top of page

ప్రపంచ పెద్దన్న స్వార్థం!

  • Writer: DV RAMANA
    DV RAMANA
  • Jun 28, 2025
  • 2 min read

అమెరికా ఏం చేసినా.. దాని వెనుక స్వార్థ ప్రయోజనాలు కచ్చితంగా ఉంటాయి. ఇప్పుడే కాదు.. గతం నుంచీ అమెరికా ఆలోచనలు, నిర్ణయాలను గమనిస్తే ఈ విషయం స్పష్టంగా అర్థమవుతుంది. ఉమ్మడి రష్యా(యూఎస్‌ఎస్‌ఆర్‌) ఉన్నంతకాలం అమెరికాను ప్రతి విషయంలో అడ్డుకుంటూ వచ్చింది. ప్రపంచ ఆధిపత్యం కోసం ఆ రెండు దేశాల మధ్య ప్రచ్ఛన్న యుద్ధం జరిగేది. అదే సమయంలో ఆయుధ తయారీ మొదలుకొని అంతరిక్ష పరిశోధనల వరకు వాటి మధ్య ఆధిపత్య పోరాటం కొనసా గింది. 1991లో యునైటెడ్‌ సోవియట్‌ సోషలిస్ట్‌ రిపబ్లిక్‌గా ఉన్న రష్యా చిన్న చిన్న దేశాలుగా విడిపో యింది. అప్పటినుంచీ అమెరికాకు ఎదురులేకుండాపోయింది. ఏకైక అగ్రరాజ్యంగా చెలామణీ అవుతూ ప్రపంచవ్యాప్తంగా సైనిక స్థావరాలు ఏర్పాటు చేస్తూ చాలా దేశాలపై ప్రత్యక్షంగా పరోక్షంగా పెత్తనం సాగిస్తోంది. అదే క్రమంలో అంతర్జాతీయ వాణిజ్యంలోనూ తన హవా కొనసాగించేలా నిర్ణయాలు తీసు కుంటోంది. తన నిర్ణయాలకు తలొగ్గని దేశాలపై ఏదో రూపంలో కయ్యానికి కాలు దువ్వి తనకు దాసోహం అనేలా చేస్తోంది. గత చరిత్రను పరిశీలిస్తే సుమారు 30 దేశాలపై అమెరికా యుద్ధానికి దిగి వాటిని కోలుకోలేని దెబ్బ తీసింది. మరోవైపు తన మిత్రదేశాల ద్వారా ప్రత్యర్థి దేశాలపై సైనిక ఘర్షణ లేదా యుద్ధాలకు పురిగొల్పడం.. ఆనక రంగంలోకి దిగి మధ్యవర్తిత్వం పేరుతో శాంతి వచనాలు పలు కుతూ ఇరుదేశాలను రాజీ పడేలా చేయడం అమెరికా దశాబ్దాలుగా అమలు చేస్తున్న వ్యూహం. పనిలో పనిగా ఆయా దేశాలు తనతో వాణిజ్య, సైనిక సంబంధాలు పెంపొందించుకునేలా బలవంతంగా ఒప్పించడం అమెరికాకు రివాజుగా మారింది. చివరికి తానే రెండు దేశాల మధ్య రాజీ కుదిర్చి రెండు దేశాల మధ్య యుద్ధాన్ని ఆపించానని ఇంటా బయటా డప్పు కొట్టుకోవడంలో అమెరికన్‌ పాలకులుగా దిట్టలని గతం నుంచీ అనుభవైకవేద్యమే. ఆ దేశ తాజా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ ఇదే రీతి.. నీతి అను సరిస్తున్నారు. ఏప్రిల్‌లో భారత్‌`పాక్‌ సైనిక ఘర్షణల సమయంలోనూ, నిన్న గాక మొన్న ఇజ్రాయెల్‌` ఇరాన్‌ యుద్ధ సమయంలోనూ ఆమెరికా స్వార్థబుద్ధి మరోసారి బయటపడిరది. పహల్గాం ఉగ్ర ఊచ కోత నేపథ్యంలో పీవోకేలోని ఉగ్రవాద శిబిరాలను భారత్‌ నాశనం చేయడం, దాన్ని తట్టుకోలేని పాకి స్తాన్‌ భారత్‌లోని పౌర అవాసాలపై వైమానిక దాడులకు తెగబడటంతో భారత్‌ ఆపరేషన్‌ సింధూర్‌ పేరుతో పాకిస్తాన్‌పై ఎదురు దాడి చేసింది. ఆ దేశంలో కీలకమైన వైమానిక స్థావరాలను ధ్వంసం చేసింది. ఈ సైనిక చర్య కొనసాగుతున్న తరుణంలోనే ట్రంప్‌ ఉన్న ఫళంగా తన సొంత సోషల్‌ మీడియా ట్రత్‌ సాక్షిగా ఇరు దేశాల మధ్య కాల్పులు విరమణ ఒప్పందం కుదిరిందని, అందుకు తానే భారత్‌, పాక్‌లను ఒప్పించానని ఏకపక్షంగా ప్రకటించేశారు. కానీ భారత్‌ ముందు అమెరికా పప్పులు ఉడకలేదు. అయితే చిరకాల మిత్రదేశమైన పాకిస్తాన్‌ మాత్రం ట్రంప్‌కు వంగి వంగి సలాములు చేసింది. ఘనంగా కృతజ్ఞతలు చెప్పింది. దాంతో మురిసిపోయిన ట్రంప్‌ ఎన్నడూ లేనివిధంగా పాక్‌ సైన్యాధ్యక్షుడినే తనతో డిన్నర్‌ భేటీకి ఆహ్వానించారు. ఆ సందర్భంగా పాక్‌కు పలు ఆధునిక ఆయు ధాలు, విమానాలు ఇస్తామని హామీ ఇచ్చి వేల కోట్ల రూపాయల కొత్త ఒప్పందాలకు తెర తీశారు. ఇది అమెరికా రక్షణ మార్కెట్‌కు బూస్ట్‌ ఇస్తుందనడం సందేహం లేదు. ఇక ఈ నెలలోనే జరిగిన ఇజ్రా యెల్‌`ఇరాన్‌ యుద్ధంలోనూ ట్రంప్‌ ఇదే తరహా రాజీ రాజకీయం నెరిపారు. తొలుత తన అనంగు మిత్రదేశమైన ఇజ్రాయెల్‌ను శత్రుపక్షమైన ఇరాన్‌పైకి ఉసిగొల్పి దాడులు చేయించారు. దాంతో ఇరాన్‌ కూడా ప్రతి దాడులకు దిగి ధీటైన సమాధానం ఇచ్చింది. స్వయంగా అమెరికా కూడా ఇరాన్‌లోని అణు కేంద్రాలపై బంకర్‌ బస్టర్‌ బాంబులు ప్రయోగించి, వాటిని నాశనం చేసింది. 12 రోజులపాటు భీకరంగా యుద్ధం జరిగి.. ఇరుదేశాలు భారీగా నష్టపోయిన తర్వాత ట్రంప్‌గారు తీరిగ్గా శాంతి వచ నాలు వల్లిస్తూ.. షరా మామూలుగానే కాల్పుల విరమణకు ఇరుదేశాలు అంగీకరించాయని హఠాత్తుగా ప్రకటించారు. అదే ఊపులో ఇరాన్‌పై ఉన్న వాణిజ్య ఆంక్షలను ఎత్తివేస్తున్నట్లు ప్రకటించారు. ఇరాన్‌ నుంచి చమురు దిగుమతి చేసుకునే దేశాల్లో చైనా అగ్రస్థానంలో ఉంది. యుద్ధం నేపథ్యంలో ట్రంప్‌ ఇరాన్‌తో వాణిజ్యంపై ఆంక్షలు విధించారు. యుద్ధం ముగిసినందున ఇరాన్‌పై ఆంక్షలు ఎత్తివేస్తున్నట్లు ప్రకటించడంతో పాటు అమెరికా నుంచి కూడా చైనా ముడిచమురు కొంటుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు. దాంతో ఇదంతా ట్రంప్‌గారి వ్యాపార స్ట్రాటజీ అని నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు.

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page