది. దీనివల్ల తన ఆయుధ మార్కెట్ దెబ్బతింటుందన్న భయంతోనే అమె రికా ఆదరాబాదరాగా రంగంలోకి దిగి భారత్`పాక్‌లను కాల్పుల విరమణకు ఒప్పించిందంటు న్నారు. అంటే ఈ యుద్ధంగా పాకిస్తాన్‌కే కాకుండా పరోక్షంగా అమెరికాకు సైతం నష్టం కలిగిం చిందన్నమాట. పాకిస్తాన్‌ను సైనికపరంగా, వారు నమ్ముకున్న ఉగ్రవాదం పరంగా అపారనష్టం కలి గించిన భారత సైనిక చర్య.. మరోవైపు దాయాది దేశ ఆర్థిక రంగాన్ని కూడా కోలుకోలేని దెబ్బ తీసింది. రెండు దేశాల మధ్య ఘర్షణాత్మక వైఖరి నెలకొన్నప్పటి నుంచీ కాల్పుల విరమణ అమల్లోకి వచ్చే వరకు పాకిస్తాన్ స్టాక్ మార్కెట్ అతలాకుతలమైంది. మార్కెట్ సూచీలు అథోముఖం పట్టడంతో ఒకటీ రెండు కాదు ఏకంగా పాకిస్తాన్ మదుపరులు సుమారు రూ.80వేల కోట్ల మేర నష్టపోయినట్టు ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ఉన్న ఆ దేశానికి ఇది పెను విఘాతమే. దీనికి ముందే ఈ సంక్షోభం నుంచి తమను బయటపడేసేందుకు ఏడు బిలియన్ డాలర్ల బెయిల్ అవుట్ ప్యాకేజీ ఇవ్వాలని పాక్ ప్రభుత్వం అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ(ఐఎంఎఫ్)ను అభ్య ర్థించింది. దీన్ని భారత్ తీవ్రంగా వ్యతిరేకించిన నేపథ్యంలో చివరికి పాక్‌కు రెండు బిలియన్ డాలర్ల ఆర్థిక ప్యాకేజీ ఇస్తున్నట్లు ఐఎంఎఫ్ ప్రకటించింది. ఇందులో ఒక బిలియన్ డాలర్లు వెంటనే ఇస్తారు. కానీ పాకిస్తాన్ స్టాక్‌మార్కెట్ నష్టం దాని కంటే చాలా ఎక్కువగా ఉంది. దాంతో ఐఎంఎఫ్ ప్యాకేజీ అందినా కూడా పాక్ కోలుకునే పరిస్థితి కనిపించడం లేదు. వీటితో పాటు అనేక పౌర, సామాజిక ఆస్తులు కూడా దెబ్బతిన్నాయి. వీటన్నిటిని బట్టి చూస్తుంటే.. పాకిస్తాన్ భారీగానే నష్టపోయినట్లు అర్థ మవుతుంది. కేవలం భారత్‌కు వ్యతిరేకంగా ఉగ్రవాదాన్ని పెంచి పోషించడానికి దేశాభివృద్ధిని ఫణంగా పెట్టడం పాక్ పాలకుల కుటిల నీతికి నిదర్శనం.










Comments