ప్రపంచ వలసల్లోనూ మనమే ఫస్ట్!
- DV RAMANA

- Aug 5, 2025
- 2 min read

మానవ పరిణామక్రమంలో వలసలు చాలా కామన్. ఆదిమ మానవ యుగం నుంచే ఇవి కొన సాగుతున్నాయి. ప్రధానంగా ఆహారం, నీరు వెతుక్కుంటూ ఆ యుగంలో మానవులు దూరతీరాలకు వలసపోయేవారు. ఇప్పటికీ ఆఫ్రికా, ఆసియా ఖండాల్లోని చాలా దేశాల్లో సంచార జాతులవారు మనుగడ సాగిస్తున్నారు. అలా మొదలైన వలసల జీవనం నాగరికత పెరిగినా.. ఉపాధి, ఆహారం, నీరు వంటి వసతులు కొన్ని వందల రెట్లు పెరిగి అందుబాటులోకి వచ్చినా ఇప్పటికీ ప్రపంచంలో వలసలు కొనసాగుతుండటం విశేషం. అది కూడా ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగి, నాలుగో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదగిన భారతదేశం నుంచి వలసలు అత్యధికంగా జరుగుతుండటం విస్మ యం కలిగిస్తోంది. వలసల్లో ప్రపంచంలో భారతదేశమే అగ్రస్థానంలో ఉందని సాక్షాత్తు ఐక్యరాజ్య సమితి తాజాగా విడుదల చేసిన గ్లోబల్ మైగ్రేషన్ నివేదికలో వెల్లడిరచింది. 2024 నాటికి ప్రపంచ వ్యాప్తంగా ఏకంగా 1.85 కోట్ల మంది ప్రవాస భారతీయులు ఉన్నట్లు ఆ నివేదిక పేర్కొంది. మొత్తం అంతర్జాతీయ వలసదారుల్లో భారత్ సుమారు ఆరుశాతాన్ని ఆక్రమించిందని స్పష్టం చేసింది. ప్రపంచ వలసదారుల మొత్తం సంఖ్య 30.4 కోట్లుగా ఉన్నట్లు నివేదికలో పేర్కొన్నారు. 2020లో ఈ సంఖ్య 27.5 కోట్లుగా ఉండగా నాలుగేళ్లలో వలసదారులు నాలుగు కోట్ల మేరకు పెరిగినట్లు ఈ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఈ జాబితాలో మన దేశం తర్వాత చైనా 1.17 కోట్ల వలసదారులతో రెండో స్థానం లో ఉంది. ఇక మెక్సికో 1.16 కోట్ల వలసదారులతో మూడో స్థానంలో ఉంది. ఆ తర్వాత స్థానాల్లో ఉక్రెయిన్ (98 లక్షలు), రష్యా (91 లక్షలు) ఉన్నాయి. భారత్ విషయానికొస్తే.. ఒకప్పుడు భారతీ యులు ప్రధానంగా సౌదీ అరేబియా, పాకిస్తాన్ వంటి దేశాలకు ఎక్కువగా మైగ్రేట్ అయ్యేవారు. కానీ ఇప్పుడు పశ్చిమాసియాతో పాటు అమెరికా, కెనడా, యూకే, ఆస్ట్రేలియా వంటి పశ్చిమ దేశాలకు భారతీయుల వలసలు విస్తరించాయి. వలస భారతీయుల పరిమితి పెరగడమే కాకుండా ఆయా దేశాల్లో వారు ప్రభావితం చేసే సామాజిక, ఆర్థిక పరిస్థితులను కూడా నివేదిక వివరించింది. యూఏఈలో భారతీయులు అత్యధికంగా వలస జీవనం సాగిస్తున్నారు. సుమారు 32.5 లక్షల మంది తో యూఏఈ మొత్తం జనాభాలో మనవారే 40 శాతానికి పైగా ఉన్నారని నివేదిక చెబుతోంది. ఇది పశ్చిమాసియాలోని భారతీయ డయాస్పొరా విస్తృతిని చూపించే ఒక కీలకాంశం. ఇక అమెరికాలో ఉన్న ఇండో-అమెరికన్లు రెండో అతిపెద్ద ఆసియన్ వర్గంగా ఉన్నారు. మొదటి స్థానంలో చైనీస్ అమె రికన్లు ఉన్నారు. అమెరికాలో భారతీయుల సంఖ్య 31.7 లక్షలు కాగా సౌదీ అరేబియాలో 19.5 లక్షలు, కెనడాలో 10.2 లక్షల మంది ఉన్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. భారతీయ వలసదారులకు పెద్దఎత్తున ఆశ్రయం కల్పిస్తున్న ఇతర దేశాల్లో ఆస్ట్రేలియా, కువైట్, ఒమన్, ఖతార్, బహ్రెయిన్, మలేషియా, యునైటెడ్ కింగ్‌డమ్ (యూకే), పాకిస్తాన్ వంటి దేశాలు ఉన్నాయి. ఈ అధ్యయన నివే దిక వల్ల గ్లోబల్ వలస ధోరణులపై మెరుగైన అవగాహన ఏర్పడుతుంది. ఉన్నత విద్య, ఉద్యోగావ కాశాలు, ఉపాధిని వెతుక్కుంటూ చాలామంది భారతీయులు ముఖ్యంగా యువత విదేశాలకు వెళుతున్నారు. వారిలో చాలామంది స్వదేశానికి తిరిగి రాకుండా అక్కడే స్థిరపడిపోతున్నారు. ఐటీ రంగం బహుముఖంగా విస్తరించిన తర్వాత భారతీయ కంప్యూటర్ నిపుణులకు ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ పెరగడం వంటి అంశాలు కూడా వలసల పెరుగుదలకు కారణమవుతున్నాయి. మరోవైపు వ్యాపారం, ఉపాధి రంగాల్లోనూ అవకాశాల కోసం పెద్దసంఖ్యలో భారతీయులు విదేశాలకు వెళ్తున్నారు. మొత్తం మీద దాదాపు ప్రపంచం నలుమూలలా భారతీయుల జాడ కనిపిస్తోందని ఈ నివేదిక వెల్లడిరచింది. ఇలా విదేశాలకు వెళ్లి స్థిరపడుతున్న భారతీయులు ఆయా దేశాల ఆర్థిక వ్యవస్థల్లో కీలకపాత్ర పోషిస్తు న్నారు. ఐటీతో పాటు ఆరోగ్య, నిర్మాణ రంగాల్లో వారి కృషి గణనీయంగా ఉందని నివేదిక పేర్కొంది. అంతర్జాతీయ వలసల్లో భారత్ అగ్రస్థానంలో ఉన్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ప్రవాస భారతీయుల సంక్షేమానికి పలు చేపడుతున్న చర్యలు మరింత మెరుగవ్వాల్సి ఉంది. రవాణా సౌకర్యాలు, వీసా సౌల భ్యాలు, న్యాయ పరిరక్షణ వంటి అంశాల్లో మరింత శ్రద్ధ చూపాల్సిన అవసరం ఉంది. ఇటీవలి కాలం లో ప్రవాస భారతీయులతో సంబంధాల మెరుగుకు కేంద్ర ప్రభుత్వం ‘వైబ్రెంట్ డయాస్పోరా’ తరహా లో పలు కార్యక్రమాలు చేపడుతోంది. భారతీయ సంస్కృతీ సంప్రదాయాలు విశ్వవ్యాప్తం అవుతున్నాయి.










Comments