top of page

ప్రధాన పార్టీలకు కోవర్టుల బెడద?

  • Writer: DV RAMANA
    DV RAMANA
  • Jun 13, 2025
  • 2 min read

రాజకీయంగా ఎదగాలన్నా.. ఎన్నికల్లో గెలిచి అధికారం చేపట్టాలన్నా.. వ్యూహ ప్రతివ్యూహాలు, ఎత్తులు పైఎత్తులు తప్పవు. తమ బలాన్ని పెంచుకోవడం, ఎదుటివారి బలహీనతలను గుర్తించడం, ప్రత్యర్థి పార్టీల గుట్టుమట్లు, వ్యూహాలు ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ప్రతివ్యూహాలు పన్నడం రాజకీ యాల్లో సహజం. సమకాలీన రాజకీయాల్లో దాదాపు అన్ని పార్టీలూ తమ ప్రత్యర్థుల లోగుట్ట తెలుసుకుని దెబ్బకొట్టడానికే ప్రాధాన్యత ఇస్తున్నట్లు కనిపిస్తోంది. ప్రాంతీయం నుంచి జాతీయం వరకు ప్రధాన పార్టీలను కలవరపెడుతున్న అంశం కూడా అదే. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో ఇప్పుడు ఇదే చర్చనీయాంశం. ఏ పార్టీలో ఎవరి కోవర్టులు ఉన్నారో తెలియని గందరగోళ పరిస్థితులు నెలకొన డమే దీనికి కారణం. చిన్నాచితకా నాయకులు మాట్లాడేదైతే పెద్ద సీరియస్‌గా పరిగణించాల్సిన అవసరం ఉండేది కాదేమో. కానీ రాహుల్‌ గాంధీ నుంచి చంద్రబాబు, కేటీఆర్‌ వరకు దాదాపు బడానేతలందరూ ఈ విషయాన్ని నొక్కి వక్కాణించడమే కోవర్టు రాజకీయంపైకి దృష్టి మళ్లించేలా చేస్తోంది. ప్రాంతీయ పార్టీల నుంచి జాతీయ పార్టీల వరకు ప్రతి రాజకీయ పక్షాన్ని కోవర్టుల సమస్య బాధిస్తున్నట్లు స్పష్టమవు తోంది. అయితే ఏ పార్టీకి ఎవరు.. ఎక్కడ కోవర్టులుగా పనిచేస్తున్నారని తెలుసుకోవడమే పెద్ద సవాలుగా మారింది. రాష్ట్ర ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడే స్వయంగా తమ పార్టీలో కోవర్టు లపై ఇటీవల చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపాయి. హత్యా రాజకీయాల్లో తలపండిన వైకాపా నాయ కులు కొందరు కోవర్టులను తెలుగుదేశంలోకి పంపి తాము అనుకున్నది సాధించాలని అనుకుంటున్నా రంటూ బాంబు పేల్చారు. అలాంటివారిని ఉపేక్షిస్తే మన వేలితో మన కన్ను పొడుచుకున్నట్టేనని కార్య కర్తలను హెచ్చరించారు. టీడీపీనే కాదు.. కొత్తగా ఏర్పడిన తెలంగాణలో పదేళ్లు అధికారం చెలాయిం చిన బీఆర్‌ఎస్‌ను కూడా ఇప్పుడు కోవర్టుల భయం వెంటాడుతోంది. ఇటీవల ఆ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్‌కు ఎమ్మెల్సీ కవిత రాసిన అంతర్గత లేఖ లీకవడంతోనే ఆ పార్టీలో కోవర్టుల పాత్ర తెరపైకి వచ్చింది. అంతర్గత లేఖ బయటకెలా వచ్చిందో తేల్చాలని కవిత డిమాండ్‌ చేయగా, పార్టీలో సీఎం రేవంత్‌రెడ్డి కోవర్టులు ఉన్నారంటూ బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ఆరోపించారు. సమయం వచ్చినప్పుడు ఆ కోవర్టుల బండారం బయటపడుతుందని హెచ్చరించారు. అయితే ఆలోపు ఇంకెన్ని బీఆర్‌ఎస్‌ సీక్రెట్స్‌ బయటకు వస్తాయోనని క్యాడర్‌ ఆందోళన చెందుతోంది. కేటీఆర్‌ చెప్పిన దాంట్లో వాస్తవం లేకపోలేదు. ప్రతి పార్టీలోనూ కోవర్టులు ఉంటారు. అక్కడి అంతర్గత విషయాలను తమ బాసు లకు చేరవేస్తుంటారు. అదే క్రమంలో ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్‌లో సైతం బీఆర్‌ఎస్‌, బీజేపీల కోవర్టులు ఉన్నారనే ప్రచారం చాన్నాళ్ల నుంచీ ఉంది. కాంగ్రెస్‌ ప్రతిపక్షంలో ఉండగా వరంగల్‌ సభలో ఏకంగా రాహుల్‌ గాంధీయే ఈ విషయాన్ని ప్రస్తావించారు. అలాంటి వారు ఎవరైనా, ఎంతటివారైనా తమకు అక్కర్లేదనీ, సొంత పార్టీల్లోకి వెళ్లిపోవాలని తేల్చి చెప్పేశారు. కోవర్టులతో చాలా ఏళ్లు ఇబ్బంది పడిన తెలంగాణ కాంగ్రెస్‌కు అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర దాటినా ఇంకా ఆ బెడద పోలేదని తెలు స్తోంది. జాతీయ స్థాయిలోనూ ఆ పార్టీకి కోవర్టుల సమస్య వెంటాడుతోంది. ఇటీవల గుజరాత్‌లో జరి గిన పార్టీ ముఖ్యనేతల సమావేశంలోనూ రాహుల్‌ ఇదే విషయాన్ని ప్రస్తావించారు. కాంగ్రెస్‌లో సగం మందికిపైగా బీజేపీకి కోవర్టులుగా పనిచేస్తున్నారంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అన్ని పార్టీల్లోనూ కోవర్టులు ఉన్నప్పటికీ.. కాంగ్రెస్‌లో మాత్రం ఈ సంస్కృతి ఎప్పటి నుంచో ఉందని రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. కాంగ్రెస్‌ అధికారంలో లేనప్పుడు ఆ పార్టీ నేతలు తమ పనుల కోసం అధికారపక్షా లతో అంటకాగుతుంటారనే ఆరోపణ ఉంది. తెలంగాణలో బీఆర్‌ఎస్‌ అధికారంలో ఉన్నప్పుడు చాలా మంది కాంగ్రెస్‌ నేతలు ఇలాంటి ఆరోపణలే ఎదుర్కొన్నారు. అదేవిధంగా కాంగ్రెస్‌లోనే ఉంటూ సొంత పార్టీ నేతలనే ఓడిరచుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. ఎంపీ ఈటల రాజేందర్‌పై కాంగ్రెస్‌ చేస్తున్న ఆరోపణలను తిప్పికొడుతున్న బీజేపీ.. అసలు కోవర్టులు కాంగ్రెస్‌లోనే ఉన్నారని, వారంతా బీఆర్‌ఎస్‌ కోసం పనిచేస్తున్నారని ప్రత్యారోపణలు చేస్తోంది. కేసీఆర్‌కు అనుకూలంగా పీసీసీ చీఫ్‌ మహేష్‌గౌడ్‌ కోవర్టు రాజకీయాలు చేస్తున్నారని బీజేఎల్పీ లీడర్‌ మహేష్‌ గౌడ్‌ ఆరోపించారు. 2014 లోక్‌సభ ఎన్నిక ల్లో బీఆర్‌ఎస్‌ అభ్యర్థి కవితకు మద్దతు ఇచ్చారని ఆరోపించారు. మొత్తం మీద అధికారంలో ఉన్నా లేకపోయినా.. ప్రధాన రాజకీయ పార్టీలను ఇప్పుడు కోవర్టుల అంశం కుదిపేస్తున్నట్లు కనిపిస్తోంది.

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page