top of page

పాక్‌ను వణికిస్తున్న రియల్ ‘దురంధర’!

  • Writer: DV RAMANA
    DV RAMANA
  • 2 days ago
  • 2 min read
  • ఆ సినిమా హీరో పాత్రను తలపిస్తున్న బీఎలఏ కమాండర్

  • అతని వ్యూహాలు, దాడులతో పాక్ సైన్యానికి చుక్కలు

  • బలూచ్ సాయుధ ఉద్యమంలో మహిళా ఫిదాయీలు

  • స్వాతంత్య్రం కోసం సమిధలవుతున్న యువత

(డి.వి.రమణ, సత్యం ప్రత్యేక ప్రతినిధి)

ఇటీవలి కాలంలో బాలీవుడ్ అనే కాకుండా భారతీయ సినిమా చరిత్రలో దురంధర్ హిందీ చిత్రం సంచనాలకు కేంద్రంగా నిలిచింది. ఈ చిత్ర కథాంశం ప్రేక్షకులకు విపరీతంగా ఆకట్టుకోవడంతో దాని ప్రభావంతో కలెక్షన్ల వర్షం కురిసింది. ఇందులో హీరో రణ్‌వీర్ సింగ్ పోషించిన హంజా పాత్ర ఉగ్రవాదుల్లో ఉగ్రవాదిగా ఇమిడిపోయి.. తమకు వ్యతిరేకంగా ఉన్న ప్రభుత్వాన్ని టార్గెట్ చేయించడం. అచ్చం ఈ సినిమా కథను తలపిస్తున్నాడు పాకిస్తాన్‌లోని బలూచిస్థాన్ తిరుగుబాటు నేత బషీర్ బలోచ్. కొద్దికాలంపాటు స్తబ్దుగా ఉన్నట్లు కనిపించిన బలూచిస్థాన్ లిబరేషన్ ఆర్మీ (బీఎలఏ) మూడు నాలుగు రోజులుగా మళ్లీ విజంభించి పంజా విసురుతోంది. ఫలితంగా బీఎలఏ దళాలు, పాక్ సైన్యం మధ్య జరుగుతున్న ఘర్షణల్లో ఇరువైపులా వందలాది మంది హతమవుతున్నారు. బలూచిస్థాన్‌లో మరోసారి రక్తపుటేరులు పారుతున్నాయి. ఈ సాయుధ ఘర్షణల్లో తమదే పైచేయి అని ఇరువర్గాలు ఎవరికివారు ప్రకటించుకుంటున్నారు. ఆ సంగతి ఎలా ఉన్నా.. బలూచిస్థాన్‌కు స్వాతంత్య్రం కోసం సాగుతున్న సాయుధ పోరాటం పాకిస్తాన్ పాలకులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. దీనికి ప్రధాన సూత్రధారి, బీఎలఏ వ్యవస్థాపకుడైన బషీర్ బలూచ్ అనే చెప్పాలి. మరోవైపు మహిళా మిలిటెంట్లు ఫిదాయీలు(మానవ బాంబులు)గా మారి పాక్ పట్టణాల్లో మారణీVAమం సష్టిస్తూ.. అందులోనే తాము సమిధలవుతున్నారు.

సమాంతర ప్రభుత్వం

బలూచిస్థాన్ స్వాతంత్య్ర పోరాటంగా చెబుతున్న సాయుధ ఉద్యమం సూత్రధారి బషీర్ బలూచ్ దురంధర్ సినిమాలో హీరో తరహాలోనే ఉద్యమాన్ని నడుపుతున్నాడు. దేశంలోని అతిపెద్ద భూభాగమైన బలూచిస్థాన్‌ను పాకిస్తాన్ మ్యాప్ నుంచి తప్పించి, స్వతంత్ర దేశంగా స్థిరపరిచేందుకు చాలాకాలంగా బలూచ్ లిబరేషన్ ఆర్మీ పోరాటం చేస్తోంది. ఇప్పటికే సుమారు పది జిల్లాలను ఈ ఆర్మీ ఆక్రమించుకుని సమాంతర పాలన నిర్వహిస్తోంది. అందులో భాగంగా గత మూడురోజులుగా ఏకధాటిగా జరుగుతున్న సాయుధ పోరాటంలో వందలాదిమంది హతమయ్యారు. తాజాగా జరుగుతున్న సాయుధ సంఘర్షణలకు బీఎలఏ మాస్టర్ మైండ్, ఆ సంస్థ కమాండర్ ఇన్ చీఫ్ బషీర్ ఆపరేషన్ హెరోఫ్ 2.0 అని వ్యవహరిస్తున్నాడు. ఈ ఆపరేషన్‌లో పాల్గొనాల్సిందిగా అతను ఇచ్చిన పిలుపునకు బలూచిస్థాన్ యువత నుంచి అనూహ్యమైన స్పందన కనిపిస్తోంది. బషీర్‌ను పట్టుకోవడానికి పాక్ సైన్యం ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా ఫలితం కనిపించడంలేదు. గతంలో ఆఫ్ఘనిస్థాన్‌లోని కాందహార్ కేంద్రంగా పనిచేసిన బషీర్ తాలిబన్ల పాలన ప్రారంభమైన తర్వాత 2021లో తన స్థావరాన్ని ఇరాన్`ఆఫ్ఘనిస్థాన్ సరిహద్దుల్లోని కొండల్లోకి మార్చుకున్నాడు. ఉద్యమం కోసం విద్యార్థులు, డాక్టర్లతో కూడిన ఒక ప్రమాదకరమైన మజీద్ బ్రిగేడ్‌ను తయారుచేశాడు. బషీర్ ఒక్క పిలుపునిస్తే చాలు..పాకిస్తాన్‌ను అతలాకుతలం చేయడానికి ఈ బ్రిగేడ్ సభ్యులు సదా సిద్ధంగా ఉంటారు. కోర్టు ఇతన్ని ఈ నెలలోనే ‘ప్రకటిత నేరస్తుడు’గా ప్రకటించినప్పటికీ, ఇతన్ని పట్టుకోవడం పాక్ సైన్యానికి సాధ్యం కావడం లేదు.

ముచ్చెమటలు పట్టిస్తున్న మహిళలు

బలూచ్ తిరుగుబాటుదారులు ‘ఆపరేషన్ హెరోఫ్ ఫేజ్-2’ పేరుతో పాక్ సైనిక స్థావరాలపై విరుచుకుపడుతున్నారు. వీరి ధాటికి క్వెట్టా, నోష్కీ వంటి కీలక నగరాల్లో పాక్ సైన్యం తోకముడవాల్సి వచ్చింది. ఈ తాజా పోరులో మహిళా ఆత్మాహుతి దళాలు కీలకంగా మారాయి. 2023లో ఉద్యమంలో చేరిన ఆసిఫా మెంగల్ అనే 24 ఏళ్ల యువతి జనవరి 31న నోష్కీలోని పాక్ గూఢచారి సంస్థ (ఐఎసఐ) ప్రధాన కార్యాలయాన్ని లక్ష్యంగా చేసుకుని కార్ బాంబు పేల్చింది. ఈ దాడిలో ఆమె కూడా ప్రాణాలు కోల్పోయింది. ఫ్రంట్‌లో మరో మహిళా ఫిదాయీ హవా బలూచ్ కూడా పాక్ సైన్యంతో పోరాడుతూ వీరమరణం పొందింది. ఈ మహిళకు సోషల్ మీడియాలో భారీ మద్దతు లభిస్తోంది. హవా బలూచ్ అత్యంత సాహసంతో పాక్ సైనికులకు చుక్కలు చూపింది. వారిపై తూటాల వర్షం కురిపిస్తూ ధైర్యంగా ముందుకు దూసుకుపోతూ తోటి వారికి ధైర్యం చెబుతూ స్ఫూర్తిగా నిలిచింది. తమ స్వాతంత్య్రానికి ఈ పోరాటం ఎంతో కీలకమని చెప్పిన ఆమె ఆ తర్వాత 12 గంటల వ్యవధిలోనే మరణించింది. ఈమె తండ్రి కూడా బీఎలఏ ఫైటర్. 2021లో పాకిస్తాన్ సైన్యం చేతిలో హతమయ్యాడు. విద్యావంతులైన యువతులు కూడా బలూచిస్థాన్ స్వాతంత్య్ర పోరాటంలో చురుగ్గా పాల్గొంటున్నారని బీఎలఏ ప్రకటించింది. ప్రభుత్వంతో పోరాటంలో వారి పాత్రను ప్రశంసిస్తూ.. తాజా ఘర్షణల్లో ప్రాణాలు కోల్పోయిన వీరిద్దరి ఫొటోలను విడుదల చేయడం ద్వారా తమ పోరాటంలో మహిళా ఫిదాయీల పాత్ర గణనీయంగా ఉందని బలూచ్ లిబరేషన్ ఆర్మీ వెల్లడించింది.

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page