పోలీసుల అదుపులో ఇద్దరు అంతర్ జిల్లా దొంగలు
- BAGADI NARAYANARAO

- Apr 3
- 2 min read
17 కేసుల్లో రూ.45.53 లక్షలు విలువైన ఆభరణాలు స్వాధీనం
వివరాలు వెల్లడిరచిన ఎస్పీ మహేశ్వరరెడ్డి
(సత్యంన్యూస్, శ్రీకాకుళం)

విశాఖ, విజయగనరం, శ్రీకాకుళం ఉమ్మడి జిల్లాల పరిధిలో 17 కేసుల్లో నిందితులుగా ఉన్న ఇద్దరు అంతర్ జిల్లాల దొంగలను కాశీబుగ్గ పోలీస్‌లు అదుపులోకి తీసుకున్నారని ఎస్పీ కె.మహేశ్వరరెడ్డి తెలిపారు. గురువారం జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో నిందితులతో పాటు వారు చోరీచేసిన సొత్తును మీడియా ముందుంచారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ పలాస`కాశీబుగ్గ పురపాలక సంఘం పరిధిలో నర్సిపురం రైల్వేగేట్ ఫ్లైఓవర్ వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా నిందితులు పార్వతీపురం మన్యం జిల్లా సీతానగరం మండలం జోగంపేటకు చెందిన పోల భాస్కరరావు, ఎచ్చెర్ల మండలం ముద్దాడపేటకు చెందిన ముద్దాడ నరసింగరావులు ద్విచక్ర వాహనంపై వస్తూ పట్టుబడ్డారని తెలిపారు. వారిని స్థానిక పోలీసులు విచారించగా శ్రీకాకుళం జిల్లాలో 16 దొంగతనాలు, మన్యం జిల్లా పాలకొండలో ఒక దొంగతనం చేసినట్టు తెలిపారన్నారు. వీటితో పాటు శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో దొంగతనాలు చేసినట్లు గుర్తించామన్నారు. వారి వద్ద నుంచి సుమారు సుమారు రూ.40.02 లక్షల విలువ గల 435.52 గ్రాములు (37 తులాల) బంగారు ఆభరణాలు, రూ.2 లక్షలు విలువ గల ఒక డైమండ్ బ్రాస్లెట్, లాకెట్, రూ.26 వేలు విలువ గల 233.2 గ్రాములు (20 తులాలు) వెండి వస్తువులు, రు.25వేలు నగదు, రెండు ద్విచక్ర వాహనాలు, ఒక స్కార్పియోను సీజ్ చేసినట్టు తెలిపారు. స్వాధీనం చేసుకున్న మొత్తం సొత్తు విలువ 45.53 లక్షలని తెలిపారు. దొంగిలించిన ఆభరణాలను ఒడిశాకు చెందిన ముత్యాలు, విశాఖపట్నంకు చెందిన బోణి గోవిందరాజులుకు, మన్యం జిల్లాకు చెందిన గ్రంధి శ్రీనివాసరావు, ఎచ్చెర్లకు చెందిన పోలం కృష్ణకు ఇచ్చినట్టు విచారణలో గుర్తించామన్నారు. దొంగిలించిన కొంత మొత్తంతో ఒక స్కార్పియో కొనుగోలు చేశారని తెలిపారు. పోలీసులు స్వాధీనం చేసుకున్న రెండు ద్విచక్ర వాహనాలను నిందితుడు ముద్దాడ నరసింగరావు చోరీ చేసినట్టు తెలిపారు. నిందితులిద్దరూ ముందుగా ఒక గ్రామాన్ని ఎంచుకొని సాయంత్రం సదరు గ్రామానికి వెళ్లి ఫోన్లను స్విచ్ ఆఫ్ చేసి తాళాలు వేసి ఉన్న ఇళ్లను రెక్కీ నిర్వహించి వారి వెంట తెచ్చుకున్న వస్తువులతో తలుప తాళం విరగ్గొట్టి, బీరువాలు తెరిచి బంగారం, వెండి వస్తువులు అపహరించారని తెలిపారు. ఇద్దరు నిందితులు నేరప్రవృత్తి కలిగినవారేనని తెలిపారు. వివిధ కేసుల్లో ఇద్దరూ వేర్వేరుగా జైల్లో కొన్నాళ్లు పాటు ఉన్నారని వివరించారు. ఇద్దరూ జైల్లో పరిచయమై రాత్రివేళల్లో దొంగతనాలు చేయటం మొదలుపెట్టారు. నిందితుడు పోలా భాస్కరరావుపై శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో సుమారు 37 చోరీ కేసులు నమోదయినట్టు తెలిపారు. 8 కేసుల్లో శిక్ష పడినట్టు వివరించారు. ముద్దాడ నరసింగరావుపై శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో సుమారు 17 చోరీ కేసులు, ఒక సారాయి కేసు నమోదయ్యాయని, మూడు కేసుల్లో శిక్ష పడిరదన్నారు. కాశీబుగ్గ సబ్ డివిజన్ డీఎస్పీ వివి వెంకటప్పారావు ఆధ్వర్యంలో చాకచక్యంగా వ్యవహరించి కేసు ఛేదించటంలో ప్రతిభ కనబర్చడంపై ఎస్పీ అభినందించారు. సీసీఎస్ ఎస్‌ఐ సూర్యచంద్రమౌళి, కాశీబుగ్గ ఎస్‌ఐ సూర్యనారాయణ, సీసీఎస్ ఎస్‌ఐ కె.మధుసూదనరావు, పోలీసు సిబ్బంది శ్యాంసుందరరావ్, కె.భాస్కరరావు, విజయ్ కుమార్, హరీష్, ఉషాకిరణ్‌లను ఎస్పీ కొనియాడి ప్రత్యేకంగా అభినందించారు. ఈ సమావేశంలో ఏఎస్పీ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.










neototo
neototo
neototo
neototo
neototo
neototo
bacan4d
bacan4d
bacan4d
neototo
neototo
neototo
neototo
neototo
neototo
tus4d
toto slot