ప్రసవాల్లో ఈ తేడాలెందుకో?
- DV RAMANA

- Aug 16, 2025
- 2 min read

సాధారణ ప్రసవాలను ప్రోత్సహించాలని ప్రభుత్వాలు చెబుతున్నాయి. అయినా సిజేరియన్లు ఈమధ్య కాలంలో విపరీతంగా పెరిగిపోయాయన్నది వాస్తవం. ప్రభుత్వ ఆస్పత్రుల సంగతెలా ఉన్నా.. ప్రైవేట్ ఆస్పత్రుల్లో ప్రసవం అంటే అది కచ్చితంగా సిజేరియనే! అన్న అభిప్రాయం బలంగా నాటుకుపో యింది. కానీ విడ్డూరం ఏమింటే.. ఇందులో కూడా మతపరమైన తేడాలు ఉన్నాయట. హిందూ మహిళలకే ఎక్కువగా సి`సెక్షన్ అంటే కడుపు కోత ద్వారా 90 శాతానికిపైగా ప్రసవాలు జరుగు తుంటే.. ముస్లిం మహిళల్లో దానికి పూర్తి విరుద్ధంగా ఏకంగా 94శాతం మేరకు సాధారణ ప్రసవాలు జరుగుతున్నాయని తాజా అంచనాలు వెల్లడిస్తున్నాయి. ఏ ప్రభుత్వ నివేదిక కూడా ఈ గణాంకాలను అధికారికంగా ప్రకటించకపోయినా వాస్తవ పరిస్థితులను, ఆస్పత్రుల పనితీరును పరిశీలిస్తే ఈ తేడా స్పష్టంగా తెలుస్తుంది. హిందూ సమాజంలో మహిళ గర్భం దాల్చినప్పటి నుంచే క్రమం తప్పకుండా చెకప్‌లు, సోనోగ్రఫీలు టెస్టులు, మందులు వాడుతుంటారు. డెలవరీ వరకు ఇవి కొనసాగినా చివరికి ఆపరేషన్ చేయకతప్పడంలేదు. మరోవైపు ముస్లిం మహిళలు ఇప్పటికీ పాత పద్ధతులపైనే ఆధారపడ తారు. ప్రభుత్వ ఆస్పత్రులు లేదా చిన్న నర్సింగ్‌హోమ్‌లను ఆశ్రయించి సాధారణ ప్రసవం ద్వారా బిడ్డలను కంటుంటారు. నిపుణుల అభిప్రాయం ప్రకారం ఈ పరిస్థితికి కారణం ప్రైవేట్ ఆస్పత్రులే. ఈ ఆస్పత్రులు సాధారణ ప్రసవాల కంటే ఎక్కువ ఆదాయం ఇచ్చే సిజేరియన్లనే ప్రోత్సహిస్తుంటాయి. సాధారణ ప్రసవానికి రూ.10వేల నుంచి రూ.20వేలు ఖర్చు అవుతుండగా.. సిజేరియన్ చేస్తే దీనికి ఐదారు రెట్లు ఎక్కువ ఖర్చవుతుంది. అలాగే సాధారణ ప్రసవ ప్రక్రియ సమయంతో కూడుకున్నది, సిబ్బంది చాలా గంటలు అప్రమత్తంగా పనిచేయాల్సి ఉంటుంది. అదే ఆపరేషన్ అయితే ఒక గంట లోనే పూర్తవుతుంది. అందువల్ల ప్రైవేట్ ఆస్పత్రులకు సిజేరియన్ ఒక సురక్షితమైన, లాభదాయకమైన వనరుగా మారింది. మరో వాదన కూడా ఉంది. హిందూ సమాజానికి చెందిన చాలామంది మహిళ లు ఇప్పుడు కూర్చుని పనిచేసే ఉద్యోగాలు చేస్తున్నారు. మొబైల్, టీవీ వాడకం ఎక్కువ. దానివల్ల యోగా, వ్యాయామానికి దూరమవుతున్నారు. బయట ఆహారం ఎక్కువగా తింటున్నారు. ఇవన్నీ సాధా రణ ప్రసవానికి ప్రతిబంధకాలే. మానసిక ఒత్తిడి, అనవసరమైన మందులు కూడా గర్భధారణను బలహీనపర్చి ఆపరేషన్ వైపు మళ్లిస్తాయన్న వాదన కూడా ఉంది. ముస్లిం మహిళల విషయానికొస్తే.. వారి జీవితం శారీరక శ్రమతో కూడుకున్నది. ఇంటి పనుల్లో చురుకుగా ఉంటారు. ఆహారంలో సత్తు పిండి, ఖర్జూరం, హలీమ్, పాలు, డ్రై ఫ్రూట్స్ వంటి సంప్రదాయ, పోషక పదార్థాలు ఉంటాయి. ఇవి శరీరాన్ని బలంగా ఉంచి సహజ ప్రసవానికి సహకరిస్తాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) మార్గదర్శకాల ప్రకారం ఏ దేశంలోనూ సి-సెక్షన్ల రేటు పది శాతానికి మించకూడదు. కానీ మన దేశంలో సగటు సిజేరియన్ల రేటు 21.5 శాతం. ఇందులో ప్రైవేట్ ఆస్పత్రుల వాటాయే 80 శాతం వరకు ఉంటుంది. నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే గణాంకాల ప్రకారం గ్రామీణ ప్రాంతాల కంటే పట్టణ ప్రాంతాల్లో సి-సెక్షన్ల రేటు రెట్టింపుగా ఉంది. సి-సెక్షన్ డెలివరీ తర్వాత మహిళల్లో నీరసం, వెన్ను నొప్పి, ఊబకాయం, మానసిక ఒత్తిడి, మళ్లీ గర్భం ధరించడంలో సమస్యలు వంటి దుష్ప్రభావా లు కనిపిస్తాయి. పిల్లల్లో రోగనిరోధక శక్తి కూడా తక్కువగా ఉంటుంది. అదే సాధారణ ప్రసవం చేసుకున్న మహిళలు త్వరగా కోలుకుంటారు. సులభంగా పాలివ్వగలరు, వారి పిల్లల్లో రోగనిరోధక శక్తి కూడా మెరుగుపడుతుంది. అయినా సిజేరియన్లు పెరుగుతుండటంపై ప్రభుత్వాలు సీరియస్‌గా స్పందించాలి. గర్భిణీ స్త్రీలకు క్రమం తప్పకుండా యోగా, తేలికపాటి వ్యాయామాలు, సరైన ఆహార అలవాట్ల గురించి సమాచారం ఇచ్చి చైతన్యపర్చాలి. ప్రైవేట్ ఆస్పత్రుల్లో పెరుగుతున్న సి-సెక్షన్ల రేటు పై దర్యాప్తు చేసి కఠిన చర్యలు తీసుకోవాలి. సాధారణ ప్రసవాలు జరగకపోవడానికి గల కారణాలను వివరించే బాధ్యతను వైద్యులకు అప్పగించాలి. విజయవంతంగా సాధారణ ప్రసవాలు చేసుకున్న మహిళల ఉదంతాలను ప్రచారం చేయాలి. సాధారణ ప్రసవం కేవలం ఒక వైద్య ప్రక్రియ కాదు.. అది ఒక సహజమైన హక్కు అన్న అవగాహనను మహిళల్లో కల్పించాలి. మహిళలను వారి హక్కుల నుంచి దూరం చేయకుండా ఉండటానికి సమాజం, వైద్య వ్యవస్థ, కుటుంబాలు కలిసి నిర్ణయం తీసు కోవాలి. ఇది కేవలం హిందూ ముస్లింల మధ్య తేడాకు సంబంధించిన సమస్య కాదని గుర్తించాలి.










Comments